
పోషించలేకనే నా బిడ్డను వదిలివెళ్తున్నా...
తిరుపతి :చిత్తూరు జిల్లాలోని తిరుపతి స్విమ్స్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఓ తల్లి తన మూడునెలల శిశువును వదిలి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున గమనించిన ఆస్పత్రి సిబ్బంది శిశువును స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే శిశువు తల్లిదండ్రులు, ఇతర పూర్తి వివరాలు, ఆస్పత్రి రికార్డులు కూడా అక్కడే వదిలి వెళ్లడంతో ఆమె నెల్లూరు జిల్లా వాసిగా భావిస్తున్నారు.
తాను నయం కాని వ్యాధితో బాధపడుతున్నానని, పోషించే స్థోమత లేక తన కూతురుని వదిలివెళ్తున్నట్లుగా ఆమె రాసిన ఉత్తరంలో పేర్కొంది.