స్థానికుడిని గెలిపించండి
చంద్రగిరిలో స్థానికేతరులకు అవకాశం ఇవ్వొద్దని, స్థానికుైడె న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు, జగన్‌ను సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గంలో 20 ఏళ్ల తరువాత స్థానికుడికి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చంద్రగిరి, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి 30 వేల మందికి పైగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు తరలివచ్చారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా స్థానికేతరులను గెలి పిస్తూ వచ్చారని, ఇప్పుడు స్థానికుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 20 రోజుల పాటు నిద్రపోకుండా ప్రతి వ్యక్తి పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలు తన సమస్యగా భావించి ఎదురు నిలబడే చెవిరెడ్డిని గెలిపించాలని కోరారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న తన తమ్ముడు చెవిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చెవిరెడ్డి నిస్వార్థ పరుడు, అభివృద్ధి చేయాలనే కసి ఉన్న నాయకుడన్నారు. తుడ చైర్మన్‌గా ఇక్కడ ఎవరూ చేయనంత అభివృద్ధి చేశాడని గుర్తు చేశారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడికే అవకాశం ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్, మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, మాజీ తుడ చైర్మన్ ఎల్బీ.ప్రభాకర్ నాయుడు, మబ్బు చెంగారెడ్డి, చొక్కారెడ్డి జగ దీశ్వర్‌రెడ్డి, బోయిగారి ముత్యాలరెడ్డి, హేమేంద్రకుమార్‌రెడ్డి, చంద్రగిరి మాజీ ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ దామినేటి కేశవులు, తుమ్మలగుంట గోవిందరెడ్డి, చంద్రగిరి మండల కన్వీనర్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, నరసింగాపురం సింగిల్ విండో చైర్మన్ మల్లం చంద్రమౌళిరెడ్డి, చిల్లకూరి యుగంధర్‌రెడ్డ్డి, ఎస్‌కే.బాబు, రమణ, గుణశేఖర్‌నాయుడు, నంగా బాబురెడ్డి, వరలక్ష్మి, సుభాషిణి, కోటేశ్వర్‌రెడ్డి, తిరుపతి రూరల్, పాకాల, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళెం, రామచంద్రాపురం మండల పార్టీ కన్వీనర్లు ఉపేంద్రరెడ్డి, చెన్నకేశవరెడ్డి, యుగంధర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఆరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.