
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయి. కొందరికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాయి. ఎన్నికల సంఘం చేసిన విస్తృత సోదాల్లో మొత్తం రూ.375 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్, నగదు, వస్తువులు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు విడుదల చేసిన అధికారిక గణాంకల ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని కోట్లు సీజ్ అయ్యాయంటే..
►నగదు రూ.147.46 కోట్లు
►దొరికిన మద్యం విలువ రూ.83.66 కోట్లు
►దొరికిన డ్రగ్స్ విలువ రూ.23.67 కోట్లు
►దొరికిన వస్తువుల విలువ రూ.96.6 కోట్లు
►ఉచితంగా పంపిణీ చేసిన వాటి విలువ రూ.24.21 కోట్లు
దీంతో ఎన్నికల సంఘం సోదాల్లో ఇప్పటివరకు మొత్తం రూ.375.61 కోట్లు పట్టుబడినట్లయింది. అధికారికంగా సీజ్ చేసిన మొత్తమే ఇన్ని కోట్లు ఉంటే.. ఇక అనధికారంగా ఎంత ఖర్చు చేసి ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.83.93 కోట్లు పట్టుబడితే ఈసారి ఆ మొత్తం నాలుగు రెట్లకు పైగా పెరగడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న(బుధవారం) జరగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు.
చదవండి: యాద్గిర్... బరాబర్.. కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లాలో రసవత్తర పోరు
Comments
Please login to add a commentAdd a comment