License
-
మాదాపూర్: శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల (Sri Chaitanya Educational Institutions) సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్(Food Safety Department) రద్దు చేసింది. శుక్రవారం ఈ కిచెన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేల మంది విద్యార్థులకు రోజూ అందజేస్తున్నారు.వేల మందికి భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు.కిచెన్, స్టోర్ రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు.. కిచెన్‌ను సీజ్ చేయడంతో పాటు ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్(ఖానామెట్)లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కిచెన్‌లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం -
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
డ్రైవింగ్.. ట్రాక్‌లో పడేలా
డ్రైవింగ్ లైసెన్స్ కావాలి.. మొదట లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు..ఏదో డ్రైవింగ్ స్కూల్లో చేరి కొన్ని రోజులు నేర్చుకున్నారు.. డ్రైవింగ్ టెస్టులో పాసయ్యేంత నైపుణ్యం లేకున్నా..ఎవరో ఏజెంట్నో, దళారీనో పట్టుకుని లైసెన్స్ సంపాదించేశారు. ఇదంతా బాగానే ఉంది..మరి వచ్చిరాని డ్రైవింగ్‌తో బండి వేసుకుని రోడ్డెక్కితే? ఏదైనా ప్రమాదానికి కారణమైతే? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సిటీలోని నాగోల్‌లో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకుని, ట్రాక్‌పై నిరీ్ణత ప్రమాణాల మేరకు నడిపితేనే.. లైసెన్స్ చేతికి వస్తుంది. లేకుంటే ఫెయిలే మరి.సాక్షి, హైదరాబాద్డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం వచ్చేవారికి రవాణా శాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లను అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. మాన్యువల్‌గా సాగుతున్న ఈ పద్ధతికి స్వస్తి చెప్పి.. మోటారు వాహన చట్టం నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆధునీకరణకు రవాణాశాఖ సిద్ధమైంది. ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నిరీ్ణత ప్రమాణాల మేరకు వాహనం నడిపితేనే డ్రైవింగ్ లైసెన్స్ లభించనుంది. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్టుకు వచ్చేవారు ఎలాంటి దొడ్డిదారి మార్గాలను అన్వేíÙంచకుండా.. బాగా శిక్షణ తీసుకుని డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ స్పష్టం చేస్తున్నారు. వాహనాల వినియోగం పెరుగుతూ.. ఇప్పుడు చాలా మందికి బైక్ లేదా కారు నిత్యావసరంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు అన్ని వర్గాల వారు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. ఏటా వేలాది మంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని, వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంలో డ్రైవర్లుగా చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడేళ్లలో సుమారు 62 లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవడం విశేషం. అయితే చాలా మంది ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా వచ్చేస్తే బాగుంటుందని భావిస్తుంటారు. ఇందుకోసం ఏజెంట్లను, మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. సరిగా నేర్చుకోకుండా, టెస్టుకు హాజరుకాకుండా తప్పుడు పద్ధతుల్లో లైసెన్సు తీసుకుని.. అరకొర అనుభవంతో బండి నడిపితే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.⇒ ఇన్నాళ్లూ కొనసాగిన మొక్కుబడి డ్రైవింగ్ టెస్టులకు చెల్లుచీటీ ⇒ రహదారులపై ఉండే ఇబ్బందులను తలపించేలా ట్రాక్‌లో ఏర్పాట్లు ⇒ లైసెన్స్ కోసం వచ్చేవారు ఎలా నడపగలుగుతున్నారో పరిశీలన ⇒ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ⇒ టెస్ట్ వివరాలన్నీ కంఫ్యూటర్లో నిక్షిప్తం ⇒ ప్రమాణాల మేరకు డ్రైవింగ్ చేయకుంటే ఫెయిలేట్రాక్లో టెస్టు ఇలా..వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు రకరకాల ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. కారు నడిపేవారు ఈ అన్ని ట్రాక్‌లలో తమ నైపుణ్యాన్ని చూపాల్సి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహన దారులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు కూడా ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయి.ట్రాక్ ‘హెచ్’: వాహనం ముందుకు వెళ్లిన తరువాత రివర్స్ చేయాల్సి వస్తే.. ఎలా తీసుకొంటారో తెలుసుకొనేందుకే ఈ ట్రాక్. ట్రాక్ ‘ఎస్’: ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాల్సి వచి్చనప్పుడు ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారో ఈ ట్రాక్‌లో తెలుస్తుంది. ట్రాక్ ‘8’: బాగా మలుపులున్న రోడ్డుపై ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకొనేందుకు ఇది దోహదం చేస్తుంది. ఎత్తుపల్లాల ట్రాక్:⇒ ఎత్తైన ప్రదేశాలు, చిన్న లోయ వంటి ప్రాంతాల్లో ఎలా నడపగలరో పరిశీలించేందుకు ఇవి ఏర్పాటు చేశారు. ⇒చివరగా బండి పార్కింగ్ చేసే పద్ధతిని కూడా పరీక్షిస్తారు. ⇒టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్,ద్విచక్రవాహనమైతే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే ఫెయిల్ చేస్తారు. ⇒ ట్రాక్‌లలో నడిపేటప్పుడు ఎలాంటి తప్పిదాలు చేసినా ఫెయిల్ అయినట్టుగా నిర్ధారిస్తారు. ఇలా ఫెయిలైన వారు మరోనెల పాటుశిక్షణ తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.రోజూ వందలాది మందికి డ్రైవింగ్ టెస్టులు..గ్రేటర్ హైదరాబాద్‌లో నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడలలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ద్వారా రవాణా శాఖ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. రోజూ వందలాది మంది ఈ టెస్టులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను నాగోల్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న 12 ట్రాక్‌లలో రోజూ వందల మందికి డ్రైవింగ్ టెస్టు చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేందుకు వేర్వేరు ట్రాక్‌లు ఉన్నాయి. అలాగే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలను నడిపేవారికి టెస్టుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. అనంతరం దశలవారీగా కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్ తదితర ఆర్టీఏలలోనూ ట్రాక్‌లను విస్తరించారు. నెలరోజులకే ‘టెస్టు’కు వస్తూ.. : అభ్యర్థులు తొలుత లెర్నింగ్ లైసెన్సు తీసుకుని డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెల రోజుల నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్టు పాసై.. హాజరై శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు. డ్రైవింగ్‌లో పట్టుసాధించాకే లైసెన్సు అందేలా ఈ నిబంధన అమలవుతోంది. కానీ చాలా మంది తూతూమంత్రంగా డ్రైవింగ్ నేర్చుకుని.. నెల రోజులకే టెస్టుకు హాజరవుతున్నారు. డ్రైవింగ్ పూర్తిగా రాకపోయినా, అడ్డదారిలో లైసెన్స్ పొందేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇకపై అలాంటి వాళ్లు టెస్టులో చిక్కులు ఎదుర్కోక తప్పదని నాగోల్ ప్రాంతీయ రవాణా అధికారి రవీందర్ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలని.. ఆ టెస్ట్ వివరాలను కంఫ్యూటర్లో నమోదు చేసి, ఉత్తీర్ణులుగా నిర్ధారణ అయితేనే లైసెన్స్ ఇస్తారని వెల్లడించారు.నైపుణ్యం ఉంటే కష్టమేమీ కాదు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరి అవసరంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, వాహనం నడపడంలో కచి్చతమైన నైపుణ్యం కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవారు ఆర్టీఏ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో తేలిగ్గా ఉత్తీర్ణులవుతారు. డ్రైవింగ్ ఎంతో కీలకమైంది. నాణ్యమైన శిక్షణ తీసుకొని, పూర్తి నమ్మకం కలిగాకే.. డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలి. మొక్కుబడిగా నేర్చుకుని లైసెన్సుల కోసం రావడం వల్ల ప్రయోజనం ఉండదు. టెస్ట్‌కు రావడానికి ముందే ఒకసారి ట్రాక్‌పైన అవగాహన పెంచుకోవడం మంచిది. – సి.రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, హైదరాబాద్పూర్తిగా నేర్చుకుని వచ్చాను సాధారణంగా డ్రైవింగ్ స్కూల్లో నెల రోజులు మాత్రమే శిక్షణ ఇస్తారు. నైపుణ్యం పెంచుకునేందుకు అది ఏ మాత్రం చాలదు. కనీసం3 నెలల పాటు డ్రైవింగ్ మెళకువలు నేర్చుకోవాలి. ఎలాంటి రోడ్లపై అయినా సరే బండి నడపగలమనే ధైర్యం, నమ్మకం వచి్చన తర్వాత టెస్ట్‌కు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈజీగా పాస్ కావొచ్చు. – పూరి్ణమ, టెస్ట్‌కు హాజరైన మహిళరోడ్లపై నడిపినట్లుగానే ఉంది ఈ ట్రాక్‌లో రోడ్డు మీద నడిపినట్టుగానే ఉంది. మూల మలుపులు, ఎత్తుపల్లాలు, స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉన్నాయి. బండి నడిపే సమయంలో ఏ రోడ్డుపైన ఎలా నడపాలోస్పష్టమైన అవగాహన ఉంటేనే ఇక్కడ టెస్ట్‌ను ఎదుర్కోగలుగుతాం. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నడిపితే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షలు ఏ మాత్రం ఇబ్బంది కాదు. – శ్రీధర్, టెస్ట్‌కు హాజరైన యువకుడు -
మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ.. కారణం ఇదే!
గత కొన్ని రోజులుగా ఆర్బీఐ, నియమాలను అతిక్రమించే బ్యాంకుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటోంది. భారీ జరిమానాలు విధించడమే కాకుండా.. లైసెన్సులు సైతం రద్దు చేస్తోంది. ఇప్పటికే పలు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా వారణాసిలోని బెనారస్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది.వారణాసిలోని బెనారస్ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాని లైసెన్స్‌ను రద్దు చేసింది. లైసెన్స్ రద్దు చేసిన తరువాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోఆపరేటివ్ కమీషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్‌ను మూసివేయడానికి, లిక్విడేటర్‌ను నియమించడానికి ఉత్తర్వు జారీ చేయాలని ఆర్బీఐ కోరింది.బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో డిపాజిటర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిపాజిటర్లు తమ డిపాజిట్ మొత్తాలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసిజీసి) నుంచి పొందుతారు. లిక్విడేషన్ తర్వాత, ప్రతి డిపాజిటర్ DICGC నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు. -
ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ముందస్తు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లు, సీసాల్లో విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్షిప్ లైసెన్స్ రద్దు చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పెట్రో డీలర్లకు తాజాగా మార్గదర్శకాలను ఎన్నికల సంఘం జారీ చేసింది. పెట్రోల్ బంకులపై నిరంతరం ఫ్లైయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. బంకుల్లో ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రదర్శించడమే కాకుండా గొడవలు చేసే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈసీ సూచించింది. ఈ ఆదేశాల మేరకు ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రావి గోపాలకృష్ణ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డీలర్లకు సూచించారు. -
వేలం వద్దు.. మేమే కేటాయిస్తాం.. మీ తీర్పును సవరించండి
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. వేలం విధానంలో కాకుండా తామే కేటాయింపులు జరుపుతామని కోర్టుకు తెలిపింది. వేలం ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలంటూ ఇచ్చిన గత తీర్పును సవరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అభ్యర్థించారు. ఈ అంశంపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్(ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత) పద్ధతిలో యూపీఏ హయాంలో ఏ.రాజా టెలికం మంత్రిగా ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించి కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. కొన్ని సందర్భాల్లో వేలంలో కాకుండా ప్రభుత్వమే కేటాయింపులు జరపాలని ఆశిస్తోందని, అందుకే పాత తీర్పును సవరించాలని అటార్నీ జనరల్ సోమవారం కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, వివరాలను ఈ–మెయిల్లో పంపాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. అయితే తీర్పును సవరించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. నాటి తీర్పు సమంజసంగానే ఉందని, సవరణ అనవసరమని ఆయన వాదించారు. ఆనాడు యూపీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా 2జీ స్పెక్ట్రమ్‌పై ప్రజా ప్రయోజనా వ్యాజ్యం దాఖలుచేసిన ఎన్జీవో సంస్థ తరఫున ఆనాడు ప్రశాంత్భూషణే వాదించారు. కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మన్మోహన్ ప్రభుత్వంలో నాటి కమ్యూనికేషన్స్, ఐటీ సహాయ మంత్రి కపిల్‌సిబల్ 2011లో వాదించారు. అయితే ఈ కేసులో ఎ.రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 21న ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఈ తీర్పును సవాల్‌చేస్తూ సీబీఐ 2018 మార్చి 20న హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ కేటాయింపుల వల్ల కేంద్ర ఖజానాకు రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లిందని వాదించింది. వేలం విధానంలో జరగని కేటాయింపుల లైసెన్స్‌లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. -
అక్రమాల టై‘టానిక్’
సాక్షి, హైదరాబాద్: ఎలైట్ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్ బిజినెస్) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్ పెట్టి ఇంకెవరూ ఎలైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్’ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలైట్ స్టోర్ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్బీసీఎల్కూ ఆయనే బాస్ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్ నడిపించిందని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారంటే టానిక్ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎలైట్ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్ బాటిళ్లు ఎప్పుడూ డిస్ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి. చైన్ బిజినెస్ స్థాయికి ప్రణాళిక.. ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్ అడిగిందే తడవుగా ఎక్సై జ్ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది. క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది. అచ్చం మాతృ టానిక్ షాపులాగానే ఎలైట్గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్ చైన్షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్ చైన్షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్ సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్), వాకిన్ స్టోర్లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్ ఎలైట్ వాకిన్ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది. -
రైతులకు మరింత ‘సహకారం’
సాక్షి, హైదరాబాద్: ఎరువుల నుంచి విత్తనాలు, పురుగుల మందులు ఇలా అన్నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. రైతులకు అవసరయ్యే సేవలు విస్తరించేందుకు ‘వన్‌స్టాప్ షాప్’ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాస్ (పీఎంకేఎస్కే) పథకంలో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇది ఇక్కడ కూడా అమలులోకి వస్తే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ‘వన్‌స్టాప్ షాప్’ కేంద్రాలుగా మార్చుతారు. ఒకేచోట అన్ని సేవలు... దేశవ్యాప్తంగా లక్ష ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఉన్నాయి. వాటిల్లో 73,098 ప్యాక్స్‌లు ఎరువుల లైసెన్స్ కలిగి ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా లైసెన్స్ పరిధిలోకి తీసుకొస్తారు. తెలంగాణలో 1,423 ప్యాక్స్ ఉన్నాయి. అందులో 1,261 చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16,915 ఎరువుల రిటైల్ దుకాణాలుండగా, 14,870 చురుగ్గా పనిచేస్తున్నాయి. అన్ని ప్యాక్స్‌లను ఎరువుల వ్యాపారంలోకి తీసుకొచ్చి అవన్నీ చురుగ్గా పనిచేసేలా కృషి చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్యాక్స్‌ల ద్వారా రైతులకు యూరియా, డీఏపీ వంటి ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి వాటిల్లో అన్ని రకాల ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా అన్ని రకాల వ్యవసాయ ఉపకరణాలు అందించాలనేదే ఉద్దేశం. నాణ్యమైన సేవలు అందించవచ్చు దేశంలో సహకార వ్యవసాయ పద్ధతులు అనుసరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. ప్రైవేట్‌లో ఎరువులు, పురుగు మందులు, విత్తన వ్యాపారుల ద్వారా అనేకచోట్ల కల్తీ, నకిలీ రాజ్యమేలుతోంది. ఆ దందాకు చెక్ పెట్టాలంటే ‘వన్‌స్టాప్ షాప్’ విధానం మేలని కేంద్రం చెబుతోంది. ప్యాక్స్ ద్వారా యూరియా వెళ్లడం వల్ల బ్లాక్ మార్కెట్ జరగకుండా చూసుకోవచ్చు. అంతేగాకుండా కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు రైతులకు అంటగట్టకుండా నిరోధించవచ్చు. తక్కువ ధరల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు , సేంద్రీయ ఎరువులు కూడా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో ప్యాక్స్ ద్వారానే మార్కెటింగ్ వసతి కల్పించే ఆలోచనలో కూడా ఉన్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్యాక్స్‌ల్లో అనేకం అప్పుల్లో కూరుకుపోయాయని, అవి ప్యాక్స్ రాజకీయాల్లో మునిగిపోవడం వల్ల వాటిల్లో కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయన్న చర్చ జరుగుతోంది. వాటిని అన్ని రకాలుగా బలోపేతం చేస్తే ‘వన్‌స్టాప్ షాప్’ విధానం విజయవంతమవుతుందని అధికారులు అంటున్నారు. -
17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ
2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. గత 9 సంవత్సరాల కాలంలో ఒకే ఏడాది ఇన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకుల లైసెన్సులను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఇందులో లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్ బ్యాంక్, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన 17 బ్యాంకులలో 6 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఉండటం గమనార్హం. ఈ బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, పనితీరు విషయంలో అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసింది. 2022లో 12 సహకార బ్యాంకులు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI, 2023లో 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. 2014 తర్వాత మొత్తం 60 సహకార బ్యాంకులు కనుమరుగైనట్లు సమాచారం. ఇందులో అర్బన్, రూరల్ బ్యాంకులు రెండూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే బ్యాంకుల పనితీరు సరిగ్గా లేకపోతే ఆ బ్యాంకులు కాలంలో కలిసిపోతాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: అనంత్ అంబానీ ఎలాంటి కారులో కనిపించారో చూసారా.. వీడియో ఆర్బీఐ.. బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు గత ఏడాది లెక్కకు మించిన బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నియమాలను అతిక్రమించిన ఏ బ్యాంకుకైనా పనిష్మెంట్ తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. చిన్న బ్యాంకుల్లో పొదుపు చేయకపోవడం ఉత్తమం! ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా పెద్ద బ్యాంకులలో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. చిన్న బ్యాంకుల్లో ఎక్కువ మొత్తం దాచుకుంటే, అలాంటి బ్యాంకుల పనితీరు సరిగ్గా లేనప్పుడు ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే.. ఆ భారం సదరు వినియోగదారుడు కూడా భరించాల్సి ఉంటుంది. -
పేమెంట్ అగ్రిగేటర్‌గా ఎన్‌క్యాష్‌కు అనుమతి
న్యూఢిల్లీ: పేమెంట్ అగ్రిగేటర్‌గా వ్యవహరించేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి లభించినట్లు ఎన్‌క్యాష్ సంస్థ తెలిపింది. బిజినెస్–2–బిజినెస్ వ్యవస్థలో ఒలింపస్ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. నిరంతరాయంగా, వినూత్నమైన, విశ్వసనీయమైన పేమెంట్ సొల్యూషన్స్‌ను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సంస్థ సహ–వ్యవస్థాపకుడు యద్వేంద్ర త్యాగి తెలిపారు. కార్పొరేట్ పేమెంట్స్ సొల్యూషన్స్ సంస్థగా ఎన్‌క్యాష్ 2018లో కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు 2,50,000 పైచిలుకు వ్యాపారాలు తమ కార్పొరేట్ పేమెంట్స్ వ్యవస్థను డిజిటలీకరించుకోవడంలో తోడ్పాటు అందించింది. ఎన్క్యాష్తోపాటు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, ఓపెన్, రేజర్‌పే వంటి ఇతర ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌లను మంజూరు చేసింది. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్
భారతదేశంలోని బ్యాంకులపై గట్టి నిఘా పెట్టిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి జరిమానాలు విధించింది. కాగా ఇప్పుడు మరిన్ని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మకారిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నియమాలు డిసెంబర్ 04 నుంచి అమలులోకి వచ్చినట్లు సమాచారం. సదరు బ్యాంకు వద్ద మూలధనం ఎక్కువగా లేకపోవడమే కాకుండా.. ఆదయ మార్గాలు కూడా లేకపోవడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 56, సెక్షన్ 11(1), సెక్షన్ 22(3) నిబంధనలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. నిబంధనలను అమలు చేయడంలో శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్ విఫలం కావడం వల్ల.. కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఇస్తే కస్టమర్లు ఇబ్బందిపడే అవకాశం ఉందని RBI భావించింది. ఇప్పటికే డిపాజిట్లు చేసుకున్న వారికి తిరిగి చెల్లించే పరిస్థిలో ఈ బ్యాంక్ లేకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు ఇన్ని రకాలా..! ఇవెలా ఉపయోగపడతాయంటే..? ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసిన ఆర్బీఐ లెక్కకు మించిన లైసెన్సులను రద్దు చేసింది. ఇందులో కేవలం ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ బ్యాంకులు ఉండటం గమనించదగ్గ విషయం. -
రెండు కంపెనీలకు ఐఎస్పీ లైసెన్స్
న్యూఢిల్లీ: జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వన్‌వెబ్ తాజాగా టెలికం శాఖ నుంచి ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ (ఐఎస్పీ) లైసెన్స్ అందుకున్నట్టు సమాచారం. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు ఈ రెండు సంస్థలకు ఏడాది క్రితమే అనుమతులు లభించాయి. ఈ కంపెనీలు టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌లతో లేదా వీశాట్ ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించవచ్చని ఒక అధికారి తెలిపారు. -
నేడే మద్యం లాటరీలు
సాక్షి, హైదరాబాద్/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రానున్న రెండేళ్ల కాలానికిగాను లైసెన్సుల మంజూరు కోసం నేడు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్‌షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘డ్రా’తీయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ ద్వారా ఈ లాటరీల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే డ్రా తీసే ప్రదేశంలోకి అనుమతించాలని, లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. కాగా, మంత్రి ఆదివారం మహబూబ్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో కూడా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాటరీ ప్రక్రియ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. -
కిక్కెక్కించిన మద్యం దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు ‘మద్యం దరఖాస్తుల’రూపంలో కాసుల వర్షం కురిసింది. రానున్న రెండేళ్ల కాలానికి గాను రాష్ట్రంలోని వైన్‌షాపులకు లైసెన్సుల మంజూరు కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు అనూహ్య రీతిలో స్పందన కనిపించింది. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగియగా, శనివారం మధ్యాహా్ననికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న లెక్కలను ఎక్సైజ్ శాఖ తేల్చింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,620 వైన్‌షాపుల లైసెన్సుల కోసం ఏకంగా 1,31,954 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సుల కోసం 68,691 దరఖాస్తులు రాగా, ఈసారి గతం కంటే 63,263 దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. గత రెండేళ్లతో పోలిస్తే రానున్న రెండేళ్ల కాలానికి గాను దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2,639 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే లభించింది. ఈ దరఖాస్తుల నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈనెల 21న డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేయనున్నారు. హైదరాబాద్ శివార్లలో భారీగా.. భారీస్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లోని వైన్‌షాపులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని షాపుల కోసం వ్యాపారులు భారీ స్థాయిలో దరఖాస్తులు దాఖలు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. సరూర్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలోని 134 షాపులకు ఏకంగా 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్‌లోని 100 షాపులకు 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఇవే షాపులకు గత రెండేళ్ల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో రావడం గమనార్హం. సరూర్‌నగర్ పరిధిలోని షాపులకు గత రెండేళ్ల కాలానికి 4,102, శంషాబాద్‌లో 4,122 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక మరో ఏడు జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 5 వేలు దాటింది. ఖమ్మం (7,207), కొత్తగూడెం (5,057), సంగారెడ్డి (6,156), నల్లగొండ (7,058), మల్కాజ్గిరి (6,722), మేడ్చల్ (7,017), వరంగల్ అర్బన్ (5,858)లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రమే వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. కాగా, క్రితం సారి 10 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో మొత్తం కలిపి 68 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి చివరి ఒక్కరోజే 56,980 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి చివరి నాలుగు రోజుల్లోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 15న సెలవు దినాన్ని మినహాయిస్తే 14,16,17, 18 తేదీల్లో కలిపి 1.10 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. ఆదిలాబాద్‌లో 979, ఆసిఫాబాద్‌లో 967 దరఖాస్తులు వచ్చాయి. ఇక, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల జాబితాలో నిర్మల్ (1,019), గద్వాల (1,179), వనపర్తి (1,329) ఉన్నాయి. ఈ దరఖాస్తుల సరళిని బట్టి రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపార రంగ సంస్థల యజమానులతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ వ్యాపారులు కూడా దరఖాస్తు చేసి ఉంటారని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
డ్రోన్ పైలట్‌గా డీజీసీఏ లైసెన్స్ పొందిన కేరళ తొలి మహిళ!
కేరళలోని మలప్పురానికి చెందిన రిన్ష పట్టకకు గాలిలో ఎగురుతున్న డ్రోన్లను చూడడం అంటే సరదా. ఆ సరదా కాస్తా ఆసక్తిగా మారింది. డ్రోన్లకు సంబంధించిన ఎన్నో విషయాలను సివిల్ ఇంజనీర్ అయిన తండ్రి అబ్దుల్ రజాక్‌ను అడిగి తెలుసుకునేది. ప్లస్ టు పూర్తయిన తరువాత బీటెక్ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లో విరామ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తుప్పుడు రిన్షకు తట్టిన ఐడియా డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సు. తండ్రితో చెబితే ఆయన ‘బాగుంటుంది’ అని ఓకే చెప్పి ప్రోత్సహించాడు. శిక్షణ కోసం కాసర్గోడ్లోని ఏఎస్ఏపీ కేరళ కమ్యూనిటీ స్కిల్ పార్క్‌లో చేరింది. క్లాసులో తాను ఒక్కతే అమ్మాయి! ఈ స్కిల్పార్క్లో యువతరం కోసం ఆటోమోటివ్ టెక్నాలజీ, కంప్యూటర్ హార్డ్‌వేర్, హాస్పిటాలిటీ, రిటైల్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో వొకేషనల్కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ ఫ్లయింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. కోర్సులో భాగంగా బేసిక్ ఫ్లైట్ ప్రిన్సిపల్స్ నుంచి డ్రోన్ ఫ్లయింగ్ రూల్స్ వరకు ఎన్నో నేర్చుకుంది రిన్ష. ఏరియల్ సర్వైలెన్స్, రెస్క్యూ ఆపరేషన్స్, అగ్రికల్చర్, ట్రాఫిక్, వెదర్ మానిటరింగ్, ఫైర్ ఫైటింగ్‌లతోపాటు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డెలివరీ సర్వీస్... మొదలైన వాటిలో డ్రోన్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. మన దేశంలో డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ తప్పనిసరి. డీజీసీఏ లైసెన్స్ పొందిన కేరళ తొలి మహిళా డ్రోన్ పైలట్‌గా చరిత్ర సృష్టించిన రిన్ష ఇలా అంటోంది... ‘రెస్క్యూ ఆపరేషన్స్ నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు ఎన్నో రంగాలలో డ్రోన్లు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ అందుకున్నందుకు గర్వంగా ఉంది’ ‘రిన్ష విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు స్కిల్పార్క్ ఉన్నతాధికారులు. (చదవండి: బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ! -
నవంబర్ నుంచి కంప్యూటర్లపై ఆంక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీల దిగుమతులపై విధించిన ఆంక్షల అమలును మూడు నెలలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దిగుమతులపై విధించిన ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఎల్రక్టానిక్స్ కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలను భారత్‌కు దిగుమతి చేసుకోవాలంటే నవంబర్ 1 నుంచి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి. కాగా, లైసెన్స్ కలిగిన కంపెనీలు మాత్రమే ఈ పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఉత్తర్వులు వెంటనే అమలులోకి తీసుకువస్తున్నట్టు ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కంప్యూటర్లలో అంతర్గత భద్రత లొసుగులతో కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల డేటాకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్న కారణంతో తప్పనిసరి లైసెన్స్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. -
వైన్ షాపుల లైసెన్సులకు లాటరీ.. ఉత్తర్వులు జారీ.. రూ.2 వేల కోట్ల ఆదాయం!
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండేళ్లకు ఏ4 (వైన్) షాపులకు లైసెన్సులు కేటాయించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లైసెన్సుల జారీకి సంబంధించిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎస్ శాంతికుమారి జారీ చేసిన జీఓ నంబరు 86 ప్రకారం పాత పాలసీలోని నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి, నవంబర్ 30, 2025 వరకు మద్యం విక్రయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు. ఇందుకు లాటరీ పద్ధతినే పాటిస్తారు. దరఖాస్తు ఫీజు కూడా గతంలో లాగానే రూ.2లక్షలుగా ఉంటుంది. ఎక్సైజ్ ఫీజు శ్లాబులూ, ఇతర నిబంధనలన్నీ గత పాలసీ మేరకే ఉంటాయి. గతంలో మాదిరిగానే గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలో ఎన్ని షాపులు కేటాయించాలో బుధవారమే నిర్ణయించారు. ఈ షాపుల సంఖ్య ప్రకారం గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రాలు నిర్వహించి ఏ షాపులు ఏ ఏ వర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు. ఇతర షాపులకు కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులు ఇస్తారు. లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో గతంలో నిర్వహించిన విధంగానే జరుగుతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్ షాపుల కేటాయింపు ద్వారా ఈసారి కూడా రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలు ఇలా... ♦ లైసెన్సులకు గత పాలసీ మాదిరిగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులోనూ ఎలాంటి మార్పు లేదు. రూ.2లక్షలు దరఖాస్తు కోసం చెల్లించాలి. లాటరీ వచి్చనా రాకపోయినా ఆ డబ్బులు ప్రభుత్వానికే జమవుతాయి. ఒకరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. ♦ రెండేళ్ల పాటు మద్యం విక్రయించుకునే ఫీజు గతంలోలాగే ఉంచారు. పాత స్లాబుల ప్రకారమే ఫీజులు నిర్ధారించారు. 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.50 లక్షలు, 5–50వేల జనాభా వరకు రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల జనాభా వరకు రూ.65లక్షలు, 5 నుంచి 20లక్షల జనాభా వరకు రూ.85లక్షలు, 20లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో షాపులకు రూ.1.10 కోట్లు ఎక్సైజ్ ఫీజుగా నిర్ణయించారు. ♦ జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబు, జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు రెండు కిలోమీటర్ల దూరంలోని షాపులకు కూడా వర్తిస్తుంది. ♦ లైసెన్స్ ఫీజు ప్రతి ఏడాది ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. అంటే రెండేళ్లలో 12 సార్లు ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ కింద మొత్తం ఫీజులో 25 శాతానికి ఇస్తే సరిపోతుంది. ♦ గతంలో మాదిరిగానే దరఖాస్తుతోపాటు ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం ఉండదు. ♦ మద్యం విక్రయాల ద్వారా లైసెన్సీలకు కమిషన్ (మార్జిన్) కూడా గతంలో ఉన్న విధంగానే నిర్ణయించారు. వార్షికఫీజు కంటే 10 రెట్ల టర్నోవర్ వరకు 27 శాతం మార్జిన్ ఇస్తారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20 శాతం, బీర్లపై 20 శాతంగా మార్జిన్ నిర్ధారించారు. పదిరెట్ల టర్నోవర్ దాటిన తర్వాత మాత్రం అన్ని బ్రాండ్లకు 10శాతం మార్జిన్ మాత్రమే ఇస్తారు. ♦ పర్మిట్రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5లక్షలు చెల్లించాలి. వాకిన్‌స్టోర్ కావాలంటే మరో రూ.5లక్షలు చెల్లించాలి. ♦ జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాలి. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయింపబడని షాపులకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్లెట్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. -
సహకార సంఘాల్లో ఔషధాల విక్రయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయాధారిత సేవలు అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో ఇకపై ఔషధాలను కూడా విక్రయించాలని కేంద్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. చౌకగా లభించే జనరిక్ మందులను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాలు రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇప్పిస్తున్నాయి. ధాన్యం, ఇతర పంటల కొనుగోలుతోపాటు కొన్ని జిల్లాల్లో పె ట్రోల్ బంక్‌లు, సూపర్మార్కెట్లు, వే బ్రిడ్జిలు కూడా ఈ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలో సొసైటీల్లో జనరిక్ మందులను విక్రయించాలని నిర్ణయించారు. జిల్లాకు నాలుగు సంఘాలు ఎంపిక.. రాష్ట్రవ్యాప్తంగా 906 సహకార సంఘాలున్నాయి. ఇందులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు అనుబంధంగా 798 పీఏసీఎస్‌లు ఉండగా, వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా మరో 108 సహకార సంఘాలున్నాయి. కాగా, ప్రయోగాత్మకంగా ఒక్కో జిల్లాకు నాలుగు జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం సూచన మేరకు ఆర్థిక, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు పకడ్బందీగా నిర్వహించే నాలుగు సొసైటీల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల సహకార శాఖాధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం జిల్లా సహకార శాఖాధికారుల నుంచి ఎంపిక చేసిన సహకార సంఘాల (సొసైటీ) వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లానుంచి ఐదు సంఘాల పేర్లు పంపించారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్, గుమ్మడిదల, ఝరాసంగం, ఏడాకులపల్లి, అందోల్ సహకార సంఘాలు ఇందులో ఉన్నాయి. ఫార్మసీ లైసెన్స్‌లు ఎలా? ఔషధాలు విక్రయించాలంటే ఫార్మసీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే సొసైటీల్లో జన్ ఔషధి కేంద్రాలకు ఫార్మసీ లైసెన్సులు ఎలా? అనే అంశంపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని సహకారశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మసిస్టును నియమించుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
ఇక ఈ 2 బ్యాంక్‌లు కనిపించవు..లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ!
బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు బ్యాంక్‌ల వద్ద తగినంత మొత్తంలో నిధులు లేవని రెండు బ్యాంక్‌ల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రం కర్ణాటకలోని తమకూరులో సేవలందిస్తున్న శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్ బ్యాంక్, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో హరిహరేశ్వర్ సహకార బ్యాంక్‌లు కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. అయితే, కార్యకలాపాల కోసం ఈ రెండు బ్యాంక్‌ల వద్ద తగినంత మొత్తం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాము తీసుకున్న నిర్ణయంతో జులై 11 నుంచి ఆ రెండు బ్యాంక్‌లు మూత పడినట్లే ఆర్బీఐ పేర్కొంది. ఖాతా దారుల సొమ్ము వెనక్కి ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన మొత్తాన్ని హరిహరేశ్వర్ సహకరి బ్యాంక్ 99.96 శాతం, శ్రీ శారద మహిళా కో-ఆపరేటీవ్ బ్యాంక్ 97.82 శాతం పొదుపు మొత్తాన్ని డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ)లు అందించినట్లు ఆర్బీఐ చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. ►ప్రతి డిపాజిటర్ డీఐసీజీసీ నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులేనని తెలిపింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తమ ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేవని పేర్కొంది. ►మార్చి 8, 2023 నాటికి, బ్యాంకు యొక్క మొత్తం బీమా డిపాజిట్లలో డీఐసీజీసీ ఇప్పటికే రూ.57.24 కోట్లను చెల్లించింది. ►జూన్ 12, 2023 నాటికి, శ్రీ శారద మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు మొత్తం బీమా చేసిన డిపాజిట్లలో రూ.15.06 కోట్లను చెల్లించింది. ►మహారాష్ట్రలోని సహకార కమీషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంకును మూసివేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ సూచించింది. చదవండి : సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట! -
Sujana : మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట సుజనా చౌదరీ ఈ కాలేజీ ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఈ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) గుర్తించింది. 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడికల్ కాలేజీని 2001-02లో నిర్మించగా 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో మెడికల్ ఆడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ప్రస్తుతం ఈ కాలేజీలో 750 మంది MBBS విద్యార్థులు, 150 మంది PG విద్యార్థులు ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ఆస్పత్రికి రోజూ ఔట్ పేషేంట్లు వస్తారు. ఆస్పత్రిలో 13 డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నేషనల్ మెడికల్ కమిషన్ వివిధ మెడికల్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో భాగంగా కాలేజీల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా? విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు ఉన్నారా? కాలేజీల్లో ఉన్న టీచింగ్ ఆస్పత్రులకు పేషేంట్లు వస్తున్నారా? అన్న విషయాలను నేషనల్ మెడికల్ కమిషన్ టీం పరిశీలించింది. సుజనాకు సంబంధించిన ఈ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్ మెంట్ వ్యవహరిస్తున్నట్టు తేలింది. దీంతో MCI ఈ కాలేజీకి నోటీసులిచ్చినట్టు తెలిసింది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కాలేజీ గుర్తింపు రద్దు చేసినట్టు సమాచారం. చదవండి: కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు! -
జూమ్‌కు టెలికం లైసెన్సు - ఇక వారికి పండగే..!
న్యూఢిల్లీ: వెబ్ కాన్ఫరెన్స్ కంపెనీ జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ (జెడ్వీసీ)కి తాజాగా భారత్‌లో దేశవ్యాప్త టెలికం లైసెన్స్ లభించింది. దీంతో ఇకపై బహళ జాతి కంపెనీలు, వ్యాపార సంస్థలకు తమ క్లౌడ్ ఆధారిత ప్రైవేట్ ఎక్స్చేంజ్ (పీబీఎక్స్) ’జూమ్ ఫోన్’ టెలిఫోన్ సర్వీసులను కూడా అందించడానికి వీలవుతుందని జెడ్వీసీ జీఎం సమీర్ రాజె తెలిపారు. భారత మార్కెట్‌కు కట్టుబడి ఉన్న తమకు ఇది కీలక మైలురాయిలాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశీ యూజర్లకు వినూత్న సొల్యూషన్స్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. -
విత్తనాలు, పిచికారీ డ్యూటీ డ్రోన్లదే..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ సాగు నుంచి ఆధునిక పద్ధతిలో పంటలు పండించే విధానాలు పెరుగుతున్నాయి. విత్తనాలు వేయడం నుంచి ఎరువులు చల్లడం వరకు అన్ని ప్రక్రియల్లో డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో వాటిని అందుబాటులో ఉంచి రైతులకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆగ్రోస్ వర్గాలు వెల్లడించాయి. సేవా కేంద్రాల నిర్వా హకులు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు అవసరమైన బ్యాంకు రుణాలను ఆగ్రోస్ ఏర్పాటు చేస్తుంది. వారికి శిక్షణతో పాటు లైసెన్స్ ఇచ్చేందుకు విమానయాన సంస్థతో ఆగ్రోస్ ఒప్పందం చేసుకుంది. డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో ట్రాక్టర్లు, స్ప్రేలు, దుక్కిదున్నే యంత్రాలు, వరి కోత మెషీన్లు తదితరాలను ఇచ్చిన వ్యవసాయశాఖ ఇప్పుడు డ్రోన్లను ఇచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. డ్రోన్ ద్వారా స్ప్రే చల్లడం వల్ల తక్కువ మొత్తంలో నీరు, పురుగుమందులు అవసరమవుతాయి. విత్తనాలు చల్లడంలో డ్రోన్లను వినియోగించడం వల్ల కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే యూరియా వంటి ఎరువులను డ్రోన్ల ద్వారా చల్లితే ప్రతీ మొక్కకు చేరతాయని అంటున్నారు. అదీగాక, డ్రోన్లతో పిచికారీ వల్ల రైతులు పురుగు మందుల దు్రష్పభావాలకు గురికాకుండా, అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చని ఆగ్రోస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో డ్రోన్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుందని అంచనా. వాటిని ఆగ్రోస్ కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇస్తారు. అలాగే కొంతమంది రైతులకు కలిపి గ్రూప్‌గా కూడా డ్రోన్ ఇచ్చే అవకాశముంది. ఒకవేళ రైతులు డ్రోన్లను కొనుగోలు చేయాలనుకుంటే సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కాగా, డ్రోన్‌ను తీసుకోవాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. అలాగే డ్రోన్ పైలట్ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఏవియేషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఒక్కో డ్రోన్ ధర: సుమారు 10,00,000 రూపాయలు డ్రోన్ అద్దె ఎకరాకు: రూ. 400 డ్రోన్లతో ఎకరాకు తగ్గనున్న ఖర్చు: రూ. 4,000 - 5,000 డ్రోన్లు ఏం చేస్తాయంటే.. ప్రధానంగా డ్రోన్లను విత్తనాలు చల్లడానికి, పురుగు మందులను స్ప్రే చేయడానికి వాడతారు. కొన్ని పంటలకు పైౖపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదళ్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటలకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు పరికరాలు అమర్చుతారు. అలాగే పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయో తెలుసుకునేందుకు ఫొటోలు కూడా తీస్తాయి. వాటిని వ్యవసాయాధికారికి పంపేలా ఏర్పాటు చేయనున్నారు. అలాగే కాత ఎలా ఉంది? దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశముంది. ఇలా పంటకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తెస్తారు. ఈ మేరకు పలు కంపెనీలతో చర్చించినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో గ్రామాల్లో డ్రోన్లతో సాగు సులభంగా జరుగుతుందని అంటున్నారు. డ్రోన్లతో సాగు ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. రైతులకు ఆదాయం పెరుగుతుంది ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రోన్ల వినియోగంతో సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పెద్దసంఖ్యలో కూలీలు చేసే పనిని ఒక డ్రోన్ కొన్ని నిమిషాల్లో చేస్తుంది. కాబట్టి సాగు ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం పెరుగుతుంది. -
డెక్కన్ మాల్‌కు అనుమతి పత్రాలపై జీహెచ్ఎంసీ అధికారుల మధ్య వాగ్వాదం
-
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి ఫుడ్ లైసెన్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి సుదర్శన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి హైదరాబాద్‌లో గుర్తించిన ప్రముఖ ఆలయాలను సందర్శించడంతో పాటు కార్యనిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంతో పాటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం సైతం ఎంపికైంది. సంబంధిత అధికారులు పెద్దమ్మ దేవాలయం ఈవో శ్రీనివాసరాజుతో ఇటీవల సమావేశమై చర్చించారు. ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం దేవాలయాలకు జీహెచ్ఎంసీ జారీ చేసిన ఫుడ్ లైసెన్స్‌లను పెద్దమ్మ దేవాలయానికి సైతం అందజేయనున్నారు. ప్రఖ్యాత ఆలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించే లక్ష్యంతో, ప్రసాదాల నాణ్యతకు సంబంధించి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఎస్ఏఐ) ప్రవేశ పెట్టిన బ్లిస్ ఫుల్ హైజనిక్ ఆఫరింగ్ టూ గాడ్(భోగ్) పథకంలో భాగంగా దేవాలయాలకు లైసెన్స్‌ల జారీ చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు, సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నగరంలో సుమారుగా ఎనిమిది దేవాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి లైసెన్స్ అందజేసిన అధికారులు పెద్దమ్మ ఆలయానికి త్వరలోనే జారీ చేయనున్నారు. ఇప్పటికే ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి, మౌనిక, లక్ష్మీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో ఆయా దేవాలయాల్లో ఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించి నాణ్యమైన ప్రసాదాలపై చర్చలు జరిపారు. ఈ లైసెన్స్ జారీ చేయడం ద్వారా ఇప్పటికే పరిశుభ్రమైన, రుచికరమైన ప్రసాదాలు అందజేస్తున్న ఆలయాలు మరింత నాణ్యమైన ప్రసాదాలను అందజేసేందుకు వీలవుతుంది. ఈ నిర్ణయం పట్ల పెద్దమ్మ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియకు ఆలయ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి ప్రసాదానికి నగర వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనతో భక్తులు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. చదవండి: బాలుడిపై దాష్టీకం.. బట్టలూడదీసి, చేతులు కాళ్లు కట్టేసి చిత్ర హింసలు -
గుడ్ న్యూస్: ఆర్టీవో టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్!
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) వెళ్లి ఆర్టీఓ వద్ద డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇవేమి చేయకుండా లైసెన్స్ ఎలా వస్తుందని అనుకుంటున్నారా. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు అమలులోకి రాగా, ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. పరీక్ష లేకుండా లైసెన్స్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు నుంచి శిక్షణను పూర్తి చేయాలి. ఆపై డ్రైవింగ్‌లో అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌లను సదరు శిక్షణా సంస్థ జారీ చేయనుంది. ఆపై వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, శిక్షణా కేంద్రం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సర్టిఫికేట్ పొందిన తర్వాత, అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై ఆర్టీఓ వద్ద ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా ఈ శిక్షణ సర్టిఫికేట్ ఆధారంగా లైసెన్స్ పొందవచ్చు. వీటిని కేంద్ర లేదా రాష్ట్ర రవాణా శాఖలు ఈ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తాయి. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను ప్రైవేటీకరించే అవకాశం ఉన్నందున డ్రైవర్ శిక్షణా కేంద్రాలను తెరవడంపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన వెరిఫికేషన్లు, తనిఖీలు లేకుండానే ఇలాంటి కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తారనే భయం కూడా నెలకొంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు ఎంత వరకు సత్పలితాలను ఇస్తాయని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
ఆయుధ అలజడి...తరచూ తుపాకులు, తూటాలు కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తరచూ తుపాకులు ‘దొరుకుతున్నాయి’. అక్రమ ఆయుధాలు వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వారితో పాటు లైసెన్స్ ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం నాణేనికి ఒక వైపైతే... చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో అక్రమాయుధాలు, తూటాలు లభిస్తుండటం మరో వైపైంది. తాజాగా శుక్రవారం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో లభించిన రెండు తపంచాలు, ఓ కంట్రీమేడ్ రివాల్వర్ తీవ్ర కలకలం సృష్టించాయి. గతంలో రెండు సందర్భాల్లో ఇలా ఆయుధాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజా ఉదంతంతో సహా మొత్తం మూడూ శుక్రవారాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. మొదటగా గాంధీ ఆస్పత్రి సమీపంలో... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో 2013 ఫిబ్రవరి 15న (శుక్రవారం) ఆయుధాలు, తూటాలు లభించాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇవి దొరికాయి. ఈ ప్రాంతాల మధ్య కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో ఒకరి పనిగానే అనుమానించారు. సదరు తుపాకులు, తూటాలు దాదాపు 40 ఏళ్ల క్రితం నాటివిగా అంచనా వేశారు. పద్మారావునగర్‌లో ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు చెత్తను డబ్బాలో వేసేందుకు వెళ్లారు. అందులో ప్లాస్టిక్ గోనెసంచిలో కట్టిన రెండు తుపాకులు (రైఫిల్స్ మాదిరివి) కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలకలం కొనసాగుతుండగానే... మరో అరగంటకు షాబాద్‌గూడ నుంచి మరో సమాచారం వచ్చింది. రామచంద్రయ్య అనే వ్యక్తి చెత్త పడేసేందుకు తన ఇంటి సమీపంలోని డబ్బా వద్దకు వెళ్లగా... అందులో తూటాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తుపాకులు, తూటాలు సైతం అమెరికాలో తయారైనవిగా వెల్లడైంది. రెమింగ్టన్ కంపెనీకి పాయింట్ 410 ఎంఎం, 0.38 ఆర్మీడ్, 3.57 రేంజర్ క్యాలిబర్లతో కూడిన తూటాలు మొత్తం వంద వరకు, మరికొన్ని ఖాళీ క్యాట్రిడ్జ్‌లు (కాల్చేయగా మిగిలినవి) ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిని పాన్ల్లో వినియోగించే ఖాళీ జర్దా డబ్బాలో, మరికొన్ని ప్రముఖ మిఠాయి దుకాణం కర్నూలు బ్రాంచ్‌కు చెందిన డబ్బాలో ఉంచి చెత్తడబ్బాలో పడేశారు. మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్ వద్ద... హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో 2019 డిసెంబర్ 20న (శుక్రవారం) రెండు రివాల్వర్లు దొరికాయి. ఆ రోజు రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఉంటారని, వాళ్లే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా భావించి ఆ కోణంలోనూ ఆరా తీశారు. అక్రమ రవాణా ముఠాలు, దోపిడీ దొంగలు, రౌడీ షీటర్లు, మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు.. వీళ్లల్లో ఎవరైనా తీసుకువచి్చ, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారని అంచనా వేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జటిలమే... సాధారణంగా కంపెనీల్లో తయారయ్యే మారణాయుధాలకు కొన్ని సీరియల్ నెంబర్లు, బ్యాచ్ నెంబర్లు తదితరాలు ఉంటాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఈ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లి బాధ్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాటు తుపాకులు, తపంచాలకు ఇలాంటి లేకపోవడంతో పాటు విదేశాల్లో తయారైన వాటికి ఇవి ఉన్నా ఫలితం ఉండట్లేదు. నగరానికి నాటు తుపాకులు, తపంచాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఇలాంటివి లభించినప్పుడు వాటి రూపం, పిడి ఉన్న తీరుతెన్నుల్ని బట్టి బాలిస్టిక్ నిపుణులు సైతం ఏ ప్రాంతంలో తయారైందో మాత్రమే చెప్పలగరు. ఇంతకు మించి ముందుకు వెళ్లడానికి సీసీ కెమెరాలు వంటి వాటిపై ఆధారపడాల్సిందే. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాటిలోనూ సరైన ఆధారాలు లభించట్లేదు. ఫలితంగా ఈ అక్రమ ఆయుధాల కేసులు బాధ్యులు గుర్తించడం జరగకుండానే పెండింగ్‌లో ఉండి క్లోజ్ అయిపోతున్నాయి. (చదవండి: రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..) -
‘అదానీ’ కి టెలికం లైసెన్స్: డాట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం సర్వీసులకు సంబంధించి అదానీ డేటా నెట్‌వర్క్‌కు ఏకీకృత లైసెన్సు (యూఎల్) లభించింది. కేంద్రం తాజాగా దీన్ని మంజూరు చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అదానీ డేటా నెట్వర్క్స్ (ఏడీఎన్ఎల్) , ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు,ముంబై ఇలా ఆరు సర్కిళ్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి ఏకీకృత లైసెన్స్‌ను పొందింది. అదానీ గ్రూప్‌లో భాగమైన ఏడీఎన్ఎల్ ఇటీవల జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లో 20 ఏళ్ల వ్యవధికి 400 మెగాహెట్జ్ మేర స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది. ఈ స్పెక్ట్రంను తమ గ్రూప్ వ్యాపారాల కస్టమర్ల కోసం రూపొందిస్తున్న సూపర్ యాప్‌తో పాటు తమ డేటా సెంటర్ల కోసం మాత్రమే వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు అదానీ గ్రూప్ గతంలోనే పేర్కొంది. -
మరో బ్యాంక్ కథ ముగిసింది.. లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ!
దేశంలోని సహకార బ్యాంకుల్లో మరో బ్యాంక్ కథ క్లైమాక్స్‌కు చేరింది. సరైన ఆర్థిక ప్రణాళికలు లేకుండా డిపాజిటర్లకు నగదు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది పుణె కేంద్రంగా పని చేస్తున్న `ది సేవ వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్`. ప్రస్తుతం ఈ బ్యాంక్ వద్ద సరిపడా పెట్టుబడి, ఆదాయ మార్గాలతో పాటు ఆర్థికపరంగా సజావుగా పనిచేసేందుకు మూలధనం కూడా లేదు. ఈ నేపథ్యంలో దీని లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ సోమవారం నుంచి `ది సేవ వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్`కు సంబంధించిన బ్యాంకింగ్ వ్యాపార లావాదేవీలు మూసేస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్రలోని సహకార కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఈ బ్యాంక్‌ను మూసివేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరడంతో పాటు బ్యాంకు కోసం లిక్విడేటర్‌ను నియమించాలని కోరినట్లు తెలిపింది. ది వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం 99 శాతం డిపాజిటర్లు.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ద్వారా పూర్తి డిపాజిట్లు పొందనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. గత నెల 14న డీఐసీజీసీ ఆధ్వర్యంలో ఇన్సూర్డ్ డిపాజిట్ల ఆధారంగా రూ.152.36 కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు. అనగా రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. చదవండి: బ్యాంకులకే షాకిచ్చిన పేటీఎం, ఒక్క నెలలోనే 7వేల కోట్లు.. బాబోయ్ ఏంటీ స్పీడ్! -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు షాక్.. లైసెన్స్ లేకపోతే జైలుకే!
సాక్షి,విజయనగరం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా లైసెన్స్‌లు లేకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమిస్తూ వ్యాపారాలు కొనసాగించే వ్యాపారులపై జిల్లా ఆహార కల్తీ, నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ఇప్పటివరకు ఆహర పదార్థాల కల్తీపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇకపై నుంచి లెసెన్స్‌లు కూడా ఉండాలని, అవి ఉన్న వారే ఆహార విక్రయాలకు అర్హులని చెబుతోంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా అమ్మకాలకు పాల్పడిన వారికి రూ.5 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నామని అధికారులు పేర్కొంటున్నారు. పుట్టగొడుగుల్లా విక్రయ కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఆహర పదార్థాల విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. చిన్నపాటి జంక్షన్లో కూడా నాలుగైదు తోపుడు బళ్లపై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఒకింత పెద్ద జంక్షన్ అయితే ఏకంగా పదుల సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వహణ కనిపిస్తుండడం గమనార్హం. అంతేకాకుండా చిన్నపాటి గదులను అద్దెకు తీసుకుని మరీ పకోడీ, టిఫిన్ షాపులు, నూడిల్స్, పానీపూరి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు అయితే వేల సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఏటా లైసెన్స్ రెన్యువల్.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడాదిలో రూ.12 లక్షల ఆదాయం వచ్చే హోటళ్లు, రెస్టారెంట్లు రూ.2 వేలు చెల్లించి తమ లైసెన్స్‌లను ఏటా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలో 270 మంది మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, లెసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. ఏడాదిలో రూ.12 లక్షల లోపు ఆదాయం సంపాదించే చిన్నపాటి దుకాణాలు నిర్వహించే వారు ఏడాదికి రూ.500 మాత్రమే చెల్లించి, లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 1,477 మంది మాత్రమే ఆ తరహా లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకున్నారు. ఈ లెక్కన అధికారికంగా నిర్వహించే దుకాణాల కన్నా అనధికారికంగా నిర్వహించే దుకాణాలే ఎక్కువన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వాటిపై సర్కారు ఆదేశాల మేరకు చర్యలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 100 కేసుల నమోదు.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అక్రమ వ్యాపారులకు వ్యతిరేకంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండగా, కోవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కేసులు మాత్రమే నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కొన్నింటిని జేసీ కోర్టుకు, మరికొన్నింటిని జిల్లా కోర్టుకు నివేదించినట్లు సమాచారం. వీటితో ఇప్పటివరకు రూ.2.50 లక్షల ఆదాయం అపరాద రుసుం కింద వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులకు లైసె న్స్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. పదార్థాలు కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు కొనసాగించినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయనగరం జిల్లా చదవండి: డామిట్.. కథ అడ్డం తిరిగింది -
భారత్‌లో లైసెన్స్ కోసం నిరీక్షణ తప్పదా?
ప్రపంచం మొత్తం తన వ్యాపార రంగాన్ని విస్తరించాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలను భారత్ ముందుకు పోనివ్వడం లేదు. అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఇదివరకే టెస్లా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. భారత్‌లో మాత్రం దిగుమతి సుంకం దెబ్బకి జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో మరో వ్యాపారానికి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. ఎలన్ మస్క్ సొంత కంపెనీ స్పేస్ ఎక్స్ నుంచి శాటిలైట్ సంబంధిత ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరప్, సౌత్-నార్త్ అమెరికాలోని కొన్ని దేశాలతో పాటు ఓషియానా(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)లలో సేవలు అందుతున్నాయి . ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ బెస్ట్ కంట్రీగా భావించి.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సేవల కంటే ముందు బుక్సింగ్ సైతం ప్రారంభించించింది కూడా. అయితే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేశారు కూడా. ఇదిలా ఉండగా.. తాజాగా అతిపెద్ద దేశాల్లో టాప్ టెన్‌లో ఉన్న బ్రెజిల్.. స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి బ్రెజిల్ నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఏజెన్సీ (Anatel)తో స్టార్‌లింక్ సంప్రదింపులు జరిపిందే లేదు. అయినప్పటికీ బ్రెజిల్ గవర్నమెంట్ ముందుకొచ్చి.. డీల్ ఓకే చేసుకోవడం గమనార్హం. మరోవైపు భారత్‌లో లైసెన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టిన స్టార్‌లింక్.. కొత్త చీఫ్ కోసం వేట సైతం ప్రారంభించింది. అయితే లైసెన్స్ పరిశీలనలోనూ జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది స్టార్‌లింక్. చదవండి: అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా! -
ముత్తూట్‌కు ఆర్బీఐ షాక్
ఫైనాన్షియల్ కార్పొరేషన్ ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. వెహికిల్స్ విభాగానికి సంబంధించిన ముత్తూట్ వెహికిల్ అండ్ అస్సెట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు ఆథరైజేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాదు చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్ (PSO)గా ఉన్న మరో కంపెనీ ఈకో(EKO) ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సైతం సీవోఏను రద్దు చేసేసింది. ఇదిలా ఉంటే ఎస్బీఐ, ఐసీసీఐ బ్యాంక్‌తో పాటు యస్ బ్యాంక్ తరపున సేవలు అందిస్తోంది ఈకో. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ (CoA) రద్దు చేయబడిన తరువాత.. ముత్తూట్ వెహికిల్ ఫైనాన్స్, ఈకో కంపెనీలు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల జారీ, నిర్వహణ లాంటి వ్యాపారాలకు అర్హత కోల్పోయినట్లు అయ్యింది. అయితే, ఈ కంపెనీలపై PSOలుగా చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ ఉన్న కస్టమర్లు, వ్యాపారులు.. రద్దు చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు తమ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం వారిని సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని విచక్షణ అధికారాల్ని వినియోగించి బ్యాంకుల పెద్దన్న ఈ నిర్ణయం తీసుకుంది. సీవోఏ క్యాన్సిలేషన్ డిసెంబర్ 31నే జరిగినప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం జనవరి 4న చేసింది ఆర్బీఐ. చదవండి: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ! -
ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట
న్యూఢిల్లీ: టెలికం సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించే దిశగా లైసెన్స్ నిబంధనలను కేంద్రం సవరించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కించే విధానంలో మార్పులు చేసింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విధింపునకు సంబంధించి టెలికంయేతర ఆదాయాలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం మొదలైన వాటిని ఏజీఆర్ నుంచి మినహాయించింది. ఇకపై టెల్కోల స్థూల ఆదాయం నుంచి ముందుగా వీటిని మినహాయిస్తారు. ఆ తర్వాత మిగిలే మొత్తం నుంచి ఇప్పటికే మినహాయింపులు అమలవుతున్న రోమింగ్ ఆదాయాలు, ఇంటర్కనెక్షన్ చార్జీల్లాంటి వాటిని తీసివేసి తుది ఏజీఆర్‌ను లెక్కిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచే ఈ సవరణను వర్తింపచేస్తున్నట్లు టెలికం శాఖ (డాట్) తెలిపింది. గత ఏజీఆర్ లెక్కింపు విధానం కారణంగా టెల్కోలపై ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల బకాయిల భారం పడుతోంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో ఏజీఆర్ సవరణ కూడా ఒకటి. ‘మారటోరియం’కు ఎయిర్టెల్ ఓకే! సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్), స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపుపై నాలుగు సంవత్సరాల మారటోరియం తనకు అంగీకారమేనని భారతీ ఎయిర్టెల్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగానికి ఇటీవల ప్రకటించిన సహాయక ప్యాకేజీలో భాగంగా టెల్కోలకు బకాయిలపై మారటోరియం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. -
ఫోన్‌పేకు ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లైసెన్స్
న్యూఢిల్లీ: చెల్లింపుల సేవల్లోని ప్రముఖ కంపెనీ ఫోన్‌పే.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నుంచి బీమా బ్రోకింగ్ లైసెన్స్ లభించినట్టు సోమవారం ప్రకటించింది. కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్‌తో బీమా వ్యాపారంలోకి ఫోన్‌పే గతేడాదే ప్రవేశించింది. నిబంధనల కింద ఒక్కో విభాగంలో మూడు కంపెనీలతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఉంటుంది. కానీ, ఇప్పుడు నేరుగా బ్రోకింగ్ లైసెన్స్ లభించడంతో అన్ని బీమా కంపెనీల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే అనుమతులు లభించినట్టయింది. దీంతో బీమా బ్రోకింగ్ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ సంస్థకు 30 కోట్లకుపైగా యూజర్ల బేస్ ఉంది. భారీ సంఖ్యలోనున్న యూజర్లకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయగలదు. -
బాబోయ్ బార్.. భయపడుతున్న యజమానులు
సాక్షి, సంగారెడ్డి: బార్‌షాప్‌ల లైసెన్స్‌లు పొందినవారు వాటిని ప్రారంభించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ మూడో వేవ్ భయం వెంటాడుతుండటం, బారులో కూర్చుని మద్యం సేవించేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుండడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా భయం వెంటాడుతోంది ► సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 22 బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం మరో 12 బార్లను మంజూరు చేసింది. జనాభా ప్రాతిపధికన ఈ కొత్త బార్లకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు తీసుకుని డ్రా ద్వారా ఎంపిక చేసింది. ► డ్రాలో గెలుపొందిన వ్యాపారులు బార్‌ను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు మూడు నెలలు గడువుంటుంది. అయితే కోవిడ్ మూడో వేవ్‌పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బార్ల లైసెన్సులు పొందిన వ్యాపారులు బార్లను ప్రారంభించడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ► బార్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇచ్చిన మూడు నెలల గడువుకు తోడు మద్యం వ్యాపారులు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు నెలల అదనపు గడువు కూడా మరో పక్షం రోజుల్లో ముగుస్తుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ► జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు బార్లు కూడా ప్రారంభం కాలేదు. సంగారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు కొత్త బార్లకు లైసెన్స్ మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం ఒకే ఒక కొత్త బారు తెరిచింది. ► జీహెచ్ఎంసీ పరిధిలోని బార్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డ్రాలో బార్‌ను దక్కించుకొని ఎక్సైజ్ ట్యాక్‌ను కట్టిన మద్యం వ్యాపారులు కొందరు తమ బార్‌ను తాము నిర్వహించకుండా, ఇతరులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ► జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సదాశివపేట్ పట్టణాల్లో రెండేసి చొప్పున బార్లు మంజూరయ్యాయి. జహీరాబాద్, నారాయణఖేడ్లలో ఒక్కో బార్ మంజూరైంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అమీన్పూర్ పరిధిలో రెండు బార్లు, బొల్లారంలో నాలుగు బార్లుకు లైసెన్స్‌లు మంజూరు చేసింది. ► జిల్లాలో కొత్త బార్లలో ఇప్పటివరకు నాలుగు బార్లు ప్రారంభమయ్యాయని సంగారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రిదేవి “సాక్షి’తో పేర్కొన్నారు. ► మెదక్ జిల్లాలో కొత్తగా మూడు బార్లకు డ్రా తీయగా, ఇప్పటివరకు రెండు బార్లు మాత్రమే ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. రామాయంపేట్‌కు మంజూరైన బార్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: Afghanistan: ‘శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారు’ -
ఆకాశం నుంచి కిందకు జంప్ చేస్తే ఆ కిక్కె వేరప్పా..!
దూకు... దూకేయ్... ఎక్కణ్ణుంచి. నింగి నుంచి నేలకు.మధ్యలో నువ్వో పక్షివవుతావు. నీ భుజాలు రెక్కలవుతాయి. దేహం దూదిపింజలా గిరికీలు కొడుతుంది. ఒక్కటే జీవితం.అద్భుతమైన అనుభవాలను ఎన్ని వీలైతే అన్ని మూట గట్టుకో. భారతదేశంలో లైసెన్స్డ్ ఉమెన్ స్కైడైవర్లు ఇప్పటి వరకు కేవలం ముగ్గురే ఉన్నారు. తాజాగా గుజరాత్ నుంచి ఏకైక మహిళగా శ్వేతా పర్మార్ నింగి గాలిని శ్వాసించింది. అయితే అందుకు ఆమె పట్టిన పంతం మాత్రం బుగ్గన వేలు ఆన్చి చదవదగ్గది. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలో స్కైడైవింగ్ సైన్యంలో ఉన్నవారికీ సైన్య శిక్షణ పొందగలిగిన వారికి మాత్రమే వస్తుంది. సాధారణ పౌరులు భారతదేశంలో ఎక్కడా స్కైడైవింగ్ నేర్చుకోలేరు. విదేశాలకు వెళ్లాల్సిందే. సాధారణంగా 7 వేల అడుగుల నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి స్కైడైవ్ చేస్తారు. కొన్నిక్షణాల ఫ్రీఫాల్ ఉంటుంది ఇందులో. ఆ తర్వాత పారాచూట్ ఓపెన్ చేసుకుని నేలకు దిగుతారు. స్కైడైవింగ్ అంటే ప్రాణాలతో చెలగాటం. అంతా సవ్యంగా గడిచి నేలకు దిగే సమయంలో ఆ వేగం అదుపులో లేకపోయినా నేలకు ఢీకొని మరణించే సందర్భాలు ఉంటాయి. అందుకని మన దేశంలో సాధారణపౌరులు ఈ క్రీడలో దిగడం తక్కువ. స్త్రీలు ఆ సాహసానికి పూనుకోవడం ఇంకా తక్కువ. గతంలో స్కైడైవింగ్ నేర్చుకున్న భారతీయ వనితలు (సాధారణ పౌరులు) ముగ్గురు ఉన్నారు. రేచల్ థామస్, షీతల్ మహాజన్, అర్చన సర్దానా. ఇప్పుడు నాలుగో వనిత వారి సరసన చేరింది. గుజరాత్ వడోదరాకు చెందిన 28 ఏళ్ల శ్వేతా పర్మార్. ఖరీదైన కల కల కనడమే తెలిసినవారికి దాని సాధ్యాసాధ్యాలు తెలియవు. సాధించాలనుకునేవారికి అడ్డుకట్టలు పడలేవు. శ్వేతా పర్మార్‌కు స్కైడైవింగ్ చేయాలని కోరిక. ఆకాశంలో మనం కూడా పక్షిలాగా ఎగిరితే ఎలా ఉంటుంది. ఆ అదృష్టం ఎలా సాధ్యం అవుతుంది... ఇవే ఆలోచనలు. కాని ఆ కలను నెరవేర్చుకునేంత వీలు ఉన్న కుటుంబం కాదు ఆమెది. 18 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయారు. ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్లు కొంత డబ్బు కడితే, స్కాలర్షిప్లు వస్తే బరోడా యూనివర్సిటీలో ఎం.బి.ఏ చేసింది. ఆ తర్వాత తమ్ముడితో కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది. కొద్దిగా డబ్బులు రాగానే 2016లో శ్వేత చేసిన మొదటి పని గుజరాత్‌లోని మెహసనా పట్టణంలో ఫ్లయింగ్ క్లబ్ ఉంటే అక్కడ ‘టాండమ్ జంప్’ చేయడం. అంటే పైలెట్ ఇన్స్ట్రక్టర్ మనల్ని తనతో పాటు కట్టుకుని స్కైడైవ్ చేస్తాడు. ఇందుకు ఆమెకు 35 వేల రూపాయలు ఖర్చయ్యింది. కాని ఆ టాండమ్ జంప్కే ఆమెకు స్కైడైవింగ్ మీద చాలా ఆకర్షణ ఏర్పడింది. నేనొక్కదాన్నే ఎగరాలి అనుకుందామె. స్పెయిన్‌కు వెళ్లి మొదలెట్టిన బిజినెస్‌ని తమ్ముడికి అప్పజెప్పేసి పూర్తిస్థాయి శిక్షణ కోసం 2018లో స్పెయిన్‌కు వెళ్లింది శ్వేతా పర్మార్. ‘అక్కడ ప్రతి జంప్‌కు నాకు 20 వేల రూపాయలు ఖర్చయ్యేది. అది కాకుండా ఉండటానికి, తిండికి. శిక్షణ కూడా చాలా శ్రమతో ఉంటుంది. గాలిలో నుంచి నేలకు దూకే వేగాన్ని తట్టుకోవడానికి కండరాలు తర్ఫీదు అవడం కోసం చాలా శిక్షణ ఇస్తారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్యారాచూట్ నేలకు తాకే సమయంలో వేగం అటూ ఇటూ అయితే ఎముకలు విరుగుతాయి. ఒకసారి అలాగే నాకు మైనర్ ఫ్రాక్చర్ అయ్యింది. అయినా విజయవంతంగా నేను శిక్షణ పూర్తి చేసుకున్నాను’ అంది శ్వేతా. సర్టిఫికేట్ పొందాలి స్కైడైవింగ్‌కు సర్టిఫికెట్ కావాలి. యునైటెట్ స్టేట్స్ పారాచూట్ అసోసియేషన్ (యు.ఎస్.పి.ఏ) రాత పరీక్షలో పాసై, తగినన్ని సార్లు స్కైడైవింగ్ అనుభవాన్ని నమోదు చేసి ఈ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. శ్వేత ఇందుకోసం 8 అంచెల కోర్సును, 29సార్లు స్కైడైవింగ్ను చేసి, రాత పరీక్ష రాసి సర్టిఫికెట్ పొందింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన భారతీయ నాలుగో మహిళ శ్వేత. ఆమెకు ఇది వరకే ఈ సర్టిఫికెట్ అందాల్సి ఉన్నా కోవిడ్ వల్ల ఆలస్యమై ఇటీవల ఆమె చేతికి వచ్చింది. స్పెయిన్ తర్వాత శ్వేత రష్యాలో, దుబాయ్‌లో స్కైడైవ్ చేసింది. ‘ఇప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడైనా స్కైడైవింగ్ చేయవచ్చు’ అని సంతోషంగా అంది శ్వేతా. ‘నేను ఇప్పుడు యువతకు స్ఫూర్తినిస్తున్నాను. నన్ను చూసి స్కైడైవింగ్‌పై ఆసక్తి కనిపిస్తున్నారు చాలామంది. గుజరాత్ నర్మదా నదిలో (సర్దార్ పటేల్ విగ్రహం వద్ద) రివర్ రాఫ్టింగ్ లాంటి సాహస క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. కాని స్కైడైవింగ్ను ప్రోత్సహిస్తే టూరిజం అట్రాక్షన్ ఉంటుంది. ఆకాశం నుంచి కిందకు జంప్ చేయడంలో ఉంటే గొప్ప అనుభూతి మరే క్రీడలోనూ ఉండదు. జీవితం ఒక్కటే. ఆ అనుభూతీ ఒక్కటే’ అంది శ్వేతా పర్మార్. కొందరలా ఉంటారు... సాహసం శ్వాసగా సాగిపోతూ. -
ఆమెకు సముద్రమే అన్నం ముద్ద
భారతదేశంలో చేపలు పట్టే లైసెన్సు ఉన్న ఏకైక మహిళ రేఖ కోవిడ్ విసిరిన మృత్యుకెరటాలకు ఏమాత్రం చలించలేదు. లాక్డౌన్ వల్ల, తుఫాన్ల వల్ల, గుండె ఆపరేషన్ కోసం ఎదురు చూస్తూ వేటకు రాలేని నిస్సహాయ భర్త వల్ల ఆమె ఓడిపోదలుచుకోలేదు. ఇంత పెద్ద సముద్రం అమ్మలా ఉంది నాకేం భయం అనుకుంది. రోజూ తీరంలో దొరికే సముద్రపు చిప్పలను ఏరి బతుకు వెళ్లమారుస్తుంది. నలుగురు ఆడపిల్లలు ఉన్నారామెకు. భర్తతో కలిపి ఐదుగురు పిల్లలు అనుకుంటూ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటోందామె. కేరళ త్రిచూర్ జిల్లాలోని ఎత్తాయి సముద్రతీరం లో రోజూ తెల్లవారు జామున ఆమె కనిపిస్తుంది. ఒక నీలిరంగు ప్లాస్టిక్ బాస్కెట్‌ను పట్టుకుని కెరటాల వెంట సాగుతూ దేనినో అన్వేషిస్తూ ఉంటుంది. దేనిని? సముద్రపు చిప్పల్ని (సాధారణ ఆల్చిప్పలు/అయిస్టర్ షెల్స్). ఆమె వాటిని ఏరుకుంటూ ఆ బుట్ట నిండేవరకూ అక్కడే తిరుగుతుంది. బుట్ట నిండితే 60 రూపాయలు వస్తాయి. ‘ఒక్కోసారి సగం బాస్కెట్ కూడా దొరకవు. అమ్మ ముఖం చాటేస్తుంది’ అని నవ్వుతుంది. ఆమె పేరు రేఖ. ఆమె అమ్మ అంటున్నది సముద్రాన్ని. నిజానికి ఆమె సముద్రంలో చేపలు పట్టాలి. కాని సముద్రపు చిప్పల్ని ఏరాల్సి వస్తోంది. ‘సముద్రంలో కెరటాలకు నేను ఎప్పుడూ భయపడలేదు. కాని జీవితంలో కెరటాలకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది’ అంటుంది నలభై ఏళ్ల రేఖ. సముద్రంలో రేఖ తొలి డీప్ ఫిషింగ్ లైసెన్స్ హోల్డర్ డీప్ ఫిషింగ్ లైసెన్స్‌ను పొందడం చాలా కష్టం. దానికి యోగ్యత సాధించాలంటే అనుభవం, అర్హత ఉండాలి. దానిని పొందడం మగవారికే సొంతం. కాని దేశంలో మొదటిసారి ఆ లైసెన్స్‌ను పొందిన ఏకైక మహిళ రేఖ. ‘సముద్రంలో నేను 50 కిలోమీటర్లు వెళ్లి చేపలు పట్టేదాన్ని’ అంటుంది రేఖ. ఇంటర్ వరకూ చదువుకున్న రేఖ 2016లో త్రిచూర్ నుంచి దేశంలో తొలి మహిళగా డీప్ ఫిషింగ్ లైసెన్స్ పొందినప్పుడు మీడియాలో చాలా కవరేజీ వచ్చింది. ఒక స్త్రీ చేపల వేటకు వెళ్లడం విశేషం అని అందరూ మెచ్చుకున్నారు. ‘పడవలో నా భర్త చేపల వేటకు వెళ్లే ప్రతిసారీ సహాయకులు వస్తారా రారా అని టెన్షన్ పడేవాడు. సముద్రంలో చేపల వేటలో... చేపలు పట్టడానికి పడవలో కనీసం ముగ్గురు ఉండాలి. నిజానికి వాళ్లకు కూలి ఇచ్చే స్థితి కూడా కాదు మాది. ఈ టెన్షన్ అంతా ఎందుకు.. నేను వస్తాను కదా అని తోడు బయలుదేరేదాన్ని. అలా భార్యను తీసుకుని వేటకు వెళ్లడానికి మగవాళ్లు ఇష్టపడరు. కాని నా భర్త సమ్మతించాడు. తోడు తీసుకుని వెళ్లి వేట చేయడం నేర్పాడు. నేను బాగా నేర్చుకున్నాను. నాకు సముద్రంలో ప్రతి అల ఆనుపానులు తెలుసు.’ అంటుంది రేఖ. కేరళలో చాలామంది స్త్రీలు బ్యాక్‌వాటర్స్‌లో చేపలు పడతారు. కాని సముద్రం మీదకు వెళ్లరు. ఇంకా చెప్పాలంటే సముద్రం మీదకు వెళ్లేందుకు వారిని ఎవరూ ప్రోత్సహించరు. రేఖ ఆ ధైర్యం చేయడం వారికి పెద్ద స్ఫూర్తిగా మారింది. ‘మా దగ్గర సాంకేతిక పరికరాలు, ఆధునిక జాకెట్లు ఏమీ ఉండవు. మాకు తెలిసిందల్లా సముద్ర దేవత కడలమ్మే. ఆమె మమ్మల్ని చూసుకుంటుంది’ అంటుంది రేఖ. కుటుంబ సభ్యులతో... ‘సముద్రంలో వేటకు వెళ్లాలంటే వలను నిర్వహించడం తెలియాలి. చాలాసార్లు చేపలు పడకపోగా వలల్ని సముద్రపు పందులు (స్కాటోప్లేన్స్) కొరికేస్తాయి. నిరాశ పడక ఆ వలను రిపేరు చేసుకొని మళ్లీ వెళ్లాలి. సముద్రంలో వేట చావు–బతుకు, ఆశ నిరాశల మధ్య సాగుతుంది’ అంటుంది రేఖ. సెకండ్ వేవ్ సవాలు రేఖ జీవితం సజావుగా సాగుతుండేది. భర్త కార్తికేయన్‌తో వేటకు వెళ్లేది. ‘రాత్రంతా వేట చేసి తిరిగి వచ్చి పడ్డ చేపలను హార్బర్‌కు తీసుకెళ్లి అమ్మితే రోజుకు ఎంత లేదన్నా రెండు మూడు వేలు వచ్చేవి’ అంటుంది రేఖ. అయితే ఇలా రోజూ చేపలు పడలేదు. అయినా సగటున ముప్పయి వేల ఆదాయం అయితే వచ్చేది. రేఖకు నలుగురు ఆడపిల్లలు. సముద్ర తీరంలోనే ఆమెకో కచ్చా ఇల్లు ఉంది. పిల్లలను చదివించుకుంటూ జీవితం లాక్కువస్తుంటే హటాత్తుగా భర్త గుండెజబ్బు బయటపడింది. దానికి సర్జరీ అవసరం అని డాక్టర్లు అన్నారు. ఈలోపు సెకండ్ వేవ్ వచ్చి ఆ సర్జరీ కాస్త పోస్ట్‌పోన్ అయ్యింది. భర్త వేటకు వచ్చేలా లేడు. లాక్డౌన్ వల్ల సరుకు లావాదేవీలు స్తంభించి వేట సాగడం లేదు. తుఫాన్లు, భారీ వానలు కూడా పనికి అంతరాయం. ఏం చేయాలి? ఇల్లైతే గడవాలి. ‘సముద్రాన్నే నమ్ముకున్నాను. ధైర్యంగా ఉన్నాను’ అంటుంది రేఖ. తీరంలో దొరికే సాధారణ అయిస్టర్ షెల్స్‌ను కాల్షియం ముడిసరుకుగా కొంటారు. ఆ సముద్రపు చిప్పల్ని ఏరి అమ్మే పనిలోకి దిగింది రేఖ. ఒకోసారి రెండు మూడు డబ్బాలు దొరుకుతాయి. ఒక్కోసారి దొరకవు. కాని ధైర్యంగా జీవితం గడుపుతోందామె. కొత్త సముద్రం ‘సముద్రం కూడా రంగు మార్చుకుంటుంది. పాత చేపలు వెళ్లి కొత్త చేపలు వస్తాయి. ఈ కష్టాలు కూడా పోతాయి. మళ్లీ మాకు మంచి జీవితం వస్తుంది’ అంటుంది రేఖ. ఆమె దగ్గర ఇప్పుడున్నదల్లా ఒక పాత పడవ. ఆ పడవతో సముద్రంలో వెళ్లాలంటే భర్త కోలుకోవాలి. ‘కొట్టాయం ఆస్పత్రిలో డాక్టర్లు డేట్ ఇచ్చారు. పోస్ట్‌పోన్ అయ్యింది కరోనా వల్ల’ అందామె. చాలామంది కష్టాలు వస్తే ‘ఏ సముద్రంలో దూకి చావను’ అంటుంటారు. రేఖ సముద్రం దగ్గరే ఉంది. సముద్రంతోనే ఉంది. కాని ఆమె సముద్రంలో దూకి చావదల్చుకోవడం లేదు. సముద్రాన్నే ఆధారం చేసుకుని అనుక్షణం బతకాలనిపిస్తోంది. ‘కెరటం ఆదర్శం నాకు. పడినందుకు కాదు. పడినా లేచినందుకు’ అన్న కవి వాక్కు రేఖ జీవితాన్ని ఒక సజీవ వ్యాఖ్యానంలా ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
రెజ్లర్ సుశీల్‌కుమార్ ఆయుధ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్‌ను (ఆర్మ్స్ లైసెన్స్) రద్దు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ రద్దు ప్రక్రియను లైసెన్స్ డిపార్ట్మెంట్ ప్రారంభించినట్టు తెలిపారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం సుశీల్ కుమార్‌ను హరిద్వార్ తీసుకెళ్లి.విచారిస్తున్నారు.సుశీల్ కుమార్ పరారీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, ఆయనకు ఎవరెవరు సహకరించారనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నారు. సుశీల్ కుమార్ 18 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. పరారీలో ఉన్న అతనికి ఆశ్రయం ఇచ్చిందెవరనే కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరం చేసిన సమయంలో అతను వేసుకున్న దుస్తులు, వాడిన సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇంకా స్వాధీనపరచలేదు. విచారణలో రెజ్లర్ సహకరించకపోవడంతో పోలీసులు మేజిస్ట్రేట్ ముందు వాదనల్ని వినిపించి అతని కస్టడీని ఇంకొన్ని రోజులు పొడిగించుకున్నారు. సుశీల్ దాడిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించగా ఈ విషయం తెలుసుకున్న రెజ్లర్ ముందుగా హరిద్వార్‌కే పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆశ్రయమిచ్చిన వారెవరో తెలుసుకునేందుకు... -
బ్యాంకింగ్ లైసెన్సులకు 8 దరఖాస్తులు
ముంబై: బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) ఏర్పాటుకు సంబంధించిన లైసెన్సులకు ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ‘ఆన్ ట్యాప్’ (ఎప్పటికప్పుడు దరఖాస్తులు చేసే విధానం) లైసెన్సింగ్ మార్గదర్శకాల కింద బ్యాంకుల ఏర్పాటుకు నాలుగు దరఖాస్తులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు గురువారం వెల్లడించింది. దరఖాస్తు సంస్థలు ఇవీ... ► యూఏఈ ఎక్సే్ఛంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ది రిప్యాట్రియట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్ (రెప్కో బ్యాంక్), చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్, పంకజ్ వైష్ బ్యాంక్ లైసెన్సుకు దరఖాస్తు చేశాయి. ► చిన్న ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సింగ్ కోసం మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారులు–– విసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాలికట్ సిటీ సర్వీస్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అఖిల్ కుమార్ గుప్తా, ద్వారా క్షేత్రీయ గ్రామీణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ► ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి 2016 ఆగస్టు 1వ తేదీన అలాగే ఎస్‌ఎఫ్‌బీల ఏర్పాటుకు 2019 డిసెంబర్ 5వ తేదీన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీని ప్రకారం బ్యాంకుల ఏర్పాటుకు తొలి కనీస పెయిడ్–అప్ ఓటింగ్ ఈక్విటీ మూలధనం రూ.500 కోట్లు ఉండాలి. అలాగే కనీస నెట్‌వర్త్ రూ.500 కోట్లును నిర్వహించాల్సి ఉంటుంది. ఎస్‌ఎఫ్‌బీల విషయంలో ఇది రూ.200 కోట్లు. అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ ఎస్ఎఫ్బీగా మా రాలని కోరుకుంటే, నెట్ వర్త్ తొలుత రూ.100 కోట్లు ఉంటే సరిపోతుంది. ఐదేళ్లలో ఈ మొత్తం రూ.200 కోట్లకు పెరగాల్సి ఉంటుంది. ► బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు సమర్పించే దరఖాస్తులను మదింపుచేసి, తగిన సలహాలను సమర్పించడానికి ఆర్బీఐ గత నెల్లో ఒక స్టాండింగ్ ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఈఏసీ)ని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్ శ్యామలా గోపీనాథ్ నేతృత్వం వహిస్తారు. కమిటీ కాలపరిమితి మూడేళ్లు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ రేవతీ అయ్యర్, ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే ప్రస్తుత ఎన్పీసీఐ చైర్మన్ బీ మహాపాత్ర, కెనరా బ్యాంక్ మాజీ చైర్మన్ టీఎన్ మనోహరన్, ఎస్బీఐ మాజీ ఎండీ అలాగే పీఎఫ్ఆర్డీఏ మాజీ చైర్మన్ హేమంత్ జీ కాంట్రాక్టర్లు కమిటీలో ఉన్నారు. -
లెక్కలున్నాయి.. జాగ్రత్త!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు ప్రతి పెంపుడు కుక్క(పెట్‌డాగ్)కూ లైసెన్సు ఉండాలి. గ్రేటర్ నగరంలో దాదాపు 50 వేల పెట్‌డాగ్స్ ఉన్నప్పటికీ, ఇందులో లైసెన్సులున్నవి ఆరువేలు మాత్రమే. ఇందుకు కారణాలనేకం. తీసుకోవాలని తెలియనివారు కొందరు కాగా.. తెలిసినా దాన్నిపొందేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగలేక, దరఖాస్తులోని వివరాలు భర్తీ చేసి, అవసరమైన ధ్రువీకరణలు అందజేయలేక ఎంతోమంది నిరాసక్తత కనబరుస్తున్నారు. ఈ పరిస్థితి నివారణతోపాటు .. జీహెచ్ఎంసీలో పెట్‌డాగ్స్ డేటాబేస్ కోసం..పెట్ లవర్స్‌కు ఎప్పటికప్పుడు యానిమల్ వెల్ఫేర్‌బోర్డు నుంచి అందే సూచనలు, సలహాలు తెలియజేసేందుకు, నిర్ణీత వ్యవధుల్లో యాంటీర్యాబిస్ వ్యాక్సిన్ వేయించేలా అలర్ట్ చేసేందుకు, ఇతరత్రా విధాలుగా వినియోగించుకునేందుకు ఆన్లైన్ డేటా అవసరమని జీహెచ్ఎంసీ భావించింది. చదవండి: ‘పెట్’.. బహుపరాక్! దాంతోపాటు లైసెన్సుల కోసం ప్రజలు కార్యాలయాల దాకా రానవసరం లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఆన్లైన్ ద్వారానే పెట్‌డాగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు, ప్రతియేటా రెన్యూవల్స్‌కు ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తే లైసెన్సు జారీ అవుతుంది. టోకెన్ కోసం మాత్రం ఒక్కసారి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. లైసెన్సు పొందిన ప్రతికుక్కకూ యూనిక్‌ఐడీ ఉంటుంది. అది జీవితకాలం పనిచేస్తుంది. ప్రతియేటా లైసెన్సు రెన్యూవల్, ఇతరత్రా అవసరమైన సందర్భాల్లో ఐడీ ఉంటే చాలు. చదవండి: పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు ► జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లోని సంబంధిత లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పరిశీలించాక లైసెన్స్ ఇస్తారు. దాంట్లో జీహెచ్ఎంసీ జోన్, లైసెన్సు నెంబర్, తదితర వివరాలుంటాయి. ► దరఖాస్తులో యజమాని వివరాలతోపాటు కుక్క పేరు, ఆడ/మగ, రంగు, బ్రీడ్ ఆఫ్ డాగ్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, వయసు, వ్యాక్సిన్ వేయించిన తేదీ, రెన్యూవల్స్‌కు టోకెన్ నంబర్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసేముందు కావాల్సినవి.. ► మొబైల్ నెంబర్ u ఇటీవలి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కాపీ ► ఇరుగుపొరుగు ఇద్దరి నుంచి ఎన్ఓసీ ► నివాస ధ్రువీకరణకు (విద్యుత్ బిల్/వాటర్‌బిల్/హౌస్ ట్యాక్స్ బిల్/ఆధార్/డ్రైవింగ్ లైసెన్స్) కాపీ. ► ఆన్లైన్లో రూ.50 చెల్లించాలి. -
రేసింగ్‌కు పాల్పడితే లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఖరీదైన వాహనాలతో రోడ్లపై రేసింగ్, ఛేజింగ్‌లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. గతంలో రాత్రి వేళల్లో మాత్రమే యువకులు రేసింగ్‌లకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనూ రేసింగులకు పాల్పడుతున్నారు. నెక్లెస్ రోడ్డు, పీవీ ఎలివెటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగురోడ్లపై వారు రెచ్చిపోతున్నారు. ఆదివారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై 2 ఖరీదైన స్పోర్ట్స్ కార్లలో విపరీతమైన వేగంతో దూసుకుపోతున్న వారిని పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. నగరంలో ఇలాంటి వాహనాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటి యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఒకసారి కౌన్సెలింగ్ ఇచ్చాక కూడా వాహనాలను పరిమితికి మించిన వేగంతో నడిపినట్లు తేలితే వారి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వాహనాలను కూడా సీజ్ చేస్తారు. -
జిల్లాలో 42 ప్రభుత్వ మద్యం దుకాణాలు
సాక్షి, విశాఖపట్నం: దశల వారీ మద్యపాన నిషేదం దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే బెల్ట్ మద్యం దుకాణాలను దాదాపు నియంత్రించిన ప్రభుత్వం సిండికేట్ వ్యాపారానికి కూడా చెక్ పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను నడిపేందుకు కార్యాచరణ రూపొందించింది. సర్కారు ఆదేశాల మేరకు మరో పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 42 మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. క్రితం సారి వేలంలో హక్కులు పొంది గతేడాది లైసన్స్లు పునరుద్ధరించుకోని దుకాణాల స్థానంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో దుకాణానికి ఓ సూపర్వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌ను నియమించనున్నారు. దీనికి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసి అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని భర్తీ చేయనున్నారు. వీరికి జీతభత్యాలు, ఇతరత్ర అంశాలను నోటిఫికేషన్ సమయంలో ప్రకటిస్తారు. ఈ ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ బాధ్యతలు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు చూసుకుంటారు. సిండికేట్‌కు చెక్ గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మద్యం ఏరులై పారిన సంగతి తెలిసిందే. లైసన్స్ మద్యం దుకాణాలకు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో సిండికేట్ వ్యాపారం పెచ్చుమీరింది. దీంతో బెల్ట్ దుకాణాలు పుట్టగొడుగుల్లా ఎక్కడిక్కడే వెలిశాయి. ఆయా దుకాణాలకు నేరుగా లైసన్స్ షాపుల నుంచే మద్యం సరఫరా చేయడంతో మద్యం వ్యాపారం మూడు ఫుల్లు.. ఆరు క్వార్టర్లుగా సాగింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభించినా వాటి నిర్వహణ గాలికి వదిలేయడంతో కొద్దిరోజులకే దుకాణాలన్నీ మూతపడ్డాయి. దీంతో సిండికేట్ వ్యాపారులు మరింత విజృంభించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నూతన మద్యం పాలసీతో ఈ సిండికేట్ వ్యాపారానికి పూర్తిగా చరమగీతం పాడినట్లే. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపడితే బెల్ట్ దుకాణాల మనుగడ ఉండదు. ధరల నియంత్రణ ఉంటుంది. కల్తీ మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉండవు. నిరుద్యోగులకు మందికి ఉపాధి మరోవైపు నూతన మద్యం పాలసీ వల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం 42 దుకాణాలకు గాను ఒక్కో దుకాణానికి ఒక సూపర్వైజర్, ఇద్దరు సేల్స్ మెన్‌ను నియమిస్తారు. తద్వారా జిల్లాలో 126 మందికి ఉపాధి లభిస్తుంది. సిబ్బంది జీత భత్యాలు, దుకాణాల సమయాలు, ఇతర నియమ నిబంధనలు రెండు మూడు రోజుల్లో జేసీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పది రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది.. నూతన మద్యం దుకాణాలు ప్రారంభించడానికి మాకు సమాచారం అందింది. దీనిపై కమిషనర్‌తో సమీక్ష కూడా జరిగింది. మరో పదిరోజుల్లో సిబ్బంది నియామకాలు, దుకాణాల లభ్యతను చూసుకుని అమ్మకాలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత మరిన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. –శ్రీనివాసరావు, డీసీ, ఎక్సైజ్‌శాఖ -
‘బెల్టు’ స్కూళ్లు..!
బెల్టు షాపులు అంటూ మద్యం అమ్మకాలకు సంబంధించి తరచూ వింటూ ఉంటాం.. అంటే అనుమతులు లేకుండా చిన్న బడ్డీ కొట్లలో అక్రమంగా మద్యం విక్రయించడం. ఈ జాడ్యం ఇప్పుడు విద్యావ్యవస్థకూ పాకింది. ఒక పాఠశాల నిర్వహించేందుకు అనుమతి తీసుకుంటారు.. అదే అనుమతితో రెండు మూడు సబ్ బ్రాంచ్‌లు పెట్టేస్తారు. వీటికి అనుమతులుండవు.. అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్ సెంటర్లంటూ నమ్మిస్తారు. దీంతో జిల్లాలో ‘బెల్టు’ స్కూళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో బెల్టు షాప్‌ల మాదిరి బెల్టు స్కూళ్లు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. గుర్తింపు పొందితే అధికారుల తనిఖీలు, ఫీజులు, పద్ధతులు పాటించాల్సి వస్తుందని చాలా స్కూళ్లు అనుమతి జోలికి పోవడం లేదు. కార్పొరేట్, పేరు మోసిన ప్రైవేట్ సంస్థలు ఒక్క స్కూల్‌కు అనుమతి తీసుకొని, వాటితో రెండు మూడు బ్రాంచ్‌లను నడుపుతూ క్యాష్ చేసుకుంటున్నాయి. స్థానిక అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్లు నడుపుతున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. గుర్తింపు లేకపోతే సరి..! స్కూల్ పెట్టాలంటే స్థానిక సంస్థల అనుమతితో పాటు ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపక శాఖ, భవననిర్మాణ శాఖ, విద్యాశాఖ, పట్టణ పారిశుద్ధ్యశాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు వాహనాలు ఉంటే వాటికి రవాణా శాఖ అనుమతి కూడా పొందాలి. విద్యార్థి ఒకొక్కరి పేరిట గుర్తింపు ఫీజులను చెల్లించాలి. ఇంత పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించి తడిసిమోపెడు ఖర్చు చేసే బదులు ఎలాంటి గుర్తింపు లేకుండా పాఠశాలలను నడపడం, అక్కడ చదివే విద్యార్థులను ఇతర స్కూళ్ల నుంచి పరీక్షకు అనుమతించడం చాలా తేలికైన అంశంగా మారింది. ప్రతి పాఠశాల నుంచి ఎగ్జంప్షన్ ఫీజు చెల్లించి ప్రైవేటు స్టడీ విద్యార్థులు, రెగ్యులర్ విద్యార్థులు హాజరుకావచ్చు. కొన్ని స్కూళ్లు తమ స్కూళ్లలో చదవకపోయినా ఇతర స్కూళ్ల వారిని కూడా తమ విద్యార్థులుగానే రికార్డుల్లో చూపిస్తున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆడిందే ఆటగా వారు రాసిందే రికార్డుగా మారిపోయింది. జిల్లాలో దాదాపు 80 స్కూళ్లు... కృష్ణా జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న పాఠశాలలు దాదాపు 80 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్క విజయవాడ నగరంలోనే 60 స్కూళ్ల వరకు గుర్తింపు లేని పాఠశాలలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో మరో 20 దాకా ఉన్నాయని సమాచారం. వీటిలో అగ్రభాగం నారాయణ, శ్రీచైతన్య, తదితర కార్పొరేట్ పాఠశాలలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా.. ఇది వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటం, భారీగా ముడుపులు అందజేయటం వంటి కారణాల వల్ల వీటిపై దాడులు జరగకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి చూపటంతో వీటిపై దాడులు మొదలయ్యాయి. బుధవారం విజయవాడలోని సత్యనారాయణపురంలోని అనుమతి లేని నారాయణ స్కూల్‌పై విద్యాశాఖాధికారులు దాడి చేసి లక్ష రూపాయలు జరిమానా, తాత్కాలికంగా సీజ్ చేశారు. విద్యాసంవత్సరం ఆరంభంలో కేవలం నోటీసులు, జరిమానాలతో సరిపెడుతున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోవటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
పైసలిస్తే లైసెన్స్..!
నెల్లూరు(టౌన్): ఇక్కడ అనధికారిక ఏజంట్లదే రాజ్యం.. వీరి ముందు నిబంధనలు బలాదూర్.. అడిగినంత పైసలిస్తే ఎలాంటి లైసెన్స్‌లైనా క్షణాల్లో ఇప్పించేస్తారు. అంతా ఆన్లైన్ అంటారు..కానీ వ్యవహారమంతా ఆఫ్‌లైన్‌లోనే నడుస్తోంది. దీనికి కొంతమంది అధికారులు సహకారమందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగమంతా రవాణాశాఖ కార్యాలయం కేంద్రంగా నడుస్తోంది. ద్విచక్ర, భారీ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. పైసలిస్తే ఎలాంటి టెస్ట్ లేకుండానే లైసెన్స్‌లు వచ్చేస్తున్నాయి. ఈ దందాకు అనధికార ఏజెంట్లతోపాటు కొంతమంది మీడియా సిబ్బంది, హోంగార్డులు, రవాణా అధికారుల డ్రైవర్లు రవాణా కార్యాలయం వద్ద కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఎంవీఐ 113 లైసెన్స్‌లకు వేలిముద్ర వేయించి ఓకే చేశారు. అయితే ఈ విషయంపై ఓ అజ్ఞాత వ్యక్తి డీటీసీకి ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా పరిశీలించి అందరికీ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు.డీటీసీనే ట్రాక్ వద్దకు వచ్చి టెస్ట్‌ను నిర్వహించడంతో కేవలం 53 మంది మాత్రమే ట్రైల్ వేసేందుకు ముందుకువచ్చారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న మిగిలిన అభ్యర్థులు ట్రైల్ వేసేందుకు ముందుకు రాకపోవడంతో వారందరినీ ఫెయిల్ చేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. బైకు, కారుకు లైసెన్స్ పొందాలంటే తొలుత ఎల్ఎల్ఆర్ పొందాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఆర్ పొందిన నెల తరువాత, 6 నెలలు లోపు శాశ్వత లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్స్ పొందేందుకు ముందుగా శ్లాట్ బుక్ చేసుకోవాలి. బైక్, కారుకు ప్రభుత్వ చలానా రూ.1350 చెల్లించాల్సి ఉంటుంది. ఆ చలానాతో శ్లాట్‌లో వచ్చిన తేదీ, సమయం ప్రకారం రవాణాశాఖ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సిఉంటుంది. దరఖాస్తులు వచ్చిన ప్రకారం డ్రైవింగ్ ట్రాక్ వద్ద వేలిముద్ర వేసి బైక్, కారు డ్రైవింగ్ చేయాల్సిఉంది. ఆ తరువాత సీరియల్ ఆధారంగా ఒకరి తరువాత మరొకరు వేలిముద్ర వేసి డ్రైవింగ్ టెస్ట్చేయాల్సిఉంది. సక్రమంగా డ్రైవింగ్ చేసిన వారికి టెస్ట్‌ను పర్యవేక్షిస్తున్న ఎంవీఐ లైసెన్స్‌ను ఓకే చేస్తారు. సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారాన్ని పంపుతారు. ఆ తరువాత లైసెన్స్‌ను పోస్టుద్వారా వ్యక్తి అడ్రస్‌కు పంపుతారు. లైసెన్స్‌కు రూ.2500 వసూలు కారు నడపడం రాకపోయినా డబ్బులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. కొంతమంది మొక్కుబడిగా బైక్ నడిపి కారుకు కూడా లైసెన్స్ పొందుతున్నారు. మరి కొంతమంది కేవలం వేలిముద్ర వేసి లైసెన్స్ పొందుతున్నారు. ఈ రీతిలో లైసెన్స్ జారీ చేసినందుకు ప్రభుత్వ చలానా కన్నా అదనంగా రూ.2500 వసూలు చేస్తున్నారు. లైసెన్స్‌ను ఇప్పించేందుకు కొంతమంది దళారుల అవతారం ఎత్తారు. అనధికార ఏజెంట్లు వ్యక్తి నుంచి అదనంగా డబ్బులు తీసుకుని ఫాం 4 అవసరం లేకపోయినా ఎంవీఐకి గుర్తుగా లైసెన్స్ కోసం దాఖలు చేస్తారు. ఫాం 4 ఆధారంగా సాయంత్రం సమయంలో అనధికార ఏజెంట్ల నుంచి నుంచి రవాణా సిబ్బంది డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కారు డ్రైవింగ్ రాకపోయినా ప్రతిరోజూ పదుల సంఖ్యలో లైసెన్స్‌లు జారీ చేయడం గమనార్హం. లైసెన్స్ ఇప్పించేందుకు దళారుల క్యూ రవాణాశాఖ అధికారులు డబ్బులు తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తుండడంతో కొంతమంది దళారులు రవాణా కార్యాలయానికి క్యూ కట్టారు. ముందుగానే లైసెన్స్ జారీ చేసే సంబంధిత అధికారితో ఒప్పందం కుదుర్చుకుని లైసెన్స్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం డీటీసీ తనిఖీల్లో తేటతెల్లమైంది. అనధికార ఏజెంట్లతోపాటు కొంతమంది మీడియా సిబ్బంది డబ్బులు తీసుకుని లైసెన్స్ ఇప్పించేందుకు రవాణాశాఖ కార్యాలయం వద్ద తిష్టవేశారు. మీడియా పేరు చెబుతుండడంతో సంబంధిత అధికారులు ఎలాంటి టెస్ట్ లేకుండానే లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. ఇదే కోవలో హోంగార్డులు, వాచ్మెన్లు, అటెండర్లు, కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సైతం తమ బంధువులని చెప్పి లైసెన్స్ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు తీసుకుని లైసెన్స్ మంజూరు చేయిస్తున్నారు. సీసీ కెమెరాల సాక్షిగా.. రవాణా కార్యాలయంలో జరిగే లావాదేవీలు సక్రమంగా జరిగేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇదే కోవలో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ తప్పు దోవపట్టకుండా ఉండేందుకు ట్రాక్‌లో కూడా సీసీ కెమెరాలు బిగించారు. ప్రతి రోజూ రవాణాశాఖ ఉన్నతాధికారి సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిఉంటుంది. కానీ సీసీ కెమెరాల సాక్షిగా అడ్డగోలు లైసెన్స్‌లను జారీ చేస్తున్నా సంబంధిత ఉన్నతాధికారి మిన్నకుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అడ్డగోలు లైసెన్స్‌ల జారీ విషయంలో ఉన్నతాధికారికి ముడుపులు అందుతుండడంతోనే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రమాణాలతో కూడిన లైసెన్స్‌లను జారీ చేయాలని పలువురు కోరుతున్నారు. లైసెన్స్ జారీలో ఎలాంటి అక్రమాలకు తావులేదు వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా లైసెన్స్ జారీ చేస్తాం. వాహనం నడపకుండా లైసెన్స్‌లు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఆ విధంగా ఏఅధికారైనా లైసెన్స్ జారీ చేస్తే చర్యలు తీసుకుంటాం. డ్రైవింగ్ లైసెన్స్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ వాహనాన్ని నడపాల్సిందే. అలాంటి వారికే లైసెన్స్ జారీ చేస్తాం.– ఎన్.శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, రవాణాశాఖ -
పెళ్లికి లైసెన్స్ తీసుకున్నారా?
ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టినప్పుడు, వాహనం కొన్నప్పుడు లైసెన్స్ తీసుకోవాలి అని వింటుంటాం. మరి పెళ్లికి లైసెన్స్ ఏంటి? అనేగా మీ అనుమానం. విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే మ్యారేజ్ లైసెన్స్ తీసుకుంటారు. ఆ లైసెన్స్ తీసుకున్న కొన్ని రోజుల (సుమారు మూడు నెలలు) వ్యవధిలో వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు. తాజాగా నిక్ జానస్, ప్రియాంకా చోప్రా కూడా అమెరికాలో పెళ్లి లైసెన్స్ తీసుకోనున్నారని టాక్. ఇటీవలే ఓ కోర్టుకి వెళ్లి లైసెన్స్ ఫామ్ కూడా నింపారట. వీరిద్దరూ ఇండియాలో వివాహం చేసుకోనున్నారు. దాన్ని మళ్లీ విదేశాల్లో అప్లై చేస్తే రెండు దేశాల్లో వీరి వివాహం లీగల్ అవుతుంది. ప్రస్తుతం నిక్, ప్రియాంక పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. వీరి వివాహం ఈనెల 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో జో«ద్ పూర్లో జరగనుంది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ఈ పెళ్లి జరగుతుంది. -
బంధన్ బ్యాంకుకు షాక్
ముంబై: లైసెన్స్ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్ బ్యాంకుపై ఆర్బీఐ కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్ ఘోష్ పారితోషికాన్ని స్తంభింపజేసింది. ‘‘బ్యాంకులో నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను 40 శాతానికి తీసుకురానందుకు కొత్త శాఖల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని ఆర్బీఐ ఉపసంహరించుకుంది. ఇకపై ఏ ఒక్క శాఖ ఏర్పాటు చేయాలన్నా ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండీ, సీఈవో పారితోషికాన్ని మాత్రం తదుపరి నోటీసు జారీ అయ్యే వరకు నిలిపివేయడం జరుగుతుంది’’ అని ఆర్బీఐ తమను ఆదేశించినట్లు బంధన్ బ్యాంకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. బ్యాంకులో ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ వాటాను 40 శాతానికి తీసుకొచ్చే లైసెన్స్ షరతును పాటించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఆర్బీఐకి సహకరిస్తామని బ్యాంకు ప్రకటించింది. కోల్‌కతా కేంద్రంగా 2001లో ఏర్పాటైన మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌కు యూనివర్సల్ బ్యాంకు లైసెన్స్‌ను 2014 ఏప్రిల్‌లో ఆర్బీఐ మంజూరు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 937 శాఖలున్నాయి. -
మ్యారేజ్ కోసం లైసెన్స్!
పాప్ మ్యూజిక్ రాక్‌స్టార్ పాప్‌ను ప్లే చేయకుండా పెళ్ళి బజంత్రీలు మోగించేందుకు సిద్ధం అయ్యాడట. తన లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్ హెయిలీ బాల్డ్విన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు జస్టిన్ బీబర్. దానికోసం మ్యారేజ్ లైసెన్స్ తీసుకున్నారు ఇద్దరూ. డ్రైవింగ్ లైసెన్స్‌లా ఈ మ్యారేజ్ లైసెన్స్ ఏంటీ అనుకుంటున్నారా?.. ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ చర్చ్ లేదా ఆ దేశానికి సంబంధించిన స్టేట్ అథారిటీ ఇచ్చే సర్టిఫికేట్. జూలై నెలలో ఈ జోడీ రింగులు మార్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ యువ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని బీబర్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రేమికుల సన్నిహితులు మాత్రం వచ్చే వారంలోనే పెళ్లి ఉండొచ్చంటూ హింట్స్ ఇస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. మ్యారేజ్ లైసెన్స్ కేవలం 60 రోజులే వర్తిస్తుంది కాబట్టి ఈ రెండు నెలల్లో కచ్చితంగా పెళ్ళి భాజాలు వినొచ్చన్నమాట. ∙జస్టిన్, హెయిలీ -
జనరిక్ షాప్ లైసెన్స్ రద్దు
తిరుపతి (అలిపిరి) : స్విమ్స్‌లో నిర్వహిస్తున్న జనరిక్ మందుల దుకాణం పై ఔషధ నియంత్రణ శాఖ కొరడా ఝళిపించింది. మెప్మా అనుమతి లేకుండా అభ్యుదయ నగర మహిళా సమాఖ్య పేరుతో మందుల దుకాణం నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. అనేక పరిణామాల మధ్య ఎట్టకేలకు జనరిక్ దుకాణాన్ని రద్దు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ అ«ధికారులు గురువారం ప్రకటించారు. మందుల స్టాక్ ఉంచకూడదని నిర్వాహకులనుఆదేశించారు. లైసెన్స్ రద్దు చేసి మూడు రోజులు గడుస్తున్నా మందుల స్టాక్ అలాగే ఉంచారు. టీడీపీ చోటా నాయకుల ఒత్తిళ్ల వల్ల స్విమ్స్ యాజమాన్యం ఈ దుకాణం మూసివేతకు వెనకడుగు వేస్తోందనే విమర్శలున్నాయి. స్విమ్స్‌లో జనరిక్ దుకాణం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. గతంలో రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహించే సమయంలో అవినీతి ఆరోపణలొచ్చాయి. దీంతో దుకాణాన్ని రద్దు చేశారు. మెప్మా అనుమతి లేకుండా టీడీపీ చోటా నాయకుల సహకారంతో అభ్యుదయ నగర మహిళా సమాఖ్య పేరుతో కనీసం సభ్యు ల అనుమతి లేకుండా జనరిక్ దుకాణాన్ని 8 నెలల క్రితం ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని రెండు నెలల క్రితం ఔషధ నియంత్రణ శాఖ లైసెన్స్ రద్దు చేసింది. చట్టంలోని లొసుగుల ఆధారంగా నిర్వాహకులు ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి తెచ్చుకుని నెల రోజులుగా జనరిక్ షాపు నిర్వహిస్తున్నారు. వివాదం మధ్య లైసెన్స్ మంజూరు జనరిక్ దుకాణం నిర్వహణకు కోర్టు ఉత్తర్వులు ఆధారంగా డ్రగ్ అధికారులు అ«భ్యుదయ నగర మహిళా సమాఖ్యకు తిరిగి ఆగమేఘాలపై లైసెన్స్ మంజూరు చేశారు. లైసెన్స్ మంజూరుకు మెప్మా పీడీ నుంచి అనుమతి తప్పనిసరి.∙ఔషధ నియంత్రణ అధికారులు జూన్ 6న లైసెన్స్ మంజూరు చేసి 12న ఇచ్చి నట్లు మెప్మాకు లేఖ రాశారు. డ్రగ్ అధికారుల తీరుపై మెప్మా అధికారులు మండిపడ్డారు. తమకు తెలియకుండా అభ్యుదయ నగర మ హిళా సమాఖ్య పేరుతో జనరిక్ నడుపుతున్నారని సమాఖ్య వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా రు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. విచారించి చర్యలు తీసుకోవాలని డ్రగ్ అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు విచారించి లైసెన్స్ రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. -
మీ పెంపుడు కుక్కకు లైసెన్స్ ఉందా?
సాక్షి, బెంగళూరు: మీ ఇళ్లలో పెంపుడు కుక్కలు ఉన్నాయా? వాటికి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏంటి.. అది కుక్కలకి ఏంటి అనుకుంటున్నారా!! ఇప్పటివరకు అయితే కుక్కలకు లైసెన్స్ తప్పనిసరి కాకపోయిన ఇకపై త్వరలో బీబీఎంపీ పరిధిలో కుక్కలకు లైసెన్స్‌లు కచ్చితం కానుంది. ఈ మేరకు బీబీఎంపీ ఆలోచన చేస్తోంది. బీబీఎంపీ పరిధిలో అపార్ట్మెంట్ అసోసియేషన్ నియమాల ప్రకారం లైసెన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో ఆదివారం కబ్బన్ పార్కు క్యానిన్స్ (సీపీసీ) స్వచ్ఛంద సేవకులు, బీబీఎంపీతో కలుపుకుని కుక్కలకు లైసెన్స్‌లనే ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఆదివారం పెంపుడు కుక్కకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు, వ్యాక్సినేషన్ వివరాలతో పాటు అడ్రస్ ప్రూఫ్‌తో యజమానులు తమ కుక్కలను కబ్బన్ పార్కుకు తీసుకొచ్చారు. ఈ లైసెన్స్‌కు బీబీఎంపీ రూ. 110 చార్జీ చేసింది. లైసెన్స్ తీసుకున్న పెంపుడు కుక్కలకు ఉచిత హెల్త్ చెకప్, రాయితీతో కూడిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీసీ వ్యవస్థాపకురాలు ప్రియా చెట్టి మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు లైసెన్స్‌లు తీసుకోవడం ప్రతిఒక్క యజమాని బాధ్యతని చెప్పారు. భారత జంతు సంక్షేమ సంస్థ (ఏడబ్ల్యూబీఐ) నియమాల ప్రకారం కూడా దేశంలో ఎక్కడైన పెంపుడు కుక్కలకు లైసెన్స్‌లు తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా అన్ని జాతులకు చెందిన పెంపుడు కుక్కలతో కబ్బన్ పార్కులో సందడి నెలకొంది. -
వెజిటబుల్ కట్లెట్లో బొద్దింకలు, పురుగులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయించడమే కాకుండా, లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న అన్నపూర్ణ థియేటర్లోని క్యాంటీన్‌ను అధికారులు సీజ్ చేశారు. గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ, శకుంతల థియేటర్స్‌లో ఆహార పదార్థాలు శుభ్రంగా లేవంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తనిఖీలో తేలిందని పూర్ణచంద్రరావు తెలిపారు. మినిట్ మెయిడ్ పల్ప్ డ్రింక్ బాటిల్స్‌కు 4, 5 రోజుల్లో కాలవ చెల్లనున్నట్లు గుర్తించామన్నారు. వెజిటబుల్ కట్లెట్ పూర్తిగా పాడైపోయి పురుగులు పట్టిందని తెలిపారు. బొద్దింకలు, పురుగులు ఆహార పదార్థాల్లో సంచరిస్తున్నాయని చెప్పారు. లేస్, పాప్‌కార్న్ అన్ఆథరైజ్డ్ ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వైట్ కవర్స్‌లో ఉంచిన కంపెనీ పేరులేని ఆహార పదార్థాలు గుర్తించామన్నారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. క్యాంటీన్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. క్యాంటీన్లో లభించిన బ్యాచ్‌కు చెందిన కూల్ డ్రింక్స్ ఎక్కడెక్కడ నిల్వలున్నాయో.. వాటన్నింటిని స్వాధీనం చేసుకోవాలని కోకాకోలా కంపెనీకి నోటీసులు జారీ చేస్తామన్నారు. క్యాంటీన్‌కు సరుకు సరఫరా చేసే వారికి లైసెన్స్ లేదని తనిఖీల్లో వెల్లడైందన్నారు. శాంపిల్స్ నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేకుండా సరుకు సరఫరా చేసేవారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రాణాలతో చెలగాటం
కొవ్వూరు: మనిషి ప్రాణాలు నిలబెట్టే ఔషధ విక్రయ కేంద్రాల నిర్వహణలో నిబంధనలకు పాతరేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపులు నడుపుతున్నారు. అద్దె సర్టిఫికెట్స్‌పై అమ్మకాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు. కొన్ని దుకాణాల్లో అడ్డుఅదుపు లేకుండా కాలం చెల్లిన ఔషధాల విక్రయాలు సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. స్టాకు రిజిస్టర్లు లేకుండానే లావాదేవీలు నడుస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నప్పటికీ ఔషధ తనిఖీ అధికారులకు పట్టడం లేదు. అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 వరకు మెడికల్ షాపులున్నాయి. 450 హోల్‌సేల్ దుకాణాలున్నాయి. 14 బ్లడ్‌బ్యాంక్‌లు, మూడు బ్లడ్ స్టోరేజ్ కేంద్రాలు, మూడు మందుల తయారీ కంపెనీలు న్నాయి. ఫార్మసిస్టులు లేకపోవడం మూలంగా ఏ మందులో ఏఏ పదార్థాల మిశ్రమం ఏమిటి అనే దానిలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏ రోగానికి ఏ మందులు వాడతారు. ఏవిధంగా వినియోగించాలన్నదీ తెలియాలంటే ప్రతి మెడికల్ షాపుల్లోను ఫార్మసిస్టులు తప్పనిసరిగా ఉండాలి. ఒక ఔషధానికి బదులు మరో ఔషధం ఇస్తే ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఫార్మసిస్టులు లేకుండానే నిత్యం వందల కోట్ల మెడిసిన్స్ వ్యాపారం సాగుతోంది. నెలవారీగా మూమూళ్లు దుకాణదారుల నుంచి నెలవారీ మామూళ్లు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో షాపు నుంచి నెలకి రూ.500 చొప్పున ఏడాదికి ఒక్కో షాపు ద్వారా రూ.6 వేలు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులను ఔషధ తనిఖీ అధికారులు మధ్యవర్తులుగా ఉంచుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా 2,500 దుకణాలున్నాయి. వీటి ద్వారా ఈ విధంగా లెక్కలు వేస్తే సుమారు నెలకి రూ.12.50 లక్షల వరకు మామూళ్లు ముడుతున్నట్టు సమాచారం. ఈ సొమ్మును పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పంచుకుంటారని చెబుతున్నారు. మొక్కుబడిగా తనిఖీలు ప్రస్తుతం జిల్లాలో మెడికల్ దుకాణాల తనిఖీ అంతా మొక్కుబడి తంతుగానే సాగుతుంది. జిల్లాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు తణుకు, కొవ్వూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరులో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. వీరిలో ప్రస్తుతం భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఒక్కో ఇన్స్పెక్టర్ నెలకి నలభై దుకాణాలు తనిఖీలు, ఐదు శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. రెండు శాంపిల్స్ ప్రభుత్వ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, కమ్యూనిటీ ఆసుపత్రుల నుంచి మూడు ట్రేడర్స్ నుంచి సేకరించాల్సి ఉంటుంది. శాంపిల్స్ నివేదికలు అందిన తర్వాత సంబంధిత కంపెనీలు, వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారు. చాలా చోట్ల మెడికల్ దుకాణాల్లో ఫార్మసిస్టులే ఉండటం లేదు. వాస్తవంగా వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌కి అనుగుణంగా మందులు విక్రయాలు చేయాలి. కొనుగోలుదారులకు బిల్లు ఇవ్వాలి. కొన్ని దుకాణాల్లో నకిలీ మందులు, నాసిరకం మందులు విక్రయాలు సాగిస్తున్నప్పటికీ మొక్కుబడి తంతుగానే తనిఖీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం మందులను, ఫిజీషియన్ శాంపిల్స్‌ను చిల్లర విక్రయాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. మందుల షీట్‌పై ముద్రించిన తేదీని వాళ్ల వద్ద ఉంచుకుని రెండో వైపు కత్తిరించి ఇవ్వడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటువంటి సందర్భాలు జిల్లాలో కోకొల్లలు. -
డ్రైవింగ్ లైసెన్స్‌లకు బ్రేక్..!
విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలం కోరుకొండపాలెంనకు చెందిన కె. సతీష్ అక్టోబర్‌లో రవాణాశాఖ కార్యాలయంలో త్రీవీలర్ లైసెన్స్ టెస్ట్‌కు హాజరై పాసయ్యాడు. అయితే ఈ రోజు వరకు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అందలేదు. అలాగే ఎస్.కోట మండలం కిల్తంపాలెం గ్రామానికి చెందిన కె.వంశీకృష్ణ ఆగస్టులో టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్‌కు హాజరై ఉత్తీర్ణుడయ్యాడు. ఇతనికి కూడా ఇంతవరకు లైసెన్స్ కార్డు అందజేయలేదు. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలో వేలాదిమంది వాహనదారుల పరిస్థితి ఇలానే ఉంది. నాలుగు నెలలుగా కార్డులు అందకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాహనంతో రోడ్డుపైకి వెళ్లాలంటనే వాహనదారులు భయపడుతున్నారు. పోలీసులు, రవాణా శాఖాధికారులు ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అన్ని అర్హతలున్నా డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో లేక చాలామంది అపరాధ రుసుం చెల్లించక తప్పడం లేదు. ఎల్ఎల్ఆర్ వచ్చిన 30 రోజుల తర్వాత అన్ని పరీక్షలు పూర్తి చేస్తే అదే రోజు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ముద్రిస్తారు. అనంతరం ముద్రించిన కార్డులను పోస్టు ద్వారా వాహనదారుడి ఇంటికి నాలుగు, ఐదు రోజుల్లో పంపించాలి. కాని నెలలు గడుస్తున్నా కార్డులు అందని పరిస్థితి నెలకొంది. డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు (ఆర్సీలు), లైసెన్స్ రెన్యూవల్ కార్డుల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఐదు వేల మందికి.. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌లు అందాల్సి ఉంది. ఇందులో 2500 రిజిస్ట్రేషన్ కార్డులు, 2500 డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు ఉన్నాయి. మూలకు చేరిన ప్రింటర్ జిల్లా కేంద్రంలో ఉపరవాణా కమిషనర్ కార్యాలయం ఉంది. అదేవిధంగా సాలురు, పార్వతీపురంల్లో వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. అన్నింటికీ కార్డుల ముద్రణ విజయనగరంలో ఉన్న ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలోనే జరుగుతుంది. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక్క ప్రింటర్ తరచూ మొరాయిస్తుండడంతో సమస్య నెలకొంటోంది. సుమారు పదిహేనేళ్ల కిందటి ప్రింటర్ కావడంతో ఎప్పటికప్పుడు సమస్యలు నెలకొంటున్నాయని సిబ్బంది చెబుతున్నారు. జిల్లా అవసరాలు బట్టి కనీసం మూడు ప్రింటర్లు ఉండాలి. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చే శాఖలో రవాణాశాఖ ఒకటి అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు తెలియజేశాం.. ప్రింటర్ పాడైన విషయం ఉన్నతాధికారులకు తెలియజేశాం. సుమారు ఐదు వేల వరకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు ప్రింట్ చేయాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – భువనగిరి కృష్ణవేణి, ఉపరవాణా కమిషనర్ -
బారు.. జోరు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: వైన్‌షాప్ టెండర్‌కు రూ.లక్ష వెచ్చించి దరఖాస్తు చేయడం, వందలాది మందితో పోటీపడి లైసెన్సు దక్కిం చుకున్నా అది రెండేళ్లపాటే ఉంటుండటంతో మద్యం వ్యాపారులు ఇబ్బందులు పడుతు న్నారు. ఈ క్రమంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎలైట్ బార్’ విధానంతో లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 820 బార్లకు 2009లో లైసెన్సులు మం జూరు చేశారు. అప్పటి నుంచి ఏటా వీటినే రెన్యువల్ చేస్తూ పోతున్నారు. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చే వారికి వైన్‌షాపులే దిక్కుగా మారాయి. ఇటీవల కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా 2,215 వైన్ షాపులకు లైసెన్సులు జారీ చేశారు. షాపులకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దరఖాస్తు ధరను ఏకంగా రూ. 25,000 నుంచి రూ. లక్షకు పెంచారు. అయినా డిమాండ్ తగ్గలేదు. సగానికి పైగా షాపులకు పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటి ఫలితంగా లైసెన్సుల జారీ ద్వారా రూ. 1,274 కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరితే.. దరఖాస్తుల ద్వారానే రూ. 420 కోట్ల ఆదాయం వచ్చింది. లైసెన్సు ఫీజులో నాలుగో వంతు ఆదాయం వీటి ద్వారానే వచ్చింది. ఈజీగా ఎలైట్.. సాధారణ బార్ లైసెన్సు ఫీజు కంటే 25 శాతం అధిక ఫీజుతో ఎలైట్ బార్లకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. ఈ బార్ పొందాలను కుంటే నేరుగా ఎక్సైజ్‌శాఖ మంత్రికి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు దరఖాస్తు వస్తుంది. ఎలైట్ బార్ పెట్టేందుకు అనువైన మౌలిక సదుపా యాలు ఉన్నట్లుగా నిర్ధారించి, దరఖాస్తుదారుడి వ్యక్తిగత సమాచారంపై సంతృప్తి చెందితే లైసె న్సు మంజూరు చేయవచ్చు. డిమాండ్‌ను బట్టి ఒక ఏరియాకు ఎన్నైనా ఎలైట్ బార్లను మం జూరు చేసే వెసులుబాటు ఉంది. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి రావాలనుకునేవారు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిబంధనలకు నీళ్లు ఎలైట్ బార్ ఏర్పాటు చేయాలంటే కనీసం పది వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇందులో 2 వేల చ.అడుగుల స్థలం కేవలం మద్యం డిస్ప్లేకు కేటాయించాలి. సెంట్రల్ ఏసీ, సువిశాల పార్కింగ్ సౌకర్యాలు తప్పనిసరి. విదేశీయులకు అసౌకర్యం లేని విధంగా సదుపాయాలు ఉన్నప్పుడు లైసెన్సు మంజూరు చేయాలి. సాధారణ బార్‌షాప్ లైసెన్సు ఫీజుపై 25 శాతం అదనం చెల్లిస్తే చాలు అధికారులు లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని ప్రతిపక్షాలు అసెంబ్లీలో గొంతు చించుకుంటున్నా.. ఎక్సైజ్‌శాఖ కొత్త మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేస్తూ పోతుండటం విమర్శలకు తావిస్తోంది. ఫుల్ డిమాండ్.. ప్రతి 25,000 మంది జనాభాకు ఒక బార్‌షాప్‌ను కేటాయించాలని ఎక్సైజ్ నిబంధ నలు ఉన్నాయి. ఈ లెక్కన 8 లక్షల జనాభా ఉన్న వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 30 నుంచి 35 బార్‌షాపులు ఉండాలి. ఇప్పటికే ఇక్కడ 89 బార్లు, 59 వైన్‌షాపులు ఉన్నాయి. కొత్తగా ఇక్కడ ఎలైట్ బార్లు నెలకొల్పేందుకు పలువురు పోటీ పడుతున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఎలైట్ బార్ కోసం మంత్రి పద్మారావు పేషీలో 50కి పైగా దరఖాస్తులు చేరినట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే 4 బార్లకు అనుమతులు వచ్చాయి. కాగా, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మరో మూడు, కరీంనగర్ జిల్లాలో ఒకటి వంతున ప్రాసెస్‌లో ఉండగా, ఖమ్మం జిల్లా మధిరలో రెండు, నిజామాబాద్, రామగుండం కార్పొరే షన్ల పరిధిలో ఎలైట్ బార్ల కోసం దరఖాస్తులు మంత్రి పేషీకి చేరుతున్నాయి. -
ఎక్సైజ్‌లో ‘పర్మిట్ల’ గోల్మాల్!
-
ఎక్సైజ్‌లో ‘పర్మిట్ల’ గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో భారీ అక్రమం బయటపడింది. ఈవెంట్ పర్మిట్ లైసెన్సులపై మద్యం కొనుగోలులో అధికారుల చేతివాటం సర్కారు ఖజానాకు రూ.100 కోట్ల కుపైగా గండిపెట్టింది. సొమ్ము దండుకునేం దుకు అధికారులు ఏకంగా తప్పుడు నిబంధన లనే సృష్టించారు. నకిలీ పర్మిట్లనూ జారీ చేశారు.ఈవెంట్ల కోసం ప్రివిలేజ్ ఫీజు చెల్లించి డిపోల నుంచి మద్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఆ సమీపంలోని దుకాణాల్లోనే కొను గోలు చేయాలంటూ ‘సొంత’ నిబంధనలను అమలు చేశారు. ఆ మద్యం దుకాణాల నిర్వా హకుల నుంచి కమీషన్లు దండుకున్నారు. మూడేళ్లుగా సాగుతున్న ఈ తతంగం ఇటీవలే అకౌంటెంట్ జనరల్ పరిశీలనలో వెల్లడైంది. పెద్ద సంఖ్యలో ఈవెంట్లు జరుగుతున్నా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 వేలకు వరకు ఫంక్షన్ హాళ్లు, 200 వరకు క్లబ్బులు, 500కు పైగా పెద్ద హోటళ్లు, బాంకెట్ హాళ్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం వాటిలో ఏటా 1.5 లక్షల వరకు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలా ఫంక్ష న్లలో మద్యం కూడా వినియోగిస్తుంటారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇలాంటి ఫంక్షన్ల లో మద్యం వినియోగించాలంటే ఈవెంట్ పర్మిట్ లైసెన్సు తీసుకోవాలి. ఆ మద్యాన్ని కూ డా కచ్చితంగా బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) డిపో నుంచే కొనుగోలు చేయాలి. అలాకాకుండా మద్యం దుకాణాల్లో, ఇతర మార్గాల ద్వారా మద్యం కొనుగోలు చేస్తే... ఆ ఈవెంట్ పర్మిట్‌ను రద్దు చేసి, వారిపై కేసులు నమోదు చేయాలి. కానీ గ్రేటర్ హైదరా బాద్ పరిధిలో ఎక్కడా ఇది అమలు కావడం లేదని, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోందని ఎకౌంటెంట్ జనరల్ (ఏజీ) గుర్తించారు. ఈ మేరకు 2014–15, 2015–16 సంవత్సరాల్లో ఎన్ని ఈవెంట్ పర్మిట్లకు లైసెన్సులు ఇచ్చారు? లైసెన్స్ తీసుకున్నవారు డిపోల నుంచి ఎంత మద్యం కొనుగోలు చేశా రు, దాని ద్వారా ఎంత సొమ్ము ప్రివిలేజ్ ఫీజు గా వసూలైందనే వివరాలను పంపాలని ఎక్సైజ్ కమినర్‌కు ఫిబ్రవరిలోనే లేఖ రాశారు. కానీ ఈ లేఖను కమిషనర్ కార్యాలయం దాచిపెట్టింది. లేఖ వచ్చి 7 నెలలైనా ఇప్పటివరకు కమిషనర్ చంద్రవదన్‌కు తెలియకపోవటం గమనార్హం. నిబంధనలు తుంగలో తొక్కి.. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి ఏటా 10 వేల ఈవెంట్ పర్మిట్లు జారీ అవుతున్నాయి. ఈ పర్మిట్ తీసుకున్నవారు కొనుగోలు చేసే మద్యం ధర మీద 15% ప్రివిలేజ్ ఫీజు వసూలు చేస్తారు. పర్మిట్లు తీసుకుంటున్న వారిలో దాదాపు 90 % మంది ప్రీమియం మద్యం వినియోగిస్తున్నట్లు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరో 10 శాతం మీడియం బ్రాండ్ల మద్యం వినియోగిస్తున్నారు. సగటున ప్రతి ఫంక్షన్లో 50 ఫుల్ బాటిళ్లు వినియోగిస్తున్నట్లు అంచనా. ఒక్కో బాటిల్ ధర సగటున రూ.1,000గా లెక్కించినా.. ప్రతి బాటిల్‌పై రూ.150 చొప్పున మొత్తంగా రూ.75 కోట్లు æప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వ ఖజానాకు చేరాలి. కానీ పర్మిట్ తీసు కున్నవారు మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసేలా ఎక్సైజ్ అధికారులు వ్యూహం పన్నుతున్నారు. అసలు డిపోల నుంచి మద్యం కొనాలనే నిబంధన పర్మిట్దారులకు తెలియ కుండా చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌హాల్ ఉన్న ప్రాంతం పరిధిలోని మద్యం దుకాణంలోనే కొనాలంటూ లేని నిబంధన పెడుతున్నారు. ఇలా పర్మిట్దారులతో కొనుగోలు చేయించి.. సదరు మద్యం దుకాణం నుంచి 5% కమీషన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏజీ వివరాలు అడిగినట్టు తెలియదు ‘‘ఈవెంట్ పర్మిట్ లైసెన్స్ మీద డిపోల్లో మద్యం తీసుకున్న వారి వివరాలు కావాలని ఎకౌంటెంట్ జనరల్ లేఖ రాసిన విషయం నాకు తెలియదు. దాని మీద నాకు పెద్దగా అవగాహన కూడా లేదు. ఇక టీఎస్‌బీసీఎల్‌కు కూడా లేఖ ఏమైనా రాసిందేమో తెలుసుకోవాలి..’’ – చంద్రవదన్, ఎక్సైజ్ కమిషనర్ నకిలీ లైసెన్సులతోనూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో భారీగా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో సగం వాటిలో మద్యం వినియోగిస్తుంటారు. అయితే ఈ ప్రాంతాల్లో పలువురు ఎక్సైజ్ అధికారులు.. నకిలీ ఈవెంట్ పర్మిట్లు జారీ చేస్తున్నారు. పాత లైసెన్సులను స్కాన్ చేసి ఈఎస్ సంతకం ఫోర్జరీ చేసి కొత్తగా జారీ చేస్తున్నట్లు ఇటీవల గుర్తించారు కూడా. ప్రతి ఈవెంట్ పర్మిట్‌కు ప్రభుత్వం రూ.9,000 ఫీజు వసూలు చేస్తుంది. ఈ లెక్కన ఈవెంట్ పర్మిట్ ఫీజుతోపాటు వారు కొనుగోలు చేసే మద్యంపై ప్రివిలేజ్ ఫీజునూ ప్రభుత్వం కోల్పోతోంది. ఈ మొత్తం విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. -
ఉబెర్‌కు భారీ షాక్
లండన్: లండన్‌లో ప్రయివేట్ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు భారీ షాక్ తగిలింది. ప్రజల భద్రత, ఇతర సెక్యూరిటీ అంశాలు తదితర పలు విషయాల పరిశీలన అనంతరం ఉబెర్ లైసెన్స్‌ను పునరుద్ధరించలేమని లండన్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ స్పష్టం చేసింది. ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్‌గా పని చేయడానికి ఉబెర్ ఫిట్ అండ్ ప్రోపర్గా లేదని వ్యాఖ్యానించింది. అలాగే సంస్థ ప్రవర్తన , విధానం , కార్పొరేట్ బాధ్యత లేకపోవటం తదితర కారణాల రీత్యా ఉబెర్ లెసెన్స్‌ను రెన్యువల్ చేయలేమని లండన్ రవాణా అధికారి శుక్రవారం వెల్లడించారు. అలాగే సంస్థపై తీవ్రమైన నేరారోపణలకు సంబంధించిన కంపెనీ విధానం సరిగా లేదని పేర్కొంది. యాప్‌ను పర్యవేక్షించే స్టాప్‌వేర్ వినియోగం గురించి కూడా ప్రస్తావించింది. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఒక ప్రకటన చేసింది. మరోవైపు ఈ నిర్ణయం అప్పీల్ కు వెళ్లేందుకు ఉబెర్‌కు 21 రోజుల గడువు ఉంది. అయితే ఈ గడువు కాలంలో ఉబెర్ తన కార్యకలాపాలను కొనసాగించవచ్చు. కాగా ఉబెర్ లైసెన్స్ ఈ సెప్టెంబర్ 30న ముగుస్తుంది. నగరంలో 40వేల మంది డ్రైవర్లతో 3.5 మిలియన్ల మంది లండన్ వాసులకు సర్వీసులను అందిస్తోంది. టీఎఫ్ఎల్ నిర్ణయంపై వెంటనే తాము సవాలు చేయాలని భావిస్తున్నామని, న్యాయపోరాటం చేస్తామని స్థానిక ఉబెర్ జనరల్ మేనేజర్ టామ్ ఎల్విడ్జ్ చెప్పారు. TfL has today informed Uber that it will not be issued with a private hire operator licence. pic.twitter.com/nlYD0ny2qo — Transport for London (@TfL) September 22, 2017 -
‘మందు’ షాపులకు మస్త్ డిమాండ్!
-
‘మందు’ షాపులకు మస్త్ డిమాండ్!
- మద్యం దుకాణాల కోసం భారీగా దరఖాస్తులు - ఇప్పటివరకు వచ్చినవి 15 వేలకు పైగానే.. - హైదరాబాద్‌లో మాత్రం ఆదరణ అంతంతే.. - దరఖాస్తుల స్వీకరణకు నేడు చివరి రోజు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సు కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 2,216 దుకాణాలకుగాను సోమవారం రాత్రి వరకు ఏకంగా 15 వేల దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం చివరిరోజు కావడంతో మరో 15 వేల వరకు దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీకి చెందిన మద్యం వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చి దరఖాస్తులు చేస్తున్నారని.. దాంతో భారీగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 276 దుకాణాల కోసం 3,055 దరఖాస్తులు రాగా.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 183 షాపులకు 145 దరఖాస్తులే వచ్చాయి. ఇక్కడ 62 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇక సూర్యాపేట జిల్లా జాన్పహాడ్లోని ఒకే ఒక్క మద్యం దుకాణానికి ఏకంగా 134 దరఖాస్తులు రావడం గమనార్హం. దీనికి మంగళవారం మరో 130 దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ వ్యాపారులు రావడంతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షాపులకు దరఖాస్తులు చేస్తున్నారు. ఏపీలో మద్యం దుకాణాలకు రెండు నెలల ముందే టెండర్ల ప్రక్రియ ముగిసింది. అక్కడ దుకాణాలు దక్కని వ్యాపారులు తెలంగాణకు వరుస కట్టారు. దీంతో ఏపీ సరిహద్దులో ఉన్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో మద్యం దుకాణాలకు భారీగా స్పందన వచ్చింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 276 దుకాణాలకు 3,056 దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల వ్యాపారులు ఇక్కడ భారీగా దరఖాస్తులు చేశారు. సూర్యాపేట జిల్లాలోనైతే ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 70 శాతం మంది ఏపీ వ్యాపారులేనని అంచనా. ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వ్యాపారులు రావడంతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 161 మద్యం దుకాణాలకు ఏకంగా 2,865 దరఖాస్తులు వచ్చాయి. ఒరిజినల్ చలానాతో తగ్గాయి మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకుంటే... మొత్తం లైసెన్స్ ఫీజులో 10 శాతం సొమ్మును (ఈఎండీ) దరఖాస్తు సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చలానా తీసి దరఖాస్తు ఫారానికి జతచేయాలి. దుకాణం రాకపోతే సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. అయితే గతంలో ఒక్కో చలానాపై జిరాక్స్ కాపీలతో 10 దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈసారి దానిని రద్దు చేశారు. ఒరిజినల్ చలానా జత చేసిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనల్లో పేర్కొన్నారు. దీనివల్ల ఒక్కో దరఖాస్తు కోసం గ్రామీణ ప్రాంతాల్లోని షాపులకు రూ. 5.60 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వాటికి రూ. 6.65 లక్షల వరకు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఈసారి దరఖాస్తు ఫీజును ఏకంగా రూ.లక్షకు పెంచారు. ఈ సొమ్మును తిరిగి ఇవ్వరు (నాన్ రిఫండబుల్) కూడా. ఈ మార్పులే లేకపోతే ఊహించని స్థాయిలో భారీగా దరఖాస్తులు వచ్చి ఉండేవని అంచనా వేస్తున్నారు. -
కిక్కే.. కిక్కు!
► కర్నూలు గోదాములో ‘వంద కోట్ల’ మద్యం స్టాక్ ► రహదారుల పక్కన ఉన్న 167 దుకాణాలు, 17 బార్లు రద్దు ► జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న 40 దుకాణాలు, రెండు బార్లు ► మొదటి రోజు రూ.1.50 కోట్ల మద్యం కొనుగోలు ► లైసెన్సుల జారీకి అర్ధరాత్రి వరకు కొనసాగిన కసరత్తు ► దరఖాస్తులు సక్రమంగా ఉంటేనే అనుమతి కర్నూలు: మద్యాన్ని భారీగా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్లూరు శివారు పందిపాడు సమీపంలోని హంద్రీనది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపోలో దాదాపు వంద కోట్ల రూపాయల విలువ చేసే మద్యం నిల్వ చేసింది. నూతన మద్యం పాలసీలో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు ఆదివారం మొదటి రోజు రూ.1.50 కోట్ల విలువ చేసే 3500 బాక్సుల మద్యం, 2200 కేసుల బీర్లను కొనుగోలు చేసి దుకాణాలకుతరలించి అమ్మకాలు ప్రారంభించారు. 204 మద్యం దుకాణాలకు ఈ ఏడాది మార్చిలో లాటరీ విధానం ద్వారా లైసెన్సీలను ఖరారు చేయగా, బార్ల పాలసీలో భాగంగా ఐదేళ్ల కాల పరిమితితో పాతవి 37, తాజాగా 10 బార్లను వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు ఖరారు చేశారు. ఆదివారం నంద్యాల ప్రాంతానికి చెందిన రెండు బార్లకు అనుమతి పత్రాలు జారీ కావడంతో అవసరమైన మద్యాన్ని డిపో నుంచి వారు తరలించారు. బారులు తీరిన మందు బాబులు... కొంతమంది మాత్రమే దుకాణాలు తెరవడంతో మందు బాబులు వాటి ముందు బారులు తీరారు. రెండు రోజులుగా జిల్లాలో మద్యం సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. కర్నూలులోని వక్కెర వాగు పక్కనున్న జీవీఆర్ దుకాణంలో గంట వ్యవధిలో రూ.2.50 లక్షల మద్యం అమ్ముడపోయింది. డిపో నుంచి తీసుకొచ్చిన సరుకును దుకాణం వద్ద దింపుతుండగానే మద్యం బాబులు బారుతీరి కొనుగోలు చేశారు. కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కేవలం 10 దుకాణాలు మాత్రమే తెరుచుకోవడంతో అన్ని చోట్ల కూడా కొనుగోలు కోసం మందు బాబులు క్యూకట్టారు. కోర్టు తీర్పుకోసం ఎదురుచూపు.. నగర, పట్టణాల్లో జాతీయ రహదారులను మేజర్ డిస్ట్రిక్ రోడ్స్ (ఎండీఆర్)గా మార్పు చేయాలని కోరుతూ కర్నూలు పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు కోర్టుకెళ్లారు. హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారి ఏర్పాటుకు ముందు కర్నూలు మున్సిపల్ కార్యాలయం, ఐదురోడ్ల కూడలి, వయా రాజ్‌విహార్ మీదుగా చిత్తూరు–కర్నూలు రోడ్డు ఉండేది. ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికే ఆ రోడ్డు జాతీయ రహదారిగా కొనసాగుతుండటంతో నగరంలోని 80 శాతం దుకాణాలు, బార్లు ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ రోడ్డును మేజర్ డిస్ట్రిక్ రోడ్స్‌గా మార్పు చేయాలని కోరుతూ కేఈ జగదీష్‌గౌడ్ అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. ఈ నెల 6వ తేదీన తీర్పు వెలువడనుంది. అది అమలైతే జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో బార్లు కొనసాగించవచ్చన్న ఆశతో వ్యాపారులు ఉన్నారు. కర్నూలు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 17 బార్లు, నంద్యాల ఎక్సైజ్పరిధిలో రెండు బార్లు రోడ్సైడు ఉన్నాయి. చివరగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం అటు వ్యాపారులు, ఇటు ఎక్సైజ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అభ్యంతరం లేని దుకాణాలకు మాత్రం లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూకట్టిన లారీలు... ఐఎంఎల్ డిపోలో భారీ మొత్తంలో స్టాక్ నిల్వ ఉండటంతో ఆదివారం వచ్చిన సరుకును దింపుకోవడానికి ఇబ్బందిగా మారింది. విజయవాడ, తిరుపతి, సింగరాయికొండతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 27 లారీలు మద్యంతో తరలివచ్చాయి. వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి లారీలతో అక్కడికి తరలిరావడంతో డిపో కిటకిటలాడుతోంది. డిపోలో ఉన్న మద్యాన్ని వ్యాపారులకు కేటాయించిన తర్వాతనే లారీల్లో ఉన్న సరుకును గోదాములోకి అనుమతించారు. స్థానచలనం.. జిల్లాలో 167 మద్యం దుకాణాలు, 17 బార్లకు స్థాన చలనం కలగనుంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి నిబంధనలు పాటించని షాపులు, బార్లు కనిపిస్తే సీజ్ చేయాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు వ్యాపారుల నుంచి వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటేనే ఎక్సైజ్ అధికారులు లైసెన్సు జారీ చేస్తున్నారు. రహదారులకు 500 మీటర్ల అవతల మాత్రమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శనివారం నుంచే అమలులోకి వచ్చింది. దీంతో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో 204 దుకాణాలకు 40 మంది లైసెన్సీలు మాత్రమే అనుమతి పత్రాలను తీసుకెళ్లారు. ఇంకా 164 దుకాణాలకు అనుమతి పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. నంద్యాల ప్రాంతంలో రెండు బార్లకు మాత్రం అనుమతి పత్రాలను ఎక్సైజ్ అధికారులు మంజూరు చేశారు. -
భారీ బడ్జెట్ చిత్రాలకు లైసెన్స్ ‘బాహుబలి’
చెన్నై: మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ మరో అయిదు రోజుల్లో (ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రద్వారా తనదైన గుర్తింపును సాధించిన రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రతిష్టాత్మక చిత్రం భారతదేశ సినీ నిర్మాతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనీ, భారీ చిత్రాలను నిర్మించే లైసెన్స్ ఇచ్చిందని ఏఎన్‌ఓస్‌తో చెప్పారు. .మోహన్ లాల్ చేపట్టబోయే భారీ బహుముఖ చిత్రం "మహాభారత్" రూ. 1000 కోట్ల బడ్జెట్ సినిమాలకు బాహుబలి నాంది పలికిందా అని ప్రశ్నించినపుడు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిర్మాతలు ఆవైపుగా ఆలోచించడం అద్భుతం మన్నారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుందని తెలిపారు. బాహుబలి విజయం భారతీయ చలన చిత్ర నిర్మాతల్లో గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచిదని రానా చెప్పుకొచ్చారు. ఒక భాషలో మొత్తం దేశం కోసం సినిమా చేయడం మిగిలిన సినిమాలకంటే గొప్ప విషయమని బాహుబలి నిరూపించిందన్నారు. దమ్ము ధైర్యం ఉండి, గ్రేట్ సూపర్ హీరో లభిస్తే మధురై నిర్మాత అయినా నమ్మకంతో సినిమా తీస్తే చూడడానికి జనం ఉన్నారని పేర్కొన్నారు. బాహుబలి ది బిగినింగ్ అనూహ్యంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిందని, ఇది తమలో నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. ఈ చిత్రంలోని రెండు భాగాల నుంచి తాను నేర్చుకున్న దాని ఆధారంగా భవిష్యత్తుల్లో పాత్రలను ఎంచుకుంటానని రానా చెప్పారు. అయితే మొదటి భాగంలో యుద్ం, యుద్ధ సన్నివేశాలు లాంటి ప్రతివీ మొదటి ప్రయత్నం, కొత్త కావడంతో కొంత కష్టమనిపించినా , రెండవ భాగంలో చాలా సులువుగా అనిపించిందంటూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించడం ప్రతి రోజూ సవాల్ గా అనిపించిందన్నారు. అయితే మొదటి భాగంలో చేసిన తప్పులను రెండవ భాగంలో దొర్లకుండా జాగ్రత్తపడినట్టు చెప్పారు. మరోవైపు ఈ రెండో భాగంలో బాహుబలి పట్టాభిషేకం, భల్లాల దేవుడికి, అతడికి మధ్య యుద్ధ సన్నివేశాలు రిచ్‌గా ఉంటాయని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రకటించారు. భావోద్వేగ సన్నివేశాలతో , కథ పకడ బందీగా సాగుతుందని చెప్పారు. హీరో ప్రభాస్, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, రమ్యకృష్ణన్ ముఖ్యప్రాతల్లో నటించిన "బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
తాగి నడిపితే రూ.25 వేల జరిమానా
⇒లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేకుంటే రూ. 10వేలు ఫైన్ ⇒వాహనదారులు నిబంధనలు పాటించాల్సిందే ⇒కామారెడ్డి ఎస్పీ ఎన్.శ్వేతారెడ్డి కామారెడ్డి : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం మోటార్ వెహికిల్ యాక్ట్‌ను సవరించిందని, అందులో భాగంగా మద్యం తాగి వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా విధిస్తామని కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టంలో మార్పులు, చేర్పులతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక బ్రీత్ ఎనలైజర్ యంత్రం అందిస్తున్నామని పేర్కొన్నారు. మొదటగా సీఐలు అందరికీ బ్రీత్ ఎనలైజర్లు అందించినట్టు చెప్పారు. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5 వేలు, లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ. 10 వేల చొప్పున, కాలుష్య నిబంధనలు పాటించని వారికి రూ. 1500, సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపితే రూ. వెయ్యి జరిమానా ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు జరిమానాలు చెల్లించిన వారి లైసెన్సులు జప్తు చేయడంతో పాటు రద్దు చేస్తామన్నారు. వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లా అంతటా నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. సీఐలకు బ్రీత్ ఎనలైజర్ల పంపిణీ.. మద్యం తాగి వాహనాలను నడపకుండా కఠినంగా వ్యవహరించేందుకు గాను ప్రభుత్వం ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్కు బ్రీత్ ఎనలైజర్లను ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని ఆయా సర్కిళ్ల ఇన్స్పెక్టర్లకు బ్రీత్ ఎనలైజర్లను ఎస్పీ శ్వేతారెత్డా అందజేశారు. రోడ్లపై మద్యం సేవించి వాహనాలను నడిపితే వారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్లను వాడుతారు. ఇందులో మద్యం తాగినట్టు తేలితే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తారు. జిల్లాలోని ఆయా సర్కిళ్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
మోటారు వాహన ఫీజుల మోత
-
మోటారు వాహన ఫీజుల మోత
► లైసెన్సు, హైపోథికేషన్ , ఫిట్నెస్ చార్జీలను భారీగా పెంచిన కేంద్రం ► వీటికి అదనంగా ప్రభుత్వ ఫీజులు ► కసరత్తు చేస్తున్న అధికారులు ► రెండు మూడు రోజుల్లో అమల్లోకి.. సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చార్జీల మోత మోగించింది. ఇంతకాలం నామమాత్రంగా ఉన్న ఫీజులను భారీగా పెంచింది. ఇప్పటికే రోడ్డు భద్రత చట్టంలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించేవారికి పెనా ల్టీలను భారీగా పెంచే కసరత్తు జరుగు తుండగా... ఏ మాత్రం సమాచారం లేకుండా లైసెన్సు, ఫిట్నెస్ రెన్యూవల్ వంటి ఫీజులను పెం చేసింది. ఈమేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ అందింది. ఆ మేరకు స్థానికంగా ఫీజులను సవరించేందుకు రవాణా శాఖ కసరత్తు ప్రారం భించింది. అదనంగా రాష్ట్ర ఫీజులు సాధారణంగా కేంద్రం నిర్ధారించిన ఫీజు లకు అదనంగా ఇతర రుసుములు జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంటుంది. అందువల్ల ఇప్పటికే కేం ద్రం అమలు చేస్తున్న ఫీజులకంటే ఎక్కువగా మన రాష్ట్రంలో రవాణా శాఖ ఫీజులు ఉన్నాయి. తాజాగా కేంద్రం పలు ఫీజులను పెంచిన నేపథ్యంలో... రాష్ట్రంలో ఆయా ఫీజులు ఏవిధంగా ఉండాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో కొత్త ఫీజులను ఖరారు చేసే అవకాశముంది. ఆ వెంటనే అవి అమల్లోకి వస్తాయి. సాధారణంగా కేంద్రం ఇలాం టి ఫీజులు సవరించేటప్పుడు భారీగా పెంచకుండా ఉంటుంది. కానీ ఈ సారి వందల్లో ఉన్న ఫీజులను వేలల్లోకి మార్చి వాహనదారులపై భారం మోపింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యూవల్ అంశం ప్రస్తుత ఫీజు కొత్త ఫీజు మోటార్ సైకిల్ 100 200 (మాన్యువల్) 400 (ఆటోమేటెడ్) మూడు చక్రాల వాహనం 100 400 (మాన్యువల్) 600 (ఆటోమేటెడ్) మీడియం/హెవీ వెహికిల్ 300 600 (మాన్యువల్) 1,000 (ఆటోమేటెడ్) (ఇవి కేంద్రం నిర్ణయించిన ఫీజులు..వీటికి రాష్ట్ర ప్రభుత్వం మరింత చేర్చి ఫీజులు నిర్ణయిస్తుంది) లైసెన్సు, మోటారు వాహనాల పాత, కొత్త ఫీజులు (రూ.లలో) (కేంద్రం నిర్ణయించిన మేర) అంశం ప్రస్తుత ఫీజు కొత్త ఫీజు తాత్కాలిక లైసెన్స్ (లెర్నర్) 30 150 డ్రైవింగ్ లైసెన్స్ 200 200 అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ 500 1,000 లైసెన్స్ రెన్యూవల్ 50 200 డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్లో ఆలస్యమైతే 100 300 (గ్రేస్ పీరియడ్ గడువు దాటితే ప్రతి సంవత్సరానికి రూ.1,000 చొప్పున అదనంగా చెల్లించాలి) డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ 2500 10,000 డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ 1,500 5,000 అభ్యంతరాలపై అప్పీలుకు ఫీజు 100 500 హైపోథికేషన్ ఒప్పందం మోటార్ సైకిల్ 100 500 మూడు చక్రాల వాహనం 100 1,000 మీడియం/హెవీ వెహికిల్ 100 3,000 -
పిల్లల్ని కనడానికి లైసెన్స్ ఉండాలి
పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ ఉండాలని నటి సంజన అభిప్రాయపడ్డారు. తమిళం, తెలుగు, కన్నడ తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈ భామ కోలీవుడ్‌కు కాదల్ సెయ్‌వీర్ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. తమిళంలో పాపులర్ అయిన నటి నిక్కీగల్రాణి సోదరి అయిన సంజన అందరిలాగా తన గురించి, తన చిత్రాల గురించి కాకుండా ఒక వినూత్న భావాన్ని వ్యక్తం చేశారు. తనేమంటున్నారో చూద్దాం. మోటార్ వాహనాలు నడపడానికి లైసెన్స్ ఉంటుంది. వస్తువుల ఉత్పత్తులకు, వాటి విక్రయాలకు లైసెన్స్ కావలసి ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అవసరం. చాలా మంది తల్లులు పిల్లల్ని కని వారితో బిచ్చమెత్తిస్తున్నారు. కొందరైతే చంటి పిల్లల్ని చంకనేసుకొని అడుక్కుంటున్నారు. మరి కొందరు మహిళలు పిల్లల్ని అద్దెకు తీసుకొచ్చి బిచ్చమెత్తుకుంటున్నారు. ఇంకొందరు సంపాదన కోసమే పిల్లల్ని కంటున్నారు. అలాంటి తల్లులకు లక్ష రూపాయలు ఇచ్చి ఇకపై పిల్లల్ని అడుక్కునే వారిగా తయారు చేయకండి అని చెప్పినా వారిలో మార్పురాదు. మండే ఎండల్లో రోడ్ల పక్కన జీవశ్చవాల్లా పడిఉన్న అలాంటి పిల్లల్ని చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది. వారికి తినడానికి అన్నం, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు. ఇలా చాలా మందిని బాల కార్మికుల్లా మారుస్తున్నారు. అలాంటి బాల కార్మికులు తయారవ్వకుండా ఉండాలంటే పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అమలవ్వాలి. స్త్రీలకు పిల్లల్ని కని పెంచే స్తోమత ఉందా అని విచారించి అందుకు లైసెన్స్ ఇవ్వాలని, అలా లైసెన్స్ లేని వారు పిల్లల్ని కంటే తగిన శిక్ష విదించాలి అని వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు పిల్లలను కనడానికి తల్లులకు లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టు నటి సంజన పేర్కొన్నారు. -
హైవేలపై మద్యం దుకాణాలు మూసేయండి
ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం ► లైసెన్స్ లను మార్చి 31 తర్వాత రెన్యువల్ చేయొద్దు ► దీన్ని ఆదాయ మార్గంగా చూడొద్దు ► సాధారణ ప్రజల ప్రాణాలను పరిగణనలోకి తీసుకోవాలి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణా లను మూసేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత లైసెన్స్ కాలపరిమితి ముగిసే వరకు మాత్రమే ఈ దుకాణాలను నిర్వహించుకోవచ్చంది. వచ్చే ఏడాది మార్చి 31 తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి లైసెన్స్ లను రెన్యువల్ చేయరాదని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి లిక్కర్ విక్రయాలను సూచించే బ్యానర్లన్నంటినీ తొలగించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడుతుండడంపై ఇటీవల సుప్రీం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిం దే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదా రులపై ఉన్న అన్ని మద్యం దుకాణాల్ని మూసివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకే జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం విక్రయాలు జరగ కుండా చూసేలా ఎక్సైజ్ చట్టాలను సవరించాలంటూ దాఖలైన పలు వినతుల నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. హైవేల సమీపంలో లిక్కర్ షాపులకు అనుమతి ఇవ్వాలని, ఇందుకోసం నిబంధనలు సడలించాలన్న పంజాబ్ ప్రభుత్వం వైఖరిని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టింది. మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికుందని గుర్తు చేస్తూ.. సాధారణ ప్రజల మేలుకోసం చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. అదే సమయంలో వివిధ రాష్ట్రాలు సైతం రోడ్ల వెంబడి ఉన్న లిక్కర్ షాపుల్ని తొలగించడంలో నిర్లక్ష్యం చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం పెరిగిపోతున్నదని, దీని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్ల వెంబడి లిక్కర్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఒక ఆదాయ మార్గంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు చూడరాదని హితవు పలికింది. ఈ విషయంలో కేంద్రం సైతం నిర్మాణాత్మకంగా వ్యవహరించక పోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. -
గుట్టు చప్పుడు కాకుండా లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష
కర్నూలు (అగ్రికల్చర్): భూమి రికార్డులు, సర్వే విభాగ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష నిర్వహించారు. ఆదివారం కర్నూలు సమీపంలోని డీఆర్డీఏ శిక్షణా కేంద్రంలో 53 మంది లైసెన్స్‌డే సర్వేయర్లకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు, అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున మామూళ్లు వసూలు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా బయటికి పొక్కకుండా గోప్యంగా పరీక్షలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కూడా ఓసారి గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
ఆహార సంస్థల లెసైన్స్‌ల గడువు మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆహార కంపెనీలను యధేచ్ఛగా నడుపుకునేందుకు లెసైన్స్ తప్పనిసరి. దీన్ని పొందేందుకు కంపెనీలకు మరో మూడు నెలలు గడువు పొడిగించింది భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ). ఈ మేరకు గడువును ఆగస్టు 4 వరకు పొడిగిస్తున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖకు వచ్చిన పలు అభ్యర్థనల మేరకు ఇప్పటికే గడువును 8 సార్లు సవరించారు. చివరిసారిగా మే 4తో గడువు ముగిసింది. -
అమరావతి రాజధాని.. విదేశీ గుప్పెట్లో!
విదేశీ సంస్థలకు రెడ్‌కార్పెట్Z 16 విభాగాల్లో పెట్టుబడులకు రంగం సిద్ధం 18 శాతం వరకు లాభాలకు గ్యారంటీ సేవల రూపంలో పన్నుల బాదుడుకు గ్రీన్‌సిగ్నల్ ‘వ్యాపారాలకు పర్మిట్.. వ్యవహారాలకు లెసైన్స్.. పేరుకు ప్రజలదే రాజ్యం.. పెత్తందార్లదే భోజ్యం..’ అంటూ గళమెత్తిన సినీ కవి ఆవేదన రాజధాని అమరావతి విషయంలో అచ్చంగా సరిపోతోంది. ప్రజా రాజధాని నిర్మిస్తామని చెబుతున్న రాష్ట్ర సర్కారు భూముల నుంచి సేవల వరకు విదేశీ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. రాజధానిని విదేశీ కార్పొరేట్ సంస్థల గుప్పెట్లో పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే అనుమానాలు కలగక మానవు. విజయవాడ బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తోంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్, డిటైల్డ్ మాస్టర్‌ప్లాన్, రాజధాని డిజైన్ వంటి కీలక పనులన్నీ విదేశీ సంస్థలకే అప్పగించిన సర్కారు.. మరో అడుగు ముందుకేసి అభివృద్ధి పనుల పేరుతో ఇక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందవచ్చంటూ విదేశీ సంస్థలను ఆహ్వానిస్తోంది. భూముల నుంచి సేవల వరకు అన్నీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విదేశీ కార్పొరేట్‌కు అనుకూలంగా ప్రణాళిక... కొద్దిరోజుల క్రితం సీఆర్డీఏ ప్రత్యేకంగా పీడబ్ల్యూసీ ప్రైవేటు లిమిటెడ్ ఇండియా అనే సంస్థతో ఒక ప్రత్యేక కార్యాచరణను తయారు చేయించింది. ‘ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ యూకే ఇన్వెస్టర్స్ ఇన్ అమరావతి- ట్వంటీ ఫస్ట్ సెంచరీ కెపిటల్’ పేరుతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రతిపాదించింది. ఏపీ రాజధానిలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతితో పనిలేకుండా వెసులుబాటు కల్పించేందుకు సీఆర్డీఏ రూపొందించిన కార్యాచరణ నిబంధనావళిలో ప్రతిపాదన చేసింది. అమరావతిలో 2020 నాటికి 163 ప్రాజెక్టుల ద్వారా రూ.62,972 కోట్లు, 2050 నాటికి 2,579 ప్రాజెక్టుల ద్వారా రూ.1.94 లక్షల కోట్ల మేరకు విదేశీ సంస్థల పెట్టుబడులు రాబట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. అయితే.. ఆ పేరుతో భూములను విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తూ ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుండటం, ఆనక ఆ సేవలను వినియోగించుకునే క్రమంలో రాజధాని ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేసుకునేందుకు అనుమతులు ఇస్తుండటం చూస్తే.. ఇది నిజంగా ప్రజా రాజధానా? విదేశీ ప్రైవేటు రాజధానా? అనే అనుమానం కలగక మానదు. 16 విభాగాల్లో విదేశీ పెట్టుబడులు... ఇప్పటికే ఇండో-యూకే ఆస్పత్రి ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సంస్థకు అవసరమైన భూముల కేటాయింపునకు రంగం సిద్ధం చేసింది. లండన్‌కు చెందిన కార్పొరేట్ సంస్థకు 1200 ఎకరాలు కేటాయించేలా ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రాజధానిలో 16 విభాగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించి పెట్టుబడులపై దాదాపు 9 నుంచి 18 శాతం లాభాల గ్యారంటీ ఇస్తూ ఒప్పందాలు చేసుకోనుంది. మెట్రో, ఔటర్ రింగ్‌రోడ్డు, కృష్ణా రివర్ ఫ్రంట్ అభివృద్ధి, డర్ట్ యుటిలిటీస్ (రోడ్డు పక్కన ఫైబర్ కేబుల్స్ వేసేందుకు నిర్మాణాలు), వరద నివారణ చర్యలు, వేస్ట్ వాటర్ కలెక్షన్-ట్రీట్మెంట్ సిస్టమ్, మంచినీటి సరఫరా విభాగం, విద్యుత్ సరఫరా, ప్రభుత్వ అధికారులకు గృహ నిర్మాణం, ప్రజలకు 14 వేల ఇళ్లు, 1300 హెక్టార్లలో పారిశ్రామిక జోన్ అభివృద్ధి, సిటీ ఎక్స్‌ప్రెస్ హైవే అభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వైద్య రంగం, నాలెడ్జ్ సిటీలో యూనివర్సిటీలు తదితర విద్యాసంస్థల అభివృద్ధి, మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్స్ ఎడ్యుకేషన్ (ఎంఐసీఈ) వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులను నేరుగాను, పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్), బీవోటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) పద్ధతుల్లో ప్రభుత్వం అవకాశం ఇస్తుండటం గమనార్హం. అదే జరిగితే రోడ్డు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టే రాజధానిలో విదేశీ సంస్థలు పెట్టుబడులు రాబట్టుకునేందుకు, సేవల పన్ను వసూళ్లకు ప్రభుత్వమే నేరుగా అవకాశం కల్పించడంతో రాజధాని ప్రజలపై అదనపు భారం తప్పదు. -
వాట్సాప్ గ్రూప్ పెట్టాలంటే.. లైసెన్స్ తీసుకోవాలి!
శ్రీనగర్: వాట్సాప్‌లో గానీ, ఫేస్బుక్లో గానీ యూజర్లు ఎవరైనా ఉచితంగా గ్రూప్ ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ, స్థానిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని.. వాట్సాప్ గ్రూపులపై ఉక్కుపాదం మోపాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది. వాట్సాప్‌లో ఒక గ్రూప్‌ను నడిపించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, లైసెన్స్ లాంటి ధ్రువపత్రం సంబంధిత అధికారుల నుంచి పొందాలని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో యూజర్ల ప్రైవసీని వాట్సాప్ కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ముప్తి మెహబూబా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అల్లర్లకు ఆజ్యం పోస్తున్న సోషల్ మీడియా వేదికలపై ఉక్కుపాదం మోపాలని తాజాగా నిర్ణయించింది. దీంతో వాట్సాప్‌లో గ్రూప్ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్న నిబంధన కలిగిన తొలి ప్రాంతం ప్రపంచంలో ఇదే కావొచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది. 'సోషల్ మీడియా న్యూస్ ఏజెన్సీస్ నిర్వాహకులందరూ తమ గ్రూప్‌లలో వార్తలు పోస్టు చేసేందుకు సబంధిత జిల్లా డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని డివిజనల్ కమిషనర్ గురువారం ఆదేశాలు ఇచ్చారు' అని ప్రభుత్వ ప్రకటన ఒకటి మంగళవారం వెల్లడించింది. కశ్మీర్లో ఏ చిన్న అలజడి జరిగినా రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హంద్వారాలో కాల్పుల నేపథ్యంలో మూడురోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజాగా వాట్సాప్ గ్రూపులపై కూడా ఆంక్షలు విధించడంపై కశ్మీర్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతా అత్యాధునిక సాంకేతికతతో ముందుకుసాగుతుంటే.. సోషల్ మీడియా వినియోగం విషయంలోనూ తమపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. -
రెండు మెడికల్ షాపులు సీజ్
బోయిన్పల్లి (కరీంనగర్) : లైసెన్స్‌లు లేకుండా ఔషధాలు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెండు మెడికల్ షాపులను ఔషధ తనిఖీ అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండల వ్యాప్తంగా ఔషధ దుకాణాల్లో అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలకు దిగారు. ఏడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి వచ్చిన టీమ్ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా బోయిన్‌పల్లిలో ఓ షాపు, కుదురుపాకలో మరొక షాపులో లెసైన్స్‌లు లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నట్టు బయటపడింది. రెండు షాపులు సీజ్ చేసి, రూ.90వేల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. -
రవాణాలో రాజ్యమేలుతున్న అవినీతి
లెసైన్సులు మొదలు ఫిట్నెస్ సర్టిఫికెట్ల మంజూరు వరకు సొమ్ముల కోసం సరిహద్దులూ దాటేస్తున్నారు ఇక్కడి బ్రేక్ ఇన్స్పెక్టర్ నెల్లూరులో చిక్కడమే ఇందుకు నిదర్శనం ఎంతమంది పట్టుబడ్డా లెక్కచేయని తీరు విజయవాడ సిటీ : రవాణా శాఖలో అవినీతి ‘హద్దు’లు దాటుతోంది. లెసైన్స్‌లు మొదలు ఫిట్నెస్ లేని వాహనాలకు పర్మిట్ల మంజూరు వరకు డబ్బులు గుంజేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ రవాణా శాఖ అధికారులు వదులు కోవడం లేదు. డబ్బులు వస్తాయంటే సరిహద్దులను సైతం దాటతారనడానికి నెల్లూరు జిల్లాలో ఇక్కడి అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి పోలీసులకు చిక్కడమే నిదర్శనం. కలకలం నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి పట్టుబడటం ఇక్కడ కలకలం రేపింది. గన్నవరం సమీపంలోని అంపాపురం డ్రైవింగ్ సెంటర్లో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ హోదాలో లెసైన్స్‌ల మంజూరును ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆమె తనిఖీలు చేయాల్సి వస్తే విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. గుడివాడ ఆర్టీవో కార్యాలయం పరిధిలో కూడా తనిఖీ చేయరా దు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆదేశానుసారం, అది కూడా ఉప రవాణా కమిషనర్ పరిధిలో మాత్రమే చేసే అవకాశం ఉంది. అందుకు విరుద్ధంగా ఆమె నెల్లూరు జిల్లాలో తనిఖీల పేరిట హడావుడి చేయడం ఇక్కడి సిబ్బందిని ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. పైగా సెలవులో ఉండి తనిఖీలేంటంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. తనతో నిమిత్తం లేకుండా డ్రైవర్ కక్కుర్తిపడి మామూళ్లు వసూలు చేశాడని చెప్పడాన్ని తప్పుబడుతున్నారు. బేఖాతరు గత ఫిబ్రవరిలో రవాణా శాఖ కార్యాలయంలో ఎల్.ఎల్.ఆర్ లెసైన్స్‌ల విభాగాన్ని ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ చర్యలను తప్పుబట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని ఏజెంట్ల కార్యాలయంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1.62 లక్షల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిఘా కొనసాగుతోంది. అయితే నిఘాను బేఖాతరు చేస్తూ వేర్వేరు మార్గాల్లో అక్రమార్జనకు దిగుతున్నట్టు కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
వాహనదారుల్లో లైసెన్స్ భయం
పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో పెరుగుతున్న దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ► పక్షం రోజుల క్రితం... నగరంలోని రవాణాశాఖ కార్యాలయాల్లో తాత్కాలిక లెసైన్సుల కోసం వచ్చే వారి సంఖ్య సగటున రోజుకు 600. ► సోమవారం తాత్కాలిక లెసైన్సు కోసం 2300 మంది కార్యాలయాలకు వచ్చారు. ఈనెల 1వ తేదీ నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ రోజుకు సగటున రెండు వేల మందికి చేరుకుంది. ► తాత్కాలిక లెసైన్సుల కోసం వాహనదారులు ఎగబడుతున్నారు. ఒక్కసారిగా ఇంత రద్దీ ఎందుకు పెరిగిందో తెలుసా..!! లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై ట్రాఫిక్ పోలీసులు విరుచుకుపడటమే దీనికి కారణం. లెసైన్సు లేకుంటే జరిమానాతో సరిపెడుతూ వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఏకంగా వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు వాహనదారుకు ఒకరోజు జైలు శిక్ష విధిస్తుండటంతో లెసైన్సులేని వారిలో కలవరం మొదలైంది. హైదరాబాద్‌లో దాదాపు 46 లక్షల వాహనాలుంటే లెసైన్సుల సంఖ్య 34 లక్షలున్నట్టు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. అంటే మరో 12 లక్షల మంది లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నట్టు స్పష్టమైంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు లెసైన్సు లేనివారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. మార్చి ఒకటి నుంచి మోటారు వాహనాల చట్టంలోని అంశాలను కఠినంగా అమలు చేయనున్నట్టు కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తూ వస్తున్నారు. లెసైన్సు, వాహనాలకు సంబంధించిన పత్రాలు, వాహన రిజిస్ట్రేషన్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటం, సిగ్నల్ జంపింగ్, ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపటం... తదితర అంశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ముమ్మరంగా ప్రచారం చేశారు. చెప్పినట్టుగానే మార్చి ఒకటి నుంచి కొరడా ఝళిపించటం మొదలుపెట్టారు. ముఖ్యంగా లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై దృష్టి సారించారు. తొలిసారి పట్టుబడితే జరిమానాతో వదిలేస్తున్న పోలీసులు తదుపరి పట్టుబడిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో దాదాపు వంద వాహనాలను సీజ్ చేసి వాహనదారులపై కేసులు నమోదు చేశారు. వారికి ఒకరోజు జైలు శిక్ష విధిస్తుండటంతో మిగతావారిలో భయం పట్టుకుంది. దీంతో తాత్కాలిక లెసైన్సు కోసం రవాణాశాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. గతంతో పోలిస్తే వీరి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
తాగి నడిపితే అంతే సంగతులు!
గ్రేటర్ హైదరాబాద్ వాహనదారులు ఇకముందు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిబంధనలను కఠిన తరం చేయబోతున్నారు. ద్విచక్ర వాహన దారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తులూ హెల్మెట్ తప్పని సరి చేయబోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ఇప్పటి వరకు జరిమానా విధించడంతో సరిపుచ్చుతున్నారు. ఇకనుంచి అలా కాకుండా లెసైన్స్ రద్దు చేసే విధానాన్ని త్వరలోనే అమలులోకి తేనున్నారు. అతి వేగంగా నడపడం, ట్రాఫిక్ సిగ్నల్ ఖాతరు చేయకుండా వెళ్లడం, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం... వీటిల్లో ఏది ఉల్లంఘించినా డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేయనున్నారు. ఇలా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను రవాణా శాఖ కు సమర్పించి నిర్ణీత కాలం పాటు డ్రైవింగ్ లెసైన్స్ సస్పెండు చేయించే విధంగా చర్యలకు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు ఉపక్రమిస్తున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్ లో ఉన్నప్పుడు వాహనాలను నడిపినట్టు తేలితే నడిపిన వ్యక్తిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తారు. దానికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష తప్పదు. ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాలను అధ్యయనం చేసిన తర్వాత టూ వీలర్ల విషయంలో వెనుక కూర్చున్న వారే ఎక్కువగా మృత్యు వాత పడటం గమనించిన తర్వాత ఇక నుంచి వెనుక కూర్చొని ప్రయాణించే వారికీ హెల్మెట్ తప్పని సరి చేయాలని నిర్ణయించినట్టు హైదరాబాద్ నగర ట్రాఫిక్ కమిషనల్ జితేందర్, రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా శుక్రవారం మీడియా సమావేశంలో ఇలాంటి పలు విషయాలను వెల్లడించారు. -
రిలయన్స్‌కు 4జీ లెసైన్స్ వివాదం..
తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్)కు 4జీ లెసైన్స్ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ... దాఖలైన ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పీఐఎల్)పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసుకుంది. ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయని సీపీఐఎల్ అనే ఒక ప్రభుత్వేతర స్వచ్చంధ సంస్థ(ఎన్జీఓ) ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ అటు కేంద్రానికి, ఇటు ఎన్జీఓలకు స్పెక్ట్రమ్ వినియోగ చార్జీ, మైగ్రేషన్ విధానాలపై పలు ప్రశ్నలు సంధించింది. వాదనల తీరిది...: ఎన్జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. బ్రాడ్‌బ్యాండ్ వైర్లెస్ వ్యవస్థకు స్పెక్ట్రమ్... డేటాకు సంబంధించినదేతప్ప, వాయిస్ కాలింగ్‌కు కాదన్న కాగ్ ముసాయిదా నివేదిక ఆధారంగా పిల్‌ను దాఖలు చేసినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీగా రిలయన్స్ కేవలం 1% చెల్లిస్తే... మిగిలిన కంపెనీలు అత్యధికంగా 5% వరకూ చెల్లించిన విషయాన్ని ఆయన ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. 20 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌కు బిడ్ దాఖలు చేసిన ఇన్ఫోటెల్ను ‘బినామీ’ కంపెనీగా పేర్కొన్న న్యాయవాది, బిడ్‌ను (రూ.12,000 కోట్లు) గెలుచుకున్న కొద్ది గంటల్లోనే కంపెనీని రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. అయితే రిలయన్స్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, కాగ్ నివేదిక సరికాదని అన్నారు. స్పెక్ట్రమ్‌కు సంబంధించి ఒక సమగ్ర మైగ్రేషన్ విధానం ఉందని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. -
ముగిసిన మద్యం షాపుల లైసెన్స్ గడువు
హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల లైసెన్స్‌ల కోసం గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే కొన్ని జిల్లాల్లోని షాపుల కోసం మాత్రం దరఖాస్తులు రాలేదు. ఈ నేపధ్యంలో దరఖాస్తులు రానీ షాపులకోసం రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
భారీ పేలుడు.. 90 మంది బలి
మధ్యప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన.. 100 మందికి పైగా గాయాలు.. బావి తవ్వకాల కోసం ఇంట్లో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు విస్ఫోటనంతో జనసమ్మర్ద ప్రాంతంలో కుప్పకూలిన 2 భవనాలు మృతుల్లో అత్యధికులు కూలి పని కోసం నిరీక్షిస్తున్న కూలీలే ఝబువా (మధ్యప్రదేశ్): బావుల తవ్వకాల కోసం భారీ స్థాయిలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలు పేలిపోవటంతో మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలో 90 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది కూలి పని కోసం నిరీక్షిస్తున్న కూలీలే. రాతి ప్రాంతాల్లో బావులు తవ్వేందుకు లెసైన్స్ కలిగివున్న రాజేంద్ర కసావా అనే వ్యక్తి తన నివాస భవనంలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్‌లను నిల్వ ఉంచాడు. రెండు దుకాణాలు కూడా ఉన్న ఈ రెండంతస్తుల భవనం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద రద్దీ ప్రాంతంలో ఉంది. దీనికి ఆనుకుని చాలా రద్దీగా ఉండే మూడంతస్తుల సెథియా రెస్టారెంట్ కూడా ఉంది. శనివారం ఉదయం 8:30 గంటలకు రాజేంద్ర భవనంలో పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఆ భవనం కుప్పకూలింది. దానికి ఆనుకుని ఉన్న రెస్టారెంట్ కూడా ధ్వంసమయింది. ఆ సమయంలో రెస్టారెంట్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారని, సమీపంలో రోజు కూలీలు కూడా చాలా మంది కూర్చుని ఉన్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం 90 మంది మృతిచెందగా వారిలో ఎక్కువ మంది రెస్టారెంట్ సమీపంలో కూలిపని కోసం నిరీక్షిస్తున్న రోజు కూలీలేనని అధికారులు తెలిపారు. అలాగే.. గుజరాత్ వెళ్లేందుకు ప్రయాణమై రెస్టారెంట్ వద్ద టీ, టిఫిన్లు చేయటానికి నిలుచుని వున్న మరికొందరు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొదట టపాసుల పేలుళ్ల చప్పుళ్లు... ‘కింది అంతస్తులో రెండు దుకాణాలు కూడా ఉన్న ఆ భవనం నుంచి మొదట టపాసులు పేలిన చప్పుళ్లు వినవచ్చాయి. తర్వాత ఎవరో ఒక షాపు షట్టరు తెరిచారు. దీంతో భారీ విస్ఫోటనం సంభవించింది. జనం ప్రాణాలు దక్కించుకోవటానికి పరుగులు తీశారు. అలా పారిపోయిన వారే ప్రాణాలతో బయటపడ్డారు. వారికి కూడా గాయాలయ్యాయి’’ అని బలరామ్ అనే కూలి తెలిపారు. ఆయన కూడా ఈ పేలుడులో గాయపడ్డారు. విస్ఫోటనంతో మనుషులు ముక్కలు చెక్కలయ్యారని.. శరీర భాగాలు ముక్కలుగా తెగి గాలిలోకి ఎగిరిపడటం చూశామని ఈ పేలుడు నుంచి గాయాలతో బయటపడ్డ నర్సింగ్ (42) అనే వ్యక్తి తెలిపాడు. ధ్వంసమైన రెండు భవనాల శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని పేర్కొన్నాడు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు జిల్లా పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంతర్సింగ్ ఆర్యలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఝబువా జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులకు కూడా అదే ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాన్ని పంపించారు. కుప్పకూలిన నిర్మాణాల శిథిలాలను తొలగించేందుకు గుజరాత్‌లోని వడోదర నుంచి మరొక బృందాన్ని తరలించారు. ఈ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్‌గౌర్ తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని సంతాపం... మధ్యప్రదేశ్‌లో విస్ఫోటనంలో ప్రజలు మృతి చెందటం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా తీవ్ర సంతాపం తెలిపారు. -
మద్యం వ్యాపారాలకు మండలం గుత్త!
ఒక్కో మండలంలో ఒక్కరికే మద్యం లెసైన్స్ ఆ పరిధిలోని గ్రామాల్లో దుకాణాలు, బి-లెసైన్సులు వారికే రూ.1.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఫీజు గ్రామాల్లో అమ్మకాలకు అదనపు ఫీజులు ఇక కోటీశ్వరులే మద్యం వ్యాపారులు దరఖాస్తు ఫారం ధరే రూ. 2 లక్షలు! జిల్లాలకు పరుగు తీసే యోచనలో ‘గ్రేటర్’ మాఫియా హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం వ్యాపారం ‘గంపగుత్త’గా మారిపోనుంది.. మద్యం వ్యాపారం కోటీశ్వరుల చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఒక మండలంలో మద్యం విక్రయాలు మొత్తం ఒక్కరి చేతుల్లోనే ఉండనున్నాయి. ప్రధాన మద్యం దుకాణాలతోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసుకునే బి-షాపులు కూడా వారి పరిధిలోనే ఉండనున్నాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన ఎక్సైజ్ విధానంలో మండలం యూనిట్‌గా మద్యం దుకాణాలకు లెసైన్సులను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి కారణం. దీంతో రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కన్నా గ్రామీణ మండలాల్లో మద్యం వ్యాపారమే ఇక ఖరీదు కాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మద్యం దుకాణం లెసైన్సు పొందాలంటే ఏడాదికి రూ.90 లక్షల ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఒక మండలంలో మద్యం దుకాణం లెసైన్సు పొందాలనుకుంటే మాత్రం కనీసం రూ.1.5 కోట్ల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉండనుంది. మండలంలో మద్యం వ్యాపారం చేయాలనుకునేవారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెట్టగలిగితే తప్ప వ్యాపారం చేసే అవకాశం కనిపించడం లేదు. మండలం లెసైన్సు పొందినవారు.. గతంలో సారా కాంట్రాక్టులు నిర్వహించిన తరహాలో గ్రామాల్లో అనుబంధ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం నుంచే..! అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో విడుదల కానుంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. మండలాల్లో దరఖాస్తు ఫారం ఖరీదే రూ.2 లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం. తిరిగి ఇవ్వని ఈ దరఖాస్తు ఫారం ధర గతంలో రూ.25వేలే. దీనిని రూ.2లక్షలకు పెంచడం వెనుక ఆదాయ సమీకరణతో పాటు మండలాల్లో డిమాండ్‌ను తగ్గించాలన్న ఆలోచన కూడా కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మినహా గ్రామీణ మండలాలు 438 ఉన్నాయి. వీటిలో కార్పొరేషన్ల సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న 18 వరకు మండలాలను నగర పరిధిలోనివేగానే పరిగణిస్తారు. మిగతా సుమారు 420 మండలాలను ప్రత్యేక యూనిట్లుగా గుర్తించి లెసైన్సు ఫీజులు నిర్ణయించనున్నట్లు సమాచారం. ప్రారంభమే రూ.కోటిన్నర! ఇప్పటివరకు జనాభా ప్రాతిపదికన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి లెసైన్సు ఫీజును నిర్ణయించారు. 10వేల జనాభాలోపు గ్రామీణ ప్రాంతాల్లో దుకాణానికి రూ.32.5 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న చోట దుకాణానికి రూ.34 లక్షలు లెసైన్సు ఫీజుగా ఉండేది. కానీ కొత్త విధానంలో ఒక మండలం మొత్తాన్ని ఒక వ్యాపారికే ధారాదత్తం చేస్తారు. 2014-15లో ఒక మండలంలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వచ్చిన లెసైన్సు ఫీజు, ప్రివిలేజ్ ఫీజును పరిగణనలోకి తీసుకుని కొత్త లెసైన్సు ఫీజును నిర్ణయిస్తారు. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో.. మండల కేంద్రంలో 8, గర్రెపల్లి, తొగర్రాయిల్లో ఒక్కోటి చొప్పున 10 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో దుకాణం నుంచి రూ.34 లక్షల చొప్పున 3.40కోట్లు లెసైన్సు ఫీజుగా వచ్చింది. ప్రివిలేజ్ ఫీజు, గుడుంబా అమ్మకాలను బేరీజు వేసుకుని.. ఈ మండ లం లెసైన్సు ఫీజును ఈసారి రూ.4 కోట్లకు పైగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలున్న కొన్ని మండలాల్లో మాత్రమే లెసైన్సు ఫీజును రూ.1.5 కోట్లుగా నిర్ణయించారని... జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మండలాల్లో రూ.5 కోట్ల వరకు ధర నిర్ణయించినట్లు సమాచారం. ఇక మండలం లెసైన్సు పొందిన వ్యాపారి గ్రామాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కో బి-లెసైన్సు కింద రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించాలి. గ్రామాల్లో జనాభా, గుడుంబా అమ్మకాలు, ఇతర ప్రమాణాలను పరిగణ నలోకి తీసుకుని ఒక్కో మండలంలో 10 నుంచి 20 వరకు బి-లెసైన్సులు జారీచే సే అవకాశం ఉంది. రూ.10 కోట్లు చేతిలో ఉంటేనే.. తక్కువ లెసైన్సు ఫీజు ఉన్న మండలాల్లో మద్యం వ్యాపారం తక్కువే కాబట్టి వ్యాపారులు ఎక్కువ ఫీజు ఉన్న దుకాణాలవైపే మొగ్గు చూపుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.90 లక్షలు చెల్లించి ఒక దుకాణం నడపడం కంటే రూ.5 కోట్లు చెల్లించి మండలంపై గుత్తాధిపత్యం వహించడమే మేలన్న ధోరణిలో వ్యాపారులు ఉన్నారు. ఇలాంటి మండలాల్లో కనీసం రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టే స్థోమత ఉన్నవారే దరఖాస్తులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లెసైన్సు ఫీజుతో పాటు ఏరోజుకారోజు డీడీలు చెల్లించి డిపోల నుంచి మద్యం తెప్పించడం, గ్రామాలకు సరఫరా చేసేందుకు వాహనాలు, సిబ్బంది, ఇతర నిర్వహణ ఖర్చులు కోటీశ్వరులకు మాత్రమే సాధ్యమని ఎక్సైజ్ అధికారులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం వ్యాపారం చేస్తున్న వారు కూడా జిల్లాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో స్థానికులతో కలిసి మద్యం వ్యాపారం చేసుకుంటే ఆదాయం, గుత్తాధిపత్యం సొంతమవుతాయనే ఆలోచనలో వారు ఉన్నారు. -
‘ప్రివిలేజ్’ ఆదాయం రూ. 404 కోట్లు
ప్రభుత్వానికి మద్యం ద్వారా అదనపు ఆదాయం ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిన అమ్మకాలు 2,033 దుకాణాల్లో లెసైన్స్ ఫీజు కన్నా ఏడు రెట్లకు మించి అమ్మకాలు ఏపీలో ప్రివిలేజ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయం రూ. 20 కోట్లు మాత్రమే హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. గడిచిన ఆబ్కారీ సంవత్సరం(జూలై 2014- జూన్ 2015) లో రాష్ట్రంలో చలామణిలో ఉన్న 2,113 మద్యం దుకాణాలకు గాను ఏకంగా 2,033 షాపుల్లో మద్యం వ్యాపారం మూడు బీర్లు, ఆరు బాటిళ్లుగా కొనసాగింది. ఈ దుకాణాల నిర్వహణ కోసం వ్యాపారులు చెల్లించిన లెసైన్సు ఫీజు కన్నా ఏడు రెట్లకు మించి అమ్మకాలు సాగాయి. తద్వారా ఆబ్కారీ శాఖకు ప్రివిలేజ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయం ఏకంగా రూ. 404 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో 4,380 దుకాణాలకు గాను కేవలం రూ. 20 కోట్లు మాత్రమే ప్రివిలేజ్ ఫీజు వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. లెసైన్స్ ఫీజులో 50 శాతం మేర ప్రివిలేజ్ ఫీజు: జూలై 2014 నుంచి జూన్ 2015 వరకు సాగిన ఎక్సైజ్ సంవత్సరానికి 2,216 దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తే 2113 దుకాణాలను వ్యాపారులు తీసుకున్నారు. ఈ షాపులకు లెసైన్స్ ఫీజు రూపంలో రూ. 986 కోట్లు ఎక్సైజ్ శాఖకు ఆదాయంగా లభించింది. మద్యం దుకాణదారుడు తాను చెల్లించిన లెసైన్స్ ఫీజు కన్నా ఏడు రెట్లు మద్యం అమ్మకాలు దాటితే 13.6 శాతం ప్రివిలేజ్ ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, గోదావరి ఖని, ఖమ్మం తదితర ప్రాంతాల్లో తొలి 9 నెలల్లోనే ఈ ఏడు రెట్ల టార్గెట్ దాటిపోయింది. ఏడు రెట్ల మార్కు దాటిన వ్యాపారులు మద్యం డిపోల్లో చేసే ప్రతి బాటిల్ కొనుగోలు మీద 13.6 శాతం ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 80 దుకాణాలు మాత్రమే ప్రివిలేజ్ ఫీజు చెల్లించాల్సి రాలేదు. వార్షిక రెవెన్యూ రూ. 11,044 కోట్లు ఎక్సైజ్ శాఖ 2014 జూలై నుంచి జూన్ 2015 వ రకు రూ. 11,044 కోట్లు రెవెన్యూ సాధించింది. ఇందులో రూ. 986 కోట్లు లెసైన్సు ఫీజు రూపం లో కాగా, ప్రివిలేజ్ ఫీజు ద్వారా రూ. 404 కోట్లు లభించింది. మిగతా మొత్తం దాదాపుగా మద్యం అమ్మకాలపైనే లభించింది. కాగా 2013- 14లో వచ్చిన రెవెన్యూ రూ. 9481 కోట్లు. ఈసారి జులై నుంచి అమలు కావలసిన నూతన మద్యం విధానాన్ని అక్టోబర్‌కు వాయిదా వే సిన ప్రభుత్వం పాతవారికి మూడునెలల పాటు లెసైన్సులు రెన్యూవల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అయితే అమ్మకాలు సరిగా లేని రాష్ట్రంలోని 80 దుకాణాలను వ్యాపారులు రెన్యూవల్ చేయించుకోలేదు. అలాగే 27 బార్లు కూడా రెన్యూవల్ కాలేదు. -
ఏపీలో ఏరులై పారనున్న మద్యం
-
మార్ఫింగ్ మాయ
- లెసైన్స్‌ల జారీకి నకిలీ ధ్రువీకరణ పత్రాలు - కన్సల్టెన్సీలు కేంద్రంగా జోరుగా దందా - రూ.లక్షలు ఆర్జిస్తున్న నిర్వాహకులు - కొరవడిన పోలీసుల నిఘా సాక్షి, హన్మకొండ : రవాణా శాఖ కార్యాలయూలను కేంద్రంగా చేసుకున్న కన్సల్టెన్సీలు నకిలీ ధ్రువీకరణ పత్రాల తయూరీకి తెరలేపాయి. డ్రైవింగ్ లెసైన్స్‌ల కోసం వచ్చేవారిని మచ్చిక చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. లెసైన్సు పొందాలంటే విద్యార్హత, వయస్సు, నివాస స్థలం వివరాల ధ్రువపత్రాలు తప్పనిసరి. ద్విచక్రవాహనదారులు, లైట్ వెయిట్ ఫోర్ వీలర్ వాహనాల డ్రైవింగ్ లెసైన్సు కోసం వచ్చే దరఖాస్తుదారులకు నిబంధనలతో ఇబ్బంది లేదు. కానీ, లారీలు, ట్రక్కు లు నడిపేందుకు లెసైన్సు కోసం దరఖాస్తు చేసేవారిలో ఎక్కువ మందికి పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు(టెన్త్ మెమో) ఉండటం లేదు. విద్యార్హతలు లేని వ్యక్తులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందచేస్తూ పలు ఆర్టీఏ కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఇతరుల సర్టిఫికెట్స్ డౌన్లోడ్చేస్తున్నారు. ఆ తర్వాత పేరు, ఫొటో, పుట్టిన రోజు తదితర వివరాలు మార్ఫింగ్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుని తాత్కాలిక ప్రయోజనం కలిగించే నకిలీ టెన్త్ సర్టిఫికేట్లను అందిస్తున్నారు. వీటిసాయంతో సదరు వ్యక్తులు ఆర్టీఏ కార్యాలయం నుంచి లెసైన్స్‌లు పొందుతున్నారు. జిల్లా అంతటా ఇదే తీరు డిప్యూటీ రవాణా కమిషనర్, వరంగల్ కార్యాలయంతోపాటు జనగామ, మహబూబాబాద్ ప్రాంతీయ కార్యాలయాలు కేంద్రంగా పని చేస్తున్న కన్సల్టెన్సీలు మార్ఫింగ్‌కు పాల్పడుతున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారు చేయడం ద్వారా కన్సల్టెన్సీలు నెలవారీగా లక్షలాది రూపాయలు అక్రమర్గాల్లో సంపాదిస్తున్నాయి. కన్సల్టెన్సీ నిర్వాహకులు, ఆర్టీఏ కార్యాలయం సిబ్బందికి మధ్య ఉన్న అవగాహన కారణంగా ఈ తతంగం జోరుగా సాగుతోంది. ఈ నకిలీ దందాకు అలవాటు పడిన కింది స్థాయి సిబ్బంది తాజాగా దరఖాస్తుతోపాటు అన్ని ధ్రువపత్రాలు జతపరిచినా రకరకాల సాకులు చూపుతూ సరిగా లేవంటూ కొర్రీలు పెడుతున్నారు. ఇటీవలే ఈ విషయంపై ఆర్టీవోకు ఫిర్యాదులు అందాయి. పట్టించుకోని పోలీస్ శాఖ నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారీ రాకెట్‌పై గతంలో పోలీసులు ఉక్కుపాదం మోపారు. మూడు నెల క్రితం ఆర్టీఏ కార్యాలయ సమీపంలో పనిచేస్తున్న కన్సల్టెన్సీ కేంద్రాలపై మిల్స్‌కాలనీ పోలీసు దాడులు చేశారు. ఈ దాడుల్లో నకిలీ టెన్త్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించి ఒక కన్సల్టెన్సీని సీజ్ చేసి నిర్వహకుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరిపై పోలీసు విభాగం దృష్టి సారించలేదు. దీనితో ఈ దందా తాత్కాలికంగా సద్దుమణిగిన ఇటీవల మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంది. కరీమాబాద్, కాశీబుగ్గ, హన్మకొండలకు చెందిన పలువురు కన్సల్టెన్సీలు ఈ దందాలో ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వందలాది నకిలీ సర్టీఫికెట్లతో ఆర్టీఏ లైన్సులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. -
ధరల ‘కిక్కు’
ధరల కిక్కుతో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ప్రివిలేజ్ ఫీజు పేరుతో అదనపు వసూళ్లకు దిగారు. వ్యాపారులంతా సిండికేటై దోపిడీకి పూనుకున్నారు. షాపుల్లో ఉన్న ధరల పట్టికను సైతం పక్కకు పడేసి యథేచ్ఛగా అదనపు ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. కళ్లెదుటే అదనపు ధరల దోపిడీ కనబడుతున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మద్యం వ్యాపారులు బరి తెగించారు. లెసైన్స్ గడువు ముగుస్తుండటంతో అంతా సిండికేట్ అయ్యి ధరలు పెంచేశారు. ఏ బ్రాండ్ అయినా ఒక్కో ఫుల్‌బాటిల్‌కు రూ.20 నుంచి 30 వరకు అదనంగా రేటు పెంచి అమ్ముతుండటంతో మందుబాబుల జేబుకు భారీగానే చిల్లు పడుతోంది. దండిగా మామూళ్లు అందుకుంటున్న ఎక్సైజ్ అధికారులు రెట్టింపు వ్యాపారానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు వినపడుతున్నాయి. జిల్లాలో ప్రతినెల రూ.50 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ఈ అదనపు బాదుడుతో మందుబాబులు మరో రూ.10 కోట్లు వదిలించుకోక తప్పదు. జూన్ 30వ తేదీతో వైన్ షాపుల లెసైన్స్ గడువు ముగియనుండటంతో మద్యం దుకాణాలు రెట్టింపు ధరలతో ఊగిపోతున్నాయి. ‘ప్రివిలేజ్’ దెబ్బకు సిండికేట్ విరుగుడు జిల్లాలో మొత్తం 148 లెసైన్స్డ్ వైన్ షాపులున్నాయి. వీటి ద్వారా ప్రతినెలా రూ.50 కోట్ల మద్యం వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వం ఏడాది కాలపరిమితో జారీ చేసిన లెసైన్స్ గడువు వచ్చే నెలాఖరుతో ముగస్తుంది. ప్రభుత్వం షాపుల యజమానుల అదనపు ఆదాయానికి గండి పెడుతూ ప్రివిలేజ్ (నిర్దేశించిన దానికన్నా ఎక్కువ వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి చెల్లించేది) ఫీజు విధించింది. దీని ప్రకారం మద్యం అమ్మకాలపై లాభాల రేటు కాస్తా అటు ఇటుగా 17 శాతం లభించనుంది. లెసైన్స్‌ల జారీ సమయంలో నిర్ణీత లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు అమ్మకాలు సాగించినా షాపు యజమానులకు లాభాల్లో కోత పెట్టే సరికొత్త నిబంధనను దీంట్లో చేర్చారు. జిల్లాలో ఇప్పటికే అన్ని వైన్ షాపులు ఈ ప్రివిలేజ్ ఫీజు పరిధిలోకి వచ్చాయి. ఒక్కసారిగా లాభాలు పడిపోయాయనుకున్న వ్యాపారులు ఈ అదనపు అమ్మకాల వ్యవహారానికి ప్లాన్ వేసి సిండికేట్ అయ్యారు. ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై చివరి మూడు నెలల పాటు తాము ఇష్టమొచ్చినట్లు అమ్ముకునే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అంటే 40 రోజుల తర్వాత తమ లెసైన్స్ ఉంటుందో..? ఊడుతుందోనన్న ఆలోచనకు వచ్చిన వైన్స్ యజమానులు అదనపు రేట్లకు ప్రణాళిక చేశారు. ఇప్పటికే రెండు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ ఏదైనా రూ.20 నుంచి 30 వరకు, బీర్లకు రూ.10 నుంచి రూ.15 వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. యథేచ్ఛగా అమ్మకాలు లెసైన్స్ పొందిన వ్యాపారులు మార్చి వరకు జిల్లాలో ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించారు. ఎక్సైజ్ అధికారులు కూడా ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరిగేలా దుకాణాల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేయించారు. ఏప్రిల్ నుంచి ఏకంగా ఈ ధరల పట్టికను దుకాణదారులు తీయించి వేయటం గమనార్హం. నగరంలోనే యథేచ్ఛగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎక్సైజ్ సిబ్బంది మాత్రం తమ దృష్టికి ఫిర్యాదులు రాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వచ్చే లెసైన్స్ జారీలో ప్రభుత్వం ఇదే తరహా లాటరీ ద్వారా కేటాయిస్తుందో..? ప్రభుత్వమే అమ్మకాలకు దిగుతుందో..? తెలియని పరిస్థితుల్లో మద్యం వ్యాపారులు దీపం ఉండగానే ఇల్లుచక్క బెట్టుకునే పనిలో పడ్డారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు, ఫలితాలు ఉండటంతో తారా స్థాయిలో అమ్మకాలు సాగాయి. ఇప్పుడు అలాంటివేవి లేకపోవడం.. పైగా ప్రివిలేజ్ ఫీజు విధించటంతో మద్యం వ్యాపారులు సిండికేట్‌కు తెరదీశారు. ఏప్రిల్ నుంచి కేసులే లేవట..! ఎమ్మార్పీ రేట్ల కన్నా అధిక ధరకు వైన్స్ యజమానులు మద్యం విక్రరుుస్తున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. గత ఏడాది జూలై 1 నుంచి మార్చి చివరి వరకు 37 కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు. అన్ని దుకాణాల్లో ఎమ్మార్పీ రేట్ల అమ్మకాలను యజమానులు భేఖాతర్ చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు కనీసం దాడులు కూడా చేయకపోవడం గమనార్హం. పట్టణాల్లో సిండికేట్‌తో అదనంగా వసూళ్లు చేస్తుండగా గ్రామాల్లోని బెల్టు షాపులోనూ రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. లెసైన్స్ ముగింపు గడువు సమీపిస్తుండడంతో వచ్చే నెలలో రూ.5 అదనంగా ఫుల్‌బాటిల్, బీరుకు పెంచాలన్న యోచనలో మద్యం వ్యాపారులు ముందడుగు వేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు మహేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్, ఎక్త్సెజ్ శాఖ జిల్లాలో ఎమ్మార్పీ రేట్ల కన్నా మద్యం అధిక ధరలకు విక్రయిస్తే సదరు షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం కొనుగోలు చేసేవారు ఏ షాపులోనైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఆయా సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే జిల్లాలో అన్ని స్టేషన్లను ఈ మేరకు ఆదేశించాం.