Svims hospital
-
వైఎస్ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
తిరుపతి/గుంటూరు, సాక్షి: తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తిరుపతికి బయల్దేరిన సంగతి తెలిసిందే. కాసేపట్లో పద్మావతి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉన్న తరుణంలో వైఎస్ జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తిరుచానూ క్రాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత వెళ్లాలని పోలీసులు చెప్పడంతో.. తిరుచానూరు క్రాస్ వద్ద నుంచి నడుచుకుంటూనే కాలినడకన బయల్దేరారు జగన్.. అయితే కొద్ది దూరం నడిచిన వెళ్లిన వైఎస్ జగన్.. ఆపై స్థానిక నేత కారులో తిరుపతికి బయల్దేరారు.వైఎస్ జగన్ వెళ్లే లోపు బాధితుల్ని తరలించే యోచనలో ఉన్న అధికారులు.. దానిలో భాగంగా ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే అరగంట, గంట అంటూ ఏవో సంబంధం లేని కారణాలను తెలియజేసే యత్నం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని వైఎస్ జగన్.. బాధితుల్ని పరామర్శించడానికి బయల్దేరారు.కనీసం ట్రాఫిక్ క్లియన్ చేయని అధికారులువైఎస్ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న అధికారుల్లో ఎలాగైనా బాధితుల పరామర్శను నిర్వీర్యం చేయాలనే యోచన ఉన్నట్లు కనిపిస్తోంది. కనీసం ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం లేదు అధికారులు. వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే రోజాలు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.పోలీసులు కాన్వాయ్‌ను అడ్డుకున్న క్రమంలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన వైఎస్ జగన్.. ఆపై స్థానిక నేత వాహనంలో తిరుపతికి బయల్దేరారు. అధికారుల ఓవరాక్షన్తొక్కిసలాట ఘటన తర్వాత అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వకపోగా.. ఆపై సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేసిన హడావిడి చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శిస్తారనే సమాచారం అధికారులకు అందింది. దీంతో.. ప్రభుత్వం అధికారులకు ఆగమేఘాల ఆదేశాలు జారీ చేసింది. తొలుత సీఎం చంద్రబాబు వచ్చి వాళ్లను పరామర్శిస్తారని.. అయితే జగన్ వచ్చేలోపు ఆ క్షతగాత్రులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేయాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని జగన్ నిలదీస్తారనే భయం ఈ ఆదేశాలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. -
ఒంట్లోకి దూసుకెళ్లిన ఇనుప కడ్డీ.. స్విమ్స్‌లో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్
సాక్షి, తిరుపతి తుడా: కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన తాపీ మేస్త్రి కె.లక్ష్మయ్యకు తిరుపతి స్విమ్స్ వైద్యులు సోమవారం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. శనివారం తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు లక్ష్మయ్య కిందపడ్డాడు. నిర్మాణ దశలో ఉన్న ఇంటిపై పడడంతో తొడ భాగంలో గుచ్చుకున్న ఇనుప కడ్డీ భుజం నుంచి బయటకు చొచ్చుకుని వచ్చింది. స్థానికులు అతన్ని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారానే ఇనుప కడ్డీని శరీరం నుంచి తీయాల్సి రావడంతో వైద్యులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆదివారం బాధితుడ్ని స్విమ్స్ అత్యవసర విభాగంలో చేర్పించారు. స్విమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సీటీసర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు పేషెంట్ స్థితిగతులను వైద్య పరీక్షల ద్వారా గుర్తించారు. 10 ఎంఎం సైజు ఇనుప కడ్డీ దాదాపు మూడు అడుగుల పొడవు అతని శరీర భాగంలోకి చొచ్చుకుని పోయిందని నిర్ధారించారు. అతిక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి బాధితుడికి ప్రాణం పోశారు. శరీర భాగంలోని అవయవాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుని ఆ ఇనుప కడ్డీని శరీరం నుంచి వేరు చేశారు. శస్త్రచికిత్సను విజయవంతం చేసిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ సత్యవతి, డాక్టర్ మధుసూదన్ల బృందాన్ని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ అభినందించారు. -
నారాయణ దీక్షితులు మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి పైడిపల్లి వంశీయు లు అర్చక మిరాశీ కుటుంబానికి చెందిన శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాసనారాయణ దీక్షితులు (75) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన కుమారుడు కృష్ణశేషాచల దీక్షితులు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. సీఎం జగన్ సంతాపం శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాసనారాయణ దీక్షితులు మృతిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రధానార్చకుడి మృతిపై టీటీడీ ఉన్నతాధికారులు, అర్చక కుటుంబసభ్యులు సంతాపం తెలిపారు. -
