రెండు మెడికల్ షాపులు సీజ్
బోయిన్‌పల్లి (కరీంనగర్) : లైసెన్స్‌లు లేకుండా ఔషధాలు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెండు మెడికల్ షాపులను ఔషధ తనిఖీ అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండల వ్యాప్తంగా ఔషధ దుకాణాల్లో అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలకు దిగారు.
ఏడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి వచ్చిన టీమ్ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా బోయిన్‌పల్లిలో ఓ షాపు, కుదురుపాకలో మరొక షాపులో లెసైన్స్‌లు లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నట్టు బయటపడింది. రెండు షాపులు సీజ్ చేసి, రూ.90వేల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు.