నీళ్లతో ఆడుకోవడం చాలా మందికి సరదా. అందుకే చాలామంది ఈత అంటే ఇష్టపడతారు. అయితే.. ఎంతసేపు ఈత కొట్టగలుగుతారు? ఎంత దూరం ఈద గలుగుతారు? ఓ కిలోమీటర్‌కూడా కష్టమే కదా! కానీ ఏకంగా 36 కిలోమీటర్లు ఏకబిగిన ఈదిందో మహిళ.
అరేబియా సముద్రంలో వర్లీ సీలింక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు 36 కి.మీ ఈత కొట్టి రికార్డు సృష్టించారు ముంబైకి చెందిన సుచేతా బర్మన్. ఈత వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ్రల్టా–మారథాన్ స్విమ్మర్ అయిన సుచేతా దేవ్ బర్మన్.. పోస్ట్ ఇన్‌స్ట్రాగామ్‌లో దాదాపు 4 మిలియన్ల మంది చూశారు.
ఆమె సాధించిన విజయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు అరేబియా సముద్రంలో ఈతేంటి? అత్యంత కలుషితమైన ఆ నీటిలో ఈత కొట్టడం ప్రమాదాలే ఎక్కువని కామెంట్స్ చేశారు. ఇలాంటి ఇన్‌ఫ్లూయర్స్‌మనకు కావాలి, వీళ్లే చాలామందిని ప్రభావితం చేస్తారని మరికొందరు స్ఫూర్తిదాయకంగా రాశారు. ముంబై ట్రాఫిక్‌ని చూస్తే, ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే బెటరేమో అనిపిస్తుందని మరో వినియోగదారు రాశారు.
36 కి.మీ ఈత కొట్టడానికి ఎంత సమయం, పట్టుదల కావాలో నాకు తెలుసంటూ ఓ స్విమ్మర్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కొన్ని గంటలపాటు పదుల కిలోమీటర్లు సముద్రంలో ఈదడమంటే మామూలు విషయం కాదుకదా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment