సాక్షి,ముంబై: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ)కి చెందిన హెలికాప్టర్ ముంబైలోని అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 9 మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న (ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు) హెలికాప్టర్‌లో లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఓఎన్‌జీసీ ట్వీట్ చేసింది. అయితే సాగర్ కిరణ్ రెస్క్యూ బోటు ద్వారా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.
#Helicopter carrying 7 passengers & 2 pilots makes emergency landing in #Arabian Sea near #ONGC rig Sagar Kiran in #Mumbai High. Four rescued. Rescue operations in full swing. @HardeepSPuri @Rameswar_Teli @PetroleumMin
— Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) June 28, 2022
ముంబైలో సాగర్ కిరణ్ వద్ద రిగ్ సమీపంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్‌లతో కూడిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని కంపెనీ ఒక ట్వీట్‌లో తెలిపింది. ఇప్పటి వరకు నలుగర్ని రక్షించామని ట్వీట్ చేసింది. ఆ తరువాత రెస్క్యూ బోట్ మరో ఇద్దరిని రక్షించారు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మరోవైపు ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఇంటర్నేషనల్ సేఫ్టీ నెట్‌ను యాక్టివేట్ చేశామని, ఇండియన్ నేవీ, ఓఎన్‌జీసీ సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. మరో నౌక ముంబై నుంచి సహాయక చర్యల్లో నిమగ్నమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment