Swims
-
36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. వైరల్ వీడియో
నీళ్లతో ఆడుకోవడం చాలా మందికి సరదా. అందుకే చాలామంది ఈత అంటే ఇష్టపడతారు. అయితే.. ఎంతసేపు ఈత కొట్టగలుగుతారు? ఎంత దూరం ఈద గలుగుతారు? ఓ కిలోమీటర్కూడా కష్టమే కదా! కానీ ఏకంగా 36 కిలోమీటర్లు ఏకబిగిన ఈదిందో మహిళ. అరేబియా సముద్రంలో వర్లీ సీలింక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు 36 కి.మీ ఈత కొట్టి రికార్డు సృష్టించారు ముంబైకి చెందిన సుచేతా బర్మన్. ఈత వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆ్రల్టా–మారథాన్ స్విమ్మర్ అయిన సుచేతా దేవ్ బర్మన్.. పోస్ట్ ఇన్‌స్ట్రాగామ్‌లో దాదాపు 4 మిలియన్ల మంది చూశారు. ఆమె సాధించిన విజయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు అరేబియా సముద్రంలో ఈతేంటి? అత్యంత కలుషితమైన ఆ నీటిలో ఈత కొట్టడం ప్రమాదాలే ఎక్కువని కామెంట్స్ చేశారు. ఇలాంటి ఇన్ఫ్లూయర్స్మనకు కావాలి, వీళ్లే చాలామందిని ప్రభావితం చేస్తారని మరికొందరు స్ఫూర్తిదాయకంగా రాశారు. ముంబై ట్రాఫిక్ని చూస్తే, ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే బెటరేమో అనిపిస్తుందని మరో వినియోగదారు రాశారు. 36 కి.మీ ఈత కొట్టడానికి ఎంత సమయం, పట్టుదల కావాలో నాకు తెలుసంటూ ఓ స్విమ్మర్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కొన్ని గంటలపాటు పదుల కిలోమీటర్లు సముద్రంలో ఈదడమంటే మామూలు విషయం కాదుకదా అంటున్నారు. View this post on Instagram A post shared by Sucheta Deb Burman (@suchetadebburman) -
తిరుపతిలో దారుణం.. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని..
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని ప్రియురాలి తల్లిదండ్రులపై ప్రియుడు దాడి చేశాడు. వివరాల ప్రకారం.. డక్కిలి మండల కేంద్రంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తమ ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియురాలి పేరెంట్స్‌పై ప్రియుడు గిరి దాడి చేశాడు. ఈ క్రమంలో అతడి దాడిలో ప్రియురాలి తండ్రి తులసి జగదీష్(45) తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వెంటనే జగదీష్‌ను స్థానిక స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగదీష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, నిందితుడు గిరిని శ్రీకాళహస్తి మండలానికి చెందిన వాగివేడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: కాకినాడ తునిలో దారుణం: మహిళా చిరు వ్యాపారిని డబ్బు కోసం బెదిరించి.. -
నీటిలోని చేపను నీరే కబళిస్తే?.. దీని వెనకున్న మిస్టరీ ఏంటి!
చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగడం కామనే.. కానీ నీటిలోని చేపను నీరే కబళిస్తే? చేపలు సహా అక్కడి జలచరాలనే ‘మింగేస్తే’? విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమేనని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. దీని వెనకున్న మిస్టరీని బయటపెట్టారు. అదేమిటంటే... ఈజిప్ట్, సౌదీ అరేబియా మధ్యన ఉన్న ఎర్ర సముద్రానికి ఉత్తరాన ఉన్న గల్ఫ్ ఆఫ్ అకాబాలో శాస్త్రవేత్తలు అరుదైన ‘డెత్ పూల్’ను గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ మయామీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు రిమోట్ ద్వారా నడిచే అండర్‌వాటర్ వెహికల్ ద్వారా సముద్ర గర్భాన్ని పరిశీలించే క్రమంలో 1,770 మీటర్ల లోతున దీన్ని కనుగొన్నారు. సుమారు 100 అడుగుల పొడవున ఈ మడుగు ఉంది. సాంకేతికంగా బ్రైన్పూల్స్ అని పిలిచే ఈ నీటిలో లవణత అత్యంత ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా అందులో ఆక్సిజన్ శాతం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. చదవండి: ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి... అందువల్ల చేపలు సహా మరే జలచరాలైనా ఈ మడుగులోకి ప్రవేశించగానే మరణిస్తాయని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శామ్ పుర్కిస్ తెలిపారు. కానీ విచిత్రంగా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సూక్ష్మజీవులు ఈ మడుగులో జీవిస్తున్నాయని... ఈ నీటిలోకి వచ్చి మరణించే జలచరాలను ఆహారంగా తీసుకుంటున్నాయని వివరించారు. భూమిపై లక్షల ఏళ్ల కిందట సముద్రాలు ఎలా ఏర్పడ్డాయనే విషయంలో చేపట్టబోయే భావి పరిశోధనలకు తాజా పరిణామం దోహదపడుతుందని చెప్పారు. భూమిపై జీవం మనుగడకు ఉన్న పరిమితులు ఏమిటో అర్థం చేసుకోనిదే ఇతర గ్రహాలపై జీవం ఉనికిని అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ జర్నల్ ‘నేచర్’ ప్రచురించింది. -
మంత్రికి సంతాపం.. కొన్ని గంటలకే చిరంజీవిగా అదే మంత్రి!!
మడగాస్కర్: హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మడగాస్కర్ దేశ మంత్రి సెర్జ్ గెలె ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన సాహసంతో సుమారు 12గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డారు. తాను మరణించలేదని బతికే ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం ఐలాండ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునక ప్రమాదంలో 39మంది చనిపోయిట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పట్ల దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రితో పాటు మిగతా ఇద్దరు అధికారులు మరణించారని ఆయన నివాళులు అర్పించారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు. హెలికాప్టర్ కూలిపోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సముద్రంలో ఈదుకుంటూ వచ్చినట్లు మంత్రి గెలె తెలిపారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బతికే ఉన్నానని మహాంబో గ్రామస్తులకు చెప్పారు. ఆయన హెలికాప్టర్‌లోని ఒక సీటును సుముద్రం నీటిపై తేలడానికి ఉపయోగించుకున్నారని పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ పేర్కొన్నారు. ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించేవారని, 30 ఏళ్ల వ్యక్తిలా బతకడానికి పోరాడారని రావోవీ ప్రశంసించారు. -
స్విమ్స్‌లో అక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన టీటీడీ
-
స్విమ్స్‌లో విద్యార్థి మృతిపై ఆందోళన
చిత్తూరు, తిరుపతి (అలిపిరి): స్విమ్స్ నెఫ్రాలజీ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సరవిద్యార్థి చేకుర్తి చరణ్(16) కిడ్నీ సమస్యలతో గత 15 రోగులుగా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నాడు. వైద్యులు, నర్సుల నిర్లక్ష్య వైద్యం వల్లే విద్యార్ధి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు సోమవారం ఆస్పత్రిలోని ఎన్టీఆర్ కూడలి వద్ద ఆందోలనకు దిగారు. వీరికి వైఎస్సార్ సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల కథనం..పొట్టి శ్రీరాములు జిల్లా డక్కిలి మండలం, తిమ్మనగుంటకు చెందిన సి.చరణ్(15) కిడ్నీ సమస్యలతో ఈనెల 7న స్విమ్స్ అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో ఆర్యోగ్యం కాస్త మెరుగు పడడంతో ఆదివారం అతడిని నెఫ్రాలజీ ఐసీయూ విభాగానికి తరలించారు. అయితే రాత్రి 9.30 గంటలకు తీవ్రమైన జ్వరంతో పాటు రక్తవాంతులు చేసుకున్నాడు. తల్లిదండ్రులు విషయాన్ని విధుల్లో ఉన్న నర్సులకు చెప్పినా పట్టించుకోలేదు. అత్యవసర విభాగంలోని వైద్యుల వద్దకు వెళ్లి తన కుమారుడి పరిస్థితి దయనీయంగా ఉందని విద్యార్థి తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. ఉదయం వస్తామని వైద్యులు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున 12.30 గంటలకు విద్యార్థి ప్రాణాలు విడిచాడు. సరైన వైద్యసేవలు అందకపోవడం వల్లే చరణ్ మృతి చెందాడని బంధువులు ఆగ్రహించారు. ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. స్విమ్స్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మహాప్రస్థాన వాహనంలో విద్యార్థి మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. వైఎస్సార్ సీపీ మద్దతు వైద్యుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి స్విమ్స్‌లో మృతి చెం దాడన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కట్టా గోపి యాదవ్, బీసీ సెల్ న గర అధ్యక్షులు తండ్లం మోహన్ యాదవ్, నాయకులు వేణుగోపాల్, విజయలక్ష్మి, చాన్‌బాషా, వూటుగుంట మోహన్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధిత కు టుం సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. స్విమ్స్‌లో వైద్య సేవలు రోజు రోజూకు దిగజారుతున్నాయ ని ఆరోపించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జిల్లాలో మరొకటి లేకపోవడం వల్ల విధిలేని పరిస్థితిలో రోగులు స్విమ్స్‌కు వస్తున్నారని, అయితే రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు, నర్సులు కొన్ని సమయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నా బిడ్డ ప్రాణాలు తీశారు వైద్యసేవలు సరిగా అందించకపోవడం వల్లే తమ బిడ్డ మృత్యువాత పడ్డాడని చరణ్ తల్లిదండ్రులు పా ర్వతి, భాస్కర్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రాణాపా య స్థితిలో ఉన్న తమ బిడ్డకు సరైన సమయంలో చికిత్స చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందుతున్న రోగులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ కుమారుడి మృతికి కారకులైన వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం చరణ్‌కు స్విమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందించామని స్విమ్స్ వైద్యులు డాక్టర్ అల్లోక్ సచన్, డాక్టర్ రామ్ తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఘటనపై ప్రత్యేక కమిటీతో సమావేశమై విచారణ చేస్తామన్నారు. ఇందులో వైద్యులు, నర్సులు నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు అధికారులు హామీ ఇచ్చారు. -
స్విమ్స్‌లో అగ్నిప్రమాదం
చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : స్విమ్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 11.15 గంటలకు యూరాలజీ విభాగం ఐసీయూలోని ప్రత్యేక గదిలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం ధాటికి గది పూర్తిగా దగ్ధమైంది. గదిలోని పీయుపీ షీట్లు, ఏసీ ఉపకరణాలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం బారిన పడి ఎవరూ గాయపడలేదు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని స్విమ్స్ అధికారులు వెల్లడించారు. మరో వైపు కనీసం ఎలక్ట్రికల్ ఇంజినీర్ విభాగం విద్యుత్ సమస్యలను సకాలంలో మరమ్మతులు చేయకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. యూరాలజీ విభాగం ఐసీయూలో 25 మందికిపైగా రోగులు చికిత్స పొందుతున్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం, వైర్ల మరమ్మతు పనులపై ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం వహించడ వల్లే షార్ట్ సర్క్యూట్ సంభవించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రమాణాలకు అనుగుణంగా లేని విద్యుత్ వైర్లు వినియోగించినా, హైఓల్టేజీ సంభవించినా షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆస్పత్రికి వచ్చిన అగ్నిమాపక అధికారి సహదేవ నాయక్‌కు స్విమ్స్ అధికారులు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని చెప్పుకొచ్చారు. తప్పిన పెనుప్రమాదం యూరాలజీ ఐసీయూ ప్రత్యేక గదిలో అగ్నిప్రమాదం సంభవిస్తే కనీసం భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించలేదని అక్కడే ఉన్న రోగుల ఆరోపణ. దట్టంగా∙పొగలు వ్యాపించిన తరువాతే మంటలు అదుపు చేశారు. తరువాత అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు గదిలోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. యూరా లజీ ఐసీయూ రోగులకు ఇబ్బందులు లేకుండా మరో వార్డులో వైద్య సేవలు అందించారు. రోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటించే స్విమ్స్ ఉన్నతాధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
జనరిక్ షాప్ లైసెన్స్ రద్దు
తిరుపతి (అలిపిరి) : స్విమ్స్‌లో నిర్వహిస్తున్న జనరిక్ మందుల దుకాణం పై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝళిపించింది. మెప్మా అనుమతి లేకుండా అభ్యుదయ నగర మహిళా సమాఖ్య పేరుతో మందుల దుకాణం నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. అనేక పరిణామాల మధ్య ఎట్టకేలకు జనరిక్ దుకాణాన్ని రద్దు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ అ«ధికారులు గురువారం ప్రకటించారు. మందుల స్టాక్ ఉంచకూడదని నిర్వాహకులనుఆదేశించారు. లైసెన్స్ రద్దు చేసి మూడు రోజులు గడుస్తున్నా మందుల స్టాక్ అలాగే ఉంచారు. టీడీపీ చోటా నాయకుల ఒత్తిళ్ల వల్ల స్విమ్స్ యాజమాన్యం ఈ దుకాణం మూసివేతకు వెనకడుగు వేస్తోందనే విమర్శలున్నాయి. స్విమ్స్‌లో జనరిక్ దుకాణం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. గతంలో రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహించే సమయంలో అవినీతి ఆరోపణలొచ్చాయి. దీంతో దుకాణాన్ని రద్దు చేశారు. మెప్మా అనుమతి లేకుండా టీడీపీ చోటా నాయకుల సహకారంతో అభ్యుదయ నగర మహిళా సమాఖ్య పేరుతో కనీసం సభ్యు ల అనుమతి లేకుండా జనరిక్ దుకాణాన్ని 8 నెలల క్రితం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని రెండు నెలల క్రితం ఔషధ నియంత్రణ శాఖ లైసెన్స్ రద్దు చేసింది. చట్టంలోని లొసుగుల ఆధారంగా నిర్వాహకులు ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి తెచ్చుకుని నెల రోజులుగా జనరిక్ షాపు నిర్వహిస్తున్నారు. వివాదం మధ్య లైసెన్స్ మంజూరు జనరిక్ దుకాణం నిర్వహణకు కోర్టు ఉత్తర్వులు ఆధారంగా డ్రగ్ అధికారులు అ«భ్యుదయ నగర మహిళా సమాఖ్యకు తిరిగి ఆగమేఘాలపై లైసెన్స్ మంజూరు చేశారు. లైసెన్స్ మంజూరుకు మెప్మా పీడీ నుంచి అనుమతి తప్పనిసరి.∙ఔషధ నియంత్రణ అధికారులు జూన్ 6న లైసెన్స్ మంజూరు చేసి 12న ఇచ్చి నట్లు మెప్మాకు లేఖ రాశారు. డ్రగ్ అధికారుల తీరుపై మెప్మా అధికారులు మండిపడ్డారు. తమకు తెలియకుండా అభ్యుదయ నగర మ హిళా సమాఖ్య పేరుతో జనరిక్ నడుపుతున్నారని సమాఖ్య వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకోవాలని డ్రగ్ అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు విచారించి లైసెన్స్ రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. -
సేవకు సెలవ్!
స్విమ్స్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. ఈఎస్ఐ ఆస్పత్రి రెఫరల్ సేవలను నిర్దాక్షిణ్యంగా ఆపేసింది. ఏడాదిగా రూ.9 కోట్ల బకాయి చెల్లించలేదన్న సాకుతో కార్మికుల సేవకు నిరాకరిస్తోంది. పది రోజులుగా టై అప్ లెటర్లు మంజూరు చేయకుండా కార్మికులను ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. విధిలేని పరిస్థితిలో కొందరు కార్మికులు విజయవాడ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి (అలిపిరి): కార్మిక రాజ్య బీమా సంస్థ ద్వారా స్విమ్స్‌లో వైద్య సేవలు పొందుతున్న రోగులకు కష్టాలు తప్పేట్లు లేవు. ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త కేసులు తీసుకోవడానికి స్విమ్స్ నిరారించిం ది. ఈఎస్ఐ కార్పొరేషన్ స్విమ్స్‌కురూ.9 కోట్లు బకాయి చెల్లించకపోవడంతో స్విమ్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈఎస్ఐ కార్డులున్న కార్మికులు, ఉద్యోగులు వైద్య సేవలు పొందడానికి తంటాలు పడాల్సి వస్తోంది. బిల్లుల చెల్లింపులో కార్మిక రాజ్య బీమా సంస్థ జాప్యం చేస్తోందని, ఆడిటింగ్ సమయంలో లోటు బడ్జెట్‌ను చూపించడం కష్టతరంగా మారడం వల్ల కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్విమ్స్ అధికారులు చెబుతున్నారు. విజయవాడకు రెఫర్ స్విమ్స్ రెఫరల్ కేసును తీసుకోకపోవడంతో తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి అధికారులు చేసేది లేక విజయవాడలోని ఆస్పత్రులకు పంపుతున్నారు. ఈఎస్ఐ పరిధిలో తిరుపతిలో శ్రీరమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నా అందులో పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు అందుబాటులో లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో రోగులను విజయవాడ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. 20 ఏళ్లలోరూ.300 కోట్లు చెల్లింపు.. గడిచిన 20 ఏళ్లలో ఈఎస్ఐ కార్పొరేషన్ స్విమ్స్‌కు రూ.300 కోట్లు చెల్లిం చింది. బకాయిలు సకాలంలో చెల్లించినా.. కొంతకాలంగా ఈఎస్ఐ కార్పొరేషన్లో దస్త్రాల కదలికలో తీవ్ర జాప్యం చోటుచేసుకోంది. స్విమ్స్‌కు బకాయి చెల్లింపుల్లో ఆలస్యమవుతోంది. బకాయి ని సాకుగా చూపి స్విమ్స్ యాజమాన్యం కార్మికులకు వైద్యం నిరాకరించడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈఎస్ఐ కార్డులున్న ఉద్యోగులకు స్విమ్స్‌లో వైద్య సేవలు అందేలా తక్షణం చర్యలు తీసుకోవాల్సింది. టై అప్ లెటర్‌మంజూరుకు నిరాకరణ ఈఎస్ఐ ఆస్పత్రి రెఫర్ చేసిన కేసులకు స్విమ్స్‌లో అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కనీసం టై అప్ లెటర్లూ మంజూరు చేయడం లేదు. రోగి వివరాలతో కూడి న టై అప్ లెటర్‌ను ఈఎస్ఐ కార్పొరేషన్‌కు పంపుతుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత ఈఎస్ఐ ఆస్పత్రి రెఫరల్ చేస్తుంది. కార్పొరేషన్లో బకాయి మం జూరులో తీవ్రజాప్యం చోటు చేసుకోవడంతో ఈఎస్ఐ కార్డులున్న ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. -
సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నద్ధం
నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో 1986లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఏర్పాటుకు పునాది రాళ్లు వేశారు. 1995 నుంచి స్విమ్స్ ఆస్పత్రి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకులకు సిద్ధమైంది. మహతీ వేదికగా సోమవారం సాయంత్రం 5.15 గంటలకు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి (అలిపిరి): 2001లో ప్రాణదానం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచిత శస్త్ర చికిత్స సేవలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించడంతో స్విమ్స్‌లో నిరుపేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీæ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ 38 విభాగాల్లో 500 మంది వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నిత్యం 1500 నుంచి 2 వేల మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారు. 898 పడకలతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తోంది. విద్యా నిలయం.. స్విమ్స్‌లో యూజీ, పీజీ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 1,765 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ సంఖ్య రాబోయే రెండేళ్లలో 2 వేలకు పెరిగే అవకాశం ఉంది. యూనివర్సిటీలో 2,218 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రతి ఏటా 540 మంది 66 కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. 2014లో స్విమ్స్ ఆధ్వర్యంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రారంభమైంది. హాజరుకానున్న ప్రముఖులు: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. -
సూపర్ బాస్‌లు
రాయలసీమకే తలమానికంగా వెలుగొందుతూ సూపర్ స్పెషాలిటీ సేవలందిస్తున్న స్విమ్స్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. ముఖ్యంగా పరిపాలనా విభాగంలో కీలక పదవుల్లో ఉన్న సీఎం బంధువులు సూపర్‌బాస్‌లుగా మారారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు మొదులుకుని ఉద్యోగాల భర్తీ వరకు అన్నీ తామై వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాకుండానే అడహక్ పద్ధతిలో సీఎం బంధువును నెట్వర్క్ ఇంజినీర్‌గా నియమించడమే ఇందుకు నిదర్శనం. తిరుపతి (అలిపిరి) : స్విమ్స్ కంప్యూటర్ సెక్షన్లలో పనిఒత్తిడి పెరిగిందని, అందుకు తగ్గట్టుగా నెట్వర్క్ ఇంజినీర్‌ను నియమించాలని సీఎం బంధువులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఒక పర్మినెంట్ పోస్ట్‌ను క్రియేట్ చేశారు. చెన్నైలో ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినిర్‌గా పనిచేస్తున్న తేజ అనే వ్యక్తిని అత్యంత రహస్యంగా నెట్వర్క్ ఇంజినీర్‌గా నియమించారు. అతనికి నెలకు స్విమ్స్ నిధుల నుంచి రూ.50 వేల వేతనం చెల్లిస్తున్నారు. ఆరు నెలల క్రితం అత్యంత రహస్యంగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి స్వయానా స్విమ్స్ పర్చేజింగ్ విభాగం ఇన్చార్జ్ అన్న కొడుకు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిబంధనలు గాలికి స్విమ్స్‌లో అడహక్ పద్ధతిలో నియమించాలంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ విడుదల చేయాలి. అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి అర్హతలున్న వ్యక్తిని నియమించాలి. స్విమ్స్ నెట్వర్క్ ఇంజి నీర్ నియామకంలో ఇవేమీ పాటించలేదు. సీఎం సమీప బంధువు కావడంతో పర్మినెంట్ పోస్ట్‌లో నియమించేశారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా డైరెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి నియామక ఉత్తర్వులు జారీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. పట్టించుకోని డైరెక్టర్ స్విమ్స్‌లో అవినీతి రాజ్యమేలుతున్నా డైరెక్టర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. పరిపాలనా పరమైన కీలక పదవుల్లో సీఎం బంధువులు ఉండడం కూడా ఇందుకు ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన స్విమ్స్‌లో సీఎం బంధువులు అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. ప్రతిభ ఆధారంగా నియామకం స్విమ్స్ కంప్యూటర్ సెక్షన్లో పనిఒత్తిడి పెరిగింది. ఉద్యోగులపై పనిభారం పెరగడంతో నెట్వర్క్ ఇంజినీర్‌ను నియమించాలని భావించాం. ప్రతిభ ఆధారంగా అడహాక్ పద్ధతిలో పోస్టును భర్తీ చేశాం. – ఆదిక్రిష్ణయ్య, పర్సనల్ మేనేజర్, స్విమ్స్, తిరుపతి -
వామ్మో! ఇలా కూడా ఆఫీస్‌కు వెళుతారా?
ఆఫీస్‌కు రావడం, మళ్లీ ఇంటికి వెళ్లడం.. మధ్యలో ఆఫీస్‌లో పనిచేయడం.. ఇవి చాలు ఒక సగటు ఉద్యోగి అలిసిపోవడానికి.. దీనికితోడు నగరాల్లో నరకం చూపించే ట్రాఫిక్ గురించి చెప్పకపోవడమే మేలు.. ఆఫీస్‌లో చేసిన వర్క్ కంటే.. ఆఫీస్‌కు రావడానికి, మళ్లీ ఇంటికి వెళ్లడానికి ట్రాఫిక్‌లో ఎదుర్కొనే చిక్కులే ఎక్కువ. దారి పొడగుతా పాములా మెలికలు తిరిగి.. నత్తలా నిదానంగా ముందుకుసాగే ట్రాఫికే చాలామందికి చెప్పలేనంత విసుగు తెప్పిస్తుంది. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కొందరు వినూత్నంగా ట్రాఫిక్ సమస్య తమ దారికి అడ్డురాకుండా కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఇదేవిధంగా ఆలోచించి ఓ చెక్ రిపబ్లిక్ వ్యక్తి ఏకంగా చిన్న హెలికాప్టర్ రూపొందించుకొని.. ఆఫీస్ వెళుతుండగా.. జర్మన్లో ఓ వ్యక్తి మరింత వినూత్నంగా ఆఫీస్ బాటపట్టాడు. మ్యూనిచ్‌లో ఉండే బెంజమిన్ డేవిడ్ ట్రాఫిక్ బెదడతో విసిగిపోయాడు. నిత్యం చుక్కలు చూపించే ట్రాఫిక్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాడు. రోడ్డుమార్గంలో వెళితే.. ట్రాఫిక్ ఎదురవుతుంది. అదే నీటిమార్గంలో వెళ్లితే.. వాహనాలు ఉండవు. సిగ్నళ్లు ఉండవు. ట్రాఫిక్ బెడద ఉండదు. అందుకే నగరంలోని ఇసార్ నదిని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆ నది మార్గంలో రవాణసౌలభ్యం లేదు. అయినా, బెంజిమిన్ వెనుకకు తగ్గలేదు. రోజూ 1.6 కిలోమీటర్లు (ఒక మైలు) ఎంచక్కా ఈదుకుంటూ వెళుతున్నాడు. ఇంటి నుంచి నేరుగా బెంజమిన్ నదికి వస్తాడు. అక్కడ తన దుస్తులు, బూట్లు, మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్ వాటర్ ప్రూఫ్ బ్యాగులో పెట్టి.. ఎంచక్కా నదిలో దూకేసి ఈదుకుంటూ ఆఫీస్‌కు వెళుతాడు. ఇలా రోజు ఆఫీస్‌కు వెళ్లడం, ఇంటికి రావడం ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉందని బెంజమిన్ చెప్తున్నాడు. గత రెండేళ్ల నుంచి అతను ఆఫీస్‌కు ఇలాగే వెళుతున్నాడు. -
ప్రసూతి రగడ
⇒రాజుకుంటున్న ప్రసూతి ఆస్పత్రి వ్యవహారం ⇒గడువు ముగిసినా ఖాళీ చేయని స్విమ్స్ ⇒మండిపడుతున్న ప్రజాసంఘాలు తిరుపతి మెడికల్:తిరుపతిలో ప్రసూతి ఆస్పత్రి రగడ రాజుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ఈ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్‌కు కట్టబెట్టింది. దీన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కార్పొరేట్ వైద్యానికే టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మండిపడుతున్నాయి. రూ.77 కోట్లతో 300 పడకల ఆస్పత్రి ఎస్వీ మెడికల్ కళాశాల పరిధిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఉంది. ఇక్కడ 150 బెడ్లు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల నుంచి వందలాది మంది కాన్పుల కోసం వస్తుండడంతో బెడ్ల కొరత ఏర్పడుతోంది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు ప్రసవించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద మహిళల కోసం 300 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది. 2012లో రూ.77 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 300 పడకల ప్రసూతి ఆస్పత్రి ఆవిష్కృతమైంది. ప్రసూతిపై కన్నేసిన స్విమ్స్ టీటీడీ ఆధ్వర్యంలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ ప్రసూతి ఆస్పత్రిపై కన్నేసింది. తమకు అనుబంధంగా ఉన్న శ్రీపద్మావతి మెడికల్ కళాశాలో సీట్ల పెంపు, సిబ్బంది నియామకాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రసూతి ఆస్పత్రిని ఇవ్వాలని పాలకులపై ఒత్తిడి తెచ్చింది. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వం ప్రసూతి ఆస్పత్రిని రెండేళ్లపాటు స్విమ్స్‌కు కట్టబెట్టింది. రెండేళ్ల క్రితంరాత్రికిరాత్రే జీవోలు విడుదల చేసింది. రెండేళ్ల గడువు ముగిసినా.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పేదలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. గడువు గత ఏడాది డిసెంబర్ నాటికే తీరినా ఇంతవరకు ఖాళీ చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరో రెండేళ్ల వరకు గడువు పొడిగింపునకు ప్రయత్నాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. ప్రస్తుత మెటర్నిటీ ఆస్పత్రికి అనుబంధంగా గత కేంద్ర ప్రభుత్వం రూ.77 కోట్లతో 300 పడకల ఆస్పత్రిని కేటాయించింది. పేద గర్భిణులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం స్విమ్స్‌కు కట్టబెట్టడంతో పేద గర్భిణులకు ఉచితంగా వైద్యం చేసుకునే వెసులబాటు లేకుండా పోయింది. దీనికితోడు రూ.50 ఓపీ తీసుకున్నా కాన్పు సమయంలో కార్పొరేట్ ధరలు వసూలు చేస్తుండడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
టెండర్ల రద్దులో సీఎం బంధువు కీలకపాత్ర!
-
తిరుపతి స్విమ్స్ టెండర్లలో గోల్మాల్
-
స్విమ్స్ ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా వాసుదేవ రెడ్డి
తిరుపతి మెడికల్ ఃశ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్శిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ డాక్టర్ వాసుదేవరెడ్డిని నియమించారు. ఈమేరకు గురువారం నియామక ఉత్తర్వులను డైరెక్టర్ రవికుమార్ జారీచేయగా, డాక్టర్ వాసుదేవ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన డాక్టర్ ఆంజనేయులు ఉద్యోగ విరమణ చేశారు. ఈనేపథ్యంలో శ్రీపద్మాతి మహిళా మెడికల్ కళాశాలలో అనాటమి ప్రొఫెసర్, విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ వాసుదేవరెడ్డిని ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. గతంలో ఈయన ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి 2012లో పదవీ విరమణ పొందారు. ఆయన సుదీర్ఘ అనుభవాన్ని దష్టిలో ఉంచుకుని ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
స్విమ్స్ వైద్య సేవల విస్తరణ
–అన్ని వైద్య విభాగాల్లో కొత్త పరికరాల ఆవిష్కరణ –క్యాన్సర్ రోగులకు 2వ సత్రంలో వసతి సదుపాయం – టీడీపీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి మెడికల్ : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) వైద్య సేవలు రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందేలా అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. స్విమ్స్‌లో శుక్రవారం సాయంత్రం నూతన రేడియేషన్ ఆంకాలజి వార్డు, మెడకిల్ ఆంకాలజి వార్డు, బ్రాకీ వార్డు, బ్రాకీ థెరపీ, కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆంకాలజీ విభాగాల అధునాతన వైద్య పరికరాలను చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చదలవాడ మాట్లాడుతూ వైద్య సేవలను మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్నిరకాల ఆర్థిక సదుపాయాలను టీటీడీ సమకూరుస్తుందని తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల వసతి కోసం టీటీడీ 2వ సత్రంలో 50 గదులను స్విమ్స్‌కు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం కింద లభించే విరాళాలతో మరింత ఆర్థిక సహాయాన్ని స్విమ్స్‌కు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి రూ.30 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని, దీనిని రూ.40 నుంచి రూ.70 కోట్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. క్యాన్సర్ రోగుల కోసం టీటీడీ సత్రంలో గదులు కేటాయించడంపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. -
స్విమ్స్ సీట్లు ఆ ఐదు జిల్లాలకే
- స్విమ్స్‌తో పాటు ‘పద్మావతి’ సీట్లూ కడప, కర్నూలు, చిత్తూరు, - అనంతపురం, నెల్లూరు వారికే.. ఉత్తర్వులు జారీ.. సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్)లో ఉన్న ఎండీ, ఎంఎస్ పీజీ, సూపర్‌స్పెషాలిటీ సీట్లతో పాటు, ఫిజియో థెరపీ, నర్సింగ్ సీట్లు ఇకపై రాయలసీమకే వర్తింప చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్విమ్స్ అనుబంధ కళాశాల పద్మావతి మహిళా వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్ సీట్లు కూడా స్థానికులకే వర్తింపచేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. స్విమ్స్‌ను స్టేట్ వైడ్ కళాశాలగా గుర్తించి 2014 ఆగస్ట్ 23న జీవో నెం.120 ఇచ్చారు. దీని ఆధారంగా 85 శాతం సీట్లు 13 జిల్లాలకు చెందిన వారికి, మిగతా 15 శాతం సీట్లు ప్రవాస భారతీయ కోటాగానూ నిర్ణయించారు. దీనిపై రాయలసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులతో పాటు కొన్ని సంఘాలు, హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. స్విమ్స్‌ను ప్రాంతీయ సంస్థగానే పరిగణించాలని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం దిగొచ్చింది. 2015 జూన్ 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇప్పటి వరకూ రాష్ట్రస్థాయి సంస్థగా ఉన్న స్విమ్స్‌ను ప్రాంతీయ (రీజనల్) సంస్థగా పరిగణిస్తామని పూనం తెలిపారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి పైన పేర్కొన్న ఐదు జిల్లాల అభ్యర్థులకు 85%సీట్లు స్థానిక కోటాలో ఉంటాయని, మిగతా 15 % సీట్లు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 1974 (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్) ప్రకారం అన్ రిజర్వ్డ్ కోటాలో ఉంటాయన్నారు. -
స్విమ్స్ కేంద్రంగా మెడికల్ హబ్
తిరుపతిలో బాలాజీ పురుషుల మెడికల్ కళాశాలకు చర్యలు పద్మావతి మెడికల్ కళాశాలలో విస్తృత పరిశోధనలు ఎయిమ్స్ స్థాయిలో స్విమ్స్‌ను తీర్చిదిద్దుతాం వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తిరుపతి కార్పొరేషన్ : తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా స్విమ్స్ కేంద్రంగా మెడికల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తె లిపారు. శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) 6వ స్నాతకోత్సవాన్ని బుధవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి వస్తారని అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షాలతో వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం హాజరుకాలేదు. ఆయన స్థానంలోమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న 288 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 8మందికి బంగారు పతకాలు, ముగ్గురికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. విలువలతో కూడిన విద్యను అందుకోవాలి.. అత్యుత్తమ విలువలు కలిగిన వైద్య విద్యను క్రమశిక్షణతో అభ్యసించాలని, నేర్చుకున్న విద్యను పదిమందికి పంచినప్పుడే అది సార్థకం అవుతుందని మంత్రి కామినేని అన్నారు. నాది అనుకోకుండా మనది అనుకున్నప్పుడే సంస్థ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగితే ఇతరులను నిందించడం కాకుండా, మనలో మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం మంత్రి కామినేనితో పాటు ప్రత్యేక అతిథిగా హాజరైన యూఎస్ఏ కార్నల్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ దత్తాత్రేయుడు నోరిలను స్విమ్స్ డెరైక్టర్ రవికుమార్ శ్రీవారి జ్ఞాపికలతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, వీరాంజనేయులు, ఎస్వీయూ వీసీ దామోదర్, స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు, డీన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
స్విమ్స్ డెరైక్టర్ రాజీనామా?
తిరుపతి కార్పొరేషన్ : తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) డెరైక్టర్, వైస్ చాన్సలర్ పదవులకు డాక్టర్ భూమావెంగమ్మ రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2009 నుంచి స్విమ్స్ డెరైక్టర్‌గా, వైస్‌చాన్సలర్‌గా వెంగమ్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్విమ్స్‌ను వేగంగా అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో వ్యక్తిగత కారణాలు చూపుతూ స్విమ్స్ డెరైక్టర్ పదవులకు నెల ముందుగానే రాజీనామా చేస్తున్నానని, దీనిని ఆమోదించాలంటూ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈనెల 20వ తేదీన రాజీనామా పత్రం అందించినట్టు తెలిసింది. అయితే రాజీనామా వెనుక గత నెలలో జరిగిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల నేపథ్యంలో ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఆమె రాజీనామా చేశారని శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఆమె రాజీనామా విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. డెరైక్టర్ రేసులో ఆ ముగ్గురు స్విమ్స్ డెరైక్టర్ పదవికి వెంగమ్మ రాజీనామా చేశారన్న సమాచారంతో ఆ పదవిని దక్కించుకోవడానికి రాష్ట్ర రాజధాని స్థాయిలో విశ్వప్రయత్నాలు సాగుతున్నాయి. రేసులు ప్రధానంగా ముగ్గురు రాజకీయ పావులు కదుపుతున్నట్టు సమాచారం. అందులో పాండిచ్చేరి మెడికల్ డీమ్డ్ యూనివర్శిటీకి చె ందిన ఎన్ఆర్ఐ రవికుమార్, బర్డ్ డెరైక్టర్ జగదీష్‌రెడ్డి, రుయా మాజీ సూపరింటెండెంట్, ఆశాలత టెస్ట్ ట్యూబ్ బేబి ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. డెరైక్టర్ పదవికోసం గతంలో ప్రయత్నించి విఫలం చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లు ఈసారి ఎలాగైనా పొందాలని పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. -
పోషించలేకనే నా బిడ్డను వదిలివెళ్తున్నా...
తిరుపతి :చిత్తూరు జిల్లాలోని తిరుపతి స్విమ్స్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఓ తల్లి తన మూడునెలల శిశువును వదిలి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున గమనించిన ఆస్పత్రి సిబ్బంది శిశువును స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే శిశువు తల్లిదండ్రులు, ఇతర పూర్తి వివరాలు, ఆస్పత్రి రికార్డులు కూడా అక్కడే వదిలి వెళ్లడంతో ఆమె నెల్లూరు జిల్లా వాసిగా భావిస్తున్నారు. తాను నయం కాని వ్యాధితో బాధపడుతున్నానని, పోషించే స్థోమత లేక తన కూతురుని వదిలివెళ్తున్నట్లుగా ఆమె రాసిన ఉత్తరంలో పేర్కొంది. -
ఉద్యోగాల పేరుతో.. ఘరానా మోసం!
-
మెరుగవుతున్న డాలర్ శేషాద్రి ఆరోగ్యం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మంగళవారం చైన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు. శేషాద్రికి డయాబెటీస్ ఉండటంతో శస్త్రచికిత్సలు చేయకుండా మాత్రలతో ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్టు వైద్యులు చెప్పారు. మరో మూడు నెలల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. శేషాద్రికి గుండెపోటు రావడంతో చికిత్స చేయిస్తున్న విషయం విదితమే. -
డాలర్ శేషాద్రికి అస్వస్థత
సాక్షి, తిరుమల/తిరుపతి: తిరుమల ఆలయ ఓఎస్డీ పి.శేషాద్రి(డాలర్ శేషాద్రి)కి బుధవారం గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవలో ఏకధాటిగా ఆరుగంటలపాటు విశిష్ట సేవలందించారు. అదే సందర్భంగా వాహనాన్ని అటూ ఇటూ తిప్పే సమయంలో కొంత అస్వస్థతకు లోనైనట్టు ఆయన శిష్యులు తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం హనుమద్వాహన సేవలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నివాస భవనం గోవింద నిలయంలో హఠాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. ఓ కారులో డాలర్ శేషాద్రిని అశ్వినీ ఆస్పత్రిలోని అపోలో హృద్రోగ చికిత్సా కేంద్రానికి తరలించారు. తర్వాత ఛాతీనొప్పి ఎక్కువ కావడంతో ఆయన్ను తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, పీఆర్వో రవి స్వయంగా తిరుపతిలోని స్విమ్స్‌కు మధ్యాహ్నం 3.40 గంటలకు వెంటిలేటర్‌పై తీసుకువచ్చారు. స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం శేషాద్రికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్తపోటు, గుండె పనితీరును పరీక్షించారు. మొదట్లో ఆరు గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేమన్న వైద్యులు.. తర్వాత పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఇది మూడోసారి.. శేషాద్రికి గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింద్చి. ప్రస్తుం ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తాయని వైద్యులు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి స్విమ్స్‌కు వచ్చి డాలర్ శేషాద్రి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాలర్ శేషాద్రి(66) 1977 జనవరి 26న టీటీడీలో ఉత్తర పారుపత్తేదార్(లెక్కలు రాసే గుమాస్తా)గా విధుల్లో చేరారు. తర్వాత సీనియర్ అసిస్టెంట్, పదోన్నతిపై పారుపత్తేదారుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2006లో ఉద్యోగ విరమణ తర్వాత ఆలయ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా 2014 జూలై 4వ తేదీ వరకు కొనసాగే అవకాశం దక్కింది. తర్వాత ప్రస్తుత ఈవో గిరిధర్ గోపాల్ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే వరకు ఓఎస్డీగా కొనసాగేందుకు పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చారు.