ముంబయి: అరేబియా సముద్ర జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో రెండు ఫిషింగ్ బోట్లలో ఏకంగా 500 కిలోల డ్రగ్స్‌ను అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో శుక్రవారం నేవీ ఒక పోస్టు చేసింది.
‘శ్రీలంకకు చెందిన రెండు ఫిషింగ్ బోట్లలో అక్రమరవాణా చేస్తున్న 500 కిలోల డ్రగ్స్‌ను ఇండియన్ నేవీ సీజ్ చేసింది. శ్రీలంక నేవీ,ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఎప్పికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ నేవీ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న బోట్లను అడ్డుకుంది.
డ్రగ్స్ ఉన్న బోట్లను గుర్తించడానికి విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించాం. డ్రగ్స్ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులో ఉన్న సిబ్బందిని శ్రీలంకకు అప్పగించాం’అని ఇండియన్ నేవీ ట్వీట్‌లో తెలిపింది. ఈ ఆపరేషన్ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో భారత్,శ్రీలంక మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియజేస్తోందని పేర్కొంది.
Narcotics Seizure - Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.
Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF— SpokespersonNavy (@indiannavy) November 29, 2024
Comments
Please login to add a commentAdd a comment