
న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొత్తం ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడుతున్న వాటిపై ఎన్నికల కమిషన్(ఈసీ) తాజాగా సంచలన విషయం వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌కు ముందే ఏకంగా 4 వేల650 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, నగదును పట్టుకున్నట్లు ప్రకటించింది.
గతేడాది తొలి దశ పోలింగ్‌కు ముందు పట్టుబడ్డ రూ.3475 కోట్ల వస్తువులు, నగదుతో పోలిస్తే ఈసారి పట్టుబడ్డ వాటి విలువ రూ.1175 కోట్లు ఎక్కువ. ఇంత విలువైన వస్తువులు, నగదు పట్టుకోవడం ఎన్నికలు న్యాయంగా జరగాలనే తమ ధృడ సంకల్పానికి నిదర్శనమని ఈసీ తెలిపింది. పట్టుబడ్డ వాటిలో 45 శాతం దాకా డ్రగ్స్, నార్కోటిక్సే కావడం గమనార్హం. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రలోభాల వాడకం కారణంగా వనరులు తక్కువగా ఉన్న చిన్న రాజకీయ పార్టీలకు సమన్యాయం జరిగే అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది.
ఇదీ చదవండి.. రూ.200కోట్ల ఆస్తి దానం.. సన్యాసంలోకి భార్యాభర్తలు
Comments
Please login to add a commentAdd a comment