అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి? | America Lewiston Mass Shooting Many People Killed And Dozens Wounded At Several Locations - Sakshi
Sakshi News home page

Mass Shooting In US: అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి?

Published Thu, Oct 26 2023 7:56 AM | Last Updated on Thu, Oct 26 2023 10:13 AM

America Lewiston Mass Shooting Many People Killed - Sakshi

దుండగుని ఫోటోను విడుదల చేసిన పోలీసులు

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లెవిస్టన్‌, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పులలో 22 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడినట్లు సమాచారం. 

అమెరికాలోని లెవిస్టన్ నగరంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లిగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తాజగా అనుమానితుడి రెండు ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. నిందితుడు ఉపయోగించిన నల్ల వాహనం కోసం లూయిస్టన్‌లో  వెతుకుతున్నామని  పోలీసులు తెలిపారు. 

దుండగుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. పోలీసులు షేర్ చేసిన ఫోటోలో పొడవాటి స్లీవ్ షర్ట్, జీన్స్ ధరించి, గడ్డం కలిగిన వ్యక్తి ఫైరింగ్ రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ కాల్పుల్లో జనం గాయపడ్డారని లెవిస్టన్‌లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. లెవిస్టన్.. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ల దూరంలో ఉంది. 

తాజాగా ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తాత్కాలికంగా స్థానిక వ్యాపార సంస్థలను మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆ ప్రకటనలో కోరారు. స్థానికులు తాత్కాలికంగా ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని సూచించారు. 
ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement