అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి! | 2 People Killed 4 Injured in Denver | Sakshi
Sakshi News home page

Denver: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

Published Mon, Feb 5 2024 10:50 AM | Last Updated on Mon, Feb 5 2024 12:37 PM

2 People Killed 4 Injured in Denver - Sakshi

అమెరికాలోని డెన్వర్‌లోని నివాస ప్రాంతంలో ఆదివారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ఒక యువకునితో పాటు ఒక బాలుడు ఉన్నట్లు పోలీసుశాఖ అధికార ప్రతినిధి సీన్ టోవెల్ మీడియాకు తెలిపారు. 
 

ఈ ఘటనలో గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. గ్రీన్ వ్యాలీ రాంచ్ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఉదయం ఆరు గంటల సమయంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement