తిరుపతి/గుంటూరు, సాక్షి: తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తిరుపతికి బయల్దేరిన సంగతి తెలిసిందే. కాసేపట్లో పద్మావతి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉన్న తరుణంలో వైఎస్ జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
తిరుచానూ క్రాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత వెళ్లాలని పోలీసులు చెప్పడంతో.. తిరుచానూరు క్రాస్ వద్ద నుంచి నడుచుకుంటూనే కాలినడకన బయల్దేరారు జగన్.. అయితే కొద్ది దూరం నడిచిన వెళ్లిన వైఎస్ జగన్.. ఆపై స్థానిక నేత కారులో తిరుపతికి బయల్దేరారు.
వైఎస్ జగన్ వెళ్లే లోపు బాధితుల్ని తరలించే యోచనలో ఉన్న అధికారులు.. దానిలో భాగంగా ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే అరగంట, గంట అంటూ ఏవో సంబంధం లేని కారణాలను తెలియజేసే యత్నం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని వైఎస్ జగన్.. బాధితుల్ని పరామర్శించడానికి బయల్దేరారు.
కనీసం ట్రాఫిక్ క్లియన్ చేయని అధికారులు
వైఎస్ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న అధికారుల్లో ఎలాగైనా బాధితుల పరామర్శను నిర్వీర్యం చేయాలనే యోచన ఉన్నట్లు కనిపిస్తోంది. కనీసం ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం లేదు అధికారులు. వైఎస్సార్‌సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజాలు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
పోలీసులు కాన్వాయ్‌ను అడ్డుకున్న క్రమంలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన వైఎస్ జగన్.. ఆపై స్థానిక నేత వాహనంలో తిరుపతికి బయల్దేరారు.
అధికారుల ఓవరాక్షన్
తొక్కిసలాట ఘటన తర్వాత అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వకపోగా.. ఆపై సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో చేసిన హడావిడి చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శిస్తారనే సమాచారం అధికారులకు అందింది. దీంతో.. ప్రభుత్వం అధికారులకు ఆగమేఘాల ఆదేశాలు జారీ చేసింది. తొలుత సీఎం చంద్రబాబు వచ్చి వాళ్లను పరామర్శిస్తారని.. అయితే జగన్ వచ్చేలోపు ఆ క్షతగాత్రులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించేయాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రభుత్వాన్ని జగన్ నిలదీస్తారనే భయం ఈ ఆదేశాలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment