Seizures
-
ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుకున్న నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర ప్రలోభావాల విలువ రూ.8889 కోట్లుంటుందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది. ఈ మేరకు ఈసీ శనివారం(మే18) ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్స్,లిక్కర్ పట్టుకోవడంపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా మూడు రోజుల్లో రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. -
‘ఈసీ’ సంచలన ప్రకటన.. తనిఖీల్లో పట్టుబడ్డవి ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొత్తం ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుంది. పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడుతున్న వాటిపై ఎన్నికల కమిషన్(ఈసీ) తాజాగా సంచలన విషయం వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌కు ముందే ఏకంగా 4 వేల650 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, నగదును పట్టుకున్నట్లు ప్రకటించింది. గతేడాది తొలి దశ పోలింగ్‌కు ముందు పట్టుబడ్డ రూ.3475 కోట్ల వస్తువులు, నగదుతో పోలిస్తే ఈసారి పట్టుబడ్డ వాటి విలువ రూ.1175 కోట్లు ఎక్కువ. ఇంత విలువైన వస్తువులు, నగదు పట్టుకోవడం ఎన్నికలు న్యాయంగా జరగాలనే తమ ధృడ సంకల్పానికి నిదర్శనమని ఈసీ తెలిపింది. పట్టుబడ్డ వాటిలో 45 శాతం దాకా డ్రగ్స్, నార్కోటిక్సే కావడం గమనార్హం. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రలోభాల వాడకం కారణంగా వనరులు తక్కువగా ఉన్న చిన్న రాజకీయ పార్టీలకు సమన్యాయం జరిగే అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. ఇదీ చదవండి.. రూ.200కోట్ల ఆస్తి దానం.. సన్యాసంలోకి భార్యాభర్తలు -
వారంతే..! రోడ్డు పై షెడ్డు నిర్మాణం
గంట్యాడ: అధికారంలో ఉన్నప్పుడు కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు, అధికారం కోల్పోయినప్పటికీ వారి తీరు కొనసాగిస్తూ కబ్జాల కు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలు కనిపిస్తే వదలడం లేదు. ఆక్రమించిన భూముల్లో సాగు చేపట్టడంతో పాటు, షెడ్డులు కూడా నిర్మిస్తున్నారు. చర్యలు చేపట్టాల్సి న అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామకంఠం ఆక్రమణ గంట్యాడ మండలంలోని గొడియాడ గ్రామంలో టీడీపీ నేతలు గ్రామకంఠంలో ఉన్న భూమిని ఆక్రమించి ఆ స్థలంలో మామిడి మొక్కలు వేశారు. అంతేకాకుండా షెడ్డు నిర్మించారు. ఆక్రమిత స్థలం చుట్టూ గ్రీన్ మేట్‌తో కంచె వేశారు. ఆ స్థలంలో వ్యవసాయ గొడౌన్ నిర్మించాలని వ్యవసాయ అధి కారులు నిర్ణయించారు. అయితే ఈ స్థలం ఆక్రమణలో ఉండడంతో గొడౌన్ నిర్మాణం ఎక్కడ చేపట్టాలన్న దానిపై తర్జన, భర్జన పడుతున్నారు. సుమారు ఎకరం స్థలం వరకు భూమి ఆక్రమణ కు గురైంది. దీని విలువ సుమారు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది. సీసీ రోడ్డుపైనే షెడ్డు నిర్మాణం గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత ఏకంగా సీసీ రోడ్డును నివాసయోగ్యంగా మార్చేశాడు. సీసీ రోడ్డుపై షెడ్డు వేశాడు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. సీసీ రోడ్డుపై శాశ్వత నిర్మాణం చేపట్టినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు సిద్ధం చేశాం గ్రామ కంఠంలో భూమిని ఆక్రమించిన వారికి నోటీసులు సిద్ధం చేశాం. సోమవారం నోటీసులు ఇస్తాం. సీసీ రోడ్డుపై షెడ్డు వేసిన వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. రెండు, మూడు రోజుల్లో ఖాళీ చేయిస్తాం. –అజయ్, వీఆర్వో, గొడియాడ విచారణ ప్రారంభం గొడియాడలో భూమిని ఆక్రమించినట్లు స్పందన కార్యక్రమంలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ ప్రారంభించాం. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలు స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణపై ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ప్రసన్న రాఘవ, తహసీల్దార్, గంట్యాడ -
రెండు వారాల్లో రూ.540 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: గడచిన రెండు వారాల్లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న దాదాపు 540 కోట్ల నగదు, విలువైన వస్తువులను ఎలక్షన్ కమిషన్ స్వాధీనం చేసుకుంది. వీటిలో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు రూ.104 కోట్లు, అత్యల్పంగా అండమాన్ నికోబర్లో రూ.90 లక్షలు పట్టుబడినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఫ్లైయింగ్ స్కాడ్, నిఘా సంస్థాల తోడ్పాటుతో వివిధ రాష్ట్రాలలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు దశలలో ఏప్రిల్ 11 నుంచి 19 మధ్య జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డబ్బు: రాష్ట్రాలు రూపాయలు (కోట్లలో) ఆంధ్రప్రదేశ్ 103 గుజరాత్ 6 మణిపూర్ 22.6 వెస్ట్ బెంగాల్ 16.295 అస్సాం 4.20 అరుణాచ్ ప్రదేశ్ 2.28 కర్ణాటక 26.53 మధ్యప్రదేశ్ 9.197 మహరాష్ట్ర 19.11 -
మా అమ్మాయికి ఫిట్స్ అదుపులోకి వచ్చేదెలా?
నా కూతురి వయసు 18 ఏళ్లు. ఆమెకు గత మూడేళ్లుగా ఫిట్స్ వస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆమెకు వాల్‌ప్రోయేట్ 300 ఎంజీ టాబ్లెట్లు రోజుకు రెండు ఇస్తున్నాం. అయినప్పటికీ ప్రతినెలా 1, 2 సార్లు ఫిట్స్ వస్తున్నాయి. ఆమెకు శాశ్వతంగా ఫిట్స్ రాకుండా ఉండటానికి ఏదైనా మార్గం ఉందా? – శాంతబాయ్, మెదక్ ఫిట్స్ కోసం మనం వాడే మందులు కేవలం ఫిట్స్‌ను నియంత్రిస్తాయంతే. ఫిట్స్‌ను పూర్తిగా నయం చేసే మందులు అంటూ లేవు. ఫిట్స్ రావడం అన్నది చాలా కారణాలతో జరుగుతుంది. ఎమ్మారై, పెట్–స్కాన్, వీడియో ఈఈజీ వంటి అనేక పరీక్షల సహాయంతో మెదడులోని ఏ నిర్ణీత భాగం నుంచి ఈ ఫిట్స్ వస్తున్నాయో తెలిస్తే, అలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స సహాయంతో ‘ఫిట్స్‌కు సెంటర్’ అయిన ఆ భాగాన్ని తొలగించడం ద్వారా, ఆ రోగులకు మాత్రం అసలెప్పుడూ ఫిట్స్ రాకుండా చేయవచ్చు. అయితే క్రమం తప్పకుండా చాలా మందులు వాడుతున్నప్పటికీ నెలలో ఒకటిరెండుసార్లు తప్పక ఫిట్స్ వస్తున్న పేషెంట్స్కే ఇలాంటి శస్త్రచికిత్స సిఫార్సు చేస్తారు. ఇక మీరు ప్రస్తావించిన వాల్‌ప్రోయేట్ విషయానికి వస్తే... అది యువకులకు మంచిదే అయితే యువతులు / మహిళల విషయంలో (ప్రధానంగా యుక్తవయస్కులైనవారిలో) ప్రభావపూర్వకంగా పనిచేయదు. పైగా స్థూలకాయం, రుతుక్రమంలో మార్పులు, జుట్టు రాలిపోవడం వంటి దుష్ప్రభావాలు చూపడంతో పాటు... ఒకవేళ వారికి గర్భం వస్తే పుట్టబోయే పిల్లల్లో అనేక లోపాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి యువతులకూ, మహిళలకు దీన్ని వాడకూడదంటూ కొన్ని దేశాల్లో దీన్ని నిషేధం కూడా విధించారు. కాబట్టి మీరు మరోసారి మీ అమ్మాయికి చికిత్స చేస్తున్న న్యూరాలజిస్ట్‌ను కలిసి ఈ విషయాన్ని చర్చించండి. దాంతో ఆయన మీ అమ్మాయి మందును మారుస్తారు. ఇటీవల యువతులకు, మహిళలకు చాలా సురక్షితమైనవి, మంచివి అయిన లామోట్రైజీన్, లెవిటెరెసిలాన్, బ్రైవరాసెటమ్ వంటి కొత్త మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏదైనా ఒక మందు వాడటం ద్వారానే ఫిట్స్‌పై 60 నుంచి 90 శాతం వరకు అదుపు సాధించవచ్చు. అయితే ఈ మందులు క్రమం తప్పకుండా, రోజూ అదే సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీ డాక్టర్‌ను సంప్రదించండి. మీ అమ్మాయి విషయంలో మంచి మార్పు తప్పక కనిపిస్తుంది. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ప్రశాంత యోగం
లైఫ్ అనారోగ్యాలను మాత్రమే కాదు భావోద్వేగాలను అదుపుచేయడంలోనూ యోగాకు తిరుగులేదు. ఈ విషయంలో కొన్ని ఆసనాలు మరింతగా ఉపకరిస్తాయి. చక్రాసన వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ మడచి పాదాలు- మడమలను పిరుదుల దగ్గరగా తీసుకొని మోకాళ్లు పైకి నిలబెట్టాలి. తలకి ఇరు వైపులా అరచేతులు నేల మీద ఉంచి (చేతి వేళ్లు లోపలి వైపునకు ఉంటాయి) శ్వాస తీసుకుంటూ అరచేతులూ, అరిపాదాలు భూమికి బలంగా నొక్కుతూ శరీరాన్ని పైకి లేపాలి. రెండు లేదా మూడు శ్వాసల తరువాత శ్వాస వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని కిందకు తీసుకురావాలి. కాళ్లను స్ట్రెచ్ చేసి చేతులు శరీరం పక్కన ఉంచి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఒక వేళ పూర్తి స్థితిలో చేయలేకపోతే... ⇒ స్టెప్-1 ముందుగా భుజాలు భూమి మీదనే ఉంచి సీటు భాగాన్ని పైకి లేపాలి. శ్వాస వదులుతూ సీటు భాగాన్ని భూమి మీద ఉంచాలి. ⇒ స్టెప్-2 మళ్లీ స్టెప్ 1 లోకి వచ్చి, ఈ సారి తలను (మాడు భాగాన్ని) నేలమీద ఉంచి అరచేతులు భూమి మీద ఉంచి భుజాలను కూడా పైకి లేపి రెండు మూడు సాధారణ శ్వాసల అనంతరం శ్వాస వదులుతూ ముందు భుజాలను తరువాత సీటు భాగాన్ని నేల మీదకు తీసుకురావాలి. ⇒స్టెప్-3 ఇంకా పూర్తి స్థాయిలో చేయాలనుకుంటే స్టెప్ 2లో నుంచి, చేతుల మీద భారం ఉంచుతూ తలను భుజాలను పూర్తిగా పైకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి స్థితిలోకి వచ్చిన తరువాత శరీరం మొత్తాన్ని చేతుల మీద తేలికగా నిలుపగల స్థితి ఉన్నట్లయితే కుడి కాలుని పైకి ఆకాశంలోకి లేపి పాదాన్ని కాలివేళ్లను పైకి స్ట్రెచ్ చేసి ఉంచవచ్చు. తరువాత కుడి కాలుని కిందకు తీసుకువచ్చి తిరిగి ఎడమకాలుని పైకి తీసుకువెళ్లవచ్చు. జాగ్రత్తలు: ఇది కొంచెం ముందస్తు భంగిమ (అడ్వాన్స్ పోశ్చర్) కాబట్టి ఊబకాయం ఉన్నవారు శరీరాన్ని పైకి లేపాల్సి వచ్చినప్పుడు భుజాలు, చేతి మణికట్టు బలంగా ఉన్నట్లయితే తేలికగా చేయవచ్చు. మణికట్టు ఏమాత్రం బలహీనంగా ఉన్నా పూర్తి స్థాయిలో చేయకుండా స్టెప్ 1 లేదా స్టెప్ 2 వరకూ చేయడం మంచిది. ఉపయోగాలు: వెన్నెముకకు ఆధారంగా ఉన్న కండరాలకి, పొట్ట కండరాలకి, భుజం, తొడ కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది. కిడ్నీలకు, ఎడ్రినల్ గ్రంథులకు టోనింగ్ జరగడం వల్ల భావోద్వేగాలను అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుంది. కర్ణ పీడాసన ఆసనంలో వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ కలిపి ఉంచి, చేతులు రెండూ వెనుకకు పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు రెండు చెవులకు రెండు భుజాలు తాకుతూ ఉంటాయి. శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ పైకి లేపి మళ్ళీ శ్వాస వదులుతూ కాళ్లు కిందపెడుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల భుజాలను పైకి లేపి శ్వాస వదులుతూ ముందుకు వంగి తలను మోకాలు దగ్గరకు వచ్చేటట్లు చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలతో పాటు కాళ్లను కూడా పైకి లేపి, శ్వాస వదులుతూ తలా, కాళ్ళు వెనుకకు హలాసనంలోనికి తీసుకు వెళ్ళి, కాళ్ళు రెండూ రిలీజ్ చే యాలి. మోకాళ్ళు రెండింటిని తల చెవుల పక్కకు దగ్గరగా తీసుకువచ్చి పాదాలను ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచాలి. చేతులు రెండూ స్ట్రెచ్ చేసి అరచేతులు భూమి మీద ఉంచి సాధారణ శ్వాసలు తీసుకుంటూ రెండు మూడు శ్వాసల తరువాత వెన్నుపూసను భూమి మీద ఆనిస్తూ సీటు భాగాన్ని నేలమీదకు తీసుకువచ్చి కాళ్ళు రెండు కిందికి తీసుకురావాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగంగా ఉంటాయి కనుక, ఆసనం తరువాత శవాసనంలోకి వచ్చి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఊపిరితిత్తులకు పూర్తిగా గాలిని తీసుకుని వదలాలి. ఫొటోలో చూసిన విధంగా పూర్తి స్థాయిలో చేయలేనివారు నావాసనంలో లాగా తలను మోకాళ్ళను వీలైనంత దగ్గరగా ఉండేటట్లుగా వెన్నెముక మీద ముందుకు వెనుకకు రోల్ అవ్వవచ్చు. ఈ ఆసనంలో వెన్నుపూస పూర్తిగా స్ట్రెచ్ అవుతుంది. ఒకవేళ కేవలం వెన్నెముక మీద రోల్ అయినట్లయితే చక్కగా వెన్నెముకకు మసాజ్ జరుగుతుంది. మెడ, వెన్నెముక సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా చేయాలి. ఉపయోగాలు: భుజాలను, వెన్నెముకను స్ట్రెచ్ చేస్తుంది. మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. మానసిక, శారీరక ఒత్తిడులు, అలసటను తగ్గిస్తుంది. వంధత్వం, మెనోపాజ్ సమస్యలను పరిష్కరిస్తుంది. తలనొప్పి, సైనసైటిస్, ఆస్తమా సమస్యలను కూడా ఈ ఆసనంతో తగ్గించుకోవచ్చు. (గమనిక: కఠినమైన ఆసనాలను నిపుణుల పర్యవేక్షణలో చేయడం మేలు) ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
వాతావరణ మార్పులతో వచ్చే సమస్యలు
హోమియో చికిత్స క్రమంగా వేసవి వస్తోంది. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నా రాత్రుళ్లు మాత్రం ఇంకా చలి పూర్తిగా తగ్గలేదు. ఇలాంటి సంధి దశలో కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. పగటివేళల్లో వేడి వల్ల దగ్గు వస్తుంది. అలాగే రాత్రివేళల్లో చలివల్ల తేమ పెరుగుతుంది. ఈ రెండు అంశాలూ అలర్జీ, ఆస్తమా లాంటి జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే పైన పేర్కొన్న దుమ్ము, రాత్రివేళల్లోని నెమ్ము ఈ రెండూ అలర్జీ, ఆస్తమాలకు ట్రిగరింగ్ ఫాక్టర్లే. దాంతో అలర్జీ, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ వాతావరణం ప్రతికూలంగా పరిణమిస్తుంది. దుమ్ము, నెమ్ములకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఏ చిన్నపని చేసినా ఆయాసపడటం, అలసిపోవడం, ముక్కులు బిగుతుగా మారడం, శ్వాసతీసుకుంటున్నప్పుడు పిల్లి కూతలు వినిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పదేపదే పునరావృతం కావడం వల్ల రోగిలో వ్యాధినిరోధకత తగ్గుతుంది. ఫలితంగా ఇతర ఇన్ఫెక్షన్లూ తేలికగా సోకే అవకాశం ఉంది. అంతేకాదు... ఊపిరితిత్తులు సైతం వాటి సాగే గుణాన్ని, పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒక్కోసారి బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి ఒకింత ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్సా విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి వాడాల్సిన మందులివి... యాంట్ టార్ట్ : జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలకు. ఆర్స్ ఆల్బ్ : దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారడం వంటి లక్షణాలకు, అలాగే వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువైనప్పుడు. హెపార్‌సల్ఫ్ : చాలా చలిగా అనిపిస్తుంటే. చలిని ఏమాత్రం తట్టుకోలేక పోతుంటే. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంటే. కూర్చుని తలవాల్చి పడుకున్నప్పుడు మాత్రమే ఉపశమనం లభిస్తుంటే. సోరియమ్ : ఎండాకాలంలోనూ దుప్పటి కప్పుకుని కూర్చోవాలనిిపిస్తుంటే. ప్రతి చలికాలంలోనూ ఆయాసం వస్తుంటే. నేట్రమ్ సల్ఫ్ : నేలమాళిగలు, సెలార్స్లో ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించినప్పుడు. కఫం పచ్చరంగులో ఉన్నప్పుడు. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతున్నప్పుడు. ఫాస్ : మెత్తటి స్వభావం, ఊరికే సాయం చేసే గుణం ఉన్నప్పుడు. క్షయ వ్యాధి ఉన్నా కూడా. రోడో : వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే, మెరుపులంటే భయం భయంగా ఉంటుంటే. కాలీ సల్ఫ్: ముక్కుదిబ్బడ, సైనసైటిస్ తోపాటు, ఆయాసం ఎక్కువగా ఉంటే. మెర్క్‌సాల్ : ఒంట్లో చురుగ్గా లేనప్పుడు, అపనమ్మకంగా ఉన్నప్పుడు, పట్టుదల కోల్పోతే, కుడివైపు తిరిగి నిద్రపోలేనప్పుడు, కఫం పచ్చగా పడుతుంటే... ఈ మందులు వాడవచ్చు. -
హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు అద్భుతమైన వైద్యం
‘రోగనిరోధక వ్యవస్థ’ అనేది అనేక రకాల అనారోగ్యాలకు గురి కాకుండా నిత్యం మనల్ని రక్షించే ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థ. ఇది ఒక్కోసారి పొరబడి శరీర అంతర్భాగాలపైనే దాడి చేస్తుంది. ఇలాంటప్పుడు ఉత్పన్నమయ్యే రకరకాల ఆటో ఇమ్యూన్ సమస్యలలో ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ కూడా ఒకటి. సాధారణంగా వెన్నుపూసలు అరిగి, వాటి మధ్య డిస్కులు దెబ్బతినటంతో వెన్నెముక సమస్యలు వస్తాయి. ఒక్కోసారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా, వెన్ను సంబంధిత కణజాలంపై దాడి చేయటంతో ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్కు గురైన వెన్నెముక బిరుసుగా మారిపోయిన స్థితినే ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ అంటారు. డిస్కులు, కండరాలు, లిగమెంట్లు, టాండన్‌లు, కార్టిలేజ్‌లు మొ॥సముదాయాలతో కూడిన వెన్నెముక నిర్మాణం ఎంతో సంక్లిష్టమైనది. మనిషి ముఖ్యంగా వంగేందుకు మరియు ఇతర ముఖ్య కదలికలన్నింటికీ వెన్నెముక తోడ్పాటు చాలా కీలకం. ఎప్పుడైతే వెన్నెముక దగ్గర కణజాలం ఫైబ్రోసిస్ బారిన పడుతుందో లేదా వెన్నెముక అసాధారణంగా పెరిగి, పూసలు ఒకదానికొకటి కలసిపోతాయో అప్పుడు వెన్నెముక తన సహజ కదలికలు కోల్పోయి, బొంగు కర్ర మాదిరిగా గట్టిగా మారిపోవటాన్ని వైద్య పరిభాషలో ‘బ్యాంబుస్పైన్’ అని అంటారు. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ కారణాలు: జన్యుపరమైన ఒక పరిశీలన మేరకు, 90% వ్యాధి బాధితులు ఏఔఅఆ27 అనే జన్యువును కలిగి అంటారు. ఇంతే కాకుండా ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ వ్యాధికి కుటుంబ చరిత్ర కూడా ఒక కారణం. లక్షణాలు: సాధారణ స్థితికి మొదలుకుని అత్యంత తీవ్ర స్థితి వరకు నుడము, తుంటి కీళ్ళు మరియు పిరుదులలో నొప్పి ఉండవచ్చు. వెన్నుపూసలు ఒకదానికొకటి నొక్కుకుపోవటంతో, నడుము-తుంటి భాగంతో పాటు మెడ పట్టేసి మామూలు కదలికలకు ఆటంకమవుతుంది. ఇది కేవలం వెన్నెముకతో పాటు, కాళ్ళు చేతుల తాలూకు కీళ్ళు గుండె కవాటాలను మరియు ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బాధితులలో 40% మందిలో కనిపించే కంటి సంబంధ లక్షణాలు: కళ్ళు ఎర్రగా మారి వెలుతురు చూడలేకపోవడం, కొన్ని సందర్భాల్లో కంటిచూపు మందగించడం, వీటితో పాటు జ్వరం, నీరసం మరియు ఆకలి తగ్గడం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: ఒక దీర్ఘకాలిక సమస్యగా పరిణమించే ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ వ్యాధిని మొదట్లోనే గుర్తించి, సత్వర వైద్యం చేయిస్తే, వెన్నెముక పాడవకుండా కాపాడవచ్చు. కేవలం హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందుబాటులో ఉండే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో రోగి లక్షణాలైన నొప్పి, తిమ్మిరి, మంటలను పూర్తిగా తగ్గించడంతో పాటు వ్యాధి మూలకారణాన్ని కూడా గుర్తించి సమర్థవంతమైన చికిత్సను అందివ్వడం జరుగుతుంది. ఈ విశిష్ట హోమియోపతి చికిత్సతో శరీర రోగనిరోధక వ్యవస్థను క్రమపరిచి, ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను సంపూర్ణంగా నయం చేయవచ్చు లేదా వ్యాధి తీవ్రతను పూర్తిగా తగ్గించి, దుష్పలితాల నుండి పూర్తిగా కాపాడవచ్చు. డా. శ్రీకాంత్ మోర్లావర్, ఇకఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్