Custody Movie: Naga Chaitanya Another Attempt For Mass Image - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: కొడితే ఇప్పుడే కొట్టాలి..లేకపోతే నాగ చైతన్యకి ఇక ఛాన్స్ లేదు!

Published Sun, Mar 19 2023 12:24 PM | Last Updated on Sun, Mar 19 2023 12:40 PM

Custody Movie: Naga Chaitanya Another Attempt For Mass Image - Sakshi

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన ప్రతి హీరో మాస్ ఇమేజ్ ట్రై చేస్తుంటారు. ఒకసారి మాస్ ఇమేజ్ వస్తే ఆ హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్ తోపాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది. ఇక దర్శక నిర్మాతలు అయితే ఆ హీరోతో సినిమాలు చేసేందుకు క్యూ కడతారు. వీటికంటే ముందు మాస్ హీరో అనిపించుకుంటే మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. పాజిటివ్ టాక్‌ వస్తే బాక్సాపీస్ కలెక్షన్స్ తో నిండిపోతోంది. 

టాలీవుడ్ లో మాస్ హీరో అనిపించుకునేందుకు ట్రై చేస్తున్న యంగ్ హీరోస్ లో నాగచైతన్య ఒకడు. నాగచైతన్య తన కెరీర్ స్టార్టింగ్ నుంచి  మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు కానీ వర్కౌట్‌ కాలేదు.  జోష్ మూవీ తో హీరోగా తెరంగ్రేటం చేసిన నాగచైతన్య ఏ మాయ చేశావే వంటి క్లాస్ మూవీతోనే ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఈ అక్కినేని హీరో నటించిన మాస్ మూవీస్ దడ, ఆటోనగర్ సూర్య  బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ అక్కినేని హీరో కెరీర్ గమనిస్తే  హిట్స్ అందుకున్న సినిమాలన్నీ క్లాస్ మూవీసే.  చైతూ కెరీర్లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన ప్రేమమ్,   రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల తర్వాత మళ్లీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. మారుతి డైరెక్షన్‌ లో శైలాజా రెడ్డి అల్లుడు సినిమాతో మాస్ ఇమేజ్ దక్కించుకోవాలనుకున్నాడు. ఆ మూవీ కూడా చైతూకి లక్కు ఇవ్వలేకపోయింది. 

ప్రస్తుతం నాగ చైతన్య   ‘క‌స్టడీ’ అనే మాస్ యాక్ష‌న్ ఫిల్మ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మే 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య లుక్ డిపరెంట్ గా కనిపించింది. కొలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే  ఉన్నాయి. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. 

నాగార్జున లానే చైతన్య టోటల్ మాస్ మూవీస్ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు. కాస్త డిఫరెంట్ స్టోరీకి మాస్‌ను జోడిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వెంకట్ ప్రభు లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న కస్టడీ ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది. ఆ సినిమా పై  నాగచైతన్య ఆశలు భారీగానే పెట్టుకున్నాడు. కోలీవుడ్ లో వెంకట్ ప్రభు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక మాస్ సినిమాలు తీయటంలో వెంకట్ ప్రభుకి వోన్ స్టైల్ ఒకటుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్యకి కస్టడీ తో మాస్ హిట్ దక్కుతుందనే నమ్మకం పెట్టుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement