VVIP
-
ప్రధాని కారుకూ ఫాస్టాగ్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని, సీఎం లాంటి వీవీఐపీ ల వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. టో ల్గేట్లు దాటేటప్పుడు కచ్చితంగా వీవీఐపీల కాన్వాయ్ల్లోని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాలని అధికారులు అంటున్నారు. టోల్‌ప్లాజాల వద్ద రుసుము చెల్లించేందుకు వాహనాలు బారులు తీరాల్సిన పని లేకుండా వేగంగా ముందుకు సాగిపోయేందుకు ఉద్దేశించిన విధానమే ఫాస్టాగ్. ఎంతోకాలంగా కేం ద్రం ప్రకటిస్తున్న ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టం ఎట్టకేలకు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా వాహనాలు కచ్చితంగా ట్యాగ్ ఏ ర్పాటు చేసుకోవాల్సిందే. ట్యాగ్ లేని వాహనాలు వస్తే టోల్గేట్లు తెరుచుకోవు. ఈ పద్ధతి అలవాట య్యే వరకు అప్పటికప్పుడు రుసుము చెల్లించి టో కెన్ తీసుకునే విధానమూ కొనసాగుతుంది. కానీ అందుకు ఒక్క లేన్‌ను మాత్రమే కేటాయించి మిగ తావన్నీ ట్యాగ్ ఉన్న వాహనాలు వెళ్లేందుకు కేటాయిస్తారు. ఎంపిక చేసిన జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు, అమెజాన్, పేటీఎం లాంటి ఆన్లైన్ సంస్థల్లో చెల్లించి ఫాస్టాగ్ పేరుతో ఉండే స్టిక్కర్లను పొందాలి. దాన్ని వాహనం ముం దు అద్దానికి అతికించాలి. గేట్ల వద్ద ఉండే సెన్సర్లు దీన్ని స్కాన్ చేసి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. ఆపై ఆటోమేటిక్‌గా గేటు తెరు చుకుంటుంది. కాగా, ఫాస్టాగ్ విధానంలో కూడా నిర్ధారిత వాహనాలకు టోల్‌ఫీజు మినహాయింపు ఉండనుంది కానీ, ట్యాగ్ నుంచి మాత్రం ఉండదు. జీరో బ్యాలెన్స్ ట్యాగ్.. కేంద్రం టోల్ నుంచి మినహాయింపునిచ్చిన వ్యక్తులకు సంబంధించిన వాహనాల సంఖ్య, రిజిస్ట్రేషన్ నంబరు, ఇతర వివరాలను ముందుగా ఎన్హెచ్ఏఐకి తెలపాలి. ఇందుకు ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించారు. ఎన్ని వాహనాలకు అనుమతి ఉందో గుర్తించి వాటికి ప్రత్యేకంగా జీరో బ్యాలెన్స్ అర్హత ఉండే ఫాస్టాగ్‌లను రూపొందిస్తారు. వాటిని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయాల నుంచి సంబం ధి త వ్యక్తులకు జారీ చేస్తారు. ఆ ట్యాగ్‌లను వాహనాల అద్దాలకు అతికిస్తారు. అయితే గతంలోలాగా వీఐపీల పేర్లతో తోచినన్ని వాహనాలు టోల్గేట్ల నుంచి వెళ్లటానికి వీలుండదు. కచ్చితంగా ట్యాగ్ ఉన్న వాహనం వస్తేనే అనుమతి ఉంటుంది. -
పార్శిల్ పరేషాన్
రాంగోపాల్‌పేట్: తమ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది వినూత్న రీతిలో తీవ్ర నిరసనకు దిగారు. కలుషిత జలాలను ప్రభుత్వ పెద్దలు, వీవీఐపీలకు పార్శిల్ చేసి కలకలం సృష్టించారు. మంగళవారం సికింద్రాబాద్ పోస్టాఫీస్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసులు, ఇటు పోస్టాఫీస్ వర్గాలు ఈ విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీస్ నుంచి పార్శిళ్లు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, డీజీపీ మహేందర్‌రెడ్డి, కొందరు మంత్రుల చిరునామాతో పార్శిళ్లు వచ్చాయి. ఉస్మానియా నుంచి వాటిని ప్రధాన పోస్టాఫీస్ అయిన సికింద్రాబాద్‌కు వచ్చాయి. మంగళవారం ఆ పార్శిళ్ల నుంచి వాసన వస్తుండటంతో పోస్టాఫీస్ వర్గాలకు అనుమానం వచ్చి మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు, క్లూస్ టీం అక్కడికి చేరుకుని పార్శిళ్లను విప్పి చూడగా అందులో కలుషిత జలాలు కనిపించాయి. అవి కలుషిత జలాలా.. మరేదైనా కెమికల్ కలిపారా.. అనేది తెలుసుకునేందు క్లూస్ టీం శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్లారు. వీటిని ఎవరు పంపించారు.. ఏ చిరునామాతో వచ్చాయనే వివరాలు లేవని తెలిసింది. మురుగు నీటి సమస్యపై.. ఉస్మానియా వర్సిటీలో ఉన్న మురుగు నీటి సమస్యను ప్రభుత్వంతో పాటు, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వర్సిటీ విద్యార్థులే ఇలా పార్శిల్స్ పంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్శిళ్లతో పాటు తమ ప్రాంతంలో ఉండే కలుషిత జలాల సమస్య ఎవరు పట్టించుకోవడం లేదని ఘాటైన లేఖలు కూడా జతచేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని మహంకాళి ఇన్స్పెక్టర్ జయపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కొన్ని పార్శిళ్లపై పోస్టాఫీస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేయడంతో పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనని వెళ్లి పరిశీలించామన్నారు. -
పొదుపు అంటూనే.. లగ్జరీ ప్లైట్‌లో ప్రయాణం!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో కొత్తగా ఏర్పాటైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పొదుపు మంత్రాన్ని పాటిస్తోన్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా దేశ అధ్యక్షుడితో సహా, మంత్రులు, అధికారులంతా పొదుపు పాటించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అదేశాలు జారీ చేశారు. తాను మాత్రం దానికి మినహాయింపు అన్నట్టు తన తొలి విదేశీ పర్యటనకు పయనమయ్యారు. సౌదీ రాజు సల్మాన్ బీన్ అబ్దుల్ అజీజ్ ఆహ్వానం మేరకు సౌదీ వెళ్లిన ఇమ్రాన్ వీవీఐపీ వసతులు కలిగిన ప్రత్యేక విమానంలో పర్యటనకు వెళ్లారు. ఇమ్రాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికారుల, మంత్రుల ప్రయాణల్లో కోత విధించి.. అందరూ సాధారణ వాహనాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖర్చుల్లో పొదుపు పాటించాలని.. ప్రజాధనాన్ని వృథా చేయకూడదంటూ అదేశాలు జారీ చేశారు. పొదుపు పాటించాలని ఆదేశాలు జారీ చేసి.. తాను మాత్రం లగ్జరీ విమానాల్లో విదేశాలకు వెళ్లడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇటీవల 102 లగ్జరీ కార్లను, గేదెలను వేలంలో అమ్మేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇమ్రాన్ తన తొలి పర్యటనకే ప్రత్యేక సదుపాయాలున్న వీవీఐపీ విమానాన్ని ఉపయోగించడంపై రాజకీయ పార్టీలు గుర్రుమంటున్నాయి. గత ఏడాది చివరినాటికి పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం.. అంటే రూ.30 లక్షల కోట్ల అప్పును కలిగివున్న విషయం తెలిసిందే. కాగా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజు అజీజ్‌తో ఇమ్రాన్ భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వీరు చర్చించనున్నారు. సౌదీ వెళ్లిన ఇమ్రాన్ దుబాయ్‌లో జరిగే పాక్-భారత్ మ్యాచ్‌కు ఇమ్రాన్ హాజరైన విషయం తెలిసిందే. -
ఇది తగునా!
అరసవల్లి: ప్రతిష్ఠాత్మకమైన రథ సప్తమి వేడుకల్లో కొంతమంది పోలీసులు వీవీఐపీల అవతారమెత్తారు. దాతలను అనుమతించే ప్రత్యేక మార్గంలో కొందరు సిఫారసులతోనూ మరికొందరు నేరుగానే ఆలయంలోకి వెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వీరిని గమనించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఈవో శ్యామలాదేవితో వాగ్వాదానికి దిగారు. అంతేగాక పాసులు ఇచ్చిన దాతలకు కూడా సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మేం పోలీసులం.. వెళ్లనివ్వండి బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆలయ ప్రధాన ఆలయ ద్వారం వద్ద వీవీఐపీ, దాతల పాసుల ప్రత్యేక దర్శన మార్గంలో వందలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు. దీంతో అంతరాలయంలో భక్తుల రద్దీ పెరిగి గందరగోళంగా మారింది. అనివెట్టి మండపం వరకు వీవీఐపీల లైను నిలిచిపోయింది. ఎంతకీ తరగకపోవడంతో ఈవో శ్యామలాదేవి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి వీవీఐపీ మార్గంలో వస్తున్న వారందరూ పోలీసులæ కుటుంబాలు, అధికారుల కుటుంబాల సభ్యులేæ. మరికొందరు సిఫారసు లెటర్లతో ఆలయంలోకి వచ్చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో.. మారు మాట లేకుండా వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ‘మేము పోలీసులం..’ అంటూ ఒక అధికారి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ‘వెళ్తారా..మీ ఎస్పీకి ఫోన్ చెయ్యాలా!’ అంటూ ఈవో మండిపడ్డారు. ‘మాకో నీతి.. మీకో నీతా! ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? అంటూ అక్కడున్న డీఎస్పీ సుబ్రమణ్యంను ఈవో ప్రశ్నించారు. వీవీఐపీ మార్గాల్లో కేవలం దాతలే వచ్చేలా చేసేందుకు ఈవో అక్కడే కుర్చీలో కూర్చుండిపోయారు. ఈవోతో తహసీల్దార్ వాగ్వాదం స్థానిక తహసీల్దార్ మురళి ప్రోటోకాల్‌లో భాగంగా కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ కుటుంబాన్ని వీవీఐపీ మార్గంలో అనుమతించాలని ఈవో శ్యామలాదేవిని కోరారు. దీనిని ఆమె తిరస్కరించారు. ఎవ్వరైనా వదలబోమని, వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చల్లారకపోవడంతో.. ఈవో శ్యామలాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. ఉత్సవాన్ని మీరే నడిపించుకోండని, అక్కడి నుంచి వెనుదిరిగారు. వెంటనే పలువురు పోలీసు అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఈవో వెళ్లేందుకు నిర్ణయించుకుని ఆ అధికారికి ‘నమస్కారం’ పెట్టి ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండం’టూ వెళ్లిపోయారు. ఈవో వెళ్లిపోయినప్పటికీ.. పోలీసుల కుటుంబాలు మాత్రం తమ తీరు కొనసాగించాయి. పలు ప్రభుత్వ శాఖలు తమ డఫేదారులను అస్త్రాలుగా వాడుకుని యథేచ్ఛగా అడ్డదారిలో అనధికారిక వీవీఐపీల అవతారమెత్తారు. ఈ వివాదంపై కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎస్పీ త్రివిక్రమ్‌వర్మకు ఈవో ఫిర్యాదు చేశారు. రూ.500 దర్శనానికీ ఇదే వ్యథ! రూ.500 చెల్లించి టికెటు తీసుకున్న భక్తులకు కూడా చేదు అనుభవమే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి 12.30 నుంచి బుధవారం ఉదయం 6 గం టల వరకు క్షీరాభిషేక టిక్కెటు తీసుకుని దర్శనం చేసుకునే భక్తులకు అంతరాలయం ముందు లైన్ నుంచి ఆదిత్యున్ని దర్శించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ టిక్కెటుపై ఇద్దరికి అనుమతి ఉండటంతో పాటు ప్రసాదం కూడా పొందారు. రూ.500 చొప్పున ఒక్కొక్కరు దర్శన టిక్కెటు తీసుకున్న భక్తులకు మాత్రం దూరం నుంచి దర్శనంతో పాటు ఎటువంటి తీర్థప్రసాదాలు ఇవ్వలేదు. దర్శన సమయంలో అక్కడ బందోబస్తు పోలీసుల వైఖరితోనే రూ.500 దర్శన మార్గాలు ఇష్టానుసారంగా మారిపోయాయని, దాతల పాసుదారులకు కూడా దగ్గర దర్శనం కరువైంది. దాతలకు తీవ్ర అవస్థలు ఆలయ అభివృద్ధికి రూ.లక్షకు పైగా విరాళాలిచ్చిన వారి సంబంధించిన కుటుంబాలకు దేవాదాయ శాఖ అధికారులు మొత్తం 328 డోనర్ పాసులను ఇచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు దాతల పాసుల ద్వారా వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఆలయ ముఖద్వారం వరకు రావడానికి 80 ఫీట్ రోడ్డు నుంచి నడిచి రావడంతో పాటు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కూడా వీవీఐపీల లైనులో దాతల కంటే అనధికారిక వ్యక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అంతరాలయంలో డోనర్ పాసుల భక్తులకు కనీసం అంతరాలయ దర్శనం కూడా దక్కలేదు. ప్రసాదాలకు కూడా నోచుకోలేదు. దీంతో వీరు నిరాశకు గురయ్యారు. కనీసం దాతల పాసులకు వాహన అనుమతి పాసు కూడా ఇవ్వకపోవడంతో అవస్థలు వర్ణనాతీతం! -
వీవీఐపీ గ్యాలరీలో చిట్‌ఫండ్ నిందితుడు
భువనేశ్వర్: చిట్‌ఫండ్ మోసాల్లో నిందితునిగా తెరపైకి వచ్చిన శుభంకర్ నాయక్ ఇటీవల కటక్ బారాబటి స్టేడియంలో ముగిసిన టీ–20 క్రికెట్ మ్యాచ్‌ను పురస్కరించుకుని ప్రత్యక్షమయ్యారు. మ్యాచ్‌ను తిలకించేందుకు విశిష్ట, అతిరథ, మహారథుల వర్గానికి కేటాయించిన గ్యాలరీలో ఆయన ప్రత్యక్షం కావడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. చిట్‌ఫండ్ మోసాల దర్యాప్తు, విచారణలో నిందిత శుభంకర్ నాయక్‌కు రాజకీయ, పాలన వగైరా రంగాల్లో అతిరథ మహారథులతో ప్రత్యక్ష లింకులు ఉన్నట్లు ఆరోపణ. కోర్టు మంజూరు చేసిన బెయిల్‌తో జైలు నుంచి వచ్చిన శుభంకర్ నాయక్ ఈ విశిష్ట వర్గాలతో చెలిమి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తాజా సంఘటన స్పష్టం చేస్తోంది. మంత్రులు, సర్వోన్నత అధికారులు, క్రికెటర్ల కుటుంబీకులు ఇతరేతర వర్గాలకు కేటాయించి ఓసీఏ బాక్స్ గ్యాలరీలో శుభంకర్ నాయక్ కూడా ఆసీనులయ్యారు. ఈ సంఘటనపట్ల క్రికెట్ మ్యాచ్ నిర్వాహక వర్గం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. కోట్లాది రూపాయల మోసాల్లో నిందితుడు? శుభంకర్ నాయక్ పేరు గల వ్యక్తులకు బాక్స్ గ్యాలరీ టికెట్ జారీ కానట్లు ఈ సంస్థ వర్కింగ్ చైర్మన్ ధీరేన్ పొలై తెలిపారు. వేరొకరికి జారీ చేసిన టికెట్‌తో ఆయన ప్రవేశించి ఉంటారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ మ్యాచ్ టికెట్లు బదిలీ చేసేందుకు వీలు కాని పరిస్థితుల్లో శుభంకర్ నాయక్‌ను బాక్స్ గ్యాలరీకి అనుమతించడంపై కూడా సందేహాల్ని రేకెత్తుతున్నాయి. టీ20 క్రికెట్మ్యాచ్ చిట్‌ఫండ్ మోసాల వ్యవహారాలను కొత్త మలుపు తిప్పింది. సీ–షోర్ గ్రూపు చిట్‌ఫండ్ కోట్లాది రూపాయల మోసాల్లో శుభంకర్ నాయక్ పాత్రధారిగా ఆరోపణ. రూ.2 లక్షల బాండు, సమాన విలువతో ఇద్దరు పూచీదార్ల హామీతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో శుభంకర్ నాయక్ ఈ ఏడాది ఆగస్టులో జైలు నుంచి విడుదలయ్యారు. 2014వ సంవత్సరం నవంబరు 18వ తేదీన సీ–షోర్ గ్రూపు చిట్‌ఫండ్ మోసాల వ్యవహారాల్లో నిందితునిగా ఆయనను సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. -
‘ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ కల్చర్ లేదు’
న్యూఢిల్లీ : ఇంఫాల్ ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ వివాదంపై పౌర విమానయాన శాఖామంత్రి జయంత్ సిన్హా తొలిసారి స్పందించారు. దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ వీవీఐపీ కల్చర్ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చని ఆయన తెలిపారు. విమానాశ్రయాల్లో తీసుకునే భద్రతా చర్యలు ప్రయాణికులు సెక్యూరిటీ కోసమేనని ఆయన తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అంతేకాక భద్రత కల్పించాల్సిన ముఖ్యవ్యక్తులు విమానశ్రయాలకు వచ్చినపుడు సెక్యూరిటీ స్క్రీనింగ్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఇది వీవీఐపీ కల్చర్ కాదని జయంత్ సిన్హా స్పష్టం చేశారు. వీరు తప్ప మిగిలిన ఎవరినైనా విమానాశ్రయాల్లో ఎవరినైనాన సాధారణ ప్రయాణికుడిగానే అధికారులు చూస్తారని ఆయన తెలిపారు. నా బ్యాగ్‌ను నేను మోసుకుంటూ విమానం ఎక్కుతాను.. వీవీఐపీ కల్చర్ లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల కిందట ఇంఫాల్ విమానాశ్రయంలో ఒక మహిళ.. వీవీఐపీ కల్చర్‌పై కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ కన్నన్‌థానమ్‌ను నిలదీయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ రావడంతో.. మిగతా విమాన ప్రయాణికులను నిలిపేశారు. దీంతో మిగిలిన విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. మంత్రి రాకవల్ల ఇబ్బందుల పడ్డవారిలో ఒక మహిళా డాక్టర్ ఉన్నారు. ఆమె అత్యవసరంగా ఒకరికి చికిత్స అందించే క్రమంలో పట్నా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీవీఐపీ కల్చర్ వల్ల ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ఆమె.. నేరుగా కేంద్రమంత్రినే ఎయిర్‌పోర్టులో నిలదీశారు. -
బుగ్గ తీశారు!
► స్వయంగా తొలగించిన సీఎం ఎడపాడి పళనిస్వామి ► అదే బాటలో మంత్రులు ► అందరికీ ఆదేశాలు ► సచివాలయంలో పళని బిజీ ► నీట్ మినహాయింపునకు లేఖ బుగ్గల సంస్కృతికి స్వస్తి పలుకుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తన వాహనంపై ఉన్న సైరన్‌ను స్వయంగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తొలగించారు. మంత్రులు అదే బాటలో ముందుకు సాగారు. అధికారులందరి వాహనాల్లో త్వరితగతిన తొలగించాలన్న ఆదేశాలను సీఎం జారీ చేశారు. ఇక, సీఎంగా పగ్గాలు చేపట్టి గురువారంతో రెండు నెలలు కావడంతో సచివాలయంలో పళనిస్వామి బిజీ అయ్యారు. సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఇక వీఐపీ, వీవీఐపీ అన్న సంస్కృతికి చోటు లేదన్నట్టుగా కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీఐపీ సంస్కృతిని సూచించే రీతిలో వాహనాల్లో ఉండే ఎర్ర బుగ్గలు(సైరన్) మే ఒకటి నుంచి ఉండబోవని కేంద్రం చేసిన ప్రకటనతో తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి తక్షణం స్పందించారు. గురువారం ఉదయం సచివాలయంలోకి రాగానే, తన వాహనంపై ఉన్న బుగ్గను సీఎం తొలగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను స్పందించానని పేర్కొన్నారు. తన మంత్రులు వారి వారి వాహనాలపై బుగ్గలను తొలగించేందుకు నిర్ణయించారని, కొందరు తొలగించేశారని, మిగిలిన వారు త్వరితగతిన తొలగిస్తారని వివరించారు. అధికారులు అందరూ త్వరితగతిన తమ తమ వాహనాలపై బుగ్గలను తొలగించాలన్న ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నా, తమఅమ్మ, దివంగత సీఎం జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఎర్రబుగ్గ సైరన్ వాహనాన్ని ఉపయోగించ లేదన్న విషయాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉందని ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. సీఎం బిజీ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి గురువారంతో పళనిస్వామికి రెండు నెలలు అయింది. అందుకే కాబోలు సచివాలయంలో బిజిబిజీ అయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు తదుపరి సచివాలయం వైపుగా సీఎం పెద్దగా దృష్టి పెట్టలేదు. అడపాదడపా కార్యక్రమాలకు హాజరైనా, తాజాగా మాత్రం రోజంతా బిజీగానే ఉండడం గమనార్హం. బల నిరూపణలో నెగ్గిన అనంతరం ఫిబ్రవరి 20వ తేదీన పళనిస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. తొలి సంతకంగా 500 టాస్మాక్‌ల మూత, అమ్మ పథకాల అమలు మీద దృష్టి పెట్టారు. ఈ రెండు నెలల కాలంలో మొత్తంగా ఆయన 1,520 ఫైల్స్ మీద సంతకాలు పెట్టినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నట్టు, ఆరు వందల వరకు గతంలో ఉన్న పెండింగ్ ఫైల్స్ కూడా ఉండడం గమనార్హం. ఈ రెండు నెలల కాలంలో ప్రభుత్వ వ్యవహారాల మీద తొలి వారం పది రోజుల్లో తీవ్ర దృష్టి పెట్టినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల నగారాతో ఆయన పనితీరు కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అందుకే పాలనా పరంగా ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాన ప్రతి పక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. సీఎం సాయం : మంత్రులు, అధికారులతో వారి వారి శాఖల్లోని కేటాయింపులు, పనుల గురించి సీఎం సుదీర్ఘంగానే చర్చల్లో మునిగారు. తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జరిగిన కేటాయింపులు, సాగుతున్న పనుల్ని సమీక్షించారు. అలాగే, వివిధ కారణాలు, ప్రమాదాల్లో మరణించిన విధి నిర్వహణలో ఉన్న పోలీసులు 14 మంది కుటుంబాల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు. తలా రూ. మూడు లక్షలు చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ఆర్మీలో సేవల్ని అందిస్తూ, వాహన ప్రమాదంలో మరణించిన తూత్తుకుడి జిల్లా ములక్కాడుకు చెందిన గుణశేఖరన్ కుమారుడు ముత్తుచందన్ మృతికి తన సంతాపం తెలియజేశారు. ఆకుటుంబానికి సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వ సాయంగా రూ.20 లక్షలు ప్రకటించి, తక్షణం అందించేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. ఇక, నీట్ పరీక్షా సమయం ఆసన్నం అవుతుండడం, తమిళ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళనను పరిగణలోకి తీసుకుని విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇక పలువురు వీఐపీల అపాయింట్మెంట్లతో సీఎం బిజీ అయ్యారు. ఇందులో పారాలింపిక్ విజేత మారియప్పన్ తంగవేల్ సీఎంను కలిసి తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ బిరుదును సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ‘నీతి ఆయోగ్’లో పాల్గొనేందుకు తగ్గ పర్యటన కసరత్తులు సాగాయి. ఆమేరకు శనివారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. -
వెంకన్న సేవకు ఎగనామం..వీఐపీలకు సలాం!
విధులు గాలికి వదిలేస్తున్నారు అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ధ్వజం తిరుపతి: తిరుమలకు వీవీఐపీలు, సెలబ్రిటీలు వచ్చినపుడు కొందరు టీటీడీ అధికారులు విధులను గాలికి వదిలి వారి వెంట పరుగులు తీస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో సోమవారం ఆయన టీటీడీ అధికారుల వ్యవహార శైలిని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. వీవీఐపీలు, సినీనటులు, వ్యాపారవేత్తలు దేవుడి దర్శనానికి వచ్చినపుడు టీటీడీ అధికారులు దేవుడిని, భక్తులను గాలికి వదిలిపెట్టి ఫొటోల కోసం వారివెంట పరుగులు తీస్తున్నారని ఆయన అన్నారు. ఫొటోల కోసం అర్చకులు, అధికారులు తరచూ గొడవలు పడుతున్నారన్నారు. తమ పరపతిని పెంచుకుని పైరవీలు చేసుకోవడానికి వారు తపన పడుతున్నారని విమర్శించారు. అలాంటి వారి వివరాలను ఆధారాలతో సహా తాను ప్రభుత్వానికి అందిస్తానన్నారు. ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి పబ్లిసిటీ, ఫొటోల కోసం పాకులాడడం జీఓఎంఎస్-348 ప్రకారం నిషిద్ధమని ఆయన గుర్తు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. నివేదికలు తెప్పించుకుని తప్పక చర్యలు తీసుకుంటామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. టీటీడీలో ప్రొటోకాల్ విభాగానికి ప్రత్యేకంగా ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారిని నియమించాలన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచన ను స్పీకర్‌తోపాటు మంత్రి మాణిక్యాల రావు స్వాగతించారు. ట్రాన్స్ఫర్ పాలసీ ఏదీ? టీటీడీ బదిలీల్లో ఒక పాలసీ అంటూ లేకపోవడాన్ని అసెంబ్లీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. కులబలం, ధనబలం లేదా ప్రభుత పెద్దల అండదండలు ఉన్న అధికారులు ఏళ ్ల తరబడి తిరుమలలో పనిచేసి అక్కడే రిటె ర్ అవుతున్నారని తెలిపారు. 35 ఏళ్లుగా టీటీడీలో పనిచేస్తున్న ఇవేవీ లేనివారు, నిజాయితీపరులైన అధికారులకు ఒక్క రోజు కూడా తిరుమలలో పనిచేసే భాగ్యానికి నోచుకోవడంలేదన్నారు. వీరంతా నిరాశగా రిటైరవుతున్నారని భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో బదిలీల పాలసీని ప్రవేశపెట్టి తప్పనిసరి చేయాలన్న భాస్కర్‌రెడ్డి డిమాండ్‌పై మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. గంట ప్రయూణానికి రూ.25 వేల భక్తులు డబ్బు టీటీడీలో కొందరు ఉన్నతాధికారులు భక్తులు స్వామివారికి సమర్పించిన డబ్బును తమ విలాసవంతమైన సౌకర్యాలకు వాడుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. అందుకు టీటీడీ ఈవోను ఉదహరించారు. 70 మందికి పైగా సిబ్బంది, 5 గెస్ట్‌హౌస్‌లు, 6 కార్లు, 5 కార్యాలయ భవనాలు ఈవో సేవలో తరిస్తున్నాయని విమర్శించారు. విమానంలో రూ.5 వేలతో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం అందుబాటులో ఉన్నా హైదరాబాద్‌కు రావాలంటే రూ.25 వేల బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి టీటీడీ నిధులను విలాసాలకు వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. టీటీడీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని భాస్కర్‌రెడి కోరారు. ఈ వైనంపై విచారణ కమిటీ వేస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడుతాయని ఆయన తెలిపారు. వివరాలు అందజేయూలని, ఇతర నివేదికలను తెప్పించుకుని భక్తుల డబ్బును కాపాడుతామని మంత్రి మాణిక్యాలరావు సమాధానమిచ్చారు.