హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు అద్భుతమైన వైద్యం
‘రోగనిరోధక వ్యవస్థ’ అనేది అనేక రకాల అనారోగ్యాలకు గురి కాకుండా నిత్యం మనల్ని రక్షించే ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థ. ఇది ఒక్కోసారి పొరబడి శరీర అంతర్భాగాలపైనే దాడి చేస్తుంది. ఇలాంటప్పుడు ఉత్పన్నమయ్యే రకరకాల ఆటో ఇమ్యూన్ సమస్యలలో ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ కూడా ఒకటి. సాధారణంగా వెన్నుపూసలు అరిగి, వాటి మధ్య డిస్కులు దెబ్బతినటంతో వెన్నెముక సమస్యలు వస్తాయి. ఒక్కోసారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా, వెన్ను సంబంధిత కణజాలంపై దాడి చేయటంతో ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఇన్‌ఫ్లమేషన్‌కు గురైన వెన్నెముక బిరుసుగా మారిపోయిన స్థితినే ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ అంటారు. డిస్కులు, కండరాలు, లిగమెంట్లు, టాండన్లు, కార్టిలేజ్‌లు మొ॥సముదాయాలతో కూడిన వెన్నెముక నిర్మాణం ఎంతో సంక్లిష్టమైనది. మనిషి ముఖ్యంగా వంగేందుకు మరియు ఇతర ముఖ్య కదలికలన్నింటికీ వెన్నెముక తోడ్పాటు చాలా కీలకం. ఎప్పుడైతే వెన్నెముక దగ్గర కణజాలం ఫైబ్రోసిస్ బారిన పడుతుందో లేదా వెన్నెముక అసాధారణంగా పెరిగి, పూసలు ఒకదానికొకటి కలసిపోతాయో అప్పుడు వెన్నెముక తన సహజ కదలికలు కోల్పోయి, బొంగు కర్ర మాదిరిగా గట్టిగా మారిపోవటాన్ని వైద్య పరిభాషలో ‘బ్యాంబుస్పైన్’ అని అంటారు.
ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ కారణాలు: జన్యుపరమైన ఒక పరిశీలన మేరకు, 90% వ్యాధి బాధితులు ఏఔఅఆ27 అనే జన్యువును కలిగి అంటారు. ఇంతే కాకుండా ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ వ్యాధికి కుటుంబ చరిత్ర కూడా ఒక కారణం.
లక్షణాలు: సాధారణ స్థితికి మొదలుకుని అత్యంత తీవ్ర స్థితి వరకు నుడము, తుంటి కీళ్ళు మరియు పిరుదులలో నొప్పి ఉండవచ్చు. వెన్నుపూసలు ఒకదానికొకటి నొక్కుకుపోవటంతో, నడుము-తుంటి భాగంతో పాటు మెడ పట్టేసి మామూలు కదలికలకు ఆటంకమవుతుంది. ఇది కేవలం వెన్నెముకతో పాటు, కాళ్ళు చేతుల తాలూకు కీళ్ళు గుండె కవాటాలను మరియు ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బాధితులలో 40% మందిలో కనిపించే కంటి సంబంధ లక్షణాలు: కళ్ళు ఎర్రగా మారి వెలుతురు చూడలేకపోవడం, కొన్ని సందర్భాల్లో కంటిచూపు మందగించడం, వీటితో పాటు జ్వరం, నీరసం మరియు ఆకలి తగ్గడం.
హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ చికిత్స: ఒక దీర్ఘకాలిక సమస్యగా పరిణమించే ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ వ్యాధిని మొదట్లోనే గుర్తించి, సత్వర వైద్యం చేయిస్తే, వెన్నెముక పాడవకుండా కాపాడవచ్చు. కేవలం హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో మాత్రమే అందుబాటులో ఉండే జెనెటిక్ కాన్స్‌టిట్యూషనల్ పద్ధతిలో రోగి లక్షణాలైన నొప్పి, తిమ్మిరి, మంటలను పూర్తిగా తగ్గించడంతో పాటు వ్యాధి మూలకారణాన్ని కూడా గుర్తించి సమర్థవంతమైన చికిత్సను అందివ్వడం జరుగుతుంది. ఈ విశిష్ట హోమియోపతి చికిత్సతో శరీర రోగనిరోధక వ్యవస్థను క్రమపరిచి, ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను సంపూర్ణంగా నయం చేయవచ్చు లేదా వ్యాధి తీవ్రతను పూర్తిగా తగ్గించి, దుష్పలితాల నుండి పూర్తిగా కాపాడవచ్చు.
డా. శ్రీకాంత్ మోర్లావర్, ఇకఈ
హోమియోకేర్ ఇంటర్‌నేషనల్