బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు.
తిరుపతి : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. మురళీధర్ రావును బుధవారం వైద్యుల పర్యవేక్షణలో హైదరాబాద్ తీసుకు రానున్నట్లు సమాచారం. కాగా శ్రీవారి దర్శనార్థం కాలిబాటలో తిరుమలకు బయల్దేరిన మురళీధర్ రావు గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. దాంతో కార్యకర్తలు ఆయనను హుటాహుటీన ఆస్పత్రికి తరలించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
అలిపిరి నుంచి కాలిబాటలో తిరుమలకు బయల్దేరిన మురళీధర్ రావు ...గాలిగోపురం వద్దకు చేరుకోవడానికి మరో 500 మెట్లు ఉండగానే అస్వస్థతకు గురై పడిపోవటంతో ఆయనను తిరుమల అశ్వని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు గుండెపోటుగా గుర్తించారు. దాంతో మెరుగైన చికిత్స కోసం అపోలోకు అనంతరం స్విమ్స్కు తరలించారు.