సాక్షి, హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి హత్యకేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 2012 డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని బొగ్గులకుంట వద్ద పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
ఆయన హత్యపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మావోయిస్టు, నయూ ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషన్నను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. 2018 ఫిబ్రవరిలో అతన్ని అరెస్ట్ చేశారు. 11 ఏళ్ల విచారణ తర్వాత శేషన్నను నేడు నాపంల్లి నిర్దోషిగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment