వెంకన్న సేవకు ఎగనామం..వీఐపీలకు సలాం! | Eganamam came to the service ..VIP Salam! | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవకు ఎగనామం..వీఐపీలకు సలాం!

Published Tue, Aug 26 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

వెంకన్న సేవకు ఎగనామం..వీఐపీలకు సలాం!

వెంకన్న సేవకు ఎగనామం..వీఐపీలకు సలాం!

  •      విధులు గాలికి వదిలేస్తున్నారు
  •      అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ధ్వజం
  • తిరుపతి: తిరుమలకు వీవీఐపీలు, సెలబ్రిటీలు వచ్చినపుడు కొందరు టీటీడీ అధికారులు విధులను గాలికి వదిలి వారి వెంట పరుగులు తీస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో సోమవారం ఆయన టీటీడీ అధికారుల వ్యవహార శైలిని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు.

    వీవీఐపీలు, సినీనటులు, వ్యాపారవేత్తలు దేవుడి దర్శనానికి వచ్చినపుడు టీటీడీ అధికారులు దేవుడిని, భక్తులను గాలికి వదిలిపెట్టి ఫొటోల కోసం వారివెంట పరుగులు తీస్తున్నారని ఆయన అన్నారు. ఫొటోల కోసం అర్చకులు, అధికారులు తరచూ గొడవలు
    పడుతున్నారన్నారు. తమ పరపతిని పెంచుకుని పైరవీలు చేసుకోవడానికి వారు తపన పడుతున్నారని విమర్శించారు. అలాంటి వారి వివరాలను ఆధారాలతో సహా తాను ప్రభుత్వానికి అందిస్తానన్నారు.

    ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి పబ్లిసిటీ, ఫొటోల కోసం పాకులాడడం జీఓఎంఎస్-348  ప్రకారం నిషిద్ధమని ఆయన గుర్తు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. నివేదికలు తెప్పించుకుని తప్పక చర్యలు తీసుకుంటామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. టీటీడీలో ప్రొటోకాల్ విభాగానికి ప్రత్యేకంగా ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారిని నియమించాలన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచన ను స్పీకర్‌తోపాటు మంత్రి మాణిక్యాల రావు స్వాగతించారు.
     
    ట్రాన్స్‌ఫర్ పాలసీ ఏదీ?
     
    టీటీడీ బదిలీల్లో ఒక పాలసీ అంటూ లేకపోవడాన్ని అసెంబ్లీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. కులబలం, ధనబలం లేదా ప్రభుత  పెద్దల అండదండలు ఉన్న అధికారులు ఏళ ్ల తరబడి తిరుమలలో పనిచేసి అక్కడే రిటె ర్ అవుతున్నారని తెలిపారు. 35 ఏళ్లుగా టీటీడీలో పనిచేస్తున్న ఇవేవీ లేనివారు, నిజాయితీపరులైన అధికారులకు ఒక్క రోజు కూడా తిరుమలలో పనిచేసే భాగ్యానికి నోచుకోవడంలేదన్నారు. వీరంతా నిరాశగా రిటైరవుతున్నారని భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో బదిలీల పాలసీని ప్రవేశపెట్టి తప్పనిసరి చేయాలన్న భాస్కర్‌రెడ్డి డిమాండ్‌పై మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.
     
    గంట ప్రయూణానికి రూ.25 వేల భక్తులు డబ్బు

    టీటీడీలో కొందరు ఉన్నతాధికారులు భక్తులు స్వామివారికి సమర్పించిన డబ్బును తమ విలాసవంతమైన సౌకర్యాలకు వాడుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. అందుకు టీటీడీ ఈవోను ఉదహరించారు. 70 మందికి పైగా సిబ్బంది, 5 గెస్ట్‌హౌస్‌లు, 6 కార్లు, 5 కార్యాలయ భవనాలు ఈవో సేవలో తరిస్తున్నాయని విమర్శించారు.

    విమానంలో రూ.5 వేలతో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం అందుబాటులో ఉన్నా హైదరాబాద్‌కు రావాలంటే రూ.25 వేల బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి టీటీడీ నిధులను విలాసాలకు వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. టీటీడీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని భాస్కర్‌రెడి కోరారు. ఈ వైనంపై విచారణ కమిటీ వేస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడుతాయని ఆయన తెలిపారు. వివరాలు అందజేయూలని, ఇతర నివేదికలను తెప్పించుకుని భక్తుల డబ్బును కాపాడుతామని మంత్రి మాణిక్యాలరావు సమాధానమిచ్చారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement