స్విమ్స్‌ను అభివృద్ధి చేయండి
తిరుపతి: స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కి తక్షణ చర్యలు చే పట్టాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైద్యరంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తె చ్చారు. స్విమ్స్‌కు పెరిగిన రోగుల రద్దీకి అనుగుణంగా కొత్త ఓపీ బ్లాక్‌ను ఏర్పాటు చేయాలని, ట్రా మా, ఎమర్జెన్సీకేర్ సెంటర్‌ను ఏ ర్పాటు చేయాలన్నారు. కిడ్నీ, గుం డె, న్యూరాలజీ విభాగాలకు ప్రత్యే క బ్లాక్‌లు ఏర్పాటు చేయాల న్నా రు.
లోటు బడ్జెట్‌లో ఉన్నామని చె బుతున్న ప్రభుత్వం కొత్తగా భవనాల నిర్మాణాల జోలికి పోకుండా ఉన్న ప్రభుత్వాస్పత్రుల స్థాయి పెంచే ఆలోచన ఉందా అని ప్ర శ్నించారు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న సూపర్ స్పెషాలిటీ ైవైద్యసేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వద్ద మోడల్ కాన్సెప్ట్ ఏదైనా అందుబాటులో ఉందా అని అడిగారు.
ఆం ధ్రప్రదేశ్‌లో సూపర్‌స్పెషాలిటీ వైద్యులు, ఆ విభాగానికి సంబంధించిన ఇతర సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన రూ.500 కోట్లతో అదనంగా చేర్చిన 100 జబ్బులకు ఉచిత చికిత్సలు అందించడం, వైద్యరంగానికి బడ్జెట్‌లో రూ.1040 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నించారు.
స్పీకర్ గారూ మంత్రులకు శిక్షణ ఇవ్వండి
అసెంబ్లీలో పత్రికలు చదవకూడద ని మంత్రులకు శిక్షణ ఇవ్వాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భా స్కర్‌రెడ్డి కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో సందర్భం గా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పత్రిక చదువుతుండగా ఆ విషయాన్ని చెవిరెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘అధ్యక్షా.. ఇటీవల నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు శిక్షణ ఇచ్చారు. రూల్ నెం.316 ప్రకారం అసెంబ్లీలో పత్రికలు చదవకూడదని తెలిపారు. మం త్రులకు కూడా శిక్షణ ఇవ్వం డి’’ అని కోరారు.