![Ec Announcement On Seizures Amid Loksabha Pollls](/styles/webp/s3/article_images/2024/05/18/eccash.jpg.webp?itok=KSYbPPgR)
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుకున్న నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర ప్రలోభావాల విలువ రూ.8889 కోట్లుంటుందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది.
ఈ మేరకు ఈసీ శనివారం(మే18) ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్స్,లిక్కర్ పట్టుకోవడంపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా మూడు రోజుల్లో రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment