డెన్వర్‌కు చెందిన తల్లీ కూతుళ్లు లాక్రోస్ టో టోర్నమెంట్‌కి వెళ్లి వస్తూ తమ లగేజీని కోల్పోయారు. బాల్టిమోర్ నుండి చికాగో మీదుగా విమానం వస్తూ డెన్వర్‌కు పయన మయ్యారు. విమానాశ్రయంలో లగేజీ బెల్ట్‌లో తమ బ్యాగ్ కనిపించలేదు. దీంతో వారు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాదాపు ఇక దొరకదు అనుకున్న ఖరీదైన బ్యాగును టెక్నాలజీ సాయంతో దక్కించుకున్న వైనం విశేషంగా నిలిచింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!)
సీఎన్‌ఎన్ రిపోర్ట్ ప్రకారం సాండ్రా షుస్టర్ , ఆమె 15 ఏళ్ల కుమార్తె రూబీ లాక్రోస్ ప్లేయర్. టోర్నమెంట్ నుంచి జూలై 17న చికాగో ఓ'హేర్ విమానాశ్రయం వద్ద, లాక్రోస్ కిట్ చెకిన్ బ్యాగ్‌గా ఉంచుకుని, మిగిలిన బ్యాగేజీని విమానాశ్రయంలో లగేజీ కౌంటర్‌లో ఇచ్చారు. అయితే బెల్ట్‌పై వారి లగేజీ మిస్ అయింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయగా వస్తుందని చెప్పారు. కానీ రాలేదు. మళ్లీ కాల్ చేస్తే మీ బ్యాగ్ ఇంకా బాల్టిమోర్‌లో ఉంది అనే సమాధానం వచ్చింది. అంతేకాదు మీ బ్యాగును ఎవరో కొట్టేశారని కూడా చెప్పారు.
రూబీ బ్యాగులో ఖరీదైన 2,000 డాలర్ల కిట్ ఉంది. అంతకుమించి తన ఆటకు బాగా అలవాటైన లాక్రోస్ గేమ్ స్టిక్ ఉంది. దాన్ని వదులుకోవడం అంటే చాలా నష్టం. మరోవైపు మరో టోర్నమెంట్ కోసం శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలి. దీంతో తమ రిఫరెన్స్ నంబర్‌తో డెన్వర్‌లోని పోయిన లగేజ్ డెస్క్ వద్ద ఆగి, చికాగోలో ఎయిర్‌ట్యాగ్ ఇప్పటికీ ట్రాక్ చేస్తూనే ఉందని గట్టిగా వాదించారు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ ద్వారా తన బ్యాగ్ బాల్టిమోర్‌లో లేదని షుస్టర్‌కి అర్థమవుతోంది. టెక్నాలజీ సాయంతో పరిశీలించగా, చికాగోలోని టెర్మినల్-1, బ్యాక్ ఆఫీసులో బ్యాగ్ ఉన్నట్లు ఎయిర్‌ట్యాగ్ చూపించింది. ఇదే విషయాన్ని వారికి వివరించి అక్కడి వారిని విచారించమని అడిగితే తమకు అనుమతి లేదని సమాధానం ఇచ్చారు సిబ్బంది.
అయితే సిస్టమ్‌లో నోట్ పెడతామని, బ్యాగేజీ బృందం పర్యవేక్షిస్తుందని తెలిపింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ టీంని ట్విటర్ ద్వారా సంప్రదించారు. అయితే ట్యాగ్ వివరాలు తప్పుగా ఉన్నాయని చెప్పడంతో మళ్లీ నిరాశ తప్పలేదు. బ్యాగ్, క్లెయిమ్ టిక్కెట్, లొకేషన్ వివరాలను వారికి పంపించారు. చివరికి మరో అరగంటలో ఫోన్ చేసి బ్యాగ్ దొరికిందని, పంపిస్తామని చెప్పారు. కానీ వాళ్ల మీద ఉన్న అపనమ్మకంతో నెక్ట్స్ ఫ్లైట్‌లోనే చిగాగో వెళ్లి అక్కడ కేవలం 30 సెకన్లలో తన బ్యాగును గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషాయన్ని సాండ్రా షుస్టర్, రూబీ మీడియాతో పంచుకున్నారు.
విమానయా సంస్థల సేవలు అధ్వాన్నంగామారుతున్నాయి.ఫలితంగా ఖరీదైన వస్తువులు,బ్యాగులు పోగొట్టుకుంటున్నాం. అందుకే ఎయర్‌ట్యాగ్‌ని కొనుగోలు చేసానని సాండ్రా షుస్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ టెక్ యుగంలో టెక్నాలజీ ఎలా వాడుకోవాలో వారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
యాపిల్ ఎయిర్‌ట్యాగ్
యాపిల్ ఎయిర్‌ట్యాగ్ ఒక ట్రాకింగ్ డివైస్. మిస్ అయిన వ్యక్తులు వ్యక్తిగత వస్తువులను కనుగొనడంలో ఎయిర్‌ట్యాగ్ కీ ఫైండర్‌గా పని చేస్తుంది. ఎయిర్‌ట్యాగ్ క్రౌడ్‌సోర్స్‌డ్ ఫైండ్ మై నెట్‌వర్క్,బ్లూటూత్ సిగ్నల్స్ సాయంతో కీలు, బ్యాగ్‌లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు తదితర పోగొట్టుకున్న వస్తువులను గుర్తించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment