Boy Friend Giri Attack On His Lover Parents In Tirupati - Sakshi
Sakshi News home page

తిరుపతిలో దారుణం.. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని..

Published Mon, Jul 17 2023 10:32 AM | Last Updated on Mon, Jul 17 2023 11:33 AM

Boy Friend Giri Attack On Lover Parents In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని ప్రియురాలి తల్లిదండ్రులపై ప్రియుడు దాడి చేశాడు. 

వివరాల ప్రకారం.. డక్కిలి మండల కేంద్రంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తమ ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియురాలి పేరెంట్స్‌పై ప్రియుడు గిరి దాడి చేశాడు. ఈ క్రమంలో అతడి దాడిలో ప్రియురాలి తండ్రి తులసి జగదీష్‌(45) తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వెంటనే జగదీష్‌ను స్థానిక స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. జగదీష్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, నిందితుడు గిరిని శ్రీకాళహస్తి మండలానికి చెందిన వాగివేడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చదవండి: కాకినాడ తునిలో దారుణం: మహిళా చిరు వ్యాపారిని డబ్బు కోసం బెదిరించి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement