innocent
-
USA: చేయని తప్పుకు 43 ఏళ్లు కారాగారంలోనే
వాషింగ్టన్: చేయని నేరానికి 43 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన అమాయకురాలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. అమెరికాలోని ఒహాయోకు చెందిన 63 ఏళ్ల సాండ్రా హెమ్మీ కథ ఇది. మిస్సోరీలో 1980లో ఓ లైబ్రరీ వర్కర్‌ను కత్తితో పొడిచి చంపిందని సాండ్రాను అరెస్ట్ చేశారు. లాయర్‌తో వాదించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మానసిక చికిత్సకు అధిక మోతాదులో తీసుకున్న ఔషధాల మత్తులో ఆమె చెప్పిన నేరాంగీకార వాంగ్మూలాన్నే పోలీసులు కోర్టుకు సమరి్పంచారు. దాంతో ఆమెకు జీవితఖైదు విధించారు. కానీ అసలు హంతకుడు మైఖేల్ హోల్మ్యాన్ అనే పోలీసు అధికారి. ఈ విషయాన్ని సాండ్రా లాయర్లు ఆధారసహితంగా తాజాగా కోర్టులో నిరూపించారు. దాంతో ఆమె శుక్రవారం విడుదలయ్యారు. కూతురు, మనవరాలిని హత్తుకుని బోరున విలపించారు. అమెరికా చరిత్రలో చేయని నేరానికి అత్యంత ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన మహిళగా సాండ్రా పేరు నిలిచిపోనుంది. -
హత్య కేసులో చోటా రాజన్‌కు ఊరట
ముంబై: ట్రేడ్ యూనియన్ లీడర్ దత్తా సామంత్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను నిరపరాధిగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 1997లో జరిగిన ఈ హత్యకు చోటా రాజన్ కుట్ర పన్నాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. సామంత్ తన జీపులో పంత్ నగర్ నుంచి ఘట్కోపర్ వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచి్చన దుండగులు ఆయనపై 17 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో సామంత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య వెనుక చోటా రాజన్ హస్తం ఉందంటూ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. అయితే అందుకు గల సాక్ష్యాధారాలను సమరి్పంచడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి బి.డి.షెల్కె రాజన్‌కు కేసు నుంచి విముక్తి కలి్పంచారు. అతనిపై మరిన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో విడుదలయ్యే అవకాశాల్లేవు. -
నేను నిర్దోషిని: చికోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ సహా 84 మంది భారతీయుల అరెస్టుకు కారణమైన థాయ్‌లాండ్‌లోని అక్రమ క్యాసినోలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అక్కడి పోలీసులు స్పష్టత ఇచ్చారు. గత నెల 27 నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు రూ.50 కోట్ల టర్నోవర్ జరిగినట్లు తేల్చారు. ఈ మేరకు చోన్బూరీ ప్రావిన్స్ పోలీసు చీఫ్ కంపోన్ లీలప్రపపోన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏడు అంతస్తుల్లో విస్తరించిన ఆసియా హోటల్లో మొత్తం 300 గదులు ఉన్నాయి. గత నెల 27న కొన్ని రూముల్లోకి దిగిన 84 మంది ఆ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వెలసిన అక్రమ జూదగృహంలో పేకాట, స్నూకర్ ఆడుతున్నారు. గేమింగ్ చిప్స్‌తో లావాదేవీలు జరుగుతుండగా ఆ వివరాలను 40 గేమింగ్ క్రెడిట్ పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల లావాదేవీలు వాటిలో నమోదైనట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. చికోటి స్పందన.. థాయిలాండ్ వ్యవహారంపై చికోటి ప్రవీణ్ మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు దేవ్, సీత అనే వ్యక్తుల నుంచి ఫోకర్ టోర్నమెంట్ ఉందని ఆహ్వానం అందితేనే థాయ్‌లాండ్ వచ్చానని పేర్కొన్నారు. ఇక్కడ గ్యాంబ్లింగ్ నిషేధం అనే విషయం తనకు తెలియదని, ఆ అక్రమ క్యాసినో నిర్వాహకుడిని తాను కాదన్నారు. తన నిర్దోషిత్వాన్ని థాయ్ పోలీసుల ఎదుట నిరూపించుకున్నట్లు చెప్పారు. సదరు హాల్లోకి తాను అడుగు పెట్టిన పది నిమిషాలకే పోలీసులు దాడి చేశారన్నారు. హైదరాబాద్‌లో స్ట్రీమ్ అయ్యేలా: అక్రమంగా నడుస్తున్న ఈ పేకాట శిబిరంపై అక్కడి పోలీసులకు అదే హోటల్లో బస చేసిన ఓ గోవా వాసి ద్వారా సమాచారం అందింది. హోటల్‌పై దాడి చేసిన పోలీసులు అందులో నాలుగు పేకాట టేబుళ్లు, మూడు పోకర్ టేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. 16 మంది మహిళల సహా 84 మంది భారతీయులు, థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరిలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి సహా అనేక మంది తెలుగు వాళ్లు ఉన్నారు. వీరందరికీ థాయ్‌లాండ్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తుగా 4,500 బాట్స్ (దాదాపు రూ.11వేలు) చెల్లించాలని ఆదేశించింది. ఈ తతంగమంతా పూర్తి చేసుకుని, పాస్‌పోర్టులు పొందిన తర్వాత భారతీయులంతా తిరిగి రానున్నారు. అయితే... ఆ పేకాట శిబిరంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు వాటిని ఇంటర్నెట్తో అనుసంధానించారు. ఆ లైవ్ ఫీడ్ హైదరాబాద్‌లో స్ట్రీమ్ అయ్యేలా ఏర్పాటుచేసినట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి అక్రమ ఈవెంట్లు భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు నగదు కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి ఫైనాన్షియర్ కోసమే ఈ క్యాసినో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆ హామీ మాకెందుకు ఇవ్వరు?: కేటీఆర్ -
గుండెపోటుతో దిగ్గజ నటుడి కన్నుమూత
మలయాళ దిగ్గజ నటుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు ఇన్నోసెంట్(75) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా సంబంధిత శ్వాసకోశ సమస్యలతో పాటు పలు అవయవాలు దెబ్బతినడంతో.. మార్చి 3వ తేదీన కొచ్చి వీపీఎస్ లకేషోర్ ఆస్పత్రిలో ఆయన చేరారు. అయితే ఆదివారం గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్‌బులిటెన్ ద్వారా వెల్లడించాయి. మలయాళంలో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన ఇన్నోసెంట్.. ఎల్డీఎఫ్ మద్దతుతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో త్రిస్సూర్ చాలాకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గారు. అసోషియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)కు పదిహేనేళ్లపాటు అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. గతంలో క్యాన్సర్ బారిన పడిన ఆయన.. దానిని జయించడమే కాదు, క్యాన్సర్ వార్డులో నవ్వులు(Laughter in the Cancer Ward) పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాశారు. 1972లో నృతశాల చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. సపోర్టింగ్రోల్స్తో పాటు విలన్‌గా, కమెడియన్ పాత్రలతో ఐదు దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించారు. ఇన్నోసెంట్ నటించిన చిత్రాల్లో అక్కరే నిన్నోరు మారన్, గాంధీనగర్ సెండక్ స్ట్రీట్, నాడోడిక్కట్టు, రామోజీ రావు స్పీకింగ్, తూవల్స్పర్శమ్, డాక్టర్ పశుపతి, సందేశం, కేళి, దేవసూరం.. తదితర చిత్రాలు బాగా గుర్తుండిపోతాయి. కిందటి ఏడాది పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో వచ్చిన కడువా చిత్రంలోనూ నటించారాయన. ఇన్నోసెంట్ చివరిసారిగా నటించిన చిత్రం పాచువుమ్ అత్భుథవిలక్కుమ్(ఫహద్ ఫాజిల్ హీరోగా..) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. Legendary actor Innocent passes away. The veteran actor was aged 75. "RIP Legend" 💔 😭 #Innocent pic.twitter.com/7vNHq3BdQi — Sanju Singh (@Iamsanjusingh1) March 27, 2023 ఇన్నోసెంట్ మృతికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం సంతాపం తెలుపుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్లతో పాటు పలువురు సినీ తారలు అందులో ఉన్నారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ్సుకుమారన్లతో ఇన్నోసెంట్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏం చెప్పను నా ఇన్నోసెంట్.. ఆ పేరు లాగే అమాయకంగా నవ్వులూ, ప్రేమా, ఓదార్పును ప్రపంచానికి పంచుతూ, చుట్టూ ఉన్నవాళ్లని తమ్ముడిలా పట్టుకుని, దేనికైనా నాతో ఉన్న.. నీ ఎడబాటు బాధని మాటల్లో చెప్పలేను. ప్రతి క్షణం ఆ అమాయకపు చిరునవ్వుతో, ప్రేమతో, మందలింపుతో నా ఇన్నోసెంట్ ఎప్పటికీ నాతో ఉంటాడు అంటూ మోహన్‌లాల్ తన ఫేస్బుక్ వాల్‌పై భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సినిమా కోసం నన్ను బతిమిలాడారు -
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు.. శేషన్నను నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు
సాక్షి, హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి హత్యకేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 2012 డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని బొగ్గులకుంట వద్ద పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన హత్యపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మావోయిస్టు, నయూ ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషన్నను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. 2018 ఫిబ్రవరిలో అతన్ని అరెస్ట్ చేశారు. 11 ఏళ్ల విచారణ తర్వాత శేషన్నను నేడు నాపంల్లి నిర్దోషిగా ప్రకటించింది. -
లైంగిక సుఖానికి దూరమయ్యా... రూ.10,006 కోట్లివ్వండి
రత్లాం: గ్యాంగ్ రేప్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన ఓ వ్యక్తి తనకు ప్రభుత్వం నష్ట పరిహారంగా రూ.10,006.2 కోట్ల చెల్లించాల్సిందేనంటూ కోర్టుకెక్కాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గిరిజనుడైన కాంతూ ఆలియాస్ కాంతీలాల్ భీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో 2020 డిసెంబర్ 23న పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు. స్థానిక కోర్టు 2022 అక్టోబర్ 20న అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అంతరం కాంతీలాల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లో ఉన్నప్పుడు భార్యతో లైంగిక సుఖానికి దూరమయ్యానని, దేవుడిచ్చిన వరం వృథా అయ్యిందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు రూ.10,006.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందులో రూ.10,000 కోట్లు మానసిక క్షోభ అనుభవించినందుకు మిగతా రూ.6.02 కోట్ల ఇతర ఖర్చుల కోసమని విన్నవించాడు. -
పొరపాటున.. దారుణ హత్య
సాక్షి, శివమొగ్గ(కర్ణాటక): పాతకక్షలతో ఒక వ్యక్తిని చంపాలని ప్రత్యర్థులు పథకం వేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తి రాకపోగా అక్కడికి వచ్చిన సంతోష్ (32) అనే మరో అమాయకున్ని ప్రాణాలు తీశారు. శివమొగ్గ నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాపూజీ నగర లేఔట్లో ఆయుధ పూజ అయిన గురువారం రాత్రి నలుగురు దుండగులు కాపుకాశారు. ఒకరు అవెంజర్ బైకులో వస్తాడని, అతన్ని వేసేయాలని దుండగులకు సుపారీ ఇచ్చిన వ్యక్తి చెప్పాడు. ఆ సమయంలో సంతోష్ స్నేహితుని ఇంట్లో భోజనం చేసి సమీపంలో ఉన్న బైక్ వద్దకు వెళ్తుండగా హంతకులు చూశారు. తాము చంపాల్సిన వ్యక్తి ఇతడేననుకుని కత్తులతో హత్యచేసి పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. -
ఏడున్నరేళ్ల పోరాటం: తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి
పనాజీ: అత్యాచారం కేసులో తెహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషిగా బయటపడ్డాడు. అతడు నిర్దోషి అని గోవా కోర్టు తేల్చి చెప్పింది. 2013లో థింక్ ఇన్ గోవా సమావేశంలో తనను తరుణ్ తేజ్‌పాల్ లైంగికంగా వేధించాడంటూ ‘తెహల్క.కమ్’కు చెందిన మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు అదే ఏడాది నవంబర్ 30వ తేదీన అరెస్ట్ చేశారు. దీనిపై గోవా కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పుడు ఆరోపణలని, ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. బెయిల్ కోసం కూడా విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి 2014 జూలై 1వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదనంతరం తనపై ఆరోపణలను కొట్టివేయాలని.. కేసు రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో గోవా కోర్టులో విచారణ జరిగి చివరకు 2021 మే 21 శుక్రవారం నాడు తీర్పు వెలువడింది. తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి అని పేర్కొంటూ పేర్కొంది. ఏడున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడడంతో తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన న్యాయవాది దివంగత రాజీవ్ గోమొస్‌కు తేజ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇటీవల కరోనాతో మృతిచెందాడు. -
‘నరోడా’ కేసులో కొడ్నానీ నిర్దోషి
అహ్మదాబాద్: నరోడా పటియా అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ మాజీ మంత్రి మాయా కొడ్నానీని శుక్రవారం గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో బజరంగ్దళ్ మాజీ నేత బాబూ భజరంగీని దోషిగా తేల్చింది. 2002లో గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా అల్లర్లలో 97 మంది మృతి చెందారు. కొడ్నానీ నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. కాగా, భజరంగీని దోషిగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అల్లర్లకు భజరంగీ కుట్ర పన్నినట్లు నిరూపి తమైందని కోర్టు పేర్కొంది. భజరంగీకి హైకోర్టు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు దోషులుగా తేల్చిన 32 మందిలో 13 మందిని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. -
అర్థజ్ఞానం... అర్ధజ్ఞానం
‘‘ఓయీ మానవా... నేను మరణ దండన దేవతను. నిజం చెప్పు.రాణిగారి సంపదను కొల్లగొట్టింది నువ్వే కదా’’ అని భయంకరంగా గర్జించింది. దొంగ గజగజ వణికిపోయాడు. ఓ దొంగ తన దారిన తను పోతున్నాడు. ఆ దొంగ వెళుతున్న దారిలో ఎవరిదో స్వామీజీ ప్రవచనం వినిపిస్తోంది. ‘మంచి మాటలు వింటే మనం చెడ్డ పనులు చెయ్యలేం’ అనుకుంటూ గట్టిగా చెవులు మూసుకున్నాడు. అలా నడుస్తూ వెళ్తుండగా కుడి కాలిలోకి కసుక్కున ముల్లు దిగింది. ‘అబ్బా’ అనుకుంటూ కిందికి వంగి, కుడిచేత్తో ముల్లును లాగేసుకున్నాడు. ఈలోపు కుడి చెవిలోకి స్వామీజీ మాట ఒకటి దూరిపోయింది. ‘‘... దేవుళ్లకు, దేవతలకు నీడలు ఉండవు ...’’ అంటున్నారాయన. దొంగ గబుక్కున చెయ్యి తీసి మళ్లీ తన చెవి మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత స్వామీజీ మాటలు ఏమీ దొంగకు వినిపించలేదు కానీ, విన్న ఆ ఒక్కమాట మనసులో ఉండిపోయింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఓసారి అంతఃపురంలో రాణిగారి ఆభరణాలు దోచుకుంటూ పట్టుబడ్డాడు. రాజభటులు తీసుకెళ్లి కొట్లో బంధించారు. నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందన్నారు. దొంగ లొంగలేదు. ‘నేను దొంగతనం చేయలేదు’ అన్నాడు. చివరికి ఇలా కాదనుకుని, ఓ అర్ధరాత్రి రాణిగారు మారువేషంలో దొంగ ఉన్న బందీఖానా దగ్గరకు వచ్చారు. ‘‘ఓయీ మానవా... నేను మరణ దండన దేవతను. నిజం చెప్పు. రాణిగారి సంపదను కొల్లగొట్టింది నువ్వే కదా’’ అని భయంకరంగా గర్జించింది. దొంగ గజగజ వణికిపోయాడు. నిజం ఒప్పుకోబోయాడు. కానీ అంతలోనే అతడికి స్వామీజీ మాట గుర్తుకువచ్చింది. దేవుళ్లకు, దేవతలకు నీడలు ఉండవు కదా! మరి ఈ వెన్నెల కాంతిలో మరణ దండన దేవత వెనకే ఆమె నీడ కూడా ఉందేమిటి? అనుకున్నాడు. నీడ ఉంది కాబట్టి ఈమె దేవత కాదు, మనిషే అనుకున్నాడు. అలా అనుకోగానే అతడికి ధైర్యం వచ్చింది. ‘‘ఈ దొంగతనం నేను చేయలేదు’’ అని ధైర్యంగా అన్నాడు. రాణిగారు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దొంగ నిర్దోషి అని విడుదల చేయించారు. దొంగ తన జ్ఞానానికి సంతోషించాడు. అనుకోకుండా చెవిన పడిన మాటలే తనను శిక్షనుంచి తప్పిస్తే, నిజంగా జ్ఞానులు చెప్పే మాటలు తనకెంత ఉపకరించేవో అనుకున్నాడు. -
మహిళలపై సీనియర్ నటుడి షాకింగ్ కామెంట్స్!
తిరువనంతపురం: మహిళలపై టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వెకిలి వ్యాఖ్యలను మరిచిపోకముందే మరో మలయాళీ సీనియర్ నటుడు ఇదేరీతిలో నోరుపారేసుకున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో ’కాస్టింగ్ కౌచ్’ (సినీ అవకాశాల పేరిట లోబరుచుకోవడం) లేనేలేదని చెప్పుకొచ్చిన ఆయన.. చెడ్డ మహిళలే ఇలా పక్కలోకి వెళుతుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ’మలయాల చిత్ర పరిశ్రమ స్వచ్ఛంగా ఉంది. కాస్టింగ్ కౌచ్‌లాంటివి ఇండస్ట్రీలో లేనేలేవు. గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. మహిళల గురించి ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే వెంటనే మీడియాకు తెలిసిపోయే పరిస్థితి ఉంది. కానీ, మహిళలు చెడ్డవారైతే.. వారు పక్కలోకి వెళ్లే అవకాశం ఉంది’ అని ప్రముఖ మలయాళ నటుడు, ఎంపీ ఇన్నోసెంట్ అన్నారు. మలయాళ చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్‌పై విలేకరులు అడిగిన ఈ ప్రశ్నకు ఈవిధంగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇన్నోసెంట్ వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడి ఎంపీగా గెలుపొందారు. మలయాళీ సూపర్ స్టార్లు సహా ప్రముఖ నటులందరూ సభ్యులుగా ఉన్న మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నటుడు ఇన్నోసెంట్ వ్యాఖ్యలపై మహిళా సినీ నటుల సంఘం వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలనుకుంటున్న కొత్త నటులు పలురకాల లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. కాస్టింగ్ కౌచ్ గురించి మా సహచరులైన పార్వతి, లక్ష్మీరాయ్ బాహాటంగానే మాట్లాడారు. ఇండస్ట్రీలో ఎలాంటి లైంగిక దోపిడీ లేదన్న ప్రకటనను మేం అంగీకరించబోం. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి’ అని వ్యాఖ్యానించింది. -
జోద్పూర్ కోర్టు తీర్పు: సల్మాన్ నిర్దోషి
-
సల్మాన్ నిర్దోషి
• 18 ఏళ్ల నాటి అక్రమాయుధాల కేసు నుంచి విముక్తి • సరైన ఆధారాలు లేవని నిర్దోషిగా ప్రకటించిన జోధ్‌పూర్ కోర్టు జోధ్‌పూర్: పద్దెనిమిది ఏళ్ల క్రితం నాటి అక్రమాయుధాల కేసు నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు విముక్తి లభించింది. ఈ కేసులో జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. బుధవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అయుధాలు కలిగి ఉన్నాడని, వాటిని వాడారని చెప్పే సరైన ఆధారాలు లేనందున నిర్దోషిగా ప్రకటించారు. సల్మాన్‌పై ఉన్న 4 కేసుల్లో అక్రమాయుధాల కేసు ఒకటి. చింకారాల వేటకు సంబంధించిన రెండు కేసుల్లో సల్మాన్‌ను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రెండు కృష్ణజింకల వేటకు సంబంధించిన కేసు విచారణ కొనసాగుతోంది. గత ఏడాది మార్చిలో సల్మాన్ జోధ్‌పూర్ కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చారు. అటవీ శాఖ తనను ఈ కేసులో ఇరికించిందని విన్నవించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 1998 అక్టోబర్ 1, 2 తేదీల్లో రాజస్తాన్‌లోని కంకానీలో రెండు కృష్ణజింకలను వేటాడాడని, ఇందుకోసం లైసెన్స్ గడువు ముగిసిన ఆయుధాలను కలిగి ఉండటమే కాక.. వాటిని సల్మాన్ వినియోగించాడని అభియోగాలు మోపింది. అయితే జిల్లా యంత్రాంగం ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి మతిలేని చర్యగా న్యాయస్థానం అభివర్ణించింది. సల్మాన్ వద్ద ఉన్న ఆయుధాలు మూడేళ్ల కాలపరిమితితో 8/8/99 వరకూ చెల్లుబాటు అవుతాయని, అయితే వేటాడినట్టు అభియోగాలు నమోదైన సమయానికి లైసెన్స్‌ను పునరుద్ధరించుకోలేదని, అంతేకానీ అది లైసెన్స్ గడువు పూర్తయినట్టుగా భావించరాదని కోర్టు పేర్కొంది. లైసెన్స్ గడువు అప్పటికి ముగిసిందని, ఆయుధం గడువు ముగియలేదని, అందువల్ల అతనిపై ఆయుధాల చట్టం సెక్షన్ 3 లేదా సెక్షన్ 21 కింద ప్రాసిక్యూషన్ చేయలేమని స్పష్టం చేసింది. తన సోదరి అల్వీరాతో కలసి సల్మాన్ బుధవారం కోర్టుకు వచ్చారు. తీర్పు తర్వాత సల్మాన్ తన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ నెల 25న ఇదే న్యాయస్థానం ఎదుట కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేయనుంది. కోర్టు తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది బీఎస్ భాటి స్పందిస్తూ.. తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం దీనిపై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
ఎంత పని చేశావు చైనా..!
బీజింగ్: వంద మంది నేరస్తులు తప్పించుకున్నా సరే.. ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదనేది భారత న్యాయ సూత్రం. అందుకే మరణ శిక్షల విషయంలో మన కోర్టులు ఆచితూచి వ్యవహరిస్తాయి. అదే పొరుగు దేశం చైనాలో 'క్యాపిటల్ పనిష్ మెంట్'ల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయో ఈ కథనం చదివితే అర్థమవుతుంది. 21 ఏళ్ల కిందట ఓ అమాయకుడికి వేసిన మరణ శిక్షకు సంబంధించి, చైనా ఉన్నత న్యాయస్థానం శుక్రవారం పునః సమీక్షించింది. ఓ యువతిపై అత్యాచారం చేసి హత్య చేశాడన్న ఆరోపణలతో నీ షుబిన్(21)ను 1995లో దోషిగా తేల్చి మరణ శిక్ష అమలు చేశారు. అయితే అతని మరణం తర్వాత సరిగ్గా 11 ఏళ్లకు వాంగ్ షూజిన్ అనే వ్యక్తి ఆ నేరం చేసింది తానే అని అంగీకరించాడు. దీంతో అదే కేసును తిరిగి విచారణ ప్రారంభించారు. తమ విచారణలో నీ షుబిన్ నిర్ధోషి అని తేలింది. నీ షుబిన్కు మరణ శిక్ష విధించడానికి సరిపడే సాక్షాధారాలు అంత ఖచ్చింతంగా కూడా లేవని కోర్టు తేల్చింది. యువతిపై అత్యాచారం, హత్య జరిగిన కొన్ని రోజులకు నీషుబిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు పెట్టే వేధింపులు భరించలేక తానే ఆ నేరాన్ని చేశానని కోర్టు ముందు ఒప్పుకున్నాడు. వేరే దారి లేక నీ షుబిన్ తరపు న్యాయవాది కూడా ఒత్తిడిలో ఆ నేరాన్ని చేశాడని ఆ రోజు కోర్టు ఎదుట తెలిపారు. అయితే నీషుబిన్ నేరాంగీకారం వెనక అనుమానాలున్నాయని శుక్రంవారం కోర్టు అభిప్రాయపడింది. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలతో పోల్చిచూస్తే అతను నేరం చేశాడనడానకి అంత కచ్చిమైన మిగతా ఆధారాలు ఏవీ లభించలేదని కోర్టు తేల్చింది. చివరగా నీషుబిన్ మరణించిన 21 ఏళ్ల తర్వాత శుక్రవారం కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చేసింది. కోర్టు నా కుమారున్ని నిర్ధోషిగా తేల్చంది, కానీ చాలా ఆలస్యమైందని నీషుబిన్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ తీర్పు అతని కుటుంబ సభ్యులకు కాస్త ఊరట నిచ్చినా నీషుబిన్ బతికుంటే ఈ పాటికి ఎలా ఉండే వాడో అనే మరో ఆలోచన రాకుండా ఎలాగుంటుంది. విచారణ పేరిట నిందితులపై పోలీసుల టార్చర్ చైనాలో ఇంకా కొనసాగుతోందని ఆమ్నేస్టీ తాజా నివేధికలో వెల్లడైంది. మానవ హక్కుల సంఘాల లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా మరణ శిక్షలు అమలు చేస్తున్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. 'ఎన్నో ఏళ్ల కిందట దోషిగా తేల్చిన వ్యక్తిని తిరిగి నిర్ధోషిగా తేల్చడం శుభపరిణామం. చైనా కోర్టులు తామే ఇచ్చిన తీర్పులను పునఃసమీక్షించి తిరిగి తీర్పు వెలువరించడానికి సుముఖంగానే ఉన్నాయనడానికి ఈ తీర్పు నిదర్శనమని' పరిశోధకుడు విలియం నీ తెలిపారు. అయితే ఈ కేసును పరిశిలిస్తే ప్రస్తుతం కూడా చైనాలో విధిస్తున్న మరణ శిక్షల్లో క్షేత్రస్థాయిలో సాక్ష్యాధారాలను పరిశీలించడంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నీషుబిన్వంటి ఎంతో విషాదకరమైన కేసుల్లో మరణ శిక్ష విధించినంత సులువుగా తిరిగి అతని జీవితాన్ని కోర్టులు ప్రసాధించలేవని విలియం పేర్కొన్నారు. అందుకే తాను మరణ శిక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాని స్పష్టం చేశారు. -
‘మాయ’ ముఠా తిరుగుతోంది..!
తస్మాత్ జాగ్రత్తా.. మూడురోజుల్లో మూడు ఘటనలు జగిత్యాల అర్బన్ : వృద్ధులను ఏదైనా పనిమీద బయటకు పంపిస్తున్నారా..? అయితే వారికి విలువైన వస్తువులు ఇచ్చి వెళ్లనివ్వకండి. ఎందుకంటే వృద్ధులు కనిపిస్తేచాలు వారి ముందు పర్సు లేదా మరేదైనా వస్తువు పడేసి ‘అవి మీవే.. సరిగ్గా చూసుకోండి..’ అంటూ మాటల్లోదింపి మోసం చేసే ముఠా జగిత్యాల ప్రాంతంలో సంచరిస్తోంది. వస్తువును పడేయడమే కాకుండా.. అందులో నకిలీ బంగారంపెట్టి.. దానిని పంచుకుందామంటూ నిజమైన బంగారాన్ని ఎత్తుకెళ్తోంది. ఇలాంటి ఘటనలు మూడురోజుల్లోనే రెండుచోట్ల చోటుచేసుకున్నాయి. ఏడాది క్రితం ఇలాంటి ఘటన మెుదటిసారిగా జగిత్యాలలోనే జరిగింది. ఆ తర్వాత సిరిసిల్లలో కలకలం రేపింది. తాజాగా మంగళవారం మెట్‌పల్లిలోనూ ఇలాంటి ఘటనే జరగడం చర్చనీయాంశమైంది. ఘటనలకు పాల్పడుతున్న ముఠాలో ఓ పురుషుడితోపాటు ఇద్దరు మహిళలు పాల్గొంటున్నట్లు సమాచారం. వృద్ధులే టార్గెట్ ఈ ముఠా ఎక్కువగా వృద్ధులనే టార్గెట్ చేస్తోంది. పట్టణంలోని ఎల్జీరామ్ లాడ్జి సమీపంలో కొడిమ్యాలకు చెందిన వృద్ధురాలు మ్యాక ఎల్లవ్వ ఆయుర్వేద మందుల కోసం వచ్చింది. ఈమె ముందు ఇద్దరు మహిళలు పర్సును పడేశారు. అనంతరం పర్సు మీదేనా అంటూ మాటల్లో దింపారు. ఇంతలో మరోవ్యక్తి వచ్చి అందులో బంగారు కడ్డీ ఉందని, పంచుకుందామని నమ్మించారు. కడ్డీ ఇచ్చినందుకు తమకు నమ్మకంగా ఏదైనా వస్తువు ఇవ్వాలని మాటల్లో దింపారు. మాయలో పడిన ఎల్లవ్వ మెడలోని పుస్తెలతాడు, కమ్మలను ఇవ్వగా అక్కడినుంచి ఉడాయించారు. ఎల్లవ్వ బంగారంలాంటి కడ్డీని స్వర్ణకారుడి వద్ద చూపించగా నకిలీదని తేల్చడంతో లబోదిబోమంది. మరో సంఘటనలో మెట్‌పల్లిలోని మఠంవాడకు చెందిన యమగంగు కూరగాయల కొనుగోలుకు సంతకు వెళ్లింది. అక్కడ ఇద్దరు మహిళలు, ఒక మగ వ్యక్తి తారసపడి మాటలు కలిపారు. ఆమె ముందు ఓ వస్తువును పడేసి తనదే అన్నట్లు నమ్మించి మాటల్లో ముంచారు. అది బంగారుకడ్డీ అని, చూసిచెప్పినందుకు తమకూ వాటా ఇవ్వాలని మాయ చేశారు. కడ్డీ 20 తులాలు ఉంటుందని, అది ఉంచుకుని తమకు ఏదైనా ఇవ్వుమని సలహా ఇచ్చారు. దీంతో ఆమె కూడా పుస్తెలతాడు, కమ్మలు ఇచ్చి కడ్డీని స్వర్ణకారుడి వద్దకు వెళ్లి చూపించగా నకిలీదిగా తేల్చడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటన సిరిసిల్లలోనూ జరిగినట్లు సమాచారం. తస్మాత్ జాగ్రత్త మహిళలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పేర్కొంటున్నారు. ఏడాదిక్రితం ఇలాంటి సంఘటనలు కోకోలల్లుగా జరిగాయి. ఓ పురుషుడితోపాటు ఇద్దరు మహిళలు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. జగిత్యాల, మెట్పల్లిలో ఇలాంటివే జరగడంతో ముఠా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే మరిన్ని సంఘటనలు అవకాశం ఉంది. అత్యాశకు పోవద్దు – కరుణాకర్‌రావు, సీఐ బంగారు కడ్డీ దొరికిందని నమ్మబలికితే నమ్మవద్దు. మాయముఠా తిరుగుతోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ‘బంగారం వస్తువు దొరికింది. మీ వద్ద ఉంచుకోండి..’ అని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. వారిని నమ్మవద్దు. మహిళలు, వృద్ధులు అత్యాశకు పోవద్దు. ఏదైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. -
అమాయక పౌరుల్ని చంపేందుకే వచ్చా..!
శ్రీనగర్ః భద్రతా బలగాలకు సజీవంగా చిక్కిన పాకిస్తానీ టెర్రరిస్ట్ బహదూర్ అలి.. తాను అమాయక పౌరుల్ని చంపేందుకే పాకిస్తాన్ నుంచీ కశ్మీర్ కు వచ్చినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముందు తెలిపాడు. కశ్మీర్ లో భద్రతా బలగాలు అరెస్టు తర్వాత.. అతనిని విచారించిన ఎన్ఐఏ ముందు ఈ విచిత్ర ప్రకటన చేశాడు. శ్రీనగర్ లో భద్రతాబలగాలకు చిక్కిన ఉగ్రవాది బహదూర్ అలి ఎన్ఐఏ విచారణ సందర్భంలో అశ్చర్యకర నిజాలను వెల్లడించాడు. బహదూర్ అలి.. అలియాస్ సైఫుల్లా తాను కశ్మీర్ కు సాధారణ, అమాయక ప్రజలను చంపేందుకే పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు ఎన్ఐఏ విచారణలో తెలిపాడు. అంతేకాదు తాను గెరిల్లా వార్ ఫేర్ లోని లష్కరే తోయిబాలో (ఎల్ఈటీ) శిక్షణ పొందినట్లు చెప్పడంతోపాటు, జమాత్ ఉద్ దవా (జుద్) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను కూడా రెండుసార్లు కలిసినట్లు ఆ 22 ఏళ్ళ టెర్రరిస్ట్ ఎన్ఐఏకు తెలిపాడు. దీనికితోడు తాను పాక్ లో ఏర్పాటైన కంట్రోల్ రూమ్ తో నిత్యం సంప్రదింపులు కూడా జరిపినట్లు చెప్పాడు. దీంతో బహదూర్ అలి లాహోర్ నగరానికి చెందిన పాకిస్తాన్ జాతీయుడని విచారణలో హోం మంత్రిత్వశాఖ నిర్థారించింది. అలాగే కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ అహిర్ కూడా అతడి గుర్తింపును ధ్రువీకరించారు. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టర్ సమీపంలో భద్రతాబలగాల కాల్పుల్లో మరో నలుగురు ఎల్ఈటీ ఉగ్రవాదులు చనిపోగా బహదూర్ అలి మాత్రం సజీవంగా పట్టుబడ్డాడు. అతనివద్ద నుంచీ మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులు, 23 వేల రూపాయలు కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత రెండు నెలల కాలంలో సరిహద్దు జిల్లాల్లో పాకిస్తానీ టెర్రరిస్టును సజీవంగా పట్టుకోవడం ఇది రెండోసారి కాగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ టీట్వాల్ ప్రాంతంనుంచీ తీవ్రవాదులు లోయలోకి ప్రవేశించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. ముందుగా టాంగ్ధర్ సెక్టర్ లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు.. అక్కడినుంచీ లీపా లోయలోకి వెళ్ళి అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన అడవీప్రాంతంలో దాక్కున్నట్లు హోంశాఖ వెల్లడించింది. -
'అందుకే స్మృతి హెచ్ఆర్డీ శాఖను కోల్పోయారు'
పాట్నా: కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అమాయకురాలని ఆర్డేజీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కితాబిచ్చారు. మానవ వనరుల శాఖ మంత్రిగా వీలైనన్ని మంచి పనులు చేశారని ఆయన ప్రశంసించారు. అయితే... ఇతర కార్యక్రమాల్లో స్మృతి ఎక్కువ బిజీ కావటం వల్లే హెచ్ఆర్డీ శాఖను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. చేనేత శాఖలో ఆమె అంతగా రాణిస్తుందనుకోవటం లేదని లాలూ వ్యాఖ్యానించారు. కాగా కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్మృతి శాఖను మార్చిన విషయం తెలిసిందే. మరోవైపు తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తే ప్రధాన పాత్ర పోషిస్తానని ఆయన అన్నారు. లాలూ గతంలో సునీల్ శెట్టి హీరోగా నటించిన 'పద్మశ్రీ లాలూప్రసాద్ యాదవ్' చిత్రంలో నటించారు. -
నేను అమాయకుడిని.. కోర్టుపై నమ్మకముంది!
న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కోర్టు సమన్లు ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్కే పచౌరి తాజాగా స్పందించారు. ఈ కేసులో తాను అమాయకుడినని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఆయనపై పోలీసులు నమోదుచేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకుసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెరి మాజీ చీఫ్ అయిన పచౌరి స్పందిస్తూ 'చార్జీషీట్లోని అభియోగాలను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకానీ నాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఎక్కడా పేర్కొనలేదు. ఫిర్యాదుదారు చేసిన అభియోగాలపై ఏడాది పాటు సాగిన విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడి కాలేదు' అని పేర్కొన్నారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసముందని, తాను ఏ తప్పు చేయలేదని, అదే విషయం కోర్టు తీర్పు ద్వారా రుజువు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై పచౌరి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. 2015లో బాధితురాలిని లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
'అమాయకులపై పోలీసు వేధింపులా... '
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు అమాయకులను వేధించడం సరికాదని విరసం నేత వరవరరావు అన్నారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరవరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా మున్సిపాలిటీకి చెందిన ధార సారయ్య కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని తెలిపారు. సారయ్య కుటుంబానికి ప్రాణభయం ఉందని, వారి కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఆ బాధ్యత ప్రభుత్వానిదే అని వరవరరావు అన్నారు. సారయ్య కుటుంబసభ్యులతో హోంమంత్రికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వరవరరావు..సారయ్య కుటుంబానికి న్యాయం చేయడం పట్ల ప్రభుత్వంపై తనకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు. -
నా కుమారుడు నిర్దోషి...
* ఆధారాలతో రుజువు చేస్తాం: సీబీఐ మాజీ డెరైక్టర్ విజయరామారావు * శ్రీనివాస్ కల్యాణ్ నా కొడుకు కాకపోతే ఇంత ప్రచారం ఉండేదా? * సీబీఐ కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టడం లేదు * ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే దోషి కాదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘‘నా కుమారుడు శ్రీనివాస్ కల్యాణ్ డాషింగ్ యంగ్మన్. తప్పుడు పనులు చేసేవాడు కాదు. మంచి ఆలోచనలు ఉన్నవాడు. నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు. వాస్తవాలేమిటో ఆధారాలతో సహా ఏ కోర్టులోనైనా నిరూపించుకునేందుకు మేం సిద్ధం. కొన్ని వాస్తవాలు నాకు తెలిసినా... ఇప్పుడు బహిర్గతం చేయలేను. బ్యాంకు రుణం విషయంలో సీబీఐ నా కుమారుడి మీద కేసు నమోదు చేసిన మాట వాస్తవం. ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే దోషి కాదు’ అని సీబీఐ మాజీ డెరైక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు శ్రీనివాస్ కల్యాణ్రావుపై బ్యాంకు రుణం ఎగవేత కేసుకు సంబంధించి వివరణ ఇచ్చారు. సీబీఐ కేసు వివరాలు వెల్లడించకుండా, సీబీఐని తప్పుపట్టకుండా, కేంద్ర మంత్రి సుజనా చౌదరిపైగానీ, టీడీపీ నేతలపైగానీ ఆరోపణలు చేయకుండా... మీడియా అడిగిన ప్రశ్నలకు ఆచితూచి సమాధానాలిచ్చారు. ఆవేదనతో కూడిన స్వరంతో తన కుమారుడు నిజాయితీపరుడు, నిర్దోషని చెప్పేందుకు విజయరామారావు ప్రయత్నించారు. శ్రీనివాస్ కల్యాణ్ తన కుమారుడు కావడం వల్లే ఇంత ప్రచారం జరిగిందన్నారు. బ్యాంకును మోసం చేసి రూ.304 కోట్లు ఎగ్గొట్టారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించారని, అందుకే తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు. ‘మీరు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరినందుకు కుట్రలో భాగంగానే శ్రీనివాస్ కల్యాణ్‌ను సీబీఐ కేసులో ఇరికించారా?..’ అన్న ప్రశ్నకు ‘ఏదీ కాదనలేను.. ఏదీ ఔననలేను..’ అని సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఈ కేసులో ఇరికించారా? అని ప్రశ్నించగా... ‘నేనెవరి పేరు చెప్పలేను’ అన్నారు. సుజనా చౌదరి నుంచి మీకు బెదిరింపులు వచ్చాయా అని అడిగితే... ‘అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా?’ అని ఎదురు ప్రశ్నించారు. సీబీఐ తప్పుడు కేసు నమోదు చేసిందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా... ‘‘సీబీఐకి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసింది. తప్పుడు కేసు నమోదు చేసిందని అనను. అయితే నమోదు చేసిన కేసు ఎంత వరకు నిజమనే విషయం దర్యాప్తులో తేలుతుంది. నేను సీబీఐ డెరైక్టర్‌గా పనిచేశాను కాబట్టే ఈ కేసుకు ఇంత ప్రచారం వచ్చింది. నా కుమారుడు కావడమే శ్రీనివాస్ కల్యాణ్ తప్పయింది..’’ అని విజయరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు గురించి మాజీ డెరైక్టర్‌గా మీకు తెలిసిందేమిటని అడగగా... తనకేమీ తెలియదని, ఒక తండ్రిగా తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. తాను సీబీఐతో ఏమీ మాట్లాడలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. తన కుమారుడు ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నాడని తెలిపారు. తనకు ఆస్తులేవీ లేవని, హైదరాబాద్‌లోని ఇల్లు, సొంత ఊళ్లో వ్యవసాయ భూములు తప్ప ఏమీ లేవని... వాటిని తన ఖా పెట్టినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. తన కుమారుడికి పంట రుణాలు తప్ప ఏ బ్యాంకులోనూ ఇతర రుణాలేవీ లేవని వివరించారు. -
'నా భర్త చాలా అమాయకుడు'
బెంగళూరు: 'తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు నా భర్త తలకు గన్ పెట్టి బెదిరించారు. వారు మేం ఢిల్లీ పోలీసులం అని చెప్పారు కానీ ఎలాంటి ప్రూఫ్ చూపించనే లేదు. నన్నూ తుపాకితో బెదిరించి ఆయుధాలు ఎక్కడున్నాయ్ అని అడిగారు. ఎలాంటి అరెస్ట్ వారెంట్, సెర్చ్ వారెంట్ లేకుండానే ఇంట్లోకి వచ్చి నా భర్తను తీసుకెళ్లారు. నా భర్త చాలా చాలా అమాయకుడు' అని ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టైన బెంగళూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. అఫ్జల్ భార్య బష్రా మీడియాతో వాపోయింది. దేశ వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న పలువురిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూరులో అఫ్జల్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారని కర్నాటక హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు దేశవ్యాప్తంగా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 'నన్ను ఆ కుర్చీలో లేకుండా చేసేందుకు భారీ కుట్ర చేశారు. నేను దళితుడిని. పైగా దళితుల్లోనే అత్యంత తక్కువ కులానికి చెందిన వాడిని. చాలామందికి నేను అధికారంలో ఉండటం నచ్చడం లేదు. నా రాజకీయ భవిష్యత్తును ముగించేందుకు చాలామంది కుట్ర పన్నారు. సాధారణంగా నా ఇంటికి ఎప్పుడూ అతిథులు బహుమతులు, స్వీట్లతో వస్తుంటారు. నా భార్య ఏమి తెలియని ఒక పల్లెటూరు మహిళ. ఆ టీవీ వాళ్లు బహుమతి అని చెప్పి ఇస్తేనే తీసుకుంది. పైగా అందులో డబ్బు లేదని ఏవో కార్డులని చెప్పి తీసుకున్న తర్వాత డబ్బుతో నిండిన బహుమానం అని చెప్పారు. మాపై ఇలాంటి జులుం ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతుండటం చూస్తూనే ఉన్నాం' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పారు. -
ఆర్తి చాలా అమాయకురాలు
-
ఆర్తి చాలా అమాయకురాలు
ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయని, చిన్న వయసులోనే చనిపోవడం దురదృష్టకరమని దర్శకుడు విజయ్ భాస్కర్ అన్నారు. ఆర్తి మరణించారనే వార్త విని షాకయ్యానని చెప్పారు. టాలీవుడ్లో ఆర్తి తొలిసారి విజయ్ భాస్కర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నటించారు. 2001లో ముంబైలో ఆర్తి ఫొటో చూసిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లడి సినిమాలో నటించే అవకాశం ఇచ్చానని విజయ్ భాస్కర్ గుర్తు చేసుకున్నారు. ఆర్తి చాలా అమాయకురాలని, కష్టపడేతత్వమని చెప్పారు. అప్పట్లో ఆమెకు అనారోగ్య సమస్యలున్నట్టు తనకు తెలియదని, ఆ తర్వాత వచ్చి ఉండొచ్చని విజయ్ భాస్కర్ అన్నారు. ఆర్తికి మంచి భవిష్యత్ ఉంటుందని అనుకున్నానరి, చిన్న వయసులో చనిపోవడం బాధాకరమని విజయ్ భాస్కర్ అన్నారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఆర్తి నటించిన నువ్వు నాకు నచ్చావు ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో మంచి గుర్తింపు పొందిన ఆర్తి ఆ తర్వాత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. -
జయ విజయం
రాజకీయాల్లో ప్రవేశించిన క్షణం నుంచి ఎన్నో యుద్ధాలనూ, అవి ముందుకు తీసుకొచ్చే సవాళ్లనూ...ఎన్నెన్నో ఆటుపోట్లనూ ఒంటి చేత్తో ఎదుర్కొంటున్న అన్నా డీఎంకే అధినేత జయలలిత మరో సుదీర్ఘ పోరాటంలో ఎన్నదగిన విజయం సాధించారు. పందొమ్మిది సంవత్సరాలనాటి అక్రమార్జన కేసులో ఆమె, ఆమెతోపాటు మరో నలుగురూ నిర్దోషులని కర్ణాటక హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిరుడు సెప్టెంబర్‌లో ఇదే కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షనూ, వంద కోట్ల రూపాయల జరిమానాను విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చినప్పుడు జయలలిత రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పడినట్టేనని అందరూ భావించారు. నాలుగేళ్ల జైలు శిక్ష, అనంతరం ఆరేళ్ల అనర్హతవల్ల మొత్తం పదేళ్లు ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాల్సివస్తుందని లెక్కలు వేశారు. అయితే మిన్ను విరిగి మీదపడినా, సర్వమూ అయిపోయినట్టేననిపించిన సందర్భాలు వచ్చిపడినా ఏమాత్రం చలించకుండా... స్థిరంగా, దృఢంగా నిలబడి పోరాడటం జయలలిత స్వభావం. నిజానికి ఆ స్వభావమే ఆమెను తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలబెట్టింది. ఫీనిక్స్‌లా మళ్లీ మళ్లీ ఆమెను పెకైగసేలా చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో జయలలిత మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. అయితే ప్రత్యేక కోర్టు తీర్పు తర్వాత శాసనసభ సభ్యత్వం రద్దయినందువల్ల నిబంధనల ప్రకారం ఆర్నెల్లలోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసి ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఎటూ వచ్చే ఏడాదితో ముగిసిపోతుంది గనుక ఆర్నెల్లలోగా ఎమ్మెల్యేగా పోటీచేసే బదులు అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని ఆమె నిర్ణయించుకున్నా ఆశ్చర్యంలేదు. జయలలితపై వచ్చిన అవినీతి ఆరోపణలూ, అందుకు సంబంధించిన కేసులూ, విచారణలూ, వాయిదాలూ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమెపై ఇంతవరకూ డజను కేసులు నడిచాయి. వాటన్నిటిలోనూ జయలలిత నిర్దోషిగా బయటికొచ్చారు. టాన్సీ భూములు కుంభకోణంలో కింది కోర్టు 2001లో ఆమెను దోషిగా తేల్చి అయిదేళ్లు శిక్ష విధించగా, అప్పీల్లో ఆ కేసు సైతం వీగిపోయింది. ఇప్పుడు తీర్పు వెలువడిన అక్రమార్జన కేసు 1996 నాటిది. ఒక కేసులో వచ్చిన నేరారోపణలు నిజమా, కాదా అని తేలడానికి ఇన్నేళ్లు పట్టడం...ఆ కేసు ఇన్ని మలుపులు తిరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జయలలితపై వచ్చిన ఈ కేసులన్నిటి వెనకా రాజకీయ స్పర్శ ఉంది. 1991లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన జయలలిత 1996 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆ సమయంలో ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని అపరిమితంగా ఆస్తులు కూడబెట్టారని ప్రస్తుత బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడు అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో విచారణ ప్రారంభమయ్యాక ఎన్నెన్నో మలుపులు తిరిగింది. ఈలోగా జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇందువల్ల కేసులో న్యాయం జరిగే అవకాశం లేదని డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ అనంతరం దీన్ని బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీచేస్తూ 2003లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదలా కొనసాగుతుండ గానే జయలలిత మళ్లీ అధికారం కోల్పోయారు. నిరుడు సెప్టెంబర్‌లో ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధించేనాటికి జయలలిత అధికారంలో ఉన్నారు. ఆ తీర్పు పర్యవసానంగా ఆమె పదవినుంచి తప్పుకున్నారు. కొత్తగా పన్నీరుసెల్వం నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భవానీసింగ్‌ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం సైతం వివాదాస్పదమైంది. ఆ నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి ఆ పదవిలో మరొకరిని నియమించమని క ర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా వరసబెట్టి ప్రతికూల నిర్ణయాలు వెలువడతున్న తరుణంలో జయలలితకు ఊరటనిస్తూ వెలువడిన కర్ణాటక హైకోర్టు తీర్పు సహజంగానే ఆమెకూ, ఆమె మద్దతుదార్లకూ ఎనలేని సంతోషాన్నిచ్చింది. తమిళనాడు అవినీతి వ్యతిరేక డెరైక్టరేట్ చేసిన దర్యాప్తు తప్పుల తడకగా ఉన్నదని, రాజకీయ కక్ష సాధింపుతో తన ఆస్తుల విలువను తప్పుగా మదింపు వేశారని జయలలిత చేసిన వాదనను సింగిల్ జడ్జి బెంచ్ అంగీకరించింది. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 66.45 కోట్లుగా ప్రాసిక్యూషన్ నిర్ధారించగా వాటి విలువ రూ. 37.59 కోట్లని హైకోర్టు తేల్చింది. ఈ కాలంలో ఆమె సంపాదనను 34.76 కోట్లుగా లెక్కేసి వ్యత్యాసం రూ. 2.82 కోట్లు మాత్రమేనని నిర్ధారణకొచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కెళ్తే భవిష్యత్తులో ఏమవుతుందన్నది పక్కనబెడితే అసలు ఒక కేసులో న్యాయాన్యాయాలను నిర్ధారించడానికి మన న్యాయస్థానాలు ఇంత సుదీర్ఘకాలాన్ని ఎందుకు తీసుకుంటున్నాయన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు సాగదీయాలనుకోవడంవల్ల కావొచ్చు... అధికారంలో ఉన్నవారి ప్రాపకంతో దర్యాప్తు సంస్థలు కావాలని చేసే జాప్యంవల్ల కావొచ్చు విచారణ ప్రక్రియ హద్దూ ఆపూ లేకుండా ఏళ్లకేళ్లు నడుస్తున్నది. ఇందువల్ల తప్పుచేసినవారు శిక్ష పడకుండా దీర్ఘకాలం తప్పించున్నట్టే నిజంగా ఏ తప్పూ చేయనివారు ‘అవినీతి’ ముద్రతో, క్షోభపడుతూ కాలం వెళ్లబుచ్చవలసి వస్తున్నది. ఇప్పుడు జయలలిత కేసే తీసుకుంటే ఈ పందొమ్మిదేళ్ల పొడవునా ఆమెపై విమర్శలు చేయాల్సివచ్చినప్పుడల్లా ప్రత్యర్థులకు ఈ అవినీతి కేసులే ఆయుధం. అది ఆమె రాజకీయ జీవితంపై అంతో ఇంతో ప్రభావం చూపింది. తీరా ఇన్నేళ్ల తర్వాత ఆమె నిర్దోషిగా బయటపడ్డారు. ఆలస్యం అయినా కేసులను నిష్పాక్షికంగా విచారించి, తీర్పులివ్వడంలో మన న్యాయవ్యవస్థ సమర్థవంతమైనది. అయితే, ఈ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవడం అవసరం ఉన్నదని ప్రస్తుత కేసు తెలియజెబుతోంది. -
తుది శ్వాస వరకూ స్వామి సేవలోనే: డాలర్ శేషాద్రి
తిరుపతి : డాలర్ల కుంభకోణం కేసులో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని డాలర్ శేషాద్రి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో తనను ఇరికించేందుకు కొంతమంది ప్రయత్నించారని ఆరోపించారు. స్వామివారి ఆశీస్సులు ఉన్నంతవరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరని డాలర్ శేషాద్రి అన్నారు. తుది శ్వాస ఉన్నంత వరకూ స్వామివారి సేవలోనే తరలించాలనేది తన కోరిక అని ఆయన పేర్కొన్నారు. కాగా తిరుమల శ్రీవారి డాలర్ల మాయం కేసులో డాలర్ శేషాద్రి నిర్దోషిగా బయటపడ్డారు. ఈ మేరకు చిత్తూరు కోర్టు తుదితీర్పునిచ్చింది. 2006లో తిరుమలలో 5 గ్రాముల బరువున్న 300 బంగారు డాలర్లు మాయమయ్యాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీసీఐడీ విచారణ చేసి 2008లో తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. సుదీర్ఘకాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో టీటీడీ షరాబు వెంకటా చలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. -
శ్రీవారి డాలర్ల కుంభకోణం కేసులో తీర్పు
టీటీడీ మాజీ ఉద్యోగికి మూడేళ్ల జైలు చిత్తూరు/సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన బంగారు డాలర్లను మాయంచేసిన కేసులో టీటీడీ మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరు సీబీసీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి ఆలయ మాజీ షరాబు వెంకటాచలపతికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి యుగంధర్ శుక్రవారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లెపాగు శ్రీనాథ్ కథనం మేరకు.. 2006 జూన్ 22న శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని కౌంటర్లో 5 గ్రాముల బరువున్న 300 శ్రీవారి డాలర్లు కనిపించకుండా పోయాయి. దీన్ని గుర్తించిన అప్పటి ఆలయ పేష్కార్ వాసుదేవన్ రూ.15 లక్షల విలువైన బంగారు డాలర్లు కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. డాలర్లు కనిపించకుండా పోయిన కాలంలో షరాబుగా పనిచేసిన వెంకటాచలపతే ఈ చోరీకి కారణమని సీబీసీఐడీ పోలీసులు నిర్ధారించారు. న్యాయం గెలిచింది: డాలర్ శేషాద్రి డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న పి.శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రికి ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘న్యాయం గెలిచింది. డాలర్ల కేసుతో నాకు సంబంధం లేదని చెప్పాను. అదే జరిగింది. అంతా ఆ స్వామి దయ’’ అని పేర్కొన్నారు. -
నిర్దోషిగా బయటపడ్డ డాలర్ శేషాద్రి
హైదరాబాద్: తిరుమల శ్రీవారి డాలర్ల మాయం కేసులో డాలర్ శేషాద్రి నిర్దోషిగా బయటపడ్డారు. శుక్రవారం చిత్తూరు కోర్టు ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. 2006లో తిరుమలలో 5 గ్రాముల బరువున్న 300 బంగారు డాలర్లు మాయమయ్యాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీసీఐడీ విచారణ చేసి 2008లో తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. సుదీర్ఘకాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో టీటీడీ షరాబు వెంకటా చలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.