జల్సారాయుడిగా... | srekanth acting as jalsa rayudu | Sakshi
Sakshi News home page

జల్సారాయుడిగా...

Published Fri, May 2 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

జల్సారాయుడిగా...

జల్సారాయుడిగా...

 శ్రీకాంత్ జల్సారాయుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. క్లాన్, మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ పాత్ర ఉంటుందట. ‘రయ్ రయ్’ చిత్రం ఫేం సుధీర్‌రాజు దర్శకత్వంలో వెంకటరమణ మూవీస్ పతాకంపై కొలన్ వెంకటేశ్ ఈ చిత్రం నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ కథాకథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రముఖ తారలతో పాటు అగ్ర సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తారు’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘ కథ నచ్చి ఈ సినిమా మొదలుపెడుతున్నాం. అందరికీ నచ్చే టైటిల్‌తో... అందరికీ నచ్చే సినిమా చేయబోతున్నాం. ఈ నెలలో పూజ చేసి వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement