వాతావరణ మార్పులతో వచ్చే సమస్యలు
హోమియో చికిత్స
క్రమంగా వేసవి వస్తోంది. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నా రాత్రుళ్లు మాత్రం ఇంకా చలి పూర్తిగా తగ్గలేదు. ఇలాంటి సంధి దశలో కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. పగటివేళల్లో వేడి వల్ల దగ్గు వస్తుంది. అలాగే రాత్రివేళల్లో చలివల్ల తేమ పెరుగుతుంది. ఈ రెండు అంశాలూ అలర్జీ, ఆస్తమా లాంటి జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే పైన పేర్కొన్న దుమ్ము, రాత్రివేళల్లోని నెమ్ము ఈ రెండూ అలర్జీ, ఆస్తమాలకు ట్రిగరింగ్ ఫాక్టర్లే. దాంతో అలర్జీ, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ వాతావరణం ప్రతికూలంగా పరిణమిస్తుంది. దుమ్ము, నెమ్ములకు ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏ చిన్నపని చేసినా ఆయాసపడటం, అలసిపోవడం, ముక్కులు బిగుతుగా మారడం, శ్వాసతీసుకుంటున్నప్పుడు పిల్లి కూతలు వినిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పదేపదే పునరావృతం కావడం వల్ల రోగిలో వ్యాధినిరోధకత తగ్గుతుంది. ఫలితంగా ఇతర ఇన్ఫెక్షన్లూ తేలికగా సోకే అవకాశం ఉంది. అంతేకాదు... ఊపిరితిత్తులు సైతం వాటి సాగే గుణాన్ని, పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒక్కోసారి బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి ఒకింత ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు.
అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్సా విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి
వాడాల్సిన మందులివి...
యాంట్ టార్ట్ : జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలకు.
ఆర్స్ ఆల్బ్ : దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారడం వంటి లక్షణాలకు, అలాగే వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువైనప్పుడు.
హెపార్‌సల్ఫ్ : చాలా చలిగా అనిపిస్తుంటే. చలిని ఏమాత్రం తట్టుకోలేక పోతుంటే. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంటే. కూర్చుని తలవాల్చి పడుకున్నప్పుడు మాత్రమే ఉపశమనం లభిస్తుంటే.
సోరియమ్ : ఎండాకాలంలోనూ దుప్పటి కప్పుకుని కూర్చోవాలనిిపిస్తుంటే. ప్రతి చలికాలంలోనూ ఆయాసం వస్తుంటే.
నేట్రమ్ సల్ఫ్ : నేలమాళిగలు, సెలార్స్‌లో ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించినప్పుడు. కఫం పచ్చరంగులో ఉన్నప్పుడు. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతున్నప్పుడు.
ఫాస్ : మెత్తటి స్వభావం, ఊరికే సాయం చేసే గుణం ఉన్నప్పుడు. క్షయ వ్యాధి ఉన్నా కూడా.
రోడో : వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే, మెరుపులంటే భయం భయంగా ఉంటుంటే.
కాలీ సల్ఫ్: ముక్కుదిబ్బడ, సైనసైటిస్ తోపాటు, ఆయాసం ఎక్కువగా ఉంటే.
మెర్క్‌సాల్ : ఒంట్లో చురుగ్గా లేనప్పుడు, అపనమ్మకంగా ఉన్నప్పుడు, పట్టుదల కోల్పోతే, కుడివైపు తిరిగి నిద్రపోలేనప్పుడు, కఫం పచ్చగా పడుతుంటే... ఈ మందులు వాడవచ్చు.