మెరుగవుతున్న డాలర్ శేషాద్రి ఆరోగ్యం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మంగళవారం చైన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.
శేషాద్రికి డయాబెటీస్ ఉండటంతో శస్త్రచికిత్సలు చేయకుండా మాత్రలతో ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్టు వైద్యులు చెప్పారు. మరో మూడు నెలల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. శేషాద్రికి గుండెపోటు రావడంతో చికిత్స చేయిస్తున్న విషయం విదితమే.