డాలర్ శేషాద్రికి గుండెపోటు | Dollar Seshadri suffered cardiac arrest | Sakshi
Sakshi News home page

డాలర్ శేషాద్రికి గుండెపోటు

Published Wed, Oct 1 2014 3:39 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

డాలర్ శేషాద్రికి గుండెపోటు

డాలర్ శేషాద్రికి గుండెపోటు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా ఉన్న డాలర్ శేషాద్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక అశ్వని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన అలసట కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. టీటీడీ ఉన్నతాధికారులు దగ్గరుండి ఆయన ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుంటున్నారు. డాలర్ శేషాద్రికి కిడ్నీ సమస్యలతో పాటు ఊపిరితీత్తుల్లో నీరు చేరడం, ఒక్కసారిగా బీపీ లెవల్ పెరగడం వల్లే గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement