gateway of india
-
ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?
ముంబయి: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో తనను ఎంతగానే బాధించినట్లు ఆనంద్ మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొందరు వ్యక్తులు వ్యర్థాలను పడేశారు. కార్లలో వచ్చి బస్తాల్లో తీసుకొచ్చిన వ్యర్థాలను సముద్ర నీటిలో వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పర్యావరణాన్ని కలుషితం చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. నగర మున్సిపాలిటీ అధికారులు నిందితులకు రూ.10,000 జరిమానా కూడా విధించారు. The Good Citizens of Mumbai Early Morning at Gateway of India pic.twitter.com/FtlB296X28 — Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) November 21, 2023 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలోని దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల అభిప్రాయం మారకపోతే.. జీవన నాణ్యతా ప్రమాణాలు పెరగబోవని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే.. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కష్టమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. వైరల్ వీడియో
నీళ్లతో ఆడుకోవడం చాలా మందికి సరదా. అందుకే చాలామంది ఈత అంటే ఇష్టపడతారు. అయితే.. ఎంతసేపు ఈత కొట్టగలుగుతారు? ఎంత దూరం ఈద గలుగుతారు? ఓ కిలోమీటర్కూడా కష్టమే కదా! కానీ ఏకంగా 36 కిలోమీటర్లు ఏకబిగిన ఈదిందో మహిళ. అరేబియా సముద్రంలో వర్లీ సీలింక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు 36 కి.మీ ఈత కొట్టి రికార్డు సృష్టించారు ముంబైకి చెందిన సుచేతా బర్మన్. ఈత వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆ్రల్టా–మారథాన్ స్విమ్మర్ అయిన సుచేతా దేవ్ బర్మన్.. పోస్ట్ ఇన్‌స్ట్రాగామ్‌లో దాదాపు 4 మిలియన్ల మంది చూశారు. ఆమె సాధించిన విజయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు అరేబియా సముద్రంలో ఈతేంటి? అత్యంత కలుషితమైన ఆ నీటిలో ఈత కొట్టడం ప్రమాదాలే ఎక్కువని కామెంట్స్ చేశారు. ఇలాంటి ఇన్ఫ్లూయర్స్మనకు కావాలి, వీళ్లే చాలామందిని ప్రభావితం చేస్తారని మరికొందరు స్ఫూర్తిదాయకంగా రాశారు. ముంబై ట్రాఫిక్ని చూస్తే, ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే బెటరేమో అనిపిస్తుందని మరో వినియోగదారు రాశారు. 36 కి.మీ ఈత కొట్టడానికి ఎంత సమయం, పట్టుదల కావాలో నాకు తెలుసంటూ ఓ స్విమ్మర్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కొన్ని గంటలపాటు పదుల కిలోమీటర్లు సముద్రంలో ఈదడమంటే మామూలు విషయం కాదుకదా అంటున్నారు. View this post on Instagram A post shared by Sucheta Deb Burman (@suchetadebburman) -
చీరకట్టులో బైక్‌పై వరల్డ్ టూర్
రమాబాయి లత్‌పతే 9 గజాల మహారాష్ట్ర నౌవారీ చీరలో40 దేశాలు బైక్ మీద చుట్టి రావడానికిమార్చి 8న గేట్ వే ఆఫ్ ఇండియా నుంచిబయలుదేరింది.365 రోజుల పాటు ప్రయాణం సాగించివచ్చే ఏడాది మార్చి 8కి ముంబై చేరనుంది.‘భారత్ కీ బేటీ’ ఏదైనా చేయగలదని నరేంద్ర మోడీ అన్న మాటలే తననీ సాహసయాత్రకు పురిగొల్పాయని చెబుతోంది. బైక్ యాత్రలు చేసిన మహిళలు చాలా మందే ఉన్నారు. కాని చీర మీద బైక్ నడుపుతూ ప్రపంచ దేశాలు చుట్టి రావాలనే కోరిక మాత్రం రమాబాయి లత్‌పతేకే వచ్చింది. పుణెకు చెందిన రమాబాయి అంట్రప్రెన్యూర్. కాని బైక్ మీద విహారాలు ఆమెకు ఇష్టం. ఆ విహారాల కోసమే ప్రత్యేకమైన బైక్ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ‘జి20’ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి ‘భారతీయ స్త్రీలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు’ అని చేసిన వ్యాఖ్య రమాబాయి లత్‌పతేను ఇన్‌స్పయిర్ చేసింది. ‘నా డిక్షనరీలో భయం అనే మాటకు విలువ లేదు. బాల్యం నుంచి నేను చాలా ధైర్యంగా నా జీవితంలో ముందుకు సాగాను. ఆ ధైర్యంతోనే ప్రపంచ యాత్ర చేయాలనిపించింది. అయితే ఆ యాత్రలో ఏ దేశంలో అడుగు పెట్టినా నేను ‘భారత్ కీ బేటీ’ అనిపించుకోవాలంటే మన సాంస్కృతిక చిహ్నమైన చీరలో ఉండటం అవసరం అని భావించాను. మహారాష్ట్ర స్త్రీలు ధరించే 9 గజాల నౌవారి చీర చాలా ప్రసిద్ధం. ఆ చీరలతోనే నా యాత్ర మొత్తం చేస్తాను’ అంది రమాబాయి లత్‌పతే. మొదలైన యాత్ర సాధారణ జనం, మీడియా ఉత్సుకతతో చూస్తుండగా ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మార్చి 8న రమాబాయి లత్‌పతే యాత్ర మొదలైంది. ఈ యాత్ర గురించి, అందునా మహరాష్ట్ర సంస్కృతి ప్రాముఖ్యం ఉండటం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆమె యాత్రను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ‘నా మొత్తం యాత్రకు కోటి రూపాయలు అవుతుంది. ఇందుకోసం నాకున్న నగలు, నా ఎస్.యు.వి అమ్మేశాను. కొంత లోటు ఏర్పడింది. నా యాత్రను ప్రోత్సహించేందుకు మనిషికి 1 రూపాయి చొప్పున చందా ఇవ్వాలని అప్పీలు చేశాను. అలా కొంత సాయం వచ్చింది. మంచి పని మొదలెడితే సాయం అదే అందుతుంది’ అంది రమాబాయి లత్‌పతే. కఠినమైన యాత్ర రమాబాయి లత్‌పతే మొత్తం 80 వేల కిలోమీటర్లు ఈ యాత్రలో తన బైక్ మీద తిరగనుంది. నలభై దేశాల వాతావరణాన్ని తట్టుకోవాలి. అతి శీతల, అత్యల్ప ఉష్ణోగ్రతలు భరించాలి. భద్రత ఒక సమస్య. అలాగే ఆహారం కూడా. ‘అయినా నేను వెనుకాడను’ అని బయలుదేరింది రమాబాయి. ముంబై నుంచి ఆమె ఢిల్లీకి చేరుకున్నాక అక్కడి నుంచి విమానం ద్వారా ఆమె బైక్‌తో పాటుగా ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఆస్ట్రేలియాలో పెర్త్ నుంచి సిడ్నీ వరకు 1600 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణిస్తుంది. కాని ఆ దారిలో జనావాసాలు పెద్దగా ఉండవు. వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది. దారి మధ్యలో ఆమె టెంట్ వేసుకుని విడిది చేయక తప్పదు. ఆ ఛాలెంజ్‌ను రమాబాయి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఆక్లాండ్ (న్యూజిలాండ్)కు, అక్కడి నుంచి శాంటియాగో (చిలీ), ఆ తర్వాత బొగోటా (కొలంబియా), ఆ తర్వాత అమెరికా అక్కడి నుంచి కెనడాలకు బైక్ మీదే ఆమె ప్రయాణం సాగుతుంది. ఆపై సముద్ర మార్గంలో బైక్‌ను లండన్‌కు చేరవేసి అక్కడి నుంచి తిరిగి బైక్ మీద పోలాండ్, రోమ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, టునీషియా, జోర్డాన్... ఇలా ప్రయాణించి మళ్లీ సముద్రం మీదుగా సౌదీ చేరుకుని ఆ ఎడారి దేశాలన్నీ చుట్టి గుజరాత్లో ప్రవేశించి వచ్చే ఏడాది మార్చి 8కి గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకుంటుంది. ఈ మొత్తం యాత్రలో మిగిలిన దేశాలతోపాటు జి 20 నుంచి 12 దేశాలు ఉంటాయి. ప్రయాణాలు చేయండి ‘స్త్రీలు నాలుగు గోడల మధ్య ఉండటం వల్ల ప్రపంచం ఏమీ తెలియదు. ప్రయాణాలకు భయపడాల్సింది లేదు. వీలైనన్ని ప్రయాణాలు చేసి లోకం ఎంత విశాలమో తెలుసుకోండి’ అంటోంది రమాబాయి. -
‘కింద ఉన్న ప్లకార్డు పట్టుకున్న.. వేరే ఉద్దేశం లేదు’
ముంబై : ‘కశ్మీర్‌కు విముక్తి కల్పించండి’అని ప్లకార్డు ప్రదర్శించిన ఓ యువతిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. జేఎన్‌యూలో విద్యార్థులపై దాడికి నిరసనగా గేట్‌వే ముట్టడికి యత్నించి.. నిరసన తెలిపిన మహక్ మీర్జా ప్రభు.. ‘ఫ్రీ కశ్మీర్’అనే ప్లకార్డును ప్రదరించింది. దీంతో జాతీ సమైఖ్యతను దెబ్బతీసేలా వ్యవహరించారని పేర్కొంటూ ఐపీసీ సెక్షన్ 153B కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కశ్మీరీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని పునరుద్ధరించాలని కోరేందుకు ‘ఫ్రీ కశ్మీర్’ ప్లకార్డును ప్రదర్శించానని మహక్ మీర్జా తెలిపారు. కశ్మీరీల సమస్యను ప్రపంచం దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే అలా చేశానని పేర్కొన్నారు. అంతేగానీ, జాతి వ్యతిరేక నినాదాలు చేయడానికి కాదని ఆమె చెప్పుకొచ్చారు. (చదవండి : ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే..) ఆంక్షలు లేని కశ్మీర్ కావాలని అడగడం తన తప్పా అని ఆమె వాపోయారు. ఉద్దేశపూర్వకంగా తనపై కేసు నమోదు చేసి వేధిస్తే.. తదుపరి పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.మహక్ మీర్జా మాట్లాడుతూ.. ‘గేట్‌వే నిరసనలో పాల్గొనేందుకు సాయంత్రం 7.30 గంటలకు అక్కడకు చేరుకున్నా. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించొద్దని అందరి దృష్టికి తెచ్చేందుకు అక్కడ పడి ఉన్న ఫ్రీకశ్మీర్ ప్లకార్డును చేతిలోకి తీసుకున్నా’అని ఆమె చెప్పుకొచ్చారు. మహక్ రచయిత కావడం గమనార్హం. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిరసనలు జరిగేది ఒక అంశంపై అయితే కశ్మీర్‌కు విముక్తి కావాలనే నినాదాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ముంబైలో వేర్పాటువాదులకు స్థానమెవరిచ్చారని అన్నారు. సీఎం ఉద్ధవ్ నేతృత్వంలోనే దేశ వ్యతిరేక నినాదాలు పుట్టుకొచ్చాయా అని సందేహం వ్యక్తం చేశారు. -
సముద్రంలో రూ.వెయ్యి నోట్లు
♦ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొట్టుకొచ్చిన నోట్లు ♦ నోట్ల కోసం బారులు తీరిన జనం ♦ దర్యాప్తు చేస్తున్న నగర పోలీసులు సాక్షి, ముంబై : డబ్బులు చెట్లకు కాయవని, ఆకాశం నుంచి ఊడి పడవని అందరికీ తెలుసు. కానీ డబ్బుల వర్షం కురిస్తే, కళ్ల ముందే అలా అలా తేలుతూ పోతే.. అవీ వెయ్యి రూపాయల నోట్లు. ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద మంగళవారం సాయంత్రం అచ్చం ఇలాగే జరిగింది.ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ సముద్రంలో రూ. వెయ్యి నోట్లు తేలుతూ వస్తున్నాయి. క్షణాల్లో ఈ విషయం దావానలంలా వ్యాపించింది. దీంతో మత్స్యకారులు, ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నోట్ల ‘వేట’లో పడ్డారు. తలా కొన్ని నోట్లను దక్కించుకున్నారు. జనప్రవాహం, నీటి ఉధృతి పెరగడంతో అక్కడికి వచ్చిన వారంతా చేసేదేమీ లేక ఉసూరుమంటూ చూస్తూ ఉండిపోయారు. మరికొంత మంది ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ప్రాణాలకు తెగించి డబ్బుల కోసం ప్రయత్నిస్తున్న వారిని వారించి, జనాన్ని చెదరగొట్టారు. ‘ముందు ఒక నోటు కనపడింది. పెద్దగా పట్టించుకోలేదు. కానీ వరుసగా చాలా నోట్లు కనిపించాయి. అంతే సముద్రంలోకి దూకేశా. ఈ డబ్బు చూస్తూంటే భలేగా ఉంది’ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు హరి సూరియా అనే స్థానికుడు. అయితే ఈ వెయ్యి రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం అంతుబట్టడంలేదు. దొంగల బారి నుంచి కాపాడుకోవడానికి ఓ ధనవంతుడు రూ.లక్షలున్న డబ్బుల సంచిని సముద్రంలోకి విసిరేశాడనే కథనం ప్రచారంలో ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు ఎదురుగా ఉన్న ప్రఖ్యాత తాజ్ హోటల్లో బస చేసిన వ్యక్తే ఈ కరెన్సీని విసిరేసి ఉండవచ్చన్న ఉదంతి కూడా ఉంది. పోలీసులు సీసీ టీవీ కెమరాల వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఇంకా ఏ విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. కొద్ది రోజులాగితే మొత్తం వ్యవహారం బయటపడొచ్చు. -
జలమార్గానికి పచ్చజెండా
సాక్షి, ముంబై: నవీముంబై, ఠాణే, గేట్ వే ఆఫ్ ఇండియా జల రవాణా మార్గానికి కేంద్ర జల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆమోద ముద్రవేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు త్వరలో లాంచీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై-లోణావాలాలోని పవన్ జలాశయం వరకు సీ ప్లేన్ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు నవీముంబై, ఠాణే-గేట్ వే ఆఫ్ ఇండియా 50 కి.మీ. దూరం గల జల రవాణా మార్గం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి పోర్టు ట్రస్టు కీలక పాత్ర పోషించనుంది. జల మార్గం వినియోగంలోకి వస్తే నవీముంబై-ముంబై, ఠాణే-ముంబై రహదారులపై ఏర్పడుతున్న ట్రాఫిక్ జాం సమస్య కొంతమేర పరిష్కారం కానుంది. నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులకు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారికి వ్యయప్రయాసల నుంచి ఉపశమనం లభించనుంది. కొలాబా నుంచి ఏడు కార్పొరేషన్ల హద్దుల్లో ఉన్న సముద్ర ఖాడీ మీదుగా ఈ మార్గం వెళుతుంది. వసయి, భివండీ, ఉల్లాస్‌నగర్, కల్యాణ్, డోంబివలి, భయందర్, ఠాణే, నవీముంబై ప్రాంత ప్రజలకు ఈ లాంచీ సేవలు ఉపయోగపడనున్నాయి. -
తీరప్రాంతాల్లో ‘అల’జడి!
సాక్షి, ముంబై: కడలి ఉగ్రరూపం దాల్చడంతో ముంబైలోని తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడం, రోజురోజుకు అలల తాకిడి మరింతగా పెరుగుతుండడంతో సముద్ర తీరప్రాంతాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్, వర్లీ, శివాజీ పార్కు, మాహిం తదితర ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొస్తోంది. నీటితోపాటు కొట్టుకొస్తున్న చెత్తాచెదారంతో ఈ ప్రాంతాలన్ని డంప్‌యార్డును తలపిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండుమూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉండడంతో ఇక్కడి మురికివాడలను ఖాళీ చేయాల్సిందిగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరే షన్(బీఎసీ) ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం కూడా నాలుగున్నర మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఎత్తు అలలు ఎగిసిపడడంతో సముద్రపు నీరంతా రోడ్లపైకి వచ్చింది. దీంతో మెరైన్ డ్రైవ్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చౌపాటీ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన పానీపూరి, బేల్‌పూరి, శేవ్పూరి తదితర తినుబండరాలు విక్రయించే స్టాళ్లన్ని అలలకు చెల్లాచెదురయ్యాయి. ఒకపక్క ఎగిసిపడుతున్న భారీ అలలు, మరోపక్క వేగంగా వీస్తున్న గాలులవల్ల నీరంతా దుకాణాల్లోకి వచ్చేస్తోంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు కూత వేటు దూరంలో ఉన్న తాజ్‌మహల్ హోటల్ ప్రవేశ ద్వారం వరకు సముద్ర పు నీరు చేరడంతో ఆ ప్రాంతమంత చెత్తకుప్పగా మారింది. భారీగా వస్తున్న అలల కారణంగా గేట్ వే ఆఫ్ ఇండియాను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులను అనుమతించడం లేదు. శివాజీపార్క్ పరిసరాల్లో ఉన్న స్కౌట్ అండ్ గైడ్ ప్రధాన కార్యాలయం వరకు నీరు వచ్చి చేరింది. కీర్తి కాలేజీ రహదారిపైకి, కాలనీల్లోకి కూడా నీరు రావడంతో పార్కింగ్ చేసిన వాహనాలన్నీ పాడైపోయాయి. మాహిం ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ముందుజాగ్రత్త చర్యగా హై టైడ్ సమయంలో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణశాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణానంద హోసాలికర్ చెప్పారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద 15 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దాదర్, జుహూ, వర్సోవా, అక్సా బీచ్, గోరాయి తదితర తీర ప్రాంతాలవద్ద అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, జాతీయ విపత్తుల నిర్వహణ సిబ్బంది, బీఎంసీ భద్రతాశాఖ సిబ్బంది. ఇలా వందలాది మందిని నియమించారు. వీరంతా కోస్టుగార్డు సిబ్బందితో తరుచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ‘అల’జడి కొనసాగే సమయం తేది సమయం అలల ఎత్తు (మీ.లో) 14 జూన్ మ.12.32 4.60 15 జూన్ మ.2.03 4.85 16 జూన్ మ.2.50 4.85 17 జూన్ మ.3.56 4.74 18 జూన్ సా. 4.23 4.55 -
ఈస్టర్న్ ఫ్రీ వే రెండో టన్నెల్ ప్రారంభం
సాక్షి, ముంబై: ముంబై-ఘాట్కోపర్ ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ రెండో భూసొరంగ మార్గం శనివారం ప్రారంభమైంది. వాహనాలు సాఫీగా, ఎలాంటి అవరోధాలు, సిగ్నల్లు లేకుండా గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఘాట్కోపర్ వరకు వాహనాలు చేరుకుంటున్నాయి. ఈ ఫ్రీవే వల్ల ఠాణే, నవీముంబై నుంచి దక్షిణ ముంబైకి చాలా తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలు కలిగింది. ప్రధానంగా ఆరెంజ్ గేట్, పాంజర్పోల్ మీదుగా ఘాట్కోపర్కు కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో వాహనాలు చేరుకుంటున్నాయి. ఈ మార్గం నుంచి ప్రతిరోజు సుమారు 25 వేలకుపైగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. అదే ఈస్టర్స్ ఎక్స్‌ప్రెస్ హైవే, బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గాల మీదుగా వెళితే ట్రాఫిక్ కారణంగా సుమారు గంటకుపైగా సమయం పట్టేది. ముంబై-ఘాట్కోపర్ ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ రెండో భూసొరంగ మార్గం వల్ల ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గాలలో కొంత మేర ట్రాఫిక్ తగ్గనుంది. కాగా, దక్షిణ ముంబైని శివారు ప్రాంతాలతో నేరుగా కలిపేందుకు ఇప్పటికే నిర్మించిన ‘ఈస్టర్న్ ఫ్రీ వే’ తొలి భూగర్భ సొరంగ మార్గం 2013 జూన్‌లో ప్రారంభమైంది. ఠాణే, నవీముంబై ప్రాంతాల నుంచి దక్షిణ ముంబైకి, దక్షిణ ముంబై నుంచి ఠాణే, నవీ ముంబైకి వెళ్లాలన్న ట్రాఫిక్ వల్ల చాలా సమయం తీసుకునేది. ఈ ఫ్రీవే వల్ల తక్కువ సమయంలో దక్షిణ ముంబై - ఠాణే, నవీ ముంబై ప్రాంతాలకు చేరుకునేందుకు వీలు కలిగింది. ట్రాఫిక్ సమస్య నుంచి కూడా కొంత ఊరట లభించింది. పి.డిమెల్లో రోడ్పైనున్న ఆరే ంజ్ గేట్ నుంచి ఘాట్కోపర్ వరకు మొత్తం 16.4 కి.మీ. పొడవుగల ఈస్టర్న్ ఫ్రీ వే మార్గాన్ని ఎమ్మెమ్మార్డీయే మూడు విడతల్లో నిర్మించింది. ముందుగా ఆరేంజ్ గేట్ నుంచి అణిక్, అణిక్ నుంచి పాంజర్పోల్ వరకు 13.59 కిలోమీటర్ల మార్గంలో 9.29 కిలొమీటర్ల ఫ్లై ఓవర్ వంతెన ఉంది. ఇక పాంజర్పోల్ నుంచి ఘాట్కోపర్ వరకు 2.5 కి.మీ. ఫ్రీ వే పనులు కూడా పూర్తి అయ్యాయి. ఓ టన్నెల్ కారణంగా ఆలస్యమైంది. 550 మీటర్ల పొడవైన ఈ రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో శనివారం ఈ ఫ్రీవేను ప్రారంభించారు. -
ఘనంగా ప్రారంభమైన సప్తరంగ్
ముంబై: రాష్ట్ర ప్రభుత్వం గేట్ వే ఆఫ్ ఇండి యా వద్ద నిర్వహిస్తున్న సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనం ‘సప్తరంగ్ 2014’ ఉత్సవం శుక్రవారం రాత్రి ముంబైలో ఘనం గా ప్రారంభమయింది. ఔత్సాహిక కళాకారుల పురోగతికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ‘ఔత్సాహికులు తమ ప్రతిభ ను ప్రదర్శించడానికి ఇది చక్కని వేదిక. మహా రాష్ట్ర ఘనసంస్కృతిని ప్రదర్శించడానికి కూడా ఉపకరిస్తుంది’ అని అన్నారు. సప్తరంగ్ను ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆద్యం తరం అలరించింది. జనవరి ఐదువరకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద, ఆరు, ఏడో తేదీల్లో నవీముంబై విష్ణుదాస్ భవే ఆడిటోరియంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముగింపు ఉత్సవాన్ని ఠాణేలోని కాశీనాథ్ ఘనేకర్ నాట్యగృహలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ సంగీతకారులు, శాస్త్రీయ నృత్యకారులు ప్రదర్శనలు ఇస్తారు.