Dollar Seshadri
-
డాలర్ శేషాద్రి అంత్యక్రియలు ఫోటోలు
-
శ్రీవారి సేవకు భాష్యం చెప్పిన స్వామి
శ్రీవేంకటేశ్వర స్వామి కొలువులో అజరామరమైన సేవలో తరించిన వారెందరో. వారిలో డాలర్ శేషాద్రి స్వామి అద్వితీయుడు. 1978 నుండి నాకున్న పరి చయం మధ్యాహ్నపు నీడలా అంతకంతకూ పెరిగింది. విశేషించి నేను పాలకమండలి అధ్యక్షుడిగా దేవదేవుడికి చేసిన కైంకర్యంలో శేషాద్రి స్వామి సహకారం వెలలేనిది. వ్యక్తిగతంగా అందరివాడు శేషాద్రి – నిగర్వి, సౌమ్యుడు. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. ఎంతటి వారినైనా ఆదరిస్తారు, అవసరమైతే అదుపు చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలనా కాలంలో నా నేతృత్వంలో (కళ్యాణమస్తు), దళిత గోవిందం వంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వహిం చాము. ప్రతి కార్యక్రమంలో తలలో నాలుకలా శ్రీనివాసుని ధర్మప్రచారంలో నాకు ఆయన తోడై నిలిచారు. శేషాద్రి స్వామి అంటే సమయపాలనకు ఉదాహరణ. ఒక సమయానికి ఈ పని జరగాలని, నిర్ణయిస్తే, సకాలంలో దీన్ని పూర్తి చేయడంలో సహకరిస్తాడు. సేవలలో, కార్యక్రమాలలో ఎలాంటి చిన్న లోపం జరగకుండా తగిన జాగరూకత వహిస్తాడు. ప్రతీ వ్యక్తి జీవితంలో చీకటి, వెలుగులుంటాయి. తిరుమలలో జరిగిన డాలర్ల వినియోగంలో అవకతవకల్లో ఈయన హస్తముందన్నారు. కానీ, సమగ్ర విచారణ జరిగాక, స్వచ్చంగా పులుకడిగిన ముత్యంలా నిలి చారు. నాకు తెలిసినంతవరకూ ఏనాడు కూడా ధనానికి శేషాద్రి స్వామి ప్రాధాన్యతను ఇవ్వలేదు. పైగా శ్రీవారి భక్తులు బలవంతంగా సంభావనను ఇచ్చినా, సాటి వారికి వితరణ చేసేవారు లేదా శ్రీవారి సేవల్లో ఏ అలంకారానికో ఖర్చు చేసేవారు. చదవండి: (శ్రీవారి సేవలో 43 ఏళ్లు) తిరుమల ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ అన్నమయ్య కీర్తనలో – ఎండకానీ, వాన కానీ, ఏమైనా కానీ, కొండలరాయుడే కులదైవ మన్న సందేశాన్ని స్వామి స్ఫూర్తిగా నింపుకొన్నవారీ యన. సంప్రదాయ దుస్తులతో, ఊర్థ్వపుండ్రాలతో నిత్యం శ్రీవారి సేవలో తరించేవారికి ఆయన స్ఫూర్తిదాత. తిరుమలకు వచ్చిన భారత రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానులు, ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులెందరెందరో శేషాద్రి స్వామితో తప్పకుండా ఫోటోకు సిద్ధమవుతారు. ఇది అతిశయోక్తి కాదు. నేను తిరుపతి వాసిగా, స్థానిక శాసనసభ్యుడిగా, పాలకమండలి అధ్యక్షుడుగా పలు పదవులు పొందుతుంటే ఇంటికివచ్చి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపిన మనస్వి. చదవండి: (డాలర్ శేషాద్రి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం) అన్నింటికీ మించి శేషాద్రి స్వామిలో నేను గమనించిన గొప్పలక్షణం, నిరాడంబరత. ఏనాడూ, ఎవరినీ ఆయన కించిపరచి మాట్లాడరు. మనిషికీ, మనిషికి మధ్య అంతరం తొలగాలని కోరుకొనేవారు. శ్రీవారి పక్షాన ఎన్నో దేవాలయాలకు వెళ్ళి వస్త్ర బహుమానాలిచ్చే కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యశీలి. అసలు ఉత్సవ సమయాల్లో ప్రతి చోటా తాను ఉండటమే కాకుండా, స్వామి కైంకర్యంలో శాస్త్రీయతకు బాసటగా నిలుస్తారు. విశ్రాంతి సమయాలను పాటించకున్నా, ఆరోగ్యంగా తనవంతు సేవలు చక్కగా చేశారు. ఇందుకు కారణం సమయపాలన, నిబద్ధత, శ్రీవారి పట్ల ఉన్న విశేష భక్తి విశ్వాసాలు. ఉదాత్త భావాలు కలిగిన శ్రీవారి దాసుడు. నిజాయితీ కల ఉద్యోగి, ఏ పటాటోపాలు లేని ఆచార్య పురుషుడు. సదా శ్రీవారి సేవల్లో జీవితాన్ని పండించుకొన్న ధన్యజీవికి, నా కన్నీటి వీడ్కోలు. శ్రీనివాస ప్రభువు శాశ్వత వైకుంఠవాసాన్ని శేషాద్రి స్వామికి ప్రసాదిస్తాడని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి శాసనసభ్యులు -
శ్రీవారి సేవలో 43 ఏళ్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ శేషాద్రి అంటే తెలియని వారుండరు. శ్రీనివాసుడి సన్నిధిలో 1978లో గుమస్తాగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1979లో ఉత్తర పార్ పత్తేదార్‌గా టీటీడీలో రెగ్యులర్ ఉద్యోగి అయ్యారు. తరువాత జూనియర్,సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది 2007 జూలైలో పార్ పత్తేదార్‌గా రిటైరయ్యారు. ఇలా 43 ఏళ్లపాటు శ్రీవారి సేవలో ఆయన తరించారు. 1948 జులై 15న జన్మించిన డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి, మెడలో పొడవైన డాలర్ ధరించి ఉండడంతో ఆ పేరుతో డాలర్ శేషాద్రిగా ప్రసిద్ధిగాంచారు. శేషాద్రి పూర్వీకులది తమిళనాడు రాష్ట్రంలోని కంచి. శేషాద్రి తండ్రి గోవిందరాజస్వామి ఆలయంలోని తిరుమల నంబి ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించేవారు. తిరుపతిలోనే జన్మించిన శేషాద్రి విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తిచేశారు. అప్పట్లోనే పీజీ పూర్తిచేసిన ఆయన ఆ తరువాత చంద్రమ్మను వివాహమాడారు. అయితే, వీరికి పిల్లలులేరు. శేషాద్రికి ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. విస్తృత పరిచయాలు డాలర్ శేషాద్రికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు తదితర ప్రముఖలందరితోనూ విస్తృత పరిచయాలున్నాయి. అయితే.. 2009లో శేషాద్రికి ఊహించని దెబ్బ తగిలింది. తిరుపతికి చెందిన రైతు నాయకుడు టీటీడీలో 60 ఏళ్లకు పైబడిన వారిని కొనసాగించకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం తీర్పుతో టీటీడీ ఆ సమయంలో శేషాద్రి సహా 58 మందిని విధుల నుంచి తప్పించింది. కానీ, శేషాద్రి తన పోరాటం కొనసాగించి విజయం సాధించారు. ఇలా దాదాపు 10 నెలలపాటు శ్రీవారి సేవలకు దూరమయ్యారు. స్వామివారి వాహనాల అలంకరణలో.. 1987లో శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్థ రద్దయిన సమయంలో ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణలో టీటీడీకి ఎంతో సహాయం అందించిన వ్యక్తి డాలర్ శేషాద్రి. శ్రీవారి వాహన సేవలప్పుడు స్వామి వారిని ఏ విధంగా అలంకరించాలో కూడా అర్చకులకు చెప్పి స్వామివారి వాహనాల అలంకరణకు పూర్తిస్థాయిలో సహకరించేవారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పూజలకు సంబంధించి చేస్తున్న మార్పుల్లోనూ శేషాద్రి తన తోడ్పాటును టీటీడీకి అందిస్తున్నారు. శ్రీవారికి సేవలోనే.. స్వామివారి సేవలో తరిస్తున్న శేషాద్రి శ్రీవారి సేవలో వున్నప్పుడే పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. 2013లో కిడ్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న ఆయన 2016లో తీవ్ర అస్వస్థతకు గురై తర్వాత కోలుకున్నారు. ఈ రెండుసార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలోనే ఆయన ఆస్వస్థతకు గురయ్యారు. ఇలా తన 42 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు 15 నెలల కాలం మినహా మిగతా సమయం అంతా స్వామి సేవలోనే తరించారు. చివరకి తన తుది శ్వాస విడిచే సమయంలో కూడా శేషాద్రి విశాఖలో శ్రీవారి సేవలోనే ఉన్నారు. -
వీఐపీ దర్శనాలకు అన్నీ తానై.. ప్రముఖులతో డాలర్ శేషాద్రి ఫోటోలు
-
డాలర్ శేషాద్రి మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. చదవండి: డాలర్ శేషాద్రి మృతి పట్ల వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి -
డాలర్ శేషాద్రి మృతి పట్ల వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, తిరుపతి: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి సేవలు మరువలేనివన్నారు. ఆయన మరణం పట్ల సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారన్నారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారన్నారు. ఆయన మరణ వార్త తానను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చదవండి: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత -
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖ నుంచి తరలించారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణం విడిచిన ఆయన భౌతికకాయాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీ అనాటమీ విభాగంలో ఎంబాంబ్ మెంట్ చేపట్టారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. రెండు గంటల పాటు జరిగిన ఈ ప్రక్రియ అనంతరం భౌతికకాయాన్ని విశాఖ నుంచి తిరుపతి తరలించారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని చూసి పలువురు చలించిపోయారు. తిరుమల వెంకన్న స్వామితో ఆయన సుదీర్ఘ అనుబంధం గుర్తు చేసుకున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి డాలర్ శేషాద్రి అకాల మరణం పై విచారణ వ్యక్తం చేశారు. రేపు(మంగళవారం) తిరుపతి గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తిరుమలలో1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ చేశారు. 1978లో టీటీడీలో చేరిన ఆయన.. 2006 జూన్ లో రిటైరయ్యారు. అప్పటి నుంచి ఓఎస్డీగా కొనసాగుతున్నారు. డాలర్ శేషాద్రికి ఆ పేరెలా వచ్చింది? శేషాద్రి అంటే అసలు ఎవరికీ తెలియదే. అదే డాలర్ శేషాద్రి అంటే సులువుగా గుర్తుపడతారు. ఆయనకా పేరు రావడానికి రెండు కారణాలున్నాయి. నుదుట నామాలు ధరించి మెడలో పెద్ద డాలర్‌ను ధరించడం వల్లే ఆయనకు డాలర్ అనే బిరుదు వచ్చింది. ఆత్మీయులు, సన్నిహితులు ఆయనను డాలర్ మామ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇక శ్రీవారి ఆలయంలో స్వామి వారి ప్రతిమతో కూడిన డాలర్‌ను తయారు చేసి విక్రయించేవారు. అది కూడా డాలర్ చేతుల మీదుగానే కొనసాగేది. అప్పటి నుంచి శేషాద్రికి బదులుగా డాలర్ శేషాద్రిగానే ఆయన ప్రాచుర్యం పొందారు. గుమాస్తా నుంచి ఓఎస్డీ స్థాయికి.. టీటీడీలో డాలర్ శేషాద్రికి ఎంతో పేరు ఉంది. సాధారణ గుమాస్తాగా చేరి దేవస్థానం ఓఎస్డీ స్థాయికి ఎదిగారు. 50 ఏళ్ల నుంచి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, ఉత్సవాలు, కైంకర్యాలు, సేవలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై శేషాద్రికి పట్టు ఉంది. అందుకే రిటైర్మెంట్ అయి పదేళ్లకు పైనే అయినప్పటికీ ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు. వీఐపీ దర్శనాలకు అన్నీ తానై.. తిరుమలకు ఎంతో మంది వీఐపీలు, వీవీఐపీలు వెంకన్నను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇలా వచ్చిన వీఐపీలు ప్రత్యేకించి డాలర్ శేషాద్రి ఆశీస్సులు పొందేందుకు ఆసక్తి చూపుతారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన ప్రముఖులకు శేషాద్రి చేతుల మీదుగానే మర్యాదలు జరుగుతుండేవి. ఆయనకు చాలా మంది ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దగ్గర నుంచి నేటి మోదీ వరకు.. అంబానీలు, అదానీలు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రపతులు ఇలా వీఐపీలు, వీవీఐపీలు ఎవరొచ్చినా డాలర్ శేషాద్రి దగ్గరుండి దర్శనాలు చేయించేవారు. డాలర్ శేషాద్రి మరణం బాధాకరం: టీటీడీ ఛైర్మన్ డాలర్ శేషాద్రి మరణం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని మాజీ సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: అమ్మో.. మళ్లీ వాన -
డాలర్ శేషాద్రిపై అసత్య ప్రచారం, కేసు నమోదు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో అసత్య పోస్టులు హల్చల్ చేశాయి. దీనిపై ఆయన టీటీడీకి ఫిర్యాదు చేశారు. డాలర్ శేషాద్రి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎస్వీ బద్రీపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక అసలు విషయానికొస్తే... డాలర్ శేషాద్రి వయసు రిత్యా రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు. దానిలో భాగంగానే చెన్నైలోని అపోలోలో ఆయన ఇటీవల పరీక్షలకు వెళ్లొచ్చారు. (చదవండి: శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత) అయితే, డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ బద్రీ వరుస ట్వీట్లు చేయడంతో వివాదాస్పదమైంది. డాలర్ శేషాద్రికి ఇప్పటికే మూడు సార్లు కోవిడ్ పరిక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. అయినా తనను మానసికంగా వేధించడంతో పాటు భక్తులను భయభ్రాంతులకు గురిచేసేలా బద్రీ ట్వీట్లు చేస్తున్నారంటూ శేషాద్రి వాపోయారు. ఇదిలాఉండగా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల 18 మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వారిలో కొందరు కోలుకున్నారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. (టీటీడీలో 170 మంది సిబ్బందికి పాజిటివ్) -
వెంకన్న స్వామీ..నీ కొండకు నీవే రక్ష!
సాక్షి, తిరుపతి: ఏడు కొండలపై వెలసిన శ్రీవెంకటేశ్వరుడే తన ఆస్తులను కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు రగిల్చిన చిచ్చు రోజురోజుకూ రాజుకుంటోంది. తాజాగా టీటీడీ మాజీ సీవీఎస్ఓ రమణకుమార్ డాలర్ శేషాద్రి గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తిరుపతి పోలీస్ అతిథిగృహంలో మాజీ సీవీఎస్ఓ రమణకుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి ఆలయంలో చోటు చేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు. తిరుమల అలిపిరి పాదాల మండపం వద్ద సన్నిధి గొల్లలు టీటీడీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఒకేరోజు ఇన్ని పరిణామాలు జరగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని 300 బంగారు డాలర్లు గతంలో కనిపించకుండా పోయిన విషయాన్ని మాజీ సీవీఎస్ఓ రమణకుమార్ గుర్తుచేశారు. ఆ సమయంలోనే పింక్ డైమండ్ కూడా పోయిందని రమణ దీక్షితులు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లోనే శ్రీవారికి రూ.లక్ష కోట్లు విలువచేసే ఆభరణాలు ఉండేవని మాజీ ఈఓ రమణాచారి వెల్ల డించిన విషయాన్ని తెలియజేశారు. ఇంకా రూ.50వేల కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు కూడా ఉండేవని తన నివేదికలో పేర్కొన్నట్లు వివరించారు. ఆ తాళాలు డాలర్ శేషాద్రి వద్దే.. వేల కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను భద్రపరచే గది తాళాలు రెండూ అప్పట్లో టీటీడీ డాలర్ శేషాద్రి వద్దే ఉంచిన విషయాన్ని మాజీ సీవీఎస్ఓ రమణమూర్తి తప్పుబట్టారు. డాలర్ శేషాద్రి అనే వ్యక్తి మొదట్లో టీటీడీలో పారుపత్తేదారుగా ఉద్యోగంలో చేరారు. ఆయన టీటీడీలో మంత్రాలు, ఆశీర్వాదాలు చేసే స్థాయికి ఎదిగిన విషయాన్ని రమణకుమార్ ప్రస్తావించారు. పదవీ విరమణ పొందిన డాలర్ శేషాద్రి అనే వ్యక్తి మంత్రాలు పఠించడం, ఆశీర్వాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. బంగారు ఆభరణాలు భద్రపరిచే గది తాళాలు రెండూ డాలర్ శేషాద్రికి అప్పగించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆ తాళాలు రెండింటిలో ఒకటి డెప్యూటి ఈఓ వద్ద, మరొకటి పేష్కార్ వద్ద ఉండాలన్నారు. ఇదిలా ఉంటే డాలర్ శేషాద్రి రిటైర్ అయినా ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ పేరుతో టీటీడీలో కొనసాగించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. 1933 నుంచి ఉండాల్సిన రికార్డులు 1952 నుంచే ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కోరినట్లు సీబీఐ దర్యాప్తు జరిగితే ఆయన అవకతవకలే వెలుగు చూస్తాయని రమణకుమార్ వెల్ల డించారు. అయితే చివరగా శ్రీవారి ఆలయంలోని ఆభరణాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని చెప్పడం గమనార్హం. ఇదిలావుంటే టీటీడీ మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ బోర్డు నియామకంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అన్యమతస్తురాలు ఎమ్మెల్యే అనితను సభ్యురాలిగా నియమిం చేందుకు నిర్ణయం తీసుకున్నపుడే టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. సన్నిధి గొల్లల ఆందోళన.. టీటీడీ పాలకమండలి తీసుకున్న 65 ఏళ్లకే రిటైర్మెంట్ నిర్ణయాన్ని సన్నిధి గొల్లలు తప్పుబడుతున్నారు. రమణ దీక్షితులను తొలగించినట్లే సన్నిధి గొల్లలను ఉద్యోగులుగా పరిగణించి రిటైర్మెంట్ ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించిందని వారు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా ఆదివారం సన్నిధి గొల్లలు, యాదవులు సంప్రదాయ వృత్తుల వేషధారణలో అలిపిరి పాదాల మండపం వద్ద నిరసన తెలియజేశారు. టీటీడీలో కులరాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను టీటీడీలో పనిచేసే కొందరు మంటగలుపుతున్నారని మండిపడ్డారు. తాము టీటీడీలో ఉద్యోగులం కాదని, శ్రీవారి సేవకులం మాత్రమేనని స్పష్టం చేశారు. సేవకులకు రిటైర్మెంట్ ఉండదని గుర్తుచేశారు. -
రూ.వేలకోట్ల ఆభరణాలకు డాలర్ శేషాద్రి రక్షకుడా?
తిరుమల: వేలకోట్ల రూపాయల విలువచేసే తిరుమలేశుని ఆభరణాలు భద్రపరిచే గది రెండు తాళాలు డాలర్ శేషాద్రి వద్ద ఎందుకు ఉంచారు? రిటైర్ అయిన ఉద్యోగిని ప్రత్యేక అధికారాలతో ఎందుకు కొనసాగించాల్సి వస్తోంది?’అని టీటీడీ మాజీ సీవీఎస్వో రమణకుమార్ ప్రశ్నించారు. 2008లో టీటీడీ సీవీఎస్వోగా పనిచేసిన రమణకుమార్ తిరుపతిలోని పోలీస్ అతిథిగృహంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ గతంలో తిరుమలలో జరిగిన 300 డాలర్లు కుంభకోణంపై విచారించే సమయంలో పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులు ప్రస్తావించారన్నారు. శ్రీవారి ఆభరణాలు, శ్రీవారి నగదు భద్రపరుస్తున్న బొక్కసం గది రెండు తాళాలు డాలర్ శేషాద్రి వద్ద ఉండకూడదని నివేదిక సమర్పించానన్నారు. -
నేత్ర ద్వారాలు తెరవాల్సిందే
సాక్షి, తిరుమల: పోటెత్తుతున్న భక్తుల దర్శన సౌకర్యార్థం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని వెండి వాకిలికి అటుఇటుగా నేత్రద్వారాలు తెరవాల్సిన అవసరం ఉందని, దానివల్ల భక్తులు సులువుగా లోపలికి, బయటకు వెళ్లి వచ్చే అవకాశముందని ఆలయ ఓఎస్డి పి. శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి అన్నారు. దేవదేవుడు తలుచుకుంటే నేత్రద్వారాలు ఆపేశక్తి ఎవరికీ లేదని.. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొట్టమొదటి ఆలయ సన్నిధి ప్రాకారం మినహా మిగిలిన ఆలయ ప్రాకారాలన్నీ కొత్తగా నిర్మాణం చేసుకున్నవేనని ఆయన వివరించారు. అంకుర్పాణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే... నాడు నిలువ నీడలేని స్వామి.. శ్రీ వేంకటేశ్వర స్వామివారు పూర్వపు రోజుల్లో చింత చెట్టుకింద ఉండేవారట. నిలువ నీడలేని రోజుల్లో అడవి జాతి మనుషులు వారి పద్ధతుల్లో పూజించేవారు. స్వామిపై సూర్య, చంద్రుల నీడ పడుతోందని ఆళ్వారుల కీర్తనల ద్వారా వెల్లడైంది. అంటే స్వామికి గుడి లేదన్నది విస్పష్టం. ఆ తర్వాత ‘‘నీ ముంగిట తొలి గడపగా ఉండాలి’’ అని కీర్తించిన కులశేఖరాళ్వారు మాటలతో గర్భాలయం వచ్చి ఉండవచ్చు. ఆ తర్వాత గర్భాలయం ఆనుకునే నిర్మాణాలు, ఆనంద నిలయం వచ్చి ఉండవచ్చు. గరుడాళ్వార్ తర్వాత నిర్మాణాలన్నీ కొత్తవే.. స్వామి కొలువైన సన్నిధి ప్రాకారం మినహా మిగిలినవన్నీ కొత్త నిర్మాణాలే. తొలిరోజుల్లో గరుడాళ్వార్ వెనుకనే ధ్వజస్తంభం, కొబ్బరికాయలు కొట్టే అఖిలాండం ఉండేవి. భక్తులు పెరగడంతో వాటిని 13వ శతాబ్దం తర్వాత సంపంగి ప్రాకారం వెలుపలకు తరలించారు. ఆ తర్వాత ఆలయంలో భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఆలయంలోనే అనేక మార్పులు, చేర్పులతో కొత్త నిర్మాణాలు వచ్చాయి. పూజకు మాత్రమే ఆగమం.. తిరుమల శ్రీవారి కైంకర్యాలన్నీ వైఖానస ఆగమం ప్రకారమే సాగుతున్నాయి. ఆ కైంకర్యాల్లో ఎలాంటి లోపాల్లేవు. ఆగమం కేవలం పూజకు మాత్రమే సంబంధం. నిర్మాణాల్లో మార్పులు చేర్పులు.. ఏది మంచి, ఏది చెడు చూడాల్సింది శిల్ప నిపుణులు, స్తపతులు మాత్రమే. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా భయపడను? 1996లోనే అప్పటి ఆలయ ఆగమ విద్వాంసులు మాడంబాక్కం శ్రీనివాసులు తిరుమల ఆలయంలో నేత్రద్వారాలు తెరుచుకోవటం శ్రేయస్కరమన్నారు. ఆగమ పండితుల మధ్య సమన్వయం లేకపోవడం, రాజకీయ కారణాలతో అది ఆగింది. కొండలతో కూడుకున్న తిరుమల లాంటి ఆలయ నిర్మాణాల్లో ఆగమం చూడకూడదు. ఆగమం పట్టించుకుంటే తిరుమల ఆలయం ఇంత స్థాయిలో విస్తరించి ఉండేదా? పెరుగుతున్న భక్తుల కోసం మార్పులు చేయవచ్చు. నా నలభై ఏళ్ల అనుభవంతోనే చెబుతున్నా.. భక్తుల కోసం స్వామి పూజ, స్వామి సన్నిధి మినహా ఇతర ఆలయాల్లోని నిర్మాణాల్లో ఎన్ని మార్పులు చేసినా తప్పులేదు. వాహన సేవలూ మార్చవచ్చు భక్తుల కోసం కొంతకాలంగా గరుడ వాహనం ఊరేగింపు సమయాన్ని రాత్రి 9 గంటలకు బదులు రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించునే అవకాశం కలుగుతోంది. ఇదే తరహాలో మిగిలిన వాహన సేవలూ మార్చవచ్చు. వాహన సేవల సమయాలను ఆగమంలో చెప్పలేదు. అలాగే, సహస్ర దీపాలంకార సేవ సమయం కూడా మార్చుకోవచ్చు. ఇకపోతే.. స్వామి తలపై భక్తులు ప్రయాణించకూడదన్న భావనతోపాటు రాజకీయ కారణంతో తిరుమల రోప్‌వే ప్రాజెక్టు ఆగింది. కొండ మీద సెల్ టవర్లు, వంతెనలు సైతం నిర్మించినందున రోప్వేకూ ఎలాంటి అభ్యంతరం లేదు. -
మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి.
-
మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ పి.శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి (69) ఆదివారం తిరిగి విధుల్లో చేరారు. అనారోగ్యం కారణంగా గత 40 రోజులుగా డాలర్ శేషాద్రి ఆసుపత్రికే పరిమితమయ్యారు. కిడ్నీలకు వైద్యం చేయించుకుని తిరిగి స్వామివారి సేవకు వచ్చానని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు స్వామి వారి సేవలోనే తరిస్తానని పేర్కొన్నారు. 1977లో ఉత్తర పారుపత్తేదార్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. 18 ఏళ్లపాటు శ్రీవారి ఆలయంలోనే పనిచేశారు. జూలై 31, 2006లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత స్వామి వారి ఆలయ ఓఎస్డీగా అవకాశం వచ్చింది.పదవీ విరమణ తర్వాత కూడా సుమారు తొమ్మిదేళ్లుగా శ్రీవారి సేవలో నిమగ్నమైన శేషాద్రికి ఇదివరకే పలుమార్లు ఛాతీనొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
పది రోజుల తర్వాత మళ్లీ వస్తా
వైద్యుల సూచన మేరకే ఉత్సవాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది స్వామి సేవకే అంకితం : డాలర్ శేషాద్రి తిరుమల : ‘నా తుది శ్వాస వరకు స్వామి సేవకే అంకితం. ఆ స్వామి దయ ఉన్నంత వరకూ నా సంకల్పంలో ఎలాంటి రాజీ ఉండబోదు’ అంటున్నారు ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి. ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన వైద్యుల సూచన మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కొంత దూరంగా ఉంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయన్ను సోమవారం ఫోన్లో ‘సాక్షి’ పలకరించింది.. ఆయన మాటల్లోనే.. ‘నాకు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలంటే ప్రాణం. కొండకి రావాలనీ ఉంది. కానీ.. వైద్యులు వారిస్తున్నారు. మరో పదిరోజుల తర్వాతే పంపుతామంటున్నారు. ఏమి చేసేది. వయసు మీద పడుతోంది కదా?. వారి చెప్పినట్టు వినకతప్పడం లేదు. 1977లో ఉత్తర పారుపత్తేదార్‌గా విధుల్లో చేరాను. వివిధ హోదాల్లో పనిచేశాను. 32 ఏళ్ల కాలంలో 18 ఏళ్లపాటు శ్రీవారి ఆలయంలోనే పనిచేశాను. జూలై 31, 2006లో ఉద్యోగ విరమణ చేశాను. ఆ తర్వాత ఆస్వామి వారే ఆలయ ఓఎస్డీగా కొనసాగేలా అవకాశం ఇచ్చారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు స్వామి సేవ చేస్తాను. అదే సంకల్పంతో సాగిపోతున్నా. ఇప్పటికే నా ఉద్యోగ జీవితంలో 60కిపైగా బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకున్నా. యేటా బ్రహ్మోత్సవాలతోపాటు అధికమాసంలో వచ్చే రెండు బ్రహ్మోత్సవాలూ ఉన్నాయి. దేనికవే సాటి. ఆయా సందర్భాల్లో అందరూ కలసికట్టుగా పనిచేయడం దేవస్థానంలోని మంచి సంప్రదాయం. ఆరోగ్య కారణాల రీత్యా అంతకుమించి మాట్లాడలేను’ అంటూ సెలవిచ్చారు. -
డాలర్ శేషాద్రికి మళ్లీ గుండెపోటు
-
డాలర్ శేషాద్రికి మరోసారి గుండెపోటు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం తొలుత స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం డాలర్ శేషాద్రిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయన అలసట కారణంగా అస్వస్థతకు లోనయినట్లు సమాచారం. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చింది. కాగా డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వివరాలు తెలియాల్సి ఉంది. -
తుది శ్వాస వరకూ స్వామి సేవలోనే: డాలర్ శేషాద్రి
తిరుపతి : డాలర్ల కుంభకోణం కేసులో ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని డాలర్ శేషాద్రి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో తనను ఇరికించేందుకు కొంతమంది ప్రయత్నించారని ఆరోపించారు. స్వామివారి ఆశీస్సులు ఉన్నంతవరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరని డాలర్ శేషాద్రి అన్నారు. తుది శ్వాస ఉన్నంత వరకూ స్వామివారి సేవలోనే తరలించాలనేది తన కోరిక అని ఆయన పేర్కొన్నారు. కాగా తిరుమల శ్రీవారి డాలర్ల మాయం కేసులో డాలర్ శేషాద్రి నిర్దోషిగా బయటపడ్డారు. ఈ మేరకు చిత్తూరు కోర్టు తుదితీర్పునిచ్చింది. 2006లో తిరుమలలో 5 గ్రాముల బరువున్న 300 బంగారు డాలర్లు మాయమయ్యాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీసీఐడీ విచారణ చేసి 2008లో తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. సుదీర్ఘకాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో టీటీడీ షరాబు వెంకటా చలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. -
డాలర్ల కేసుకు స్వస్తి
టీటీడీ ఉద్యోగి వెంకటాచలంను ముద్దాయిగా తేల్చిన కోర్టు ఆరోపణల నుంచి శేషాద్రితోపాటు మరికొందరికి విముక్తి మలుపులు తిరిగిన కేసు ..టీటీడీ చరిత్రలో మరక తిరుమల : సంచలనం రేపిన శ్రీవారి డాలర్ల గల్లంతు కేసుకు చిత్తూరు కోర్టు శుక్రవారం ముగింపు పలికింది. దాదాపు ఎనిమిదేళ్లు సాగిన మూడొందల బంగారు డాలర్ల కుంభకోణం కేసులో టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకటాచలపతిని ముద్దాయిగా తేల్చింది. మూడేళ్ల జైలు, జరిమానా విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాలర్ శేషాద్రితోపాటు మరికొందరు అధికారులు విముక్తి పొందారు. అయితే, ఈ డాలర్ల కుంభకోణం మాత్రం టీటీడీ చరిత్రలో మరకలా మిగిలిపోనుంది. డాలర్ల కేసు ఇలా.. తిరుమల ఆలయంలో భక్తులకు విక్రయించే బంగారు డాలర్లు 300 గల్లంతైన విషయం 2006 జూన్‌లో వెలుగుచూసింది. ఈ కేసును టీటీడీ విజిలెన్స్, పోలీసు, సీబీసీఐడీ దర్యాప్తు చేశాయి. తొలుత తిరుమల ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటాచలంను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడంతోపాటు అప్పటి టీటీడీ సీవీఎస్వో రమణకుమార్ నివేదిక ఆధారంగా ఆలయ డెప్యూటీ ఈవో రెడ్డివారి ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్, ఆలయ బొక్కసం ఇన్చార్జిగా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్డీగా కొనసాగిన డాలర్ శేషాద్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ముగ్గురిపై అప్పటీ ఈవో కేవీ.రమణాచారి వేటు వేశారు. ఈ వ్యవహారంలో ఈవో చర్యను టీటీడీ అధికార, ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో ఆ ముగ్గురిపై సస్పెన్షన్ తొలగిస్తూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించడ ంతో సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. తర్వాత డెప్యూటీ ఈవో ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్ ఉద్యోగ విరమణ పొందారు. కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్డీగా డాలర్ శేషాద్రి మాత్రం కొనసాగారు. శేషాద్రి కొనసాగింపుపై తిరుపతికి చెందిన మాంగాటి గోపాల్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో డాలర్ శేషాద్రిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. డాలర్ శే షాద్రి కూడా హైకోర్టును ఆశ్రయించి 14 నెలల విరామం తర్వాత 2012లో తిరిగి ఆలయ ఓఎస్డీగా విధుల్లో చేరారు. ఈ తరుణంలో దాదాపుగా ఎనిమిదేళ్లు సాగిన డాలర్ల కుంభకోణం కేసుపై చిత్తూరు కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ముద్దాయిగా వెంకటాచలంను తేల్చి మూడేళ్ల జైలు, జరిమానా విధించింది. అయితే శ్రీవారి బంగారు డాలర్ల కేసు మాత్రం టీటీడీ చరిత్రలో మరకలా నిలిచిపోనుంది. సాక్షాత్తు స్వామి కొలువైన ఆలయంలోనే భక్తులకు విక్రయించే సుమారు 300 బంగారు డాలర్లు గల్లంతు కావడంపై దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆలయ పోషణ, అందులో 81 ఏళ్ల చరిత్ర కలిగిన టీటీడీ పాలనలో డాలర్ల కేసొక మరకలా మిగిలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ల కేసుతో శ్రీవారి ఆభరణాలకు అదనపు రక్షణ డాలర్ల కుంభకోణంతో శ్రీవారి ఆభరణాలకు రక్షణ చేకూరునట్టైంది. భక్తులు హుండీలో వేసిన బంగారు ఆభరణాలు కరిగించి తయారు చేసిన బంగారు డాలర్లు గల్లంతు కావడంతో టీటీడీ ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిగణించింది. ఆలయం బొక్కసంలో ఉండే 13 తిరువాభరణ రికార్డుల్లోని శ్రీవారి ఆభరణాల భద్రతపై దృష్టిసారించింది. శ్రీవారి ఆభరణాల విషయంలో నేరుగా ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసుకుని వాటిపై జస్టిస్ జగన్నాథ్, జస్టిస్ వాద్వా కమిటీలను నియమించాయి. వారు పలుమార్లు ఆలయాన్ని సందర్శించారు. రికార్డులు, ఆభరణాలు పరిశీలించి నివేదికలిచ్చారు. స్వామి ఆభరణాల భద్రతపై విలువైన సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఖచ్చితంగా అమలు చేసేలా టీటీడీ ఉన్నతాధికారులను బాధ్యులను చేశారు. ప్రస్తుతం వారి సూచనల ప్రకారం స్వామి ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. అలాగే, ఆలయంలోనే నగల పరిశీలన కోసం ల్యాబొరేటరీ ప్రారంభించారు. కేసును టీటీడీ విజిలెన్స్, పోలీసు, సీబీసీఐడీ దర్యాప్తు చేశాయి. తొలుత తిరుమల ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటాచలపతిని సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడంతోపాటు అప్పటి టీటీడీ సీవీఎస్వో రమణకుమార్ నివేదిక ఆధారంగా ఆలయ డెప్యూటీ ఈవో రెడ్డివారి ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్, ఆలయ బొక్కసం ఇన్చార్జిగా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్డీగా కొనసాగిన డాలర్ శేషాద్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ముగ్గురిపై అప్పటీ ఈవో కేవీ.రమణాచారి వేటు వేశారు. ఈ వ్యవహారంలో ఈవో చర్యను టీటీడీ అధికార, ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో ఆ ముగ్గురిపై సస్పెన్షన్ తొలగిస్తూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించడంతో సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. తర్వాత డెప్యూటీ ఈవో ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్ ఉద్యోగ విరమణ పొందారు. కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్డీగా డాలర్ శేషాద్రి మాత్రం కొనసాగారు. శేషాద్రి కొనసాగింపుపై తిరుపతికి చెందిన మాంగాటి గోపాల్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో డాలర్ శేషాద్రిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పిం చారు. డాలర్ శే షాద్రి హైకోర్టును ఆశ్రయించి 14 నెలల విరామం తర్వాత 2012లో తిరిగి ఆలయ ఓఎస్డీగా విధుల్లో చేరారు. దాదాపుగా ఎనిమిదేళ్లు సాగిన డాలర్ల కుంభకోణం కేసుపై చిత్తూరు కోర్టు తుది తీర్పు వెల్లడిం చింది. ముద్దాయిగా వెంకటాచలపతిని తేల్చి మూడేళ్ల జైలు, జరిమానా విధించింది. అయి తే శ్రీవారి బంగారు డాలర్ల కేసు మాత్రం టీటీడీ చరిత్రలో మరకలా నిలిచిపోనుంది. సాక్షాత్తు స్వామి కొలువైన ఆలయంలోనే భక్తులకు విక్రయించే సుమారు 300 బంగారు డా లర్లు గల్లంతు కావడంపై దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆలయ పోషణ, అందులో 81 ఏళ్ల చరిత్ర కలిగిన టీటీడీ పాలనలో డాలర్ల కే సు ఒక మరకలా మిగిలిపోనుంది. డాలర్ల కేసుతో శ్రీవారి ఆభరణాలకు అదనపు రక్షణ డాలర్ల కుంభకోణంతో శ్రీవారి ఆభరణాలకు రక్షణ చేకూరునట్టైంది. భక్తులు హుండీలో వేసిన బంగారు ఆభరణాలు కరిగించి తయారు చేసిన బంగారు డాలర్లు గల్లంతు కావడంతో టీటీడీ ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిగణించింది. ఆలయం బొక్కసంలో ఉండే 13 తిరువాభరణ రికార్డుల్లోని శ్రీవారి ఆభరణాల భద్రతపై దృష్టిసారించింది. శ్రీవారి ఆభరణాల విషయంలో నేరుగా ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసుకుని వాటిపై జస్టిస్ జగన్నాథ్, జస్టిస్ వాద్వా కమిటీలను నియమించాయి. వారు పలుమార్లు ఆలయాన్ని సందర్శించారు. రికార్డులు, ఆభరణాలు పరిశీలించి నివేదికలిచ్చారు. స్వామి ఆభరణాల భద్రతపై విలువైన సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఖచ్చితంగా అమలు చేసేలా టీటీడీ ఉన్నతాధికారులను బాధ్యులను చేశారు. ప్రస్తుతం వారి సూచనల ప్రకారం స్వామి ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. అలాగే, ఆలయంలోనే నగల పరిశీలన కోసం ల్యాబొరేటరీ ప్రారంభించారు. -
శ్రీవారి డాలర్ల కుంభకోణం కేసులో తీర్పు
టీటీడీ మాజీ ఉద్యోగికి మూడేళ్ల జైలు చిత్తూరు/సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన బంగారు డాలర్లను మాయంచేసిన కేసులో టీటీడీ మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరు సీబీసీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి ఆలయ మాజీ షరాబు వెంకటాచలపతికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి యుగంధర్ శుక్రవారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లెపాగు శ్రీనాథ్ కథనం మేరకు.. 2006 జూన్ 22న శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని కౌంటర్లో 5 గ్రాముల బరువున్న 300 శ్రీవారి డాలర్లు కనిపించకుండా పోయాయి. దీన్ని గుర్తించిన అప్పటి ఆలయ పేష్కార్ వాసుదేవన్ రూ.15 లక్షల విలువైన బంగారు డాలర్లు కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. డాలర్లు కనిపించకుండా పోయిన కాలంలో షరాబుగా పనిచేసిన వెంకటాచలపతే ఈ చోరీకి కారణమని సీబీసీఐడీ పోలీసులు నిర్ధారించారు. న్యాయం గెలిచింది: డాలర్ శేషాద్రి డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న పి.శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రికి ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఈ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘న్యాయం గెలిచింది. డాలర్ల కేసుతో నాకు సంబంధం లేదని చెప్పాను. అదే జరిగింది. అంతా ఆ స్వామి దయ’’ అని పేర్కొన్నారు. -
నిర్దోషిగా బయటపడ్డ డాలర్ శేషాద్రి
హైదరాబాద్: తిరుమల శ్రీవారి డాలర్ల మాయం కేసులో డాలర్ శేషాద్రి నిర్దోషిగా బయటపడ్డారు. శుక్రవారం చిత్తూరు కోర్టు ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. 2006లో తిరుమలలో 5 గ్రాముల బరువున్న 300 బంగారు డాలర్లు మాయమయ్యాయి. ఈ కేసులో డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీసీఐడీ విచారణ చేసి 2008లో తమ నివేదికను కోర్టుకు సమర్పించింది. సుదీర్ఘకాలం ఈ కేసును విచారించిన న్యాయస్థానం డాలర్ శేషాద్రిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో టీటీడీ షరాబు వెంకటా చలపతికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. -
మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి
-
మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి
తిరుపతి: శ్రీవారి సేవకు రేపటి నుంచి అంకితమవుతానని టీటీడీ ఒఎస్డీ డాలర్ శేషాద్రి వెల్లడించారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి సాక్షితో మాట్లాడుతూ... కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి తనకు పునర్జన్మ కల్పించారన్నారు. ఆయన ఆశీస్సులతోనే ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన గుండెపోటుకు గురైన తాను... దాదాపు 30 గంటలు అపస్మారక స్థితిలో ఉన్నానని శేషాద్రి గుర్తు చేశారు. ఆ సమయంలో టీటీడీ అధికారులు అండగా నిలిచారని... వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్వామి వారి సేవలో ఉన్నానని చెప్పారు. అన్యారోగ్యంతో ఉన్నప్పుడు తనపై కొందరు చేసిన వ్యతిరేక భావనను పట్టించుకోనని డాలర్ శేషాద్రి స్పష్టం చేశారు. -
శ్రీవారి సేవకు పునరంకితమవుతా
తిరుపతి: శ్రీవారి సేవకు తాను పునరంకితమవుతానని తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల ఒకటవ తేదీన ఆయన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. స్విమ్స్‌లో చికిత్స అనంతరం ఆయనను చెన్నై ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది ఆరోగ్యం మెరుగుపడడంతో సోమవారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి సరోజినీదేవి రోడ్‌లోని స్వగృహానికి చేరుకున్నారు. ఆయన తోబుట్టువులు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. శేషాద్రి వెంట చెన్నై నుంచి టీటీడీ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డివారి ప్రభాకర్‌రెడ్డి, సుబ్రమణ్యయాదవ్ (పరదాల మణి) వచ్చా రు.. సంపూర్ణ ఆరోగ్యంతో స్వగృహానికి చేరుకున్న శేషాద్రిని ‘సాక్షి’పలకరించింది. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన మనోభావాలు.. బాగా విశ్రాంతి పొంది వచ్చాను. ప్రస్తుతం కులాసాగానే ఉన్నాను. ఇక విశ్రాంతి అవసరం లేదు. బుధవారం నుంచి శ్రీవారి సేవకు పునరంకితం అవుతా. స్వామి నాకు పునర్జన్మ ప్రసాదించాడు. మునుపటి కంటే ఉత్సాహంగా స్వామి సేవలో పాల్గొంటా. సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి శ్రీవారి గరుడసేవలో ఎప్పటిలాగే పాల్గొన్నా. మరుసటి రోజు ఉదయం హనుమంత వాహన సేవలో ఉండగా ఆయాసం వచ్చింది. 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని కాసేపు కూర్చున్నా. అయినా తగ్గలేదు. అశ్వని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. స్విమ్స్‌లో చేర్పించిన తర్వాత మరుసటి రోజు కొంత తేరుకున్నా. 3వ తేదీ ఉదయం వచ్చిన వాళ్లతో మాట్లాడగలిగాను. తిరుమలలో జేఈవో, ఆలయ డెప్యూటీ ఈవో, పేష్కార్ సహకారం బాగుంది. నేను అస్వస్థతకు గురైంది మొదలు క్షేమంగా ఇంటికి చేరేంత వరకు వారందరూ నా ఆరోగ్యం కోసం పరితపించారు. శేషాద్రి ఓఎస్డీ పదవీ కాలాన్ని పొడిగించినందుకు ఎవైరె నా బాధపడి ఉంటే నేనేమి చేయగలను? శ్రీవారిని సేవించే అవకాశం మళ్లీ ఎందుకు కల్పించారో వారు ఆ స్వామినే అడగాలి. శేషాద్రి కంట కన్నీరు చెన్నై నుంచి ఇంటికి చేరుకున్న శేషాద్రి తనను ఎక్కువగా అభిమానించే తోబుట్టువులు ఆప్యాయంగా తల నిమిరి పలకరించే సరికి దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. కంట తడి పెట్టారు. స్వామి దయ వల్ల క్షేమంగా తిరిగి వచ్చానని వారిని ఓదార్చారు. -
మెరుగవుతున్న డాలర్ శేషాద్రి ఆరోగ్యం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మంగళవారం చైన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు. శేషాద్రికి డయాబెటీస్ ఉండటంతో శస్త్రచికిత్సలు చేయకుండా మాత్రలతో ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్టు వైద్యులు చెప్పారు. మరో మూడు నెలల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. శేషాద్రికి గుండెపోటు రావడంతో చికిత్స చేయిస్తున్న విషయం విదితమే. -
డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై ఆసక్తి
సాక్షి, తిరుమల: గుండెపోటుకు గురైన ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై అందరూ ఆసక్తి కనబరిచారు. గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై టీటీడీ ఉద్యోగులు చర్చించుకున్నారు. ‘దేవుడి ఆశీసులతో శేషాద్రి స్వామి క్షేమం గా రావాలి’ అంటూ ఆకాంక్షిం చారు. ప్రస్తుతం స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాలర్ శేషాద్రి ఆరోగ్యం కుదుట పడిందన్న సమాచారం తెలియడంతో వాహన సేవల్లోని సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం హనుమంత వాహనం వరకు ఆలయ ఓఎస్డీగా అన్నీ తానై నడిపించే డాలర్ శేషాద్రి బాధ్యతల్ని ఆలయ బొక్కసం ఇన్చార్జి గురురాజా నిర్వహించారు. వాహన సేవలు ఎక్కడ ఆపాలి? ఏ ప్రాంతంలో సర్కారు హారతి ఇవ్వాలి? గంటకొట్టి హెచ్చరించే బాధ్యతల్ని గురురాజా సమర్థవంతంగా నిర్వహించారు. శేషాద్రి కోలుకున్నారు డెప్యూటీ ఈవో ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి స్వామి క్షేమంగా కోలుకున్నారని గురువారం డెప్యూటీ ఈవో చిన్నం గారి రమణ అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని, ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆకాంక్షించారు. -
డాలర్ శేషాద్రికి అస్వస్థత
సాక్షి, తిరుమల/తిరుపతి: తిరుమల ఆలయ ఓఎస్డీ పి.శేషాద్రి(డాలర్ శేషాద్రి)కి బుధవారం గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవలో ఏకధాటిగా ఆరుగంటలపాటు విశిష్ట సేవలందించారు. అదే సందర్భంగా వాహనాన్ని అటూ ఇటూ తిప్పే సమయంలో కొంత అస్వస్థతకు లోనైనట్టు ఆయన శిష్యులు తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం హనుమద్వాహన సేవలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నివాస భవనం గోవింద నిలయంలో హఠాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. ఓ కారులో డాలర్ శేషాద్రిని అశ్వినీ ఆస్పత్రిలోని అపోలో హృద్రోగ చికిత్సా కేంద్రానికి తరలించారు. తర్వాత ఛాతీనొప్పి ఎక్కువ కావడంతో ఆయన్ను తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, పీఆర్వో రవి స్వయంగా తిరుపతిలోని స్విమ్స్‌కు మధ్యాహ్నం 3.40 గంటలకు వెంటిలేటర్‌పై తీసుకువచ్చారు. స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం శేషాద్రికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్తపోటు, గుండె పనితీరును పరీక్షించారు. మొదట్లో ఆరు గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేమన్న వైద్యులు.. తర్వాత పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఇది మూడోసారి.. శేషాద్రికి గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింద్చి. ప్రస్తుం ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తాయని వైద్యులు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి స్విమ్స్‌కు వచ్చి డాలర్ శేషాద్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాలర్ శేషాద్రి(66) 1977 జనవరి 26న టీటీడీలో ఉత్తర పారుపత్తేదార్(లెక్కలు రాసే గుమాస్తా)గా విధుల్లో చేరారు. తర్వాత సీనియర్ అసిస్టెంట్, పదోన్నతిపై పారుపత్తేదారుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2006లో ఉద్యోగ విరమణ తర్వాత ఆలయ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా 2014 జూలై 4వ తేదీ వరకు కొనసాగే అవకాశం దక్కింది. తర్వాత ప్రస్తుత ఈవో గిరిధర్ గోపాల్ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే వరకు ఓఎస్డీగా కొనసాగేందుకు పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చారు. -
డాలర్ శేషాద్రికి గుండెపోటు
-
డాలర్ శేషాద్రికి గుండెపోటు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా ఉన్న డాలర్ శేషాద్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక అశ్వని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన అలసట కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. టీటీడీ ఉన్నతాధికారులు దగ్గరుండి ఆయన ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుంటున్నారు. డాలర్ శేషాద్రికి కిడ్నీ సమస్యలతో పాటు ఊపిరితీత్తుల్లో నీరు చేరడం, ఒక్కసారిగా బీపీ లెవల్ పెరగడం వల్లే గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. -
డాలర్ శేషాద్రి పదవీ కాలం పెంపు
తిరుపతి : డాలర్ శేషాద్రి మరోసారి చక్రం తిప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో డాలర్ శేషాద్రి పదవీ కాలంని మరో రెండేళ్లు పొడిగించారు. గత ఎనిమిదేళ్లుగా ఆయన కాంట్రాక్ట్ పద్దతిలోనే ఆలయ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నారు. పదవీ విరమణ చేసినా ఆలయ ఓఎస్డీగా శేషాద్రిని కొనసాగించటంపై మరోవైపు విమర్శులు వినిపిస్తున్నాయి. ఆయన ఆ పదవి నుంచి తొలగితే ....ఆ పదవికి అర్హులైనవారు చాలామంది ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డ డాలర్ శేషాద్రి శ్రీవారి బంగారు డాలర్లు మాయం అయిన సంఘటనలో ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ప్రముఖుల అండదండలతో వాటి నుండి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఇంతకు ముందే ఓ సారి తన పదవీకాలం పొడిగించుకున్న డాలర్ శేషాద్రి ఈ సారి కూడా తన పదవి పోకుండా చక్రం తిప్పాడు. -
నిజరూపం.. అపురూపం
అప్పన్న చందనోత్సవానికి పోటెత్తిన భక్తులు స్వామిని దర్శించి పులకించిన భక్తజనం పకడ్బందీగా ఏర్పాట్లు ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి పట్టు వస్త్రాల సమర్పణ సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఏడాదికి ఒక్క రోజు మా త్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. వైశాఖ శుద్ద తదియని పురస్కరించుకుని అప్పన్న చందనోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి గురువారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేశారు. ఒంటి గంట సమయంలో స్వామిపై ఉన్న చందనాన్ని వెండి బొరుగులతో తొలగించి నిజ రూపభరితున్ని చేశారు. తెల్లవారుజామున 2.45 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు కుటుంబ సమేతంగా తొలిదర్శనాన్ని చేసుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 3.15 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి 8.30 నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవస్వాములు గంగధార నుం చి వెయ్యి కలశాలతో జలాలను తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకించారు. 108 వెండి కలశాలతో అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శీతలోపచారాలు చేశారు. అనంతరం స్వామికి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించి నిత్య రూపభరితున్ని చేశారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ రాష్ర్ట ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావు, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు కూడా స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపనందేంద్ర సరస్వతి, రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తులు సూరి అప్పారావు, నూతి రామ్మోహనరావు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, కలెక్టర్ ఆరోఖ్యరాజ్, పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి, మాజీ మంత్రులు రెడ్డి సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. విస్తృత ఏర్పాట్లు తెల్లవారుజామున 3.15 నుంచే సాధారణ భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని అధికారులు కల్పించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఫ్రీ పాస్‌లు జారీ చేయలేదు. ప్రొటోకాల్ వీఐపీలు, వీఐపీలకు వెయ్యి రూపాయల టికెట్లు అందజేశారు. లక్షా 25 వేల లడ్డూలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. అడవివరం ఆరోగ్య కేద్రం ప్రధాన వైద్యాధికారి జగదీష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆర్టీసీ పలు ప్రత్యేక బస్సులను నడిపింది. దేవస్థానం 40 బస్సులను ఉచితంగా కొండపైకి నడిపింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేషలం దించాయి.