కరోనా పేషెంట్లను పరామర్శించిన చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి : కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి అనునిత్యం కృషి చేస్తున్నారని, ప్రతిరోజు కోవిడ్ ఆస్పత్రుల పనితీరుపై సమీక్ష చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతిలో కోవిడ్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి స్విమ్స్‌లోని స్టేట్ కోవిడ్ ఆస్పత్రిని స్వయంగా సందర్శించారు. పీపీఈ కిట్ ధరించి 330 మంది పేషెంట్లను స్వయంగా కలిసి వారితో మాట్లాడారు. ప్రతి పేషెంట్ వద్దకు వెళ్లి వాళ్లకు అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి తెలుసుకొన్నారు. భయపడాల్సిన పనిలేదని చికిత్సతో నయం అవుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించి అక్కడి వైద్య సేవల గురించి తెలుసుకొంటున్నట్లు తెలిపారు. (నిల్వ చేసిన కోడి రెక్కల్లో కరోనా: చైనా) స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని అలాగే సౌకర్యాలు కూడా బాగున్నాయని అన్నారు. అలాగే లోపాలు ఉంటే సరి చేయడమే తమ లక్ష్యమని, కోవిడ్ ఆస్పత్రుల మీద 45 రోజులుగా తిరుపతిలో సమన్వయ కమిటీ పని చేస్తోందన్నారు. అధికారులతో కలిసి రోజుకు 18 గంటలు పని చేస్తున్నామని, ఎక్కడా లోపం ఉండకూడదన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. (రెమ్‌డెసివిర్ : చౌక మందు లాంచ్) -
తల్లి గర్భంలో తలలేని కవలలు!
పలమనేరు(చిత్తూరు): కడుపులో తల లేని కవలలున్న గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో ఆదివారం కన్నుమూసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి ఎస్సీ కాలనీకి చెందిన యుగంధర్ భార్య అన్నపూర్ణ (27) గర్భం దాల్చింది. అప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ పలమనేరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఈ నెల 9న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులు చిత్తూరులో స్కానింగ్ సెంటర్‌కు పంపారు. స్కాన్ చేయగా కడుపులో తలలు లేని కవలలున్నట్టు తేలింది. దీంతో అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 10న ఆమెకు గర్భస్రావ మాత్రలిచ్చారు. వాటిని వేసుకున్నాక ఆమెకు ఫిట్స్ రావడంతో వెంటనే కుప్పం మెడికల్ కళాశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టిందని తేల్చారు. అక్కడ న్యూరో సర్జన్లు లేరని ఆమెను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అన్నపూర్ణ మృతికి సంబంధించిన నివేదికను మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ డీఎంహెచ్‌వోకు పంపనున్నారు. -
చనిపోయాడని ఏర్పాట్లు..ఇంతలో కదలికలు
చంద్రగిరి : చిత్తూరు జిల్లాలో బతికుండగానే రోగి చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అతని శరీరంలో కదలికలు వచ్చాయి. ఈ ఘటన చంద్రగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో రోగి చనిపోయాడని ఇంటికి పంపించేశారని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు వైద్యానికి నిరాకరించి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారని స్విమ్స్ వైద్యులు తెలపడంతో వివాదం కొనసాగుతోంది. చంద్రగిరి కొత్తపేట దాసర వీధికి చెందిన ఆర్టీసీ కండక్టర్ విశ్వనాథం నాయుడుకు గురువారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని స్విమ్స్‌కు తరలించారు. వెంటిలేటర్ ద్వారా చికిత్సలు అందిస్తున్న సమయంలో తన తండ్రి చనిపోయాడని వైద్యులు నిర్ధారించారని విశ్వనాథం కుమారుడు ప్రదీప్ తెలిపాడు. దీంతో ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆ సమయంలో ఆయన శరీరంలో ఒక్కసారిగా కదలికలు వచ్చాయని.. హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని కుటుంబసభ్యులు వాపోయారు. ఘటనపై స్విమ్స్ వైద్యులను వివరణ కోరగా విశ్వనాథంకు జబ్బు నయం కాలేదని చెప్పినా, రోగిని ఇంటికి వెళ్తామని కుటుంబసభ్యులు చెప్పారన్నారు. దీంతో రాతపూర్వకంగా రాసిచ్చి ఆయన్ను శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేశామని చెప్పారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని విశ్వనాథం కుమారుడు డిమాండ్ చేస్తున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వనాథం నాయుడిని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విశ్వనాథంనాయుడు మృతి చెందినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు. -
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత
-
నిలకడగా మురళీధర్ రావు ఆరోగ్యం
తిరుపతి : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మురళీధర్ రావును బుధవారం వైద్యుల పర్యవేక్షణలో హైదరాబాద్ తీసుకు రానున్నట్లు సమాచారం. కాగా శ్రీవారి దర్శనార్థం కాలిబాటలో తిరుమలకు బయల్దేరిన మురళీధర్ రావు గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. దాంతో కార్యకర్తలు ఆయనను హుటాహుటీన ఆస్పత్రికి తరలించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అలిపిరి నుంచి కాలిబాటలో తిరుమలకు బయల్దేరిన మురళీధర్ రావు ...గాలిగోపురం వద్దకు చేరుకోవడానికి మరో 500 మెట్లు ఉండగానే అస్వస్థతకు గురై పడిపోవటంతో ఆయనను తిరుమల అశ్వని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు గుండెపోటుగా గుర్తించారు. దాంతో మెరుగైన చికిత్స కోసం అపోలోకు అనంతరం స్విమ్స్‌కు తరలించారు. -
బీజేపీ నేత మురళీధర్ రావుకు తీవ్ర అస్వస్థత
తిరుపతి : బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను హుటా హుటీన చికిత్స నిమిత్తం స్విమ్స్‌కు తరలించారు. ఆదివారం రాత్రి నుంచి మురళీధర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తిరుపతిలో ఆయన నిన్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మురళీధర్ రావుకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డాలర్ శేషాద్రికి గుండెపోటు
-
డాలర్ శేషాద్రికి గుండెపోటు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా ఉన్న డాలర్ శేషాద్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక అశ్వని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన అలసట కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. టీటీడీ ఉన్నతాధికారులు దగ్గరుండి ఆయన ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుంటున్నారు. డాలర్ శేషాద్రికి కిడ్నీ సమస్యలతో పాటు ఊపిరితీత్తుల్లో నీరు చేరడం, ఒక్కసారిగా బీపీ లెవల్ పెరగడం వల్లే గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. -
స్విమ్స్‌ను అభివృద్ధి చేయండి
తిరుపతి: స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కి తక్షణ చర్యలు చే పట్టాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైద్యరంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తె చ్చారు. స్విమ్స్‌కు పెరిగిన రోగుల రద్దీకి అనుగుణంగా కొత్త ఓపీ బ్లాక్‌ను ఏర్పాటు చేయాలని, ట్రా మా, ఎమర్జెన్సీకేర్ సెంటర్‌ను ఏ ర్పాటు చేయాలన్నారు. కిడ్నీ, గుం డె, న్యూరాలజీ విభాగాలకు ప్రత్యే క బ్లాక్‌లు ఏర్పాటు చేయాల న్నా రు. లోటు బడ్జెట్లో ఉన్నామని చె బుతున్న ప్రభుత్వం కొత్తగా భవనాల నిర్మాణాల జోలికి పోకుండా ఉన్న ప్రభుత్వాస్పత్రుల స్థాయి పెంచే ఆలోచన ఉందా అని ప్ర శ్నించారు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న సూపర్ స్పెషాలిటీ ైవైద్యసేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వద్ద మోడల్ కాన్సెప్ట్ ఏదైనా అందుబాటులో ఉందా అని అడిగారు. ఆం ధ్రప్రదేశ్‌లో సూపర్‌స్పెషాలిటీ వైద్యులు, ఆ విభాగానికి సంబంధించిన ఇతర సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన రూ.500 కోట్లతో అదనంగా చేర్చిన 100 జబ్బులకు ఉచిత చికిత్సలు అందించడం, వైద్యరంగానికి బడ్జెట్లో రూ.1040 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నించారు. స్పీకర్ గారూ మంత్రులకు శిక్షణ ఇవ్వండి అసెంబ్లీలో పత్రికలు చదవకూడద ని మంత్రులకు శిక్షణ ఇవ్వాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భా స్కర్‌రెడ్డి కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో సందర్భం గా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పత్రిక చదువుతుండగా ఆ విషయాన్ని చెవిరెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘అధ్యక్షా.. ఇటీవల నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు శిక్షణ ఇచ్చారు. రూల్ నెం.316 ప్రకారం అసెంబ్లీలో పత్రికలు చదవకూడదని తెలిపారు. మం త్రులకు కూడా శిక్షణ ఇవ్వం డి’’ అని కోరారు. -
మెడికోలకు అన్యాయం జరిగితే ఊరుకోం: వైఎస్ఆర్ సీపీ
తిరుపతి: స్విమ్స్ ఆసుపత్రికి బదలాయించిన భవనాలను తక్షణమే మెటర్నటీకి అప్పగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అందుకోసం తిరుపతిలో మెడికోలు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపింది. శనివారం తిరుమలలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆసుపత్రి భవనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని అసెంబ్లీలో ఎండగడతామని చెప్పారు. గతంలో ధర్మాసుపత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని వారు గుర్తు చేశారు. మెడికోలకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోమని భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి స్పష్టం చేశారు.