Cevireddi Bhaskar
-
ఇదికూడా రాజకీయమేనా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తనకు కేటాయించిన క్వార్టర్ నంబర్ 157ను పరిశుభ్రంగా ఉంచుకుందామని మరమ్మతులు చేయించుకున్నా రాజకీయం చేస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటాయించిన క్వార్టర్లకు పునరుద్ధరణ పనులు చేయించుకోవడమనేది అందరూ చేసేదేనని తాను మాత్రమే ఆ పనులు చేయడంలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఎరబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్వార్టర్లు తనకు కేటాయించిన వరుసలోనే ఉన్నాయని వారంతా వాటిని తమ అభీష్టం మేరకు పునరుద్ధరణ పనులు చేసుకున్నారని, ఢిల్లీలో కూడా టీడీపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి సుజనాచౌదరికి కేటాయించిన క్వార్టర్లను స్టార్ హోటళ్ల మాదిరిగా పునర్నిర్మించుకున్నారని ఈ సందర్భంగా చెవిరెడ్డి ఉదహరించారు. అయితే, తన విషయంలోనే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తన క్వార్టర్ మరమ్మతులపై వ్యతిరేక కథనం రాసిన ఆంగ్ల పత్రిక ఎడిటర్, రిపోర్టర్‌పై తాను న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. నంబర్ 157 క్వార్టర్లో అడుగు పెట్టేనాటికి పైకప్పు పెంకులు ఊడిపోయి, వర్షపు నీళ్లు కారుతూ అధ్వానంగా ఉండడంతో.. పనులు చేసుకుంటానని ప్రభుత్వానికి లేఖ రాస్తే అనుమతించారన్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కాపీని చెవిరెడ్డి చూపించారు. సీఎం చంద్రబాబు రూ.50 కోట్ల ప్రజాధనం వెచ్చించి తన కార్యాలయాన్ని పునర్నిర్మించుకుంటే తప్పులేదు కానీ తన విషయంలోనే ఎందుకు ఇలా రాశారని ఆయన ప్రశ్నించారు. -
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అభినందనలు
తిరుపతి: రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ సభ్యుడిగా నియమితులైన చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆదివారం పలువురు అభినందించారు. ప్రభుత్వం శాసన సభ అంచనాల కమిటీని నియమించింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాయలసీమలో ముగ్గురికి స్థానం కల్పించారు. వీరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒకరు. ఎంతో నమ్మకంతో తనకు అంచనాల కమిటీలో స్థానం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు చంద్రగిరి నియోజకవర్గ నేతలు ఆయనను అభినందించారు. -
జిల్లా కలెక్టరా.. ఎన్టీఆర్ భవన్ కార్యదర్శా
సిద్ధార్థజైన్‌కు సభా హక్కుల నోటీసులు ఇస్తాం ఐఏఎస్సా? లేక టీడీపీ వారికి ‘అయ్యా ఎస్సా?’ నిబంధనలు పాటించకుంటే మంత్రుల పర్యటనను అడ్డుకుంటాం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరిక తిరుపతి రూరల్: జిల్లా పరిపాలనాధికారిగా కాకుండా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కార్యదర్శిలా జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ వ్యవహరిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. అత్యున్నత ఐఏఎస్ చదివిన సిద్ధార్థ జైన్ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారన్నారు. ఆయన ఐఏఎస్‌లా కాకుండా టీడీపీ కార్యకర్తలకు ‘అయ్యా ఎస్’ అనే స్థాయికి కలెక్టర్ పదవిని దిగజార్చుతున్నారని చెవిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. అధికారిక కార్యక్రమాలను సైతం టీడీపీ కార్యక్రమంలా మార్చుతున్నారని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో గత 10 రోజుల్లో చాలా అధికారిక కార్యక్రమాలు జరిగాయని, ఇందులో మంత్రులతో పాటు అధికారిక ప్రముఖులు, వీఐపీలు పాల్గొన్నారన్నారు. కానీ స్థానిక శాసనసభ్యులైన తనకు మాత్రం కలెక్టర్ సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో ఎంఎస్ నెం.348 ప్రకారం ఏదైనా నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలు జరిగినా, మంత్రులు, వీఐపీలు పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడికి కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నట్టు ఆయన చెప్పారు. కానీ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల విషయంలో కలెక్టర్ ప్రోటోకాల్‌ని పాటించడం లేదని తెలిపారు. కలెక్టర్ తీరు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఆయనకు సభా ఉల్లంఘన నోటీసు ఇస్తామని, అసెంబ్లీ ముందు దోషిగా నిలబెడ తామని హెచ్చరించారు. ప్రోటోకాల్ పాటించకుంటే శాసనసభ్యుల హక్కుకు భంగం కలిగించే ఏ అధికారినీ వదలమన్నారు. మంత్రులనూ అడ్డుకుంటాం ప్రోటోకాల్ పాటించకుంటే నియోజకవర్గాలకు వచ్చే మంత్రులను ఎక్కడికిక్కడ ప్రజలతో కలసి అడ్డుకుంటామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే అధికారిక కార్యక్రమాలవద్ద ఎలాంటి సంఘటనలు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉం టుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారప్రతినిధి చిన్నియాదవ్, చంద్రగిరి మండల కోఆప్షన్ మెంబర్ మస్తాన్, వాసు, సునీల్, గజ, ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు. -
వంద పడకల ఆస్పత్రి జీవోకు కృషి చేస్తా
చంద్రగిరి: చంద్రగిరిలోని ఏరియా ఆస్పత్రిని వందపడకల ఆస్పత్రిగా మార్చేందుకు అవసరమైన జీవో తీసుకురావడానికి కృషి చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏరియా ఆస్పత్రి చైర్మన్ హోదాలో బోర్డు కమిటీ సభ్యులను నియమించారు. ఈ కమిటీలో చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి సభ్యులుగా చంద్రగిరి ఎంపీపీ, తిరుపతి రూరల్ ఎంపీపీ, పాకాల ఎంపీపీ, చంద్రగిరి జెడ్పీటీసీ, ఆర్సీ. పురం జెడ్పీటీసీ, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ, చంద్రగిరి సర్పంచ్, తహశీల్దార్, వైద్యాధికారి, డీసీహెచ్ఎస్, మానవ హక్కుల సభ్యులు ఒకరు, స్థానిక సేవ సభ్యులు ఒకరిని నియమించారు. అలాగే చిన్నగొట్టిగల్లు ఏరియా ఆస్పత్రి కమిటీ సభ్యులుగా చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళెం, రామచంద్రాపురం, ఎంపీపీలు, చిన్నగొట్టిగళ్లు, యర్రావారిపాళెం, పాకాల జెడ్పీటీసీలు, వైధ్యాధికారి, స్థానిక సర్పంచ్, తహశీల్దార్, డీసీహెచ్ఎస్, ఐకేపీ, సేవా సంఘం తరఫున ఒకరిని నియమించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ నియమించిన బోర్డు సభ్యుల పర్యవేక్షణలో అస్పత్రి వర్గాలు పనిచేస్తాయన్నారు. నియోజకవర్గానికి ఎంతో తలమానికంగా చంద్రగిరి ఆస్పత్రి ఉందన్నారు. 31 మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉందని అయితే ఇద్దరు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఏరియా అస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా జీవో తీసుకురావాలని అధికారులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని పలు సమస్యలపై ప్రస్తావించానన్నారు. ముఖ్యంగా 100 పడకల జీవోకు ప్రభుత్వం ఆమోదం తెలిపాలని కోరానన్నారు. దీనికి ప్రభుత్వం, సంబంధిత మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వైద్యం అందంచగలిగే విధంగా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు తమ సమస్యలను వివరించారు. స్పందించిన ఎంఎల్ఏ జిల్లా వైద్యాధికారితో ఫోన్‌తో మాట్లాడి చంద్రగిరి ఏఎన్ఎం నర్సులను కొనసాగించాలని తెలిపారు. ఎంపీపీ కుసుమ, వైఎస్ ఎంపీపీ వనజ, మండల కన్వీనర్, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ, వేణుగోపాల్‌రెడ్డి, హేమేంద్రకుమార్‌రెడ్డి, ఎంపీటీసీలు బుజ్జి, నవనీతమ్మ, భారతి, జ్యోతి, నాగరాజు, మంగయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి, సర్పంచి ఉమామహేశ్వరి, తొండవాడ సర్పంచ్ సిద్దముని, నాయకులు అగరాల భాస్కర్‌రెడ్డి, బండారు హేమచంద్ర, ఒంటి శివశంకర్, కో ఆప్షన్ సభ్యులు మస్తాన్, మణి, ఫరూక్, జయకుమారి, అస్పత్రి సూపరింటెండెంట్ కె.శారద, డాక్టర్లు పద్మజ, ఆపర్ణ, దినే్ష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాబు ప్రజల్ని అవమానించారు
తిరుపతి రూరల్: రాజధాని ప్రకటన తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పదవిని, ముఖ్యంగా ప్రజల్ని అవమానించేలా వ్యవహరించారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వేసిన మేధావుల కమిటీ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా అత్యంత ప్రమాదకరంగా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఓ రాష్ట్రానికి రాజధానిపై ప్రకటన చేసేముందు కనీసం అసెంబ్లీలో చర్చ లేకుండా చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు పూర్తిగా కార్పొరేటర్ల చేతుల్లోకి వెళ్లిపోయూరని ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు కోసం కక్కుర్తిపడి నలుగురు వ్యక్తుల చేతుల్లో బాబు కీలుబొమ్మగా మారిపోవడం బాధాకరమన్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు చెప్పినట్టు బాబు గంగిరెద్దులా తలూపుతూ పరిపాలన చేయడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ సెక్టార్లో రాజధాని నిర్మాణం మంచిది కాదని స్వయంగా కేంద్ర కమిటీ తేల్చినా ఏక పక్షంగా, అన్యాయంగా, అప్రస్వామికంగా ప్రకటన చేయడం అన్యాయమన్నారు. ఇది ప్రజల్ని ముమ్మాటికీ మోసం చేసేవిధంగా ఉందన్నారు. ఇది తెలుగు ప్రజలకు దుర్దినంగా ఆయన అభివర్ణించారు. ఎక్కడ రాజధానిని నిర్ణయించాలి, ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, ఎప్పుడు మంత్రి వర్గం ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు బాబు చేతుల్లో లేదని ఆరోపించారు. కనీసం సీఎం సీట్లో కుర్చోవాలన్నా పార్టీని శాసిస్తున్న ఆ నలుగురు వ్యక్తులు చెప్పాల్సిందేనని, లేకుంటే ఆయన అటువైపు కూడా చడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. రాజధాని నిర్ణయం చరిత్రలో చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. కేబినెట్ సమావేశాల్లోకి నేరుగా రియల్‌వ్యాపారులు వస్తూ ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఎప్పుడిస్తారు?
సర్కార్‌ను నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తిరుపతి : రైతుల కరెంట్ కడగండ్లు తీర్చడానికి వ్యవసాయానికి ఎప్పటి నుంచి 9 గంటల కరెంట్ ఇస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ స మస్యలను సోమవారం వారు అసెంబ్లీ లో ప్రస్తావించారు. ప్రస్తుతం వ్యవసాయానికి రోజూ 7 గంటలు కూడా కరెం ట్ ఇవ్వడం లేదని అలాంటిది 9 గంటల కరెంట్ హామీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. హామీకి కట్టుబడి ఉంటే ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని పట్టుబట్టారు. రోజుకు 7 గంటలు కరెంట్ ఇవ్వకున్నా వాడినట్లు లెక్కగడుతున్న అధికారులు బకాయీల కోసం నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 5హెచ్‌పీ మోటార్ వాడితే గంటకు 2.73 యూనిట్లు, నెలకు 783.3 యూ నిట్ల వంతున సంవత్సరానికి 9399.6 యూనిట్లు కాలుతుందని కేటగిరీని బట్టి యూనిట్‌కు 50 పైసల నుంచి రూపా యి వంతున వసూలు చేసినా ప్రభుత్వానికి ప్రతిరైతు 5 వేల నుంచి 10 వేల రూ పాయల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పైగా నెలకు 20 రూపాయలు, ఏడాదికి 240 రూపాయల వంతున 10 సంవత్సరాలకు లెక్కగట్టి 2400 రూపాయలు సర్వీస్ చార్జీలు వసూలు చేయబోతున్నట్లు తెలిసి రైతులు దిగులు చెందుతున్నారన్నారు. బకాయీలు రా బట్టుకునేందుకు పంట బిల్లుకు ఇంటి బిల్లుకు లింకు పెట్టి పంట బిల్లు చెల్లించకపోతే ఇంటి కనెక్షన్ కట్ చేస్తారనే ప్రచా రం జరుగుతోందని ఒక వేళ అదేగనుక జరిగితే రైతులు ఆత్మహత్యలకు పాల్ప డే ప్రమాదం ఉందన్నారు. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ ్చరించారు. రాష్ట్రంలో ఉన్న 9 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లలో లక్షకు పైగా కనెక్షన్లను ప్రభుత్వం తొలగించనున్నట్లు వార్తలు వినవస్తున్నాయని అలాంటి ఆలోచన ఏదైనా ప్రభుత్వానికి ఉందా? అని వారు ప్రశ్నించారు. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తే చంద్రబాబు రైతు వ్యతిరేకి అన్న భావన రైతుల్లో బలపడుతుందన్నారు. అలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి ఉంటే వెంటనే విరమించుకోవాలని కోరారు. అలాంటి నిర్ణయాలు తీసుకోబోమని సంబంధిత మంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు తెలిపారు. -
వెంకన్న సేవకు ఎగనామం..వీఐపీలకు సలాం!
విధులు గాలికి వదిలేస్తున్నారు అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ధ్వజం తిరుపతి: తిరుమలకు వీవీఐపీలు, సెలబ్రిటీలు వచ్చినపుడు కొందరు టీటీడీ అధికారులు విధులను గాలికి వదిలి వారి వెంట పరుగులు తీస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో సోమవారం ఆయన టీటీడీ అధికారుల వ్యవహార శైలిని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. వీవీఐపీలు, సినీనటులు, వ్యాపారవేత్తలు దేవుడి దర్శనానికి వచ్చినపుడు టీటీడీ అధికారులు దేవుడిని, భక్తులను గాలికి వదిలిపెట్టి ఫొటోల కోసం వారివెంట పరుగులు తీస్తున్నారని ఆయన అన్నారు. ఫొటోల కోసం అర్చకులు, అధికారులు తరచూ గొడవలు పడుతున్నారన్నారు. తమ పరపతిని పెంచుకుని పైరవీలు చేసుకోవడానికి వారు తపన పడుతున్నారని విమర్శించారు. అలాంటి వారి వివరాలను ఆధారాలతో సహా తాను ప్రభుత్వానికి అందిస్తానన్నారు. ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి పబ్లిసిటీ, ఫొటోల కోసం పాకులాడడం జీఓఎంఎస్-348 ప్రకారం నిషిద్ధమని ఆయన గుర్తు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. నివేదికలు తెప్పించుకుని తప్పక చర్యలు తీసుకుంటామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. టీటీడీలో ప్రొటోకాల్ విభాగానికి ప్రత్యేకంగా ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారిని నియమించాలన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచన ను స్పీకర్‌తోపాటు మంత్రి మాణిక్యాల రావు స్వాగతించారు. ట్రాన్స్ఫర్ పాలసీ ఏదీ? టీటీడీ బదిలీల్లో ఒక పాలసీ అంటూ లేకపోవడాన్ని అసెంబ్లీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. కులబలం, ధనబలం లేదా ప్రభుత పెద్దల అండదండలు ఉన్న అధికారులు ఏళ ్ల తరబడి తిరుమలలో పనిచేసి అక్కడే రిటె ర్ అవుతున్నారని తెలిపారు. 35 ఏళ్లుగా టీటీడీలో పనిచేస్తున్న ఇవేవీ లేనివారు, నిజాయితీపరులైన అధికారులకు ఒక్క రోజు కూడా తిరుమలలో పనిచేసే భాగ్యానికి నోచుకోవడంలేదన్నారు. వీరంతా నిరాశగా రిటైరవుతున్నారని భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో బదిలీల పాలసీని ప్రవేశపెట్టి తప్పనిసరి చేయాలన్న భాస్కర్‌రెడ్డి డిమాండ్‌పై మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. గంట ప్రయూణానికి రూ.25 వేల భక్తులు డబ్బు టీటీడీలో కొందరు ఉన్నతాధికారులు భక్తులు స్వామివారికి సమర్పించిన డబ్బును తమ విలాసవంతమైన సౌకర్యాలకు వాడుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. అందుకు టీటీడీ ఈవోను ఉదహరించారు. 70 మందికి పైగా సిబ్బంది, 5 గెస్ట్‌హౌస్‌లు, 6 కార్లు, 5 కార్యాలయ భవనాలు ఈవో సేవలో తరిస్తున్నాయని విమర్శించారు. విమానంలో రూ.5 వేలతో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం అందుబాటులో ఉన్నా హైదరాబాద్‌కు రావాలంటే రూ.25 వేల బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి టీటీడీ నిధులను విలాసాలకు వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. టీటీడీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని భాస్కర్‌రెడి కోరారు. ఈ వైనంపై విచారణ కమిటీ వేస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడుతాయని ఆయన తెలిపారు. వివరాలు అందజేయూలని, ఇతర నివేదికలను తెప్పించుకుని భక్తుల డబ్బును కాపాడుతామని మంత్రి మాణిక్యాలరావు సమాధానమిచ్చారు. -
స్విమ్స్‌ను అభివృద్ధి చేయండి
తిరుపతి: స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కి తక్షణ చర్యలు చే పట్టాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైద్యరంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తె చ్చారు. స్విమ్స్‌కు పెరిగిన రోగుల రద్దీకి అనుగుణంగా కొత్త ఓపీ బ్లాక్‌ను ఏర్పాటు చేయాలని, ట్రా మా, ఎమర్జెన్సీకేర్ సెంటర్‌ను ఏ ర్పాటు చేయాలన్నారు. కిడ్నీ, గుం డె, న్యూరాలజీ విభాగాలకు ప్రత్యే క బ్లాక్‌లు ఏర్పాటు చేయాల న్నా రు. లోటు బడ్జెట్లో ఉన్నామని చె బుతున్న ప్రభుత్వం కొత్తగా భవనాల నిర్మాణాల జోలికి పోకుండా ఉన్న ప్రభుత్వాస్పత్రుల స్థాయి పెంచే ఆలోచన ఉందా అని ప్ర శ్నించారు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న సూపర్ స్పెషాలిటీ ైవైద్యసేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వద్ద మోడల్ కాన్సెప్ట్ ఏదైనా అందుబాటులో ఉందా అని అడిగారు. ఆం ధ్రప్రదేశ్‌లో సూపర్‌స్పెషాలిటీ వైద్యులు, ఆ విభాగానికి సంబంధించిన ఇతర సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన రూ.500 కోట్లతో అదనంగా చేర్చిన 100 జబ్బులకు ఉచిత చికిత్సలు అందించడం, వైద్యరంగానికి బడ్జెట్లో రూ.1040 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నించారు. స్పీకర్ గారూ మంత్రులకు శిక్షణ ఇవ్వండి అసెంబ్లీలో పత్రికలు చదవకూడద ని మంత్రులకు శిక్షణ ఇవ్వాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భా స్కర్‌రెడ్డి కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో సందర్భం గా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పత్రిక చదువుతుండగా ఆ విషయాన్ని చెవిరెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘అధ్యక్షా.. ఇటీవల నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు శిక్షణ ఇచ్చారు. రూల్ నెం.316 ప్రకారం అసెంబ్లీలో పత్రికలు చదవకూడదని తెలిపారు. మం త్రులకు కూడా శిక్షణ ఇవ్వం డి’’ అని కోరారు. -
తీరు మార్చుకోండి
ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గితే.. మూల్యం చెల్లించుకోవాల్సిందే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతా మెప్పు పొందడం కోసంపయత్నించి బలిపశువులు కావొద్దు పోలీసులకు హెచ్చరిక సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గో.. మెప్పు పొందడం కోసమో వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి బలిపశువులు కావొద్దని పోలీసు అధికారులకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టీకరించారు. రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేతలు సుబ్రమణ్యం, ఎ.మధు, సిద్ధయ్య, శ్రీనివాసులుపై టీడీపీ నేత పద్మనాభనాయుడు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినందుకు నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ రామచంద్రాపురం పోలీసుస్టేషన్లో బైఠాయించారు. పద్మనాభనాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయకుండా వైఎస్సార్సీపీ నేతలపై ఎలా కేసు నమోదు చేస్తారని సీఐ సాయినాథ్‌ను, పోలీసులను ప్రశ్నించారు. ఇందుకు సీఐ స్పందిస్తూ.. పద్మనాభనాయుడుపై రక్తపు గాయాలు ఉండడం వల్ల కేసు నమోదు చేశానని బదులిచ్చారు. దాంతో అక్కడి నుంచే రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరాస్వామికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేఖను తన మనుషుల ద్వారా పంపారు. ‘పద్మనాభనాయుడు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారా.. ఆయన శరీరంపై ఏమైనా గాయాలు ఉన్నాయా? ఆయనకు ఎలాంటి చికిత్స చేశారు?’ వంటి వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో చెవిరెడ్డి కోరారు. ఇందుకు రుయా సూపరింటెండెట్ వీరాస్వామి స్పందిస్తూ.. ‘పద్మనాభనాయుడు అవుట్ పేషంట్‌గా ఆస్పత్రికి వచ్చారు. ఆయన శరీరంపై ఎలాంటి రక్తపు గాయాలు లేవు.. సాధారణ చికిత్స చేసి పంపాం’ అని రాతపూర్వకంగా బదులు ఇచ్చారు. దానిని చూపుతూ వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసు బనాయించిన మాట వాస్తవం కాదా అని సీఐ సాయినాథ్‌ను చెవిరెడ్డి ప్రశ్నిం చారు. తప్పుడు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని కోరారు. టీడీపీ నేతలపై సీఐ సాయినాథ్ కేసు నమోదు చేశారు. అనంతరం చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను భయోత్పాతానికి గురిచేయడం కోసం టీడీపీ నేతలు పోలీసులను ప్రయోగిస్తున్నారన్నారు. ఇందుకు నెత్తకుప్పం వైఎస్సార్సీపీ నేతలపై బనాయించిన కేసే నిదర్శనమన్నారు. తప్పుడు కేసు బనాయించిన పోలీసు అధికారులపై న్యాయస్థానంలో ప్రైవేటు కేసు ఫైల్ చేస్తానన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు కేసు బనాయించిన ఏ ఒక్క అధికారిని వదిలి పెట్టే ప్రశ్నే లేదని.. న్యాయస్థానం ఎదుట నిలబెడతామని హెచ్చరించారు. అధికారపార్టీ నేతల మెప్పుకోసం తప్పుడు కేసులు పెట్టి బలిపశువులు కావద్ద ని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు బనాయిస్తోన్న అక్ర మ కేసులు.. చేస్తోన్న దాడులపై అసెంబ్లీలో పోరాటం చేస్తానన్నారు. పోలీసు అధికారులు చట్టప్రకారం నడుచుకుంటే శాంతిభద్రతలు పరిఢవిల్లుతాయని.. లేదంటే శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని.. అందుకు చంద్రగిరి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే ఉదాహరణ అని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల కోసం ప్రాణాలైనా అర్పిస్తానని స్పష్టీకరించారు. -
రెండు రోజుల్లో విత్తనాలు అందాలి
అదనుకు అందించ లేకపోవడం బాధాకరం వేరుశనగ విత్తనాల పంపిణీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరి : ఖరీఫ్ అదను దృష్టిలో ఉంచుకుని మరో రెండు రోజుల్లో అర్హులందరికీ వేరుశనగ విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రగిరి ఎమ్మె ల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రభుత్వం రాయితీతో అందించే వేరుశనగ విత్తనాల పంపిణీ ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విత్తన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని చంద్రగిరి, తిరుపతి రూరల్, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళెం మండలాల అధికారులు, రైతులు కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అర్హులైన రైతులందరికీ త్వరగా విత్తనాలు అందించాలని చెప్పారు. ఉపాధి హామీని వెంటనే వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. పంటలపై సూచనలు, ఏ అదనుకు ఏ పంటలు వేయాలో ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు రైతులకు సూచించాలన్నారు. గ్రీవెన్స్‌డేలో వ్యవసాయ అధికారులు పాల్గొంటే రైతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మంచి నిర్ణయాలకు ముందుంటా ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా, సంక్షేమ పథకాలు అర్హులకు న్యాయబద్ధంగా అందేలా అధికారుల నిర్ణయాలు ఉంటే అలాంటి వాటిని సమర్థిస్తూ ముందుంటానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. తాను నిబంధనలు అతిక్రమంచి పనులు చేయమనే వ్యక్తిని కాదని చెప్పారు. ప్రాంతాలను, పార్టీలను చూసి పనులు చేయాలని చూస్తే ఒప్పుకోనన్నారు. నిబంధనల ప్రకారమే అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రతి అధికారి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమస్యలు, ఇతర పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలపై చిన్నచూపు లేకుండా పనులు చేయించి పంపాలన్నారు. తాను ఎమ్మెల్యేగా కాకుండా మీలో ఒకడిగా ఉంటానని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమన్నారు. ఆదర్శరైతులకు నెలజీతం అందించడంలో ఆలస్యం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో నరసింగాపురం సింగిల్‌విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, ఎంపీడీవోలు రాజశేఖర్‌రెడ్డి, వెంకట్ నారాయణ, పాకాల తహశీల్దార్ కృష్ణయ్య, అగ్రికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్లు వాసు, సౌభాగ్యలక్ష్మి, ఆరు మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు శంకర్‌లాల్ నాయక్, లక్ష్మీదేవి, మమత, నర్మద, మురళి, హరిత, ఆరు మండలాల రైతులు, అధికారులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, ఏవీ.రమణమూర్తి, దామినేటి కేశవులు, హేమేంద్రకుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వరలక్ష్మి, కోటీశ్వర్‌రెడ్డి, ఆనందభాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ బుజ్జి, అగరాల భాస్కర్‌రెడ్డి, దేవారెడ్డి, మస్తాన్, లోక, ఎంపీపీ అభ్యర్థి కుసుమకుమారి, ఔరంగజేబు, ఎంపీటీసీ నాగరాజ, రైతు నాయకుడు ఆదికేశవులురెడ్డి, లత పాల్గొన్నారు. -
స్థానికుడిని గెలిపించండి
చంద్రగిరిలో స్థానికేతరులకు అవకాశం ఇవ్వొద్దని, స్థానికుైడె న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు, జగన్‌ను సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గంలో 20 ఏళ్ల తరువాత స్థానికుడికి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చంద్రగిరి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి 30 వేల మందికి పైగా వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా స్థానికేతరులను గెలి పిస్తూ వచ్చారని, ఇప్పుడు స్థానికుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 20 రోజుల పాటు నిద్రపోకుండా ప్రతి వ్యక్తి పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలు తన సమస్యగా భావించి ఎదురు నిలబడే చెవిరెడ్డిని గెలిపించాలని కోరారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న తన తమ్ముడు చెవిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చెవిరెడ్డి నిస్వార్థ పరుడు, అభివృద్ధి చేయాలనే కసి ఉన్న నాయకుడన్నారు. తుడ చైర్మన్‌గా ఇక్కడ ఎవరూ చేయనంత అభివృద్ధి చేశాడని గుర్తు చేశారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడికే అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్, మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, మాజీ తుడ చైర్మన్ ఎల్బీ.ప్రభాకర్ నాయుడు, మబ్బు చెంగారెడ్డి, చొక్కారెడ్డి జగ దీశ్వర్‌రెడ్డి, బోయిగారి ముత్యాలరెడ్డి, హేమేంద్రకుమార్‌రెడ్డి, చంద్రగిరి మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ దామినేటి కేశవులు, తుమ్మలగుంట గోవిందరెడ్డి, చంద్రగిరి మండల కన్వీనర్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, చిల్లకూరి యుగంధర్‌రెడ్డ్డి, ఎస్కే.బాబు, రమణ, గుణశేఖర్‌నాయుడు, నంగా బాబురెడ్డి, వరలక్ష్మి, సుభాషిణి, కోటేశ్వర్‌రెడ్డి, తిరుపతి రూరల్, పాకాల, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళెం, రామచంద్రాపురం మండల పార్టీ కన్వీనర్లు ఉపేంద్రరెడ్డి, చెన్నకేశవరెడ్డి, యుగంధర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఆరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. -
విభజన పాపం వారిదే
టీడీపీ, కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోనియా, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దిష్టిబొమ్మ దహనం తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేనని వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. చట్టసభల్లో విభజన బిల్లుకు ఆమోదం తెలపడంతో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో గురువారం చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట కూడలివద్ద ఆందోళన నిర్వహించారు. తెలుగు జాతి విచ్ఛిన్నానికి కారకులైన సోనియా, సహకరించిన బాబు, వెంకయ్యనాయుడుల దిష్టి బొమ్మలను తగుల బెట్టారు. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయిస్తే చంద్రబాబు, వెంకయ్యనాయుడు సహకరించారని ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడటం వల్లే తెలుగు జాతికి ఈ దుస్థితి పట్టిందన్నారు. రెండుకళ్ల సిద్ధాంతం పేరుతో తెలుగు జాతిని నిలువునా చీల్చేందుకు కారకుడయ్యాడని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆరు నెలల ఉద్యమంలో చంద్రబాబు ఏనాడూ సమైక్యం అనలేదని గుర్తుచేశారు. సమైక్యం అంటే బీజేపీతో పొత్తు కుదరదని చంద్రబాబు భావించారేమో అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ చొక్కారెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ దామినేటి కేశవులు, గోవిందరెడ్డి, మండల కన్వీనర్ ఉపేంద్రరెడ్డి, చిన్నీయాదవ్, శ్రీరాములు, అజయ్‌కుమార్‌రెడ్డి, రామస్వామి, రఘు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పరిశోధన కేంద్రానికి విభజన సెగ!
=పెండింగ్‌లో హర్సిలీహిల్స్ నివేదిక =హిందూపురం నుంచే పరిశోధనలు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: పట్టుగూళ్ల ఉత్పత్తిలో కొత్త వంగడాలను సృష్టిం చేందుకు బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో ఏర్పాటు కానున్న పరిశోధన కేంద్రానికి విభజన సెగ తగిలింది. దీనికి సంబంధించిన ప్రతిపాదిత నివేదిక పెండింగ్ పడింది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీ కొండపై వాతావరణం ప్రత్యేకమైంది. సాధారణ ఉష్ణోగ్రత 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. ఇప్పటికే మౌళిక పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం నడిచి మూతపడింది. దీంతో ఇక్కడి భవనాలను స్వాధీనం చేసుకుని కొత్త వంగడాల సృష్టికి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అన్ని చర్యలు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన పట్టు పరిశోధన కేంద్రం (ఏపీఎస్ఎస్ఆర్డీఐ) ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితులను పరిశీలించాక నిర్ణయానికి వచ్చారు. మల్బరీఆకు ఉత్పత్తి, గుడ్ల తయారీ, ప్రధానంగా పట్టులో కొంత వంగడాలను సృష్టించేందుకు అనువైందిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు కేంద్ర పట్టు పరిశ్రమ బోర్డుకు పరిశోధన నివేదికను పంపారు. దీనికి ఆమోదం లభించింది. హర్సిలీహిల్స్లో ఇంతవరకు బైవోల్టిన్ పట్టుగుడ్ల ఉత్పత్తి జరిగిం ది. ఇకపై అధిక ఆదాయం, ఎక్కువ ప్రయోజనాలిచ్చే కొత్తరకం పట్టుగుడ్ల ఉత్పత్తికి కృషి చేసే కేంద్రంగా మారబోతుండగా రాష్ట్ర విభజన చర్యలతో దీనికి తాత్కాలిక బ్రేక్ పడింది. దీని కారణంగా ఇక్కడ చేపట్టదలచిన పరిశోధనలను ప్రస్తుతం హిందూపురంలోనే చేస్తున్నారు. దీనిపై పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డెరైక్టర్ బీజే.శర్మ మాట్లాడుతూ కేంద్రం ఏర్పాటు ఆలస్యమవుతోందన్నారు. అయితే ఏర్పాటు ఖాయమని ఆయన స్పష్టం చేశారు.