mass
-
‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్‌కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...మొక్కే కదా అని... ‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం. సైకిల్ చైన్‌తో... నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ. మమ్మమ్మాస్ ‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్‌కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్. తిక్క చూపిస్తా... ‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ధూల్‌పేట్ ఈశ్వర్ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్‌ను చూపించారు. కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ లోని లవర్ బాయ్‌ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్‌డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్. మళ్లీ కొలవెరి ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్‌గా నిలిచింది. రామ్‌గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్‌ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్. -
అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి?
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పులలో 22 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడినట్లు సమాచారం. అమెరికాలోని లెవిస్టన్ నగరంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లిగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తాజగా అనుమానితుడి రెండు ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేసింది. నిందితుడు ఉపయోగించిన నల్ల వాహనం కోసం లూయిస్టన్‌లో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. దుండగుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. పోలీసులు షేర్ చేసిన ఫోటోలో పొడవాటి స్లీవ్ షర్ట్, జీన్స్ ధరించి, గడ్డం కలిగిన వ్యక్తి ఫైరింగ్ రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ కాల్పుల్లో జనం గాయపడ్డారని లెవిస్టన్లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. లెవిస్టన్.. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ల దూరంలో ఉంది. తాజాగా ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తాత్కాలికంగా స్థానిక వ్యాపార సంస్థలను మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆ ప్రకటనలో కోరారు. స్థానికులు తాత్కాలికంగా ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం -
ఒక తార పేలిన వేళ...
సూపర్ నోవా. అంతరిక్షంలో సంభవించే అతి పెద్ద పేలుడు. బహుశా బ్రహ్మాండంలో దీన్ని మించిన పేలుడు మరోటి ఉండదని చెబుతారు. నిజానికి సూపర్ నోవాలు సైంటిస్టులకు ఎప్పుడూ ఆసక్తికరమైన సబ్జెక్టే. నక్షత్రాల జీవిత కాలంలోని చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికంటే చాలా ఎక్కువ విశేషాలే జరుగుతాయని వారిప్పుడు చెబుతున్నారు. ఆ సమయంలో అవి భారీ పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోతాయట. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ సూపర్ నోవాపై జరిపిన అధ్యయనంలో ఈ విశేషం వెలుగులోకి వచి్చంది. ► అది దాని చివరి ఏడాదిలో ఏకంగా సూర్యునికి సమాన పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోయిందట. ► నక్షత్రాలు తమ చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికి మించి చాలా పరిణామాలకు లోనవుతాయని ఈ దృగ్విషయం తేటతెల్లం చేసింది. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను జపాన్ కు చెందిన ఔత్సాహిక అంతరిక్ష శాస్త్రవేత్త కోయిచీ ఇటగాకీ 2023లో కనిపెట్టాడు. ► ఇది పిన్ వీల్ గెలాక్సీలో భూమికి దాదాపు 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ► మిగతా సూపర్ నోవాలతో పోలిస్తే ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంది. పైగా మనకు తెలిసిన వాటిలో అత్యంత నూతన నోవా కూడా ఇదే. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను టైప్ 2, లేదా కోర్ కొలాప్స్ సూపర్ నోవా గా పిలుస్తారు. సూర్యుని కంటే 8 నుంచి 25 రెట్లు పెద్దవైన తారలు రెడ్ సూపర్ జెయింట్స్ గా మారి తమ బరువును తామే తాళలేక భారీ పేలుడుకు లోనవుతాయి. ► ఇలాంటి సూపర్ నోవాలు సంభవించగానే వాటి నుంచి అతి విస్తారమైన కాంతి పుంజాలు వెలువడతాయి. ► వాటి తాలూకు షాక్ వేవ్స్ సూపర్ నోవా ఆవలి అంచును చేరతాయి. ► కానీ ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ నుంచి వెలువడ్డ కాంతి పుంజాలు మాత్రం అలా దాని చివరి అంచును చేరలేదు. ► సదరు సూపర్ నోవా దాని చివరి సంవత్సరంలో తీవ్ర అస్థిరతకు లోనయిందని దీన్నిబట్టి తెలుస్తోందని సైంటిస్టులు వివరిస్తున్నారు. ► పేలుడుకు ముందు సదరు తార నిండా అతి దట్టమైన ద్రవ్యరాశి పరుచుకుని ఉందనేందుకు ఇది ప్రత్యక్ష ప్రమాణమని ఇటగాకీ వివరించారు. ► భారీ తారల ఆవిర్భావ, వికాసాలకు సంబంధించి ఇప్పటిదాకా విశ్వసిస్తున్న పలు కీలక సిద్ధాంతాలపై ఇది పలు ప్రశ్నలు లేవనెత్తిందని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నానీ కొంపముంచిన దసరా...?
-
ఉగ్రం మూవీ టీమ్ తో యాంకర్ సుమ చిట్ చాట్...
-
కొడితే ఇప్పుడే కొట్టాలి..లేకపోతే నాగ చైతన్యకి ఇక ఛాన్స్ లేదు!
సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన ప్రతి హీరో మాస్ ఇమేజ్ ట్రై చేస్తుంటారు. ఒకసారి మాస్ ఇమేజ్ వస్తే ఆ హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్ తోపాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది. ఇక దర్శక నిర్మాతలు అయితే ఆ హీరోతో సినిమాలు చేసేందుకు క్యూ కడతారు. వీటికంటే ముందు మాస్ హీరో అనిపించుకుంటే మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాపీస్ కలెక్షన్స్ తో నిండిపోతోంది. టాలీవుడ్ లో మాస్ హీరో అనిపించుకునేందుకు ట్రై చేస్తున్న యంగ్ హీరోస్ లో నాగచైతన్య ఒకడు. నాగచైతన్య తన కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. జోష్ మూవీ తో హీరోగా తెరంగ్రేటం చేసిన నాగచైతన్య ఏ మాయ చేశావే వంటి క్లాస్ మూవీతోనే ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఈ అక్కినేని హీరో నటించిన మాస్ మూవీస్ దడ, ఆటోనగర్ సూర్య బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ అక్కినేని హీరో కెరీర్ గమనిస్తే హిట్స్ అందుకున్న సినిమాలన్నీ క్లాస్ మూవీసే. చైతూ కెరీర్లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల తర్వాత మళ్లీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. మారుతి డైరెక్షన్ లో శైలాజా రెడ్డి అల్లుడు సినిమాతో మాస్ ఇమేజ్ దక్కించుకోవాలనుకున్నాడు. ఆ మూవీ కూడా చైతూకి లక్కు ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య ‘కస్టడీ’ అనే మాస్ యాక్షన్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య లుక్ డిపరెంట్ గా కనిపించింది. కొలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. నాగార్జున లానే చైతన్య టోటల్ మాస్ మూవీస్ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు. కాస్త డిఫరెంట్ స్టోరీకి మాస్‌ను జోడిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వెంకట్ ప్రభు లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న కస్టడీ ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది. ఆ సినిమా పై నాగచైతన్య ఆశలు భారీగానే పెట్టుకున్నాడు. కోలీవుడ్ లో వెంకట్ ప్రభు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక మాస్ సినిమాలు తీయటంలో వెంకట్ ప్రభుకి వోన్ స్టైల్ ఒకటుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్యకి కస్టడీ తో మాస్ హిట్ దక్కుతుందనే నమ్మకం పెట్టుకున్నారు. -
మనసులో మాట చెప్పిన రవితేజ.. చిరు గ్రీన్ సిగ్నల్
-
జాతి పండగకు జేజేలు
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు. జీపీఓ సర్కిల్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించనున్నారు. రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకంతో కళాకారుడి ఆనంద హేల సామూహిక గీతాలాపన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు ఉన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపకులు తిరంగా సంబరం తరంగమై ఎగిసింది. నగరం అంగరంగ వైభవంగా మెరిసింది. మువ్వన్నెల జెండా వజ్రోత్సవంలా మురిసింది. స్వాతంత్య్ర శోభ వెల్లివిరిసింది. ఇళ్లు, వీధులు, వాహనాలపై త్రివర్ణ పతాకాలు సమున్నతంగా ఆవిష్కృతమయ్యాయి. సోమవారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు అంబరమంటాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో భారీ జెండాలతో బైక్ ర్యాలీలు, కారు ర్యాలీలు జోరుగా సాగాయి. భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా ముస్లిం మహిళలు వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన పతాకాలు చూడముచ్చగా కనువిందు చేశాయి. సంజీవయ్య పార్క్ సమీపంలో జాతీయ జెండాలతో వింటేజ్ కార్లతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అబిడ్స్ మొజంజాహీ మార్కెట్ వేదికగా అతి పొడవైన జాతీయ జెండాతో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాశాలు, స్కూళ్లలో వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. కళాకారులు దేశభక్తి ఉట్టిపడేలా తయారైన విధానం అందరినీ ఆకట్టుకుంది. ట్యాంక్‌బండ్‌పై త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలతో పాటు నలుమూలలా వ్యాపించి ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో, ఐటీ కంపెనీల్లో, విద్యా సంస్థల్లో 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాల్లో నగర యువత ఆసక్తిగా పాల్గొని సందడి చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా నగరానికి చెందిన మైక్రో ఆరి్టస్టు కృష్ణ ఉట్ల బియ్యపు గింజపై జాతీయ జెండాను రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే బియ్యపు గింజపై అశోక చక్రం, మూడు వర్ణాలతో ఉన్న జాతీయ జెండాను వేసి దేశభక్తిని చాటుకున్నాడు. – సాక్షి, సిటీబ్యూరో (చదవండి: దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి) -
అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు
బ్రైజిల్: మానవుడు కోతి నుంచి పుట్టాడని కొందరూ, చింపాజీ నుంచి అని మరికొందరూ చెబుతారు. ఏదిఏమైనా మొదట్లో మానవునికి తోకలు ఉండేవని ఆ తర్వాత క్రమక్రమంగా తోకలు లేవని చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గానీ బ్రెజిల్‌లోని ఒక బాలుడు మాత్రం తోకతో జన్మించాడు. (చదవండి: అసాధ్యురాలు.. ఏకంగా సింహం తోకపట్టుకుని) పైగా ఆ తోక 12 సెం.మీ పొడవుతో చివర ఒక బంతి ఆకారం ఉంటుంది. నిజానికి మానవుని జనన సమయంలో నాలుగు నుంచి ఎనిమిది వారాల గర్భధారణలో మొదట పిండం తోకల రూపంలోనే పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా నెలలు నిండే కొద్ది అవయావలు ఏర్పడి పూర్తి మానవ శరీర రూపంలోకి మారిపోతుంది. కానీ అనూహ్యంగా ఇది పిండంతోపాటుగా ఈ తోక కూడా పెరిగింది. అయితే ఫోర్టలేజాలోని ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో శిశువు జన్మించిన సమయంలో 'తోక' 12 సెం.మీ వరకు పెరిగి 4 సెం.మీ వ్యాసం కలిగిన బంతిని కలిగి ఉన్నట్లు మెడికల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు డాక్టర్లు శస్త్ర చికిత్స ద్వారా ఆ శిశువుకు తోకను తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని చెప్పారు. ఈ అరుదైన మానవ తోకల గురించి సమగ్రంగా రేడియోలాజికల్ పద్ధతుల ద్వారా అధ్యయనం చేయల్సిన అవసరం ఉందని అన్నారు. (చదవండి: వింత ఇల్లు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!) -
ఘనంగా సామూహిక వివాహాలు
బజార్హత్నూర్(బోథ్): మండలంలోని భూతాయి(బి) గ్రామపంచాయతీ పరిధి వంజర్‌భూతాయిలో సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ, హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఎనిమిది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామ పెద్ద పాటిల్ పడ్ మాట్లాడుతూ గ్రామంలో 1992 నుంచి సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో పేద, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారేనని, ఒక వివాహం చేయాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చి సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించామని, 25 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒక సంవత్సరంలో గ్రామంలో ఎన్ని సంబంధాలు కుదిరినా వాటన్నింటికీ ఒక తేదీ నిర్ణయించి సామూహిక వివాహాలు జరిపిస్తామని, మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఒక్కో జంటకు రూ.20వేల నుంచి రూ.30 వేలు తీసుకుని మొత్తం రూ.2లక్షలతో టెంట్లు, భోజన ఏర్పాట్లు, బ్యాండుమేళాలు, పెండ్లికి పూలదండలు, బ్రహ్మణుల ఖర్చులు అన్నింటినీ అందులో నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు. ఒక్కో జంటకు రూ.30 వేలతో వివాహం చేసే వెసులుబాటు ఉంటుందని, ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా గ్రామస్తులందరూ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దినేశ్ ముండే, హరిచంద్ ముండే, ప్రహ్లాద్ పడ్, వినాయక్ ముండే, ప్రభాకర్ ముండే హనుమాన్ యూత్ సభ్యులు ఈశ్వర్, సంతోష్ పడ్, మారుతీ, నాగనాథ్, శివరాజ్, మాధవ్ పాల్గొన్నారు. పెళ్లికి హాజరైన బంధువులు, గ్రామస్తులు -
డబ్బు కొట్టు.. బుక్కు పెట్టు.. గ్రేడ్ కొట్టు!
- పదో తరగతి పరీక్షల్లో ప్రైవేటు స్కూళ్ల దందా - గ్రేడ్ల కోసం కొంతమంది విద్యార్థులతో మాస్ కాపీయింగ్ - పరీక్ష కేంద్రాల సీఎస్‌లతో కుమ్మక్కు - దానవాయిపేట పాఠశాలలో ఇదే తంతు - సబ్ కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు - గేటు వద్దే ఆర్ఐ, వీఆర్ఓల నిలిపివేత - 10 నిమిషాల తర్వాత ఆర్ఐకి మాత్రమే అనుమతి - ఆలోగా అంతా సర్దేశారంటూ ఆరోపణలు పదో తరగతి పరీక్షల్లో అధిక సంఖ్యలో గ్రేడులు సాధించుకునేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు రకరకాల పైరవీలు చేస్తున్నాయి. పుస్తకాలు పెట్టి విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్)లతో కుమ్మక్కవుతున్నాయి. అధిక మొత్తం ఆశ చూపడంతో కొన్ని పరీక్ష కేంద్రాల సీఎస్‌లు వారు చెప్పినట్టే నడచుకుంటున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎంపిక చేసిన విద్యార్థులతో పుస్తకాలు పెట్టి రాయిస్తున్నారు. ఇటువంటి దందాకు నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా నిలిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థిని నగరంలోని ఓ పాఠశాల కేంద్రంగా పరీక్షలు రాస్తోంది. ఆ విద్యార్థిని స్నేహితులు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పరీక్షలు రాస్తున్నారు. శనివారం తెలుగు పేపర్-2 పరీక్ష రాసిన తర్వాత ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని బోరున ఏడవసాగింది. విషయం ఏమిటని తల్లిదండ్రులు ఆరా తీయగా ‘‘నేను ఏడాదంతా కష్టపడి చదివి రాస్తుంటే నా స్నేహితులు కొందరు పుస్తకాలు పెట్టి రాస్తున్నారు. ఇప్పటివరకూ క్లాస్‌లో నేను ఫస్ట్. రేపు ఫలితాల్లో వారికి నాకన్నా మంచి గ్రేడులు వస్తాయి’’ అంటూ విలపించింది. దీంతో ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ‘సాక్షి’ దృష్టి తీసుకొచ్చారు. సోమవారం హిందీ పరీక్ష జరుగుతుండగా దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో జరుగుతున్న దందాను ‘సాక్షి’ సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం పాఠశాల వద్దకు ‘సాక్షి’ బృందం వెళ్లింది. ఇతరులు రాకూడదని చెప్పిన అక్కడి సిబ్బంది ‘సాక్షి’ని లోపలికి అనుమతించలేదు. ఈలోగా సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశాల మేరకు అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాయుడు, వీఆర్ఓలు వాసు, దోసలరావు పాఠశాల వద్దకు తనిఖీ చేసేందుకు వచ్చారు. గేటుకు తాళం వేసి ఉండడంతో అక్కడి వాచ్‌మన్‌ను పిలిచి, తమ గుర్తింపు కార్డులు చూపించి తాళం తీయాలని చెప్పారు. అలా తీయడం కుదరదని అంటూ విషయాన్ని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్‌కు చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా ప్రశాంత్ వచ్చి తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అనుమతించబోమని ఆర్ఐ, వీఆర్ఓలకు చెప్పారు. తాను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌నంటూ నాయుడు తన గుర్తింపు కార్డు చూపించినా కూడా అనుమతించలేదు. ఈలోగా సీఎస్ రాజా ప్రశాంత్ ఫోనులో మాట్లాడుతూ పది నిమిషాల పాటు తాత్సారం చేశారు. అనంతరం ఆర్ఐ నాయుడును మాత్రమే లోనికి అనుమతించారు. వీఆర్ఓలు వాసు, దోసలరావులను గేటు బయటే నిలిపివేశారు. ఆర్ఐని, వీఆర్ఓలను పది నిమిషాలపాటు గేటు బయట నిలిపివేసిన సమయంలోనే లోపల ఏమీ దొరకకుండా సర్దేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల వద్దకు వచ్చిన పది నిమిషాల తర్వాత లోపలికి వెళ్లిన ఆర్ఐకి అక్కడ ఏమీ దొరకలేదు. ఈలోగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి తనిఖీ చేశారు. అంతా సవ్యంగా ఉందంటూ విలేకర్లకు చెప్పారు. ఆర్ఐ, వీఆర్ఓలను పది నిమిషాల పాటు ఎందుకు అనుమతించలేదన్న విలేకర్ల ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఈ విషయంపై డీఈఓ అబ్రహం వివరణ కోరగా.. తహసీల్దార్ క్యాడర్ వరకు నేరుగా అనుమతిస్తామని చెప్పారు. అంతకన్నా దిగువ క్యాడర్ అధికారులు తనిఖీకి వస్తే వారి పై అధికారులు ఫలానా అధికారులు తనిఖీకి వస్తున్నారంటూ సంబంధిత పరీక్ష కేంద్రానికి ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అధికారులు ముందుగానే సమాచారం ఇస్తే ఇక తనిఖీ అన్న పదానికి అర్థం ఏముంటుందని ‘సాక్షి’ ప్రశ్నించగా ‘‘మీరు చెబుతున్నది నిజమే. కానీ నిబంధనలు అలా ఉన్నాయి’’ అని డీఈఓ అన్నారు. పది నిమిషాల తర్వాత పంపారు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాలలో పదో తరగతి పరీక్ష తనిఖీకి వచ్చాం. నాతోపాటు వీఆర్ఓలు వాసు, దోసలరావు వచ్చారు. తనిఖీ చేయాలన్న సబ్కలెక్టర్గారి ఆదేశాల మేరకు వచ్చామని చెప్పినా సీఎస్ రాజా ప్రశాంత్ మమ్మల్ని అనుమతించలేదు. మా గుర్తింపు కార్డులు చూపించినా ససేమిరా అన్నారు. చివరకు పది నిమిషాల తర్వాత నన్ను ఒక్కడినే లోపలికి అనుమతించారు. మా వీఆర్ఓలు బయటే ఉన్నారు. - నాయుడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
అయ్యోర్లూ..అప్రమత్తం
- విద్యార్థులు కాపీ కొడితే ఉపాధ్యాయులకే శిక్ష - పది పరీక్షల నిర్వహణలో చట్టం అమలు రాయవరం: ‘ఎంకిపెళ్లి సుబ్బిచావు’కు వచ్చిందంటే ఇదేనేమో. పది పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొడితే ఆ శిక్ష ఉపాధ్యాయులకే. ఈ ఏడాది పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దమైన నేపధ్యంలో ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంత వరకు వారిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించడం, ఇంక్రిమెంట్లలో కోత విధించడం చేసేవారు. ఈ ఏడాది కఠిన నిర్ణయాలు తీసుకోడానికి విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. 1997 చట్టంలో సెక్షన్ 25లోని 10 నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ చట్టం ప్రకారం పది పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజువైతే కటకటాలపాలు కావాల్సిందేనంటున్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించే సమయంలో విద్యార్థులు చీటీలతో పట్టుబడినా, పక్కవారి పేపరులో చూచి రాస్తున్నా అందుకు ఇన్విజిలేటర్‌నే బాధ్యుడ్ని చేస్తారు. ఇన్విజిలేటర్‌తోపాటు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను కూడా భాగస్వామ్యులను చేస్తారు. శిక్ష సమంజసమేనా.. పరీక్ష కేంద్రాల గదుల్లో ఉపాధ్యాయిని పర్యవేక్షకురాలిగా ఉంటే బాలురను, పురుష ఉపాధ్యాయుడు ఉంటే బాలికలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం సాధ్యపడదు. దీంతో కొందరు విద్యార్థుల వద్ద చీటీలు ఉండిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. తమ తప్పులు ఉండని పక్షంలోనూ శిక్షలు విధించాలని నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఐదు కేంద్రాల్లో సీసీ కెమేరాలు... జిల్లా విద్యాశాఖ ఐదు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తుంది. కూనవరం, కోలంక, గొల్లలమామిడాడ, జగ్గంపేట శ్రీ చైతన్య స్కూల్, అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవికాకుండా ఇప్పటికే సీసీ కెమేరాలు ఉన్న మరో 30 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశాం. 16న ఇన్విజిలేటర్లకు సమావేశాలు.. ఈ 17వ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 16న మధ్యాహ్నం రెండు గంటలకు 307 పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు పట్టుకెళ్ల కూడదని, పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే ఆ ఇన్విజిలేటర్లుæ విధులు నిర్వర్తించకూడదని, సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులతో మాట్లాడకూడదని తదితర సూచనలు ఇవ్వనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒక విద్యాశాఖ అధికారి, తహసీల్దారు, ఏఎస్సైతో కలిసిన బృందాలు 15 ఏర్పాటు చేశాం. వీరు కాకుండా 20 స్క్వాడ్‌లతోపాటు రాష్ట్రస్థాయి పరిశీలకుడు కూడా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎటువంటి మాస్‌కాపీయింగ్‌కు, అవకతవకలకు ఆస్కారం లేకుండా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. – ఎస్.అబ్రహాం, జిల్ల విద్యాశాకాధికారి, కాకినాడ. -
మమమ్మమ్మాస్...
బి. గోపాల్ మంచి మాస్ డెరైక్టర్. గోపీచంద్ మంచి మాస్ హీరో. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే.. కచ్చితంగా అది మమమ్మమ్మాస్ అనేలా ఉంటుందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని బాలాజీ రీల్ మీడియా పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ దీపావళికి టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వక్కంతం వంశీ అందించిన పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. బి. గోపాల్‌గారి వంటి యాక్షన్ డెరైక్టర్, గోపీచంద్, నయనతారతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మగారు స్వరాలు సమకూరుస్తున్నారు. క్లయిమాక్స్ మినహా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. నవంబర్‌లో పాటలు, డిసెంబర్లో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, చలపతిరావు, ఉత్తేజ్, జయప్రకాశ్ రెడ్డి, రమాప్రభ, సురేఖావాణి, సన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల మురుగన్. -
లక్కు మారుతుందా?
ఆశలు, కోరికలు మనిషికి సహజం. అయితే అవి తీరడానికి చేసే ప్రయత్నమే ప్రధానం. అదృష్టం కూడా తోడవ్వాలి. ఈ రెండోదే కలిసి రాని నటిగా మారారు ప్రణీత. ఈ కన్నడ భామ మంచి అందగత్తే. నటిగా కూడా పెద్దగా కొరతలూ లేవు. లేనిదల్లా లక్కే...ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇది అస్సలు లేదు ప్రణీతకు. ఉదయన్ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలో ఏన్నో ఆశలతో రంగప్రవేశం చేసిన నటి ప్రణీత. అరుళ్‌నిధి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ప్రణీతకు బోలెడంత నిరాశ. చిన్న గ్యాప్ తరువాత కార్తీతో శకుని చిత్రంలో రొమాన్స్ చేసి అవకాశం రావడంతో ప్రణీతలో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే శకుని అపజయంతో ఈ బ్యూటీ ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. మళ్లీ అవకాశాలు నిల్. కొంతగ్యాప్ తరువాత మాస్ చిత్రంలో సూర్యతో నటించే అవకాశం వచ్చింది. రెండో నాయకి పాత్ర అయినా టాప్ హీరో సరసన కావడంతో మంచి ప్రచారం వస్తుంది. తద్వారా అవకాశాలు రాబట్టుకోవచ్చన్న చిన్న ఆశతో ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. నిజానికి ఆ పాత్రను శ్రుతీహాసన్ చేయాల్సింది. ప్రాధాన్యత లేదని తను ఆ చిత్రం నుంచే వైదొలగారు. మాస్ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. మళ్లీ ప్రణీత కథ మొదటికి వచ్చింది. అంతే కాదు లక్కు లేని నటి అనే ముద్రకు గురయ్యారు. అయితే తాజాగా నటుడు జై తో నటించే అవకాశం వచ్చింది. ఎనక్కు వాయ్oద అడిమైగళ్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇంతకు ముందు చిత్రాలలో అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేసిన ప్రణీత ఈ చిత్రంలో కాస్త డోస్ తగ్గించి నటిస్తున్నారట. అభినయానికి ప్రాధాన్యతనిస్తూ, సంభాషణలు బట్టీ పట్టి, రిహార్సల్ చేసి మరీ కెమెరా ముందుకు వెళుతున్నారట. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు ఓకే అన్నా తనకు తృప్తి కలగలేదంటూ మరో టేక్ తీసుకుని మరీ నటిస్తున్నారట. ఈ చిత్రంతో లక్కు లేని నటి అన్న ముద్రను తుడిచేస్తుందని, తానూ కోలీవుడ్‌లో ప్రముఖ నాయకిగా పేరు తెచ్చుకుంటాననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
విశ్వంలో ఎంత దూరం వెళ్లినా గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా?
స్కూల్ ఎడ్యుకేషన్ * మన విశ్వంలో ‘ద్రవ్యరాశి’ (పదార్థం) గల ప్రతి వస్తువూ వేరే వస్తువుని ఆకర్షిస్తుంది. తన ఆకర్షణ శక్తితో ఆ రెండో వస్తువుని తన వైపుకి లాక్కొనే ప్రయత్నం చేస్తుంది. ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల మధ్య పరస్పరం ఉండే ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ బలం అని అంటారు. ఏవైనా రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒకటి ఆ రెండు వస్తువులలోనూ ఉండే పదార్థ పరిమాణం కాగా రెండోది ఆ రెండు వస్తువుల కేంద్ర భాగాల మధ్య ఉండే దూరం. * వస్తువుల ద్రవ్యరాశి పెరిగితే వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం కూడా పెరుగుతుంది. ఆ బలం రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఆ ద్రవ్యరాశుల లబ్ధం ఎంత ఎక్కువగా ఉంటే వాటి మధ్య పనిచేసే గురుత్వ బలం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్న మాట. ఇది ఒక ముఖ్యమైన విషయం. * ఇక గురుత్వ బలానికి సంబంధించిన రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రెండు వస్తువుల కేంద్రకాల మధ్య ఉండే దూరం పెరిగే కొద్దీ ఆ రెండు వస్తువుల మధ్య పనిచేసే గురుత్వ బలం అదే స్థాయిలో తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకు భూకేంద్రానికి -మనకు మధ్య ఉన్న దూరాన్ని రెండింతలు పెంచితే భూమికి - మనకు మధ్య పనిచేసే గురుత్వ బలం నాలుగో వంతుకి, పదింతలు పెంచితే 100వ వంతుకి పడిపోతోంది. ఇలా దూరం పెరిగి కొద్దీ గురుత్వ బలం క్రమేణా తగ్గిపోతుందే కాని ఎన్ని కోట్ల మైళ్ల దూరానికి పోయినా అది శూన్య స్థితికి మాత్రం చేరుకోదు. ఇదే సూత్రం విశ్వంలోని అన్ని ఖగోళాలకి వర్తిస్తుంది. -
నాగ్‌ను మాసీగా చూపించేందుకు...
కొరియోగ్రాఫర్‌గా సక్సెస్ సాధించి అనంతరం మెగా ఫోన్ చేతపట్టి వరుస సక్సెస్‌లు కొడుతున్న దర్శకుడు లారెన్స్. స్టార్ హీరోలను కూడా డైరెక్ట్ చేసిన లారెన్స్ ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న తమిళ సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ డాన్సింగ్ స్టార్‌కు మంచి రికార్డే ఉంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కించిన మాస్, డాన్ సినిమాలు లారెన్స్ కెరీర్లో మంచి హిట్స్ గా నిలిచాయి. అందుకే మరోసారి టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు లారెన్స్. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున ఓ మాస్ సినిమా చేయాలనుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో లారెన్స్ ఆశలకు మరింత జోష్ వచ్చింది. రెండుసార్లు సక్సెస్ అయిన వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఆడియన్స్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే నాగ్ ఇమేజ్ కు తగ్గ ఓ యాక్షన్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడు లారెన్స్. ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలతో బిజీగా ఉండగా, లారెన్స్ కూడా తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. సెట్స్ మీద ఉన్న ఈ ప్రాజెక్ట్స్ పూర్తవ్వగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో మాస్ మసాలా ఎంటర్ టైనర్ పట్టాలెక్కే చాన్స్ ఉంది. చాలా రోజులుగా క్లాస్ సినిమాలే చేస్తున్న నాగ్ ను వీలైనంత మాసీగా చూపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు లారెన్స్. 'రెబల్' డిజాస్టర్ కావటంతో కావటంతో తెలుగు తెరకు దూరమైన ఈ డాన్సింగ్ స్టార్ నాగ్ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. -
ఆ రెండు సినిమాల్నీ ఒకే టికెట్‌పై చూపించనున్నా!
లారెన్స్... సినీ నృత్యాలను కొత్త పుంతలు తొక్కించిన పేరిది. కొన్నేళ్ల పాటు దక్షిణాదిలో అగ్రశ్రేణి నృత్యదర్శకునిగా వెలుగొందిన ఘనత ఆయనది. మాస్, ముని, డాన్,కాంచన సినిమాలతో దర్శకునిగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. త్వరలో ‘గంగ’తో మన ముందుకు రానున్న ఆయన దర్శకునిగా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం... ‘కాంచన’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారేంటి? త్వరగా సినిమా తీసేసి... త్వరగా విడుదల చేసేసి, మంచి హిట్ సాధించాలని.. ఎవరికుండదు చెప్పండి. కానీ... నా టైమే బాలేదు. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాను. దాంతో ‘గంగ’ (ముని-3) షూటింగ్‌కి పెద్ద విరామమే వచ్చేసింది. అనారోగ్యమేంటి? ‘స్టైల్’ చిత్రంలో మీరు చూసే ఉంటారు. క్లైమాక్స్‌లో ప్రభుదేవాగారిని భుజాలపై ఎక్కించుకొని డాన్స్ చేస్తాను. ఆ సినిమా కోసం నేను చేసిన ఆ సాహసమే నాకు కష్టాలు తెచ్చిపెట్టింది. అప్పుడే.. నొప్పి చేసి డాక్టర్‌కి చూపించుకుంటే... మెడ చేరువలో ఉన్న వెన్నెముక భాగంలో ఇబ్బంది ఏర్పడిందని తేల్చారు. మూడు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. వైద్యుల మాట లక్ష్యపెట్టకుండా నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. ‘కాంచన’ దాకా ఎలాంటి ఇబ్బందీ తెలీలేదు. ‘గంగ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంటుందనగా... ఒక్కసారిగా లొకేషన్లో పడిపోయాను. పరీక్షలు నిర్వహించాక, నా నిర్లక్ష్యం వల్ల గాయం ఇంకాస్త డిస్ట్రబ్ అయ్యిందని తేలింది. అందుకే... ఈ దఫా ‘అయిదు నెలలు విశ్రాంతి’ అన్నారు. దాంతో ‘గంగ’ షూటింగ్ ఆపేసి, విశ్రాంతి తీసుకుంటున్నాను. మరి... మళ్లీ రంగంలోకి దిగేదెప్పుడు? ‘గంగ’ క్లైమాక్స్ మినహా పూర్తయింది. త్వరలోనే పతాక సన్నివేశాలు తీసేస్తాను. డిసెంబర్లో సినిమా విడుదల చేస్తాం. ‘కాంచన’లో స్ల్పిట్ పర్సనాలిటీ అద్భుతంగా పండించారు కదా. ఇందులో అలాంటి ప్రయోగం ఏమైనా ఉందా? ఇందులో ఏకబిగిన ఏడు కేరక్టర్లలో కనిపిస్తా. ఆ వివరాలు ఇప్పుడే బయట పెట్టలేను. అది తెరపై చూస్తేనే బావుంటుంది. ‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్లో కూడా తీస్తామన్నారు కదా? అవును.. అజయ్‌దేవగణ్ హీరో. అయితే శరత్‌కుమార్ పోషించిన పాత్రకు సరైన స్టార్ కోసం చూస్తున్నాం. ‘గంగ’ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఓ ప్రయోగం చేయనున్నాను. ఆ తర్వాత బాలీవుడ్లో ‘కాంచన’ తీస్తా. ఏంటా ప్రయోగం? ‘ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు’.... ఈ అయిదు నెలల విశ్రాంతి సమయంలో నాకొచ్చిన ఓ వెరైటీ ఆలోచన ఇది. ఇంట్రవెల్ వరకూ గంటన్నర పాటు ఓ సినిమా. ఇంట్రవెల్ తర్వాత గంటన్నర పాటు మరో సినిమా. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూపించాలనుకుంటున్నాను. కథలు కూడా రెడీ చేశాను. తొలి గంటన్నర సినిమా పేరు -‘ముసలోడు’. రెండో గంటన్నర సినిమా పేరు - ‘ది లేటెస్ట్’. రెండింటికీ దర్శకుణ్ణీ, హీరోనూ నేనే. ‘ముసలోడు’లో హీరోయిన్గా ఆండ్రియాను ప్రయత్నిస్తున్నాను. ‘ది లేటెస్ట్’లో మాత్రం లక్ష్మీరాయ్ కథానాయికగా నటిస్తారు. ఆ సినిమాలు ఏ తరహాలో ఉంటాయి? ‘ముసలోడు’ సందేశాత్మకంగా ఉంటుంది. ఓ విధంగా ‘కాంచన’ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లాంటి భావన కలుగుతుంది. అలాగని వినోదానికి దూరంగా ఉండదు. రెండు పాటలు, ఒక ఫైట్ కూడా ఉంటాయి. ఇందులో నేను ముసలివాడి గెటప్‌లో కనిపిస్తా. ఇక ‘ది లేటెస్ట్’ పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో అత్యాధునికంగా కనిపిస్తా. రెండు కథలకూ అస్సలు సంబంధం ఉండదు. తొలి సినిమా కాగానే ‘శుభం’ కార్డ్ పడిపోతుంది. తర్వాత టైటిల్స్‌తో రెండో సినిమా మొదలవుతుంది. ఈ వెరైటీ ఆలోచన ఎలా వచ్చింది మీకు? డాన్స్ మాస్టర్‌గా ఉన్నప్పుడే కొత్తదనం కోసం పాకులాడేవాణ్ణి. కొత్త కొత్త స్టెప్స్ సృష్టించేవాణ్ణి. దర్శకుడయ్యాక కూడా ఆ బుద్ధి పోలేదు. ఒక్కసారి హాలీవుడ్ సినిమాలు చూడండి. గంటన్నరలో అన్నీ చెప్పేస్తున్నారు వాళ్లు. మనం మాత్రం ఎందుకు ఆ ప్రయత్నం చేయకూడదు. అందుకే ఈ కొత్త ప్రయత్నం చేయనున్నాను. నేను ‘కాంచన’ చేయగానే... ఇప్పుడు అందరూ హారర్ కామెడీ వైపు చూస్తున్నారు. రేపు ఈ ట్రెండ్ కూడా మొదలవుతుందేమో. అంతా రాఘవేంద్రస్వామి దయ. మరి కొరియోగ్రఫీ? చేస్తున్నానుగా.. అది అదే.. ఇది ఇదే. తుది శ్వాస విడిచేవరకూ డాన్స్‌ను నేను విడిచిపెట్టను. ఈ విశ్రాంతి పుణ్యమా అని కుటుంబానికి కొన్నాళ్లయినా దగ్గరగా ఉన్నారు కదా? అవునండీ... నా ఫ్యామిలీ లైఫ్ ఆనందంగా ఉంది. నాకు టెన్త్ చదివే కొడుకున్నాడు తెలుసా! బుర్రా నరసింహ -
హాస్యంపై కన్నేసిన మాస్
ఏ నటుడయినా వరుసగా ఒకే తరహా చిత్రాలు చేస్తే ఓటమి తప్పదు. ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. అందుకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా మన హీరోలు జాగ్రత్త పడుతుంటారు. ఇక నటుడు సూర్య విషయానికొస్తే ఈయన కమర్షియల్ చిత్రాలనే నమ్ముకున్నారు. ఈ పంథాలో సక్సెస్ అయినా ఇటీవల విడుదలైన అంజాన్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇది సూర్యను కాస్త నిరాశ పరిచే విషయమే. ఏదేమయినా ఈ కమర్షియల్ చిత్రాల మాస్ హీరో తాజాగా తన దృక్పథాన్ని మార్చుకుని వినోదంపై కన్నేశారు. తాజా చిత్రం పేరు కూడా మాస్‌నే. అయితే చిత్ర కథ మాత్రం వినోదాల వల్లరిగా ఉంటుందంటున్నాయి యూనిట్ వర్గాలు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈయనకు జంటగా నయనతార, ఎమిజాక్సన్లు నటిస్తున్నారు. ఇందులో సూర్య ఒక పాత్రలో ఆత్మగా నటిస్తున్నట్లు సమాచారం. ప్రేమ్‌జీ అమరన్, శ్రీమాన్లు ఆయనకు మాత్రమే కనపడే మరో ఆత్మలుగా నటిస్తున్నారట. ఈ ముగ్గురు చేసే హాస్యం కడుపుబ్బ నవ్విస్తుందంటున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తనదైన బాణిలో ఈ మాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
జల్సారాయుడిగా...
శ్రీకాంత్ జల్సారాయుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. క్లాన్, మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ పాత్ర ఉంటుందట. ‘రయ్ రయ్’ చిత్రం ఫేం సుధీర్‌రాజు దర్శకత్వంలో వెంకటరమణ మూవీస్ పతాకంపై కొలన్ వెంకటేశ్ ఈ చిత్రం నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ కథాకథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రముఖ తారలతో పాటు అగ్ర సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తారు’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘ కథ నచ్చి ఈ సినిమా మొదలుపెడుతున్నాం. అందరికీ నచ్చే టైటిల్‌తో... అందరికీ నచ్చే సినిమా చేయబోతున్నాం. ఈ నెలలో పూజ చేసి వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అని తెలిపారు. -
క్లాసే మాస్
-
దాసీపై మాస్పతాస్త్రం
దురాచారం ఒక వ్యవస్థగా వేళ్లూనుకున్నప్పుడు దానిని పెకలించే మహాశక్తి ఏదైనా ఆవిర్భవించాలి.అలా ఆవిర్భవించి, ‘దేవదాసీ’ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేస్తున్న స్త్రీశక్తే... మాస్. కడుపులో ఉన్న ఆడబిడ్డను కడుపులో ఉండగానే చంపేయడం, పదేళ్లు కూడా దాటని పసిమొగ్గలపై అత్యాచారాలకు పాల్పడటం.. ఇవన్నీ ప్రతిరోజూ మనం వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. అయితే కడుపులో ఆడబిడ్డ ఉందని తెలిస్తే చాలు, ఆ బిడ్డను అప్పుడే అమ్మేసే సంస్కృతి గురించి విన్నప్పుడు మాత్రం మనం ఉన్నది ఎలాంటి సమాజంలో! అనే ప్రశ్న తలెత్తక మానదు. ఒకరిది పేదరికం, మరొకరిది తెలియనితనం, ఇంకొకరిది ఇదేంటని ప్రశ్నించలేని పిరికితనం.. ఇవన్నీ కలిసి వారిని దేవదాసీలుగా మార్చాయి. తమ పెద్దలు, ఊళ్లో వాళ్లు చెప్పిందే వేదవాక్కంటూ ఎన్నో ఏళ్లు దేవదాసీలుగా మగ్గిపోయారు. ఎన్నో అవమానాలు పడ్డారు. దేవుడికి అంకితం చేశామనే పేరుతో ‘మగాళ్ల‘కు అప్పగించేస్తుంటే పంటిబిగువున బాధను ఆపుకున్నారు. తమ బిడ్డలకు సమాజం నుండి ఛీత్కారాలు ఎదురవుతున్నా తమ రక్తాన్ని గంజిగా మార్చి దానినే వారికి పానకంలా తాగించారు. అలా ఎన్నో ఏళ్లు సాగాయి. తమలా మరికొందరు ఆ దారుల్లోకి వస్తూనే ఉన్నారు. అంతేకాదు, కడుపులో ఉన్న ఆడబిడ్డలు కడుపులోనే అమ్ముడయిపోతున్నారు. అప్పుడే వారికి అర్థమైంది.. ఇంకా ఇలానే భరిస్తూ పోతే తమ బిడ్డలను కూడా అదే నరకంలోకి తోస్తారని. అంతే.. కళ్లు తెరిచారు. తమ భావితరాలు ‘దాసీ’ బతుకుల్లో మగ్గిపోకూడదని పోరాటం ప్రారంభించారు. ఇంకా పోరాడు తూనే ఉన్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన దేవదాసీల్లో వచ్చిన ఈ మార్పు ఓ విప్లవంలా కొనసాగుతోంది. కర్ణాటక దేవదాసీ(ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్)యాక్ట్-1982 ద్వారా రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అయితే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48 వేల మంది దేవదాసీలున్నట్ల్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది బీదర్, బెల్గాం, రాయచూరు, బళ్లారి ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్క బెల్గ్గాంలోనే దాదాపు 5 వేల మంది దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా బెల్గ్గాం జిల్లాలో దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తూ అనంతరం తమ జీవన విధానాన్ని మార్చుకున్న కొంతమంది మహిళలతో ఏర్పాటైన సంస్థే ‘మాస్’(మహిళల అభివృద్ధి సంరక్షణా సంస్థ-ఎంఏఎస్ఎస్). సామాజిక దురాచారమైన దేవదాసీ చెరలో మగ్గుతున్న బెళ్గావి జిల్లాలోని కొందరు మహిళలు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ప్రమేయంతో ఆ చెర నుండి బయటపడ్డారు. వారిలో సీతవ్వ, సరసవ్వ, ఐరావతిలు కూడా ఉన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 1997లో ‘మాస్’ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో సభ్యత్వంతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం దాదాపు 4,500 మంది మాజీ దేవదాసీలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దేవదాసీ పద్ధతిని రూపుమాపేందుకు ‘మాస్’ సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ విషయంపై ‘మాస్’ సంస్థ కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్న సీతవ్వ, సంస్థ సభ్యురాలైన ఐరావతి ఏమంటారంటే...‘‘బెళ్గావిలోని గోకాక్ తాలూకాలో ఉన్న యల్లమ్మ గుడ్డలో జరిగే జాతరలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలను దేవదాసీలుగా మార్చేవారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ ఆడపిల్లలను దేవదాసీలుగా మారుస్తుంటారు. అయితే మా సంఘం ఏర్పాటైన నాటి నుండి అక్కడ ఎవరినీ దేవదాసీలుగా మార్చకుండా చూస్తున్నాం. ఇంతకు ముందు మేము దేవదాసీలుగా ఉన్న వాళ్లమే కాబట్టి ఎవరైనా తమ సంబంధీకుల్లో లేదా ఇతరుల ఆడబిడ్డలను దేవదాసీలుగా మారుస్తున్నారా అన్న విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంటుంది. దేవదాసీ వ్యవస్థపై నిషేధం విధించిన నాటినుండి అమ్మాయిలను దేవదాసీలుగా మార్చే ప్రక్రియ రాత్రివేళల్లో సాగుతోంది. అందుకే మా సంస్థ సభ్యులతో బృందంగా వెళ్లి రాత్రివేళల్లో నిఘా వేసేవాళ్లం. ఆ సందర్భంలో అమ్మాయి సంబంధీకులు మాపై దాడులకు కూడా పాల్పడ్డారు. అయినా సరే, మరే ఆడబిడ్డా మాలాగా మారకూడదనే దృఢ నిశ్చయంతో వారిని అడ్డుకునేవాళ్లం. అలా ఎంతోమంది ఆడబిడ్డలను ఆ చెరలో పడకుండా చూడగలిగాము’’ అంటూ తమ సంఘం చేసిన పనులను చెప్పారు ఐరావతి. చెరవీడినవారికి.... దేవదాసీ వ్యవస్థలో మగ్గి ప్రస్తుతం ఆ చెరనుండి బయటపడ్డ వారు వారి పిల్లలకు ఓ పుట్టినిల్లులా భరోసా ఇస్తోంది ‘మాస్’. మాజీ దేవదాసీలు, వారి పిల్లలకు రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేమున్నామంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తోంది. తమపై జరిగే అన్యాయాలను నిరోధించేందుకు గాను మాస్ సంస్థలో న్యాయ సలహా కేంద్రం కూడా ఏర్పాటైంది. న్యాయవ్యవస్థ నుండి తమకు లభించే ప్రయోజనాలు, న్యాయస్థానాల నుండి సహాయాన్ని ఎలా పొందవచ్చు అనే అంశాలపై కూడా సలహాలు, సూచనలు అందిస్తోంది. వీటితో పాటు మాస్ సంస్థలోని సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బాల్యవివాహాలను అరికట్టడంతో పాటు వివిధ సామాజిక దురాచారాలపై వీధినాటికలను ప్రదర్శిస్తూ గ్రామాల్లోని మహిళల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు చేయాల్సిన కృషి వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉంటారు. మాజీ దేవదాసీల పిల్లలకు మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేస్తోంది మాస్. ఈ క్రమంలో మాస్ సంస్థ సభ్యులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే ఎలాంటి అవరోధాలనూ లెక్కచేయక ముందుకు సాగుతున్నారు. - షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు; ఫొటోలు: టి.కె. ధనుంజయ స్వయం ఉపాధి కూడా... ‘దేవదాసీ విధానం నుండి విముక్తి కల్పించిన తర్వాత మేం ఆలోచించింది మా ఉపాధి గురించి, మా బిడ్డల భవిష్యత్తు గురించి. అందుకే ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ముందుగా మేం స్వయం ఉపాధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నాం. బుట్టల అల్లిక, ఎంబ్రాయిడరీ, అగరుబత్తుల తయారీలో శిక్షణ పొంది మా సభ్యులకు కూడా శిక్షణ ఇప్పించాం. ప్రస్తుతం మా సంస్థలోని సభ్యులంతా స్వశక్తితో జీవనాన్ని సాగిస్తున్నారు. మా సంఘంలోని సభ్యుల పిల్లల ఉన్నత చదువుల కోసం రుణాలను కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది మాజీ దేవదాసీల పిల్లలు ‘దాసీ’ శృంఖలాలను తెంచుకుంటూ తమదైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. - సీతవ్వ, మాస్ సంస్థ కార్యనిర్వాహక అధికారి