హైదరాబాద్: తిరుమల శ్రీవారి డాలర్ల మాయం కేసులో డాలర్ శేషాద్రి నిర్దోషిగా బయటపడ్డారు. శుక్రవారం చిత్తూరు కోర్టు ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.
2006లో తిరుమలలో 5 గ్రాముల బరువున్న 300 బంగారు డాలర్లు మాయమయ్యాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీసీఐడీ విచారణ చేసి 2008లో తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. సుదీర్ఘకాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో టీటీడీ షరాబు వెంకటా చలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.
నిర్దోషిగా బయటపడ్డ డాలర్ శేషాద్రి
Published Fri, Nov 14 2014 6:40 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement