తిరుపతి (అలిపిరి) : స్విమ్స్‌లో నిర్వహిస్తున్న జనరిక్ మందుల దుకాణం పై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝళిపించింది. మెప్మా అనుమతి లేకుండా అభ్యుదయ నగర మహిళా సమాఖ్య పేరుతో మందుల దుకాణం నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. అనేక పరిణామాల మధ్య ఎట్టకేలకు జనరిక్ దుకాణాన్ని రద్దు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ అ«ధికారులు గురువారం ప్రకటించారు. మందుల స్టాక్ ఉంచకూడదని నిర్వాహకులనుఆదేశించారు. లైసెన్స్ రద్దు చేసి మూడు రోజులు గడుస్తున్నా మందుల స్టాక్ అలాగే ఉంచారు. టీడీపీ చోటా నాయకుల ఒత్తిళ్ల వల్ల స్విమ్స్ యాజమాన్యం ఈ దుకాణం మూసివేతకు వెనకడుగు వేస్తోందనే విమర్శలున్నాయి.
స్విమ్స్‌లో జనరిక్ దుకాణం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. గతంలో రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహించే సమయంలో అవినీతి ఆరోపణలొచ్చాయి. దీంతో దుకాణాన్ని రద్దు చేశారు. మెప్మా అనుమతి లేకుండా టీడీపీ చోటా నాయకుల సహకారంతో అభ్యుదయ నగర మహిళా సమాఖ్య పేరుతో కనీసం సభ్యు ల అనుమతి లేకుండా జనరిక్ దుకాణాన్ని 8 నెలల క్రితం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని రెండు నెలల క్రితం ఔషధ నియంత్రణ శాఖ లైసెన్స్ రద్దు చేసింది. చట్టంలోని లొసుగుల ఆధారంగా నిర్వాహకులు ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి తెచ్చుకుని నెల రోజులుగా జనరిక్ షాపు నిర్వహిస్తున్నారు.
వివాదం మధ్య లైసెన్స్ మంజూరు
జనరిక్ దుకాణం నిర్వహణకు కోర్టు ఉత్తర్వులు ఆధారంగా డ్రగ్ అధికారులు అ«భ్యుదయ నగర మహిళా సమాఖ్యకు తిరిగి ఆగమేఘాలపై లైసెన్స్ మంజూరు చేశారు. లైసెన్స్ మంజూరుకు మెప్మా పీడీ నుంచి అనుమతి తప్పనిసరి.∙ఔషధ నియంత్రణ అధికారులు జూన్ 6న లైసెన్స్ మంజూరు చేసి 12న ఇచ్చి నట్లు మెప్మాకు లేఖ రాశారు. డ్రగ్ అధికారుల తీరుపై మెప్మా అధికారులు మండిపడ్డారు. తమకు తెలియకుండా అభ్యుదయ నగర మ హిళా సమాఖ్య పేరుతో జనరిక్ నడుపుతున్నారని సమాఖ్య వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకోవాలని డ్రగ్ అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు విచారించి లైసెన్స్ రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment