
హాస్యంపై కన్నేసిన మాస్
ఏ నటుడయినా వరుసగా ఒకే తరహా చిత్రాలు చేస్తే ఓటమి తప్పదు. ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. అందుకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా మన హీరోలు జాగ్రత్త పడుతుంటారు. ఇక నటుడు సూర్య విషయానికొస్తే ఈయన కమర్షియల్ చిత్రాలనే నమ్ముకున్నారు. ఈ పంథాలో సక్సెస్ అయినా ఇటీవల విడుదలైన అంజాన్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇది సూర్యను కాస్త నిరాశ పరిచే విషయమే. ఏదేమయినా ఈ కమర్షియల్ చిత్రాల మాస్ హీరో తాజాగా తన దృక్పథాన్ని మార్చుకుని వినోదంపై కన్నేశారు.
తాజా చిత్రం పేరు కూడా మాస్‌నే. అయితే చిత్ర కథ మాత్రం వినోదాల వల్లరిగా ఉంటుందంటున్నాయి యూనిట్ వర్గాలు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈయనకు జంటగా నయనతార, ఎమిజాక్సన్‌లు నటిస్తున్నారు. ఇందులో సూర్య ఒక పాత్రలో ఆత్మగా నటిస్తున్నట్లు సమాచారం. ప్రేమ్‌జీ అమరన్, శ్రీమాన్‌లు ఆయనకు మాత్రమే కనపడే మరో ఆత్మలుగా నటిస్తున్నారట. ఈ ముగ్గురు చేసే హాస్యం కడుపుబ్బ నవ్విస్తుందంటున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తనదైన బాణిలో ఈ మాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.