
నాలుగు శాఖలకే దాదాపు 81 శాతం నిధులు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఉప పథకాలకు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన గ్రాంట్లు కలిపి రాష్ట్రానికి రూ.38,788 కోట్లు నిధులు వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల్లో కేవలం నాలుగు శాఖలకే 81శాతం మేర వస్తాయని తేల్చారు. కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆయా పథకాలకు కేటాయించిన నిధుల ఆధారంగా మన రాష్ట్రానికి ఎంత వస్తాయనేది అంచనా వేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
ముఖ్యంగా ఆయా పథకాల కోసం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చేసిన కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని ఈ అంచనాలు రూపొందించినట్లు పేర్కొంది. కేంద్ర బడ్జెట్‌లో వివిధ పథకాలకు రూ.5,20,61 కోట్లు కేటాయించగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.38,788 కోట్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,750 కోట్లకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. అయితే గత రెండేళ్ల కేటాయింపులను పరిశీలిస్తే రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనల్లో సగం కన్నా తక్కువగా రూ.6,078 కోట్ల వరకు రావొచ్చని అధికారులు అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment