Denver
-
అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
అమెరికాలోని డెన్వర్‌లోని నివాస ప్రాంతంలో ఆదివారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ఒక యువకునితో పాటు ఒక బాలుడు ఉన్నట్లు పోలీసుశాఖ అధికార ప్రతినిధి సీన్ టోవెల్ మీడియాకు తెలిపారు. Two people have died following an early morning shooting on February 4 in a residential area of #Denver that left four other people injured, police said.https://t.co/dma1vdrviA — The Hindu (@the_hindu) February 5, 2024 ఈ ఘటనలో గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. గ్రీన్ వ్యాలీ రాంచ్ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఉదయం ఆరు గంటల సమయంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. -
లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!
డెన్వర్‌కు చెందిన తల్లీ కూతుళ్లు లాక్రోస్ టో టోర్నమెంట్‌కి వెళ్లి వస్తూ తమ లగేజీని కోల్పోయారు. బాల్టిమోర్ నుండి చికాగో మీదుగా విమానం వస్తూ డెన్వర్‌కు పయన మయ్యారు. విమానాశ్రయంలో లగేజీ బెల్ట్‌లో తమ బ్యాగ్ కనిపించలేదు. దీంతో వారు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాదాపు ఇక దొరకదు అనుకున్న ఖరీదైన బ్యాగును టెక్నాలజీ సాయంతో దక్కించుకున్న వైనం విశేషంగా నిలిచింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) సీఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం సాండ్రా షుస్టర్ , ఆమె 15 ఏళ్ల కుమార్తె రూబీ లాక్రోస్ ప్లేయర్. టోర్నమెంట్ నుంచి జూలై 17న చికాగో ఓ'హేర్ విమానాశ్రయం వద్ద, లాక్రోస్ కిట్ చెకిన్ బ్యాగ్‌గా ఉంచుకుని, మిగిలిన బ్యాగేజీని విమానాశ్రయంలో లగేజీ కౌంటర్లో ఇచ్చారు. అయితే బెల్ట్‌పై వారి లగేజీ మిస్ అయింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయగా వస్తుందని చెప్పారు. కానీ రాలేదు. మళ్లీ కాల్ చేస్తే మీ బ్యాగ్ ఇంకా బాల్టిమోర్‌లో ఉంది అనే సమాధానం వచ్చింది. అంతేకాదు మీ బ్యాగును ఎవరో కొట్టేశారని కూడా చెప్పారు. రూబీ బ్యాగులో ఖరీదైన 2,000 డాలర్ల కిట్ ఉంది. అంతకుమించి తన ఆటకు బాగా అలవాటైన లాక్రోస్ గేమ్ స్టిక్ ఉంది. దాన్ని వదులుకోవడం అంటే చాలా నష్టం. మరోవైపు మరో టోర్నమెంట్ కోసం శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలి. దీంతో తమ రిఫరెన్స్ నంబర్‌తో డెన్వర్‌లోని పోయిన లగేజ్ డెస్క్ వద్ద ఆగి, చికాగోలో ఎయిర్‌ట్యాగ్ ఇప్పటికీ ట్రాక్ చేస్తూనే ఉందని గట్టిగా వాదించారు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ ద్వారా తన బ్యాగ్ బాల్టిమోర్‌లో లేదని షుస్టర్కి అర్థమవుతోంది. టెక్నాలజీ సాయంతో పరిశీలించగా, చికాగోలోని టెర్మినల్-1, బ్యాక్ ఆఫీసులో బ్యాగ్ ఉన్నట్లు ఎయిర్‌ట్యాగ్ చూపించింది. ఇదే విషయాన్ని వారికి వివరించి అక్కడి వారిని విచారించమని అడిగితే తమకు అనుమతి లేదని సమాధానం ఇచ్చారు సిబ్బంది. అయితే సిస్టమ్‌లో నోట్ పెడతామని, బ్యాగేజీ బృందం పర్యవేక్షిస్తుందని తెలిపింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ టీంని ట్విటర్ ద్వారా సంప్రదించారు. అయితే ట్యాగ్ వివరాలు తప్పుగా ఉన్నాయని చెప్పడంతో మళ్లీ నిరాశ తప్పలేదు. బ్యాగ్, క్లెయిమ్ టిక్కెట్, లొకేషన్ వివరాలను వారికి పంపించారు. చివరికి మరో అరగంటలో ఫోన్ చేసి బ్యాగ్ దొరికిందని, పంపిస్తామని చెప్పారు. కానీ వాళ్ల మీద ఉన్న అపనమ్మకంతో నెక్ట్స్ ఫ్లైట్‌లోనే చిగాగో వెళ్లి అక్కడ కేవలం 30 సెకన్లలో తన బ్యాగును గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషాయన్ని సాండ్రా షుస్టర్, రూబీ మీడియాతో పంచుకున్నారు. విమానయా సంస్థల సేవలు అధ్వాన్నంగామారుతున్నాయి.ఫలితంగా ఖరీదైన వస్తువులు,బ్యాగులు పోగొట్టుకుంటున్నాం. అందుకే ఎయర్ట్యాగ్ని కొనుగోలు చేసానని సాండ్రా షుస్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ టెక్ యుగంలో టెక్నాలజీ ఎలా వాడుకోవాలో వారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. యాపిల్ ఎయిర్‌ట్యాగ్ యాపిల్ ఎయిర్‌ట్యాగ్ ఒక ట్రాకింగ్ డివైస్. మిస్ అయిన వ్యక్తులు వ్యక్తిగత వస్తువులను కనుగొనడంలో ఎయిర్‌ట్యాగ్ కీ ఫైండర్‌గా పని చేస్తుంది. ఎయిర్‌ట్యాగ్ క్రౌడ్సోర్స్డ్ ఫైండ్ మై నెట్వర్క్,బ్లూటూత్ సిగ్నల్స్ సాయంతో కీలు, బ్యాగ్‌లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు తదితర పోగొట్టుకున్న వస్తువులను గుర్తించవచ్చు. -
మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం
డెన్వర్: జర్మనీ అమ్మాయి, విశాఖ అబ్బాయి ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో అమెరికాలో వైభవంగా జరిగింది. లిండా ముల్లర్, దైవిక్ శశాంక్ స్నేహ బంధం ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఎస్బీఐ విశ్రాంత అధికారి, ప్రసిద్ధ గాయకులు, విశాఖ కళాసాగర్ వ్యవస్దాపక అధ్యక్షులు వానపల్లి శ్రీమన్నారాయణ ఏకైక కుమారుడు శశాంక్‌తో లిండా ముల్లర్ వివాహం ముచ్చటగా జరిగింది. ప్రకృతి సోయగాల అందాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో అమెరికాలో హిందూ బంధుమిత్రుల నడుమ వేద మంత్రాలతో వైభవంగా ఈ వివాహ వేడుక జరగడం విశేషం. -
వైరల్: ఈ ఖడ్గమృగం చాలా స్పెషల్! బర్త్‌డేకి ఏం చేసిందో తెలుసా?
వాషింగ్టన్: మనుషులు పుట్టిన రోజు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే జంతుప్రేమికులు కొన్నిసార్లు తమ పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు చేస్తుంటారు. అయితే తాజాగా డెన్వర్ జూలో ఒక ఖడ్గమృగం తన పుట్టినరోజున తనే స్వయంగా కీబోర్డ్‌ను ప్లే చేసింది. జూలోని బంధు అనే ఖడ్గమృగానికి 12 సంవత్సరాలు నిండాయి. దాంతో బంధుకు పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 18 వేల మంది వీక్షించగా..వందల మంది లైక్ కొట్టారు. "మా జూలో ఉండే కొమ్ము గల మగ ఖడ్గమృగానికి ఈ రోజుతో 12 ఏళ్లు నిండాయి. ఇది తన పుట్టినరోజు. అయితే బంధు స్వయంగా తాను రాసిన ఒక ప్రత్యేక పాటతో మీ అందరికీ చికిత్స చేయాలనుకున్నాడు. తన పుట్టినరోజున మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరిచేందుకు అనేక మార్గాలలో ట్యూన్ కంపోజ్ చేయడానికి అతని ప్రిహెన్సిల్ పెదవిని ఉపయోగించాడు." అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా, దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "పుట్టినరోజు శుభాకాంక్షలు బంధు! అవును! ఆ పెద్ద పిల్లవాడిని ప్రేమించండి! " అంటూ కామెంట్ చేశాడు. "జంతువులకు నాకన్నా ఎక్కువ ప్రతిభ ఉంది" అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Denver Zoo (@denverzoo) (చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!) -
ఇంజిన్‌లో మంటలు..24 విమానాలు బంద్!
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని డెన్వర్, నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్లో చోటుచేసుకున్న బోయింగ్ విమాన ప్రమాదాలు కలకలం రేపాయి. డెన్వర్‌లో బయలుదేరిన కొద్దిసేపటికే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానం ఇంజిన్ నుంచి కొన్ని భాగాలు నేలపై పడడం, అత్యవసర ల్యాండింగ్ ఘటనలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాదానికి గురైన ఆ బోయింగ్–777 రకం విమానానికి ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తయారీ ఇంజిన్ ఉందని గుర్తించింది. ఈ రకం ఇంజిన్ ఉన్న అన్ని బోయింగ్–777 విమానాలను తనిఖీ చేయాలనీ, వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టాలని ఆదేశించింది. సోదాలు పూర్తయ్యే వరకు ఆ మోడల్ ఇంజిన్ ఉన్న విమానాలను ఉపయోగించరాదని బోయింగ్ కూడా విమానయాన సంస్థలకు ఎఫ్ఏఏ సూచించింది. విమానయానసంస్థలు, అధికారులతో సహకరించేందుకు తమ బృందాన్ని పంపిస్తున్నట్లు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తెలిపింది. డెన్వర్ ఘటనతో 24 విమానాలను వినియోగించరాదని నిర్ణయించినట్లు ఆ సంస్థ తెలిపింది. డెన్వర్ శివారు ప్రాంతంలో ఆదివారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్–777 విమానం ఇంజిన్ నుంచి పొగలు రావడంతోపాటు, రెక్క, తదితర భాగాలు నేలపై పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి, పరీక్షించగా విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు రెండు విరిగిపోగా మిగతా వాటికి పగుళ్లు వచ్చినట్లు తేలింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు 231 మంది, 10 మంది సిబ్బంది సహా ఎవరికీ హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఈ రకం ఇంజిన్ ఉన్న బోయింగ్ విమానాలు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు మాత్రమే ఉన్నాయి. డెన్వర్ ఘటన నేపథ్యంలో జపాన్ ఎయిర్వేస్, ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ సంస్థలు తమ 32 బోయింగ్ రకం విమానాలను ప్రస్తుతానికి నడపరాదని నిర్ణయించాయి. నెదర్లాండ్స్ ఘటన.. నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్లో బోయింగ్–747 రకం సరకు రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలోనూ డెన్వర్ ఘటనకు కారణమైన ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తయారీ ఇంజిన్ ఉండటం గమనార్హం. లాంగ్ టెయిల్ ఏవియేషన్‌కు చెందిన ఈ విమానం మాస్ట్రిచ్ నుంచి న్యూయార్క్‌కు ఆదివారం సాయంత్రం బయలుదేరి కొన్ని నిమిషాలకే పొగలు రేగి, ఇంజిన్ నుంచి కొన్ని భాగాలు పడిపోవడం మొదలైంది. వీటి కారణంగా వృద్ధురాలు, బాలుడు గాయపడ్డారు. ఇంజిన్ భాగాల తాకిడికి మీర్సెన్లోని పలు గృహాలు దెబ్బతిన్నాయి. ఈ విమానాన్ని పొరుగునే ఉన్న బెల్జియంలోని లీజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే అందులోని నాలుగు ఇంజిన్లలో ఒకదాని నుంచి మంటలు లేచాయని డచ్ ఎయిర్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఇంజిన్లోకి ఒక వస్తువు అడ్డుపడటంతో టర్బైన్ బ్లేడ్లు విరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అన్నారు. మా గగనతలంలోకి రావద్దు డెన్వర్ ఘటన నేపథ్యంలో యూకే స్పందించింది. ప్రాట్ అండ్ విట్నీ తయారీ ఇంజిన్లున్న బోయింగ్–777 విమానాలు తమ గగనతలంలో ప్రయాణించరాదంటూ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విమానాలు యూకే ఎయిర్‌లైన్స్‌లో లేవనీ, వీటి వినియోగాన్ని అమెరికా, జపాన్, ద.కొరియా అధికారులు నిలిపివేశారని తెలిపింది. చదవండి: విమానంలో మంటలు.. 231 మంది ప్రయాణికులు! -
ఆ రెస్టారెంట్లో స్టూపిడ్ ప్రశ్నలు అడిగితే అంతే..
మాములుగా రెస్టారెంట్‌కు వెళితే.. మనం ఆర్డర్ చేసినవాటికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అమెరికా డెన్వర్‌లోని ‘టామ్స్ డిన్నర్’ రెస్టారెంట్లో మాత్రం వాటితో పాటు.. ఇంకో నిబంధన కూడా ఉంటుంది. రెస్టారెంట్లో కస్టమర్లు అడిగే స్టూపిడ్ ప్రశ్నలకు కూడా వారు బిల్లు వసూలు చేస్తారు. ఇలా బిల్లు వసూలు చేస్తామని వారి మెనూలో కూడా పొందుపర్చారు. గత 20 ఏళ్లుగా ఆ రెస్టారెంట్లో ఈ నిబంధన ఉంది. తాజాగా ఓ వ్యక్తి టామ్స్ రెస్టారెంట్లో ఎదుర్కొన్న అనుభవాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. తను అడిగిన ఓ ప్రశ్నకు.. బిల్లు వేశారని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ఆన్లైన్లో ఉంచాడు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. స్టూపిడ్ ప్రశ్నలు అడిగినందుకు.. $0.38(రూ. 27) బిల్లు కట్టాల్సిందిగా రెస్టారెంట్ నిర్వాహకులు ఆ బిల్లులో పేర్కొన్నారు. అయితే ఆ రెస్టారెంట్ సంబంధిన మెను కార్డును పరిశీలిస్తే.. అందులో హెల్తీ ఆప్షన్స్ కింద కొన్ని అంశాలను జోడించారు. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని వ్యంగ్యంగా ఉన్నాయి. నెక్ట్స్ మిల్ తినకుంటే.. డబ్బులు ఆదా అవుతాయని, ఇంటికి నడుచుకుంటే వెళ్తే.. ఖర్చు ఉండదని పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఆ ‘మెను’ ను రూపొందించారని రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ చార్జ్ ఏమిటని కస్టమర్లు అడిగనప్పుడు.. భలే ఫన్నీగా అనిపిస్తోందని చెప్పారు. -
అమెరికా పాఠశాలలో కాల్పులు
హైల్యాండ్స్ రాంచ్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కొలెరాడోలోని ఓ పాఠశాలలోకి చొరబడిన ఇద్దరు విద్యార్థులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ‘డెవోన్ ఎరిక్సన్ (18), మరో విద్యార్థి కలిసి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం హైల్యాండ్స్ రాంచ్‌లోని స్టెమ్ స్కూల్లోకి ప్రవేశించారు. ఒక్కసారిగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో భయభ్రాంతులకు లోనైన విద్యార్థులు స్కూల్ ఆవరణలో పరుగులు పెట్టారు’అని డగ్లస్ కౌంటీ షెరిఫ్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
బిత్తిరి చర్య.. తప్పిన పెను ప్రమాదం
వాషింగ్టన్: జాగ్రత్తగా ఉండాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వహించాడు. బిత్తిరి చర్యతో నైట్ క్లబ్లో ప్రజలను బెంబేలెత్తించాడు. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మాత్రం గాయపడ్డాడు. డెన్వర్ నగరం(కొలరెడా)లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన ఘటన తాలుకూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎఫ్‌బీఐ అధికారి(ఆఫ్ డ్యూటీలో ఉన్నాడు) ఒకరు శుక్రవారం రాత్రి డెన్వర్‌లోని మైల్ హైల్ స్పిరిట్ అనే నైట్ క్లబ్‌కు వెళ్లాడు. హుషారుగా ఫ్లోర్‌పై బ్రేక్ డాన్స్ చేయటం ప్రారంభించాడు. చుట్టూ అమ్మాయిలు, అబ్బాయిలు చేరి వావ్ అనుకుంటుంటే.. ఆ కోలాహలం చూసి తట్టుకోలేక తన ట్యాలెంట్ ప్రదర్శించాడు. బ్యాక్‌ఫ్లిప్ మూమెంట్‌తో అదరగొట్టాడు. ఆ ప్రయత్నంలో అతని వెనకభాగంలో దాచుకున్న గన్ ఎగిరి కింద పడిపోయింది. కంగారులో దాన్ని తీసుకునే క్రమంలో అది కాస్త పేలింది. బార్లో పని చేసే ఓ ఉద్యోగి కాలికి తగిలి గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ బుల్లెట్ కింది దిశగా ప్రయాణించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటన తర్వాత సారీ చెబుతూ అక్కడి నుంచి అతను గాయబ్ అయిపోయాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేసి వైరల్ చేశాడు. ఎఫ్‌బీఐ మౌనం... ఘటన అనంతరం రంగంలోకి దిగిన డెన్వర్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అయితే ఎఫ్‌బీఐ అధికారి కావటంతో కేసు మాత్రం నమోదు చేయలేదు. మరోవైపు ఎఫ్‌బీఐ ఈ కేసును గోప్యంగా డీల్ చేయాలని చూస్తోంది. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై మీడియాకు ఎలాంటి వివరణ ఇచ్చేందుకు ఎఫ్‌బీఐ అధికారులు సుమఖంగా లేకపోవటం విశేషం. అయితే డెన్వర్ పోలీసులు మాత్రం ఎఫ్బీఐతో ప్రమేయం లేకుండా ఈ కేసులో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. ఇప్పటికే డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయానికి నివేదిక ను సమర్పించగా, వారిచ్చే ఆదేశాలనుసారం ముందుకు వెళ్తామని పోలీసులు స్పష్టం చేశారు. -
తప్పిన పెను ప్రమాదం
-
డెన్వర్‌లో 'టీడీఎఫ్' బతుకమ్మ సంబరాలు
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజిల్స్‌లలో బతుకమ్మ సంబరాను నిర్వహించారు. తాజాగా డెన్వర్‌లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. శనివారం డెన్వర్‌లోని కెసిల్ఉడ్ గ్రాంజ్ వేదికగా బతుకమ్మ, దసరా సంబరాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు అమెరికాలోని తెలుగువారు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. -
చిన్న విమానం కూలి ఐదుగురు మృతి
ఈరీ(యూఎస్): అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర డెన్వర్ లో ఈ దుర్ఘటన జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పైపర్ -46 విమానం ఈరీ మున్సిపల్ విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయిందని తెలిపారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోయాగా, ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆరుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ విమానం కిందకు దిగుతున్నప్పుడు కూలిందా లేక పైకి ఎగురుతున్నప్పడు కూలిందా అనేది తెలియలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర డెన్వర్ కు ఈరీ ప్రాంతం 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.