tag
-
లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!
డెన్వర్‌కు చెందిన తల్లీ కూతుళ్లు లాక్రోస్ టో టోర్నమెంట్‌కి వెళ్లి వస్తూ తమ లగేజీని కోల్పోయారు. బాల్టిమోర్ నుండి చికాగో మీదుగా విమానం వస్తూ డెన్వర్‌కు పయన మయ్యారు. విమానాశ్రయంలో లగేజీ బెల్ట్‌లో తమ బ్యాగ్ కనిపించలేదు. దీంతో వారు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాదాపు ఇక దొరకదు అనుకున్న ఖరీదైన బ్యాగును టెక్నాలజీ సాయంతో దక్కించుకున్న వైనం విశేషంగా నిలిచింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) సీఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం సాండ్రా షుస్టర్ , ఆమె 15 ఏళ్ల కుమార్తె రూబీ లాక్రోస్ ప్లేయర్. టోర్నమెంట్ నుంచి జూలై 17న చికాగో ఓ'హేర్ విమానాశ్రయం వద్ద, లాక్రోస్ కిట్ చెకిన్ బ్యాగ్‌గా ఉంచుకుని, మిగిలిన బ్యాగేజీని విమానాశ్రయంలో లగేజీ కౌంటర్లో ఇచ్చారు. అయితే బెల్ట్‌పై వారి లగేజీ మిస్ అయింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయగా వస్తుందని చెప్పారు. కానీ రాలేదు. మళ్లీ కాల్ చేస్తే మీ బ్యాగ్ ఇంకా బాల్టిమోర్‌లో ఉంది అనే సమాధానం వచ్చింది. అంతేకాదు మీ బ్యాగును ఎవరో కొట్టేశారని కూడా చెప్పారు. రూబీ బ్యాగులో ఖరీదైన 2,000 డాలర్ల కిట్ ఉంది. అంతకుమించి తన ఆటకు బాగా అలవాటైన లాక్రోస్ గేమ్ స్టిక్ ఉంది. దాన్ని వదులుకోవడం అంటే చాలా నష్టం. మరోవైపు మరో టోర్నమెంట్ కోసం శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలి. దీంతో తమ రిఫరెన్స్ నంబర్‌తో డెన్వర్‌లోని పోయిన లగేజ్ డెస్క్ వద్ద ఆగి, చికాగోలో ఎయిర్‌ట్యాగ్ ఇప్పటికీ ట్రాక్ చేస్తూనే ఉందని గట్టిగా వాదించారు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ ద్వారా తన బ్యాగ్ బాల్టిమోర్‌లో లేదని షుస్టర్కి అర్థమవుతోంది. టెక్నాలజీ సాయంతో పరిశీలించగా, చికాగోలోని టెర్మినల్-1, బ్యాక్ ఆఫీసులో బ్యాగ్ ఉన్నట్లు ఎయిర్‌ట్యాగ్ చూపించింది. ఇదే విషయాన్ని వారికి వివరించి అక్కడి వారిని విచారించమని అడిగితే తమకు అనుమతి లేదని సమాధానం ఇచ్చారు సిబ్బంది. అయితే సిస్టమ్‌లో నోట్ పెడతామని, బ్యాగేజీ బృందం పర్యవేక్షిస్తుందని తెలిపింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ టీంని ట్విటర్ ద్వారా సంప్రదించారు. అయితే ట్యాగ్ వివరాలు తప్పుగా ఉన్నాయని చెప్పడంతో మళ్లీ నిరాశ తప్పలేదు. బ్యాగ్, క్లెయిమ్ టిక్కెట్, లొకేషన్ వివరాలను వారికి పంపించారు. చివరికి మరో అరగంటలో ఫోన్ చేసి బ్యాగ్ దొరికిందని, పంపిస్తామని చెప్పారు. కానీ వాళ్ల మీద ఉన్న అపనమ్మకంతో నెక్ట్స్ ఫ్లైట్‌లోనే చిగాగో వెళ్లి అక్కడ కేవలం 30 సెకన్లలో తన బ్యాగును గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషాయన్ని సాండ్రా షుస్టర్, రూబీ మీడియాతో పంచుకున్నారు. విమానయా సంస్థల సేవలు అధ్వాన్నంగామారుతున్నాయి.ఫలితంగా ఖరీదైన వస్తువులు,బ్యాగులు పోగొట్టుకుంటున్నాం. అందుకే ఎయర్ట్యాగ్ని కొనుగోలు చేసానని సాండ్రా షుస్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ టెక్ యుగంలో టెక్నాలజీ ఎలా వాడుకోవాలో వారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. యాపిల్ ఎయిర్‌ట్యాగ్ యాపిల్ ఎయిర్‌ట్యాగ్ ఒక ట్రాకింగ్ డివైస్. మిస్ అయిన వ్యక్తులు వ్యక్తిగత వస్తువులను కనుగొనడంలో ఎయిర్‌ట్యాగ్ కీ ఫైండర్‌గా పని చేస్తుంది. ఎయిర్‌ట్యాగ్ క్రౌడ్సోర్స్డ్ ఫైండ్ మై నెట్వర్క్,బ్లూటూత్ సిగ్నల్స్ సాయంతో కీలు, బ్యాగ్‌లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు తదితర పోగొట్టుకున్న వస్తువులను గుర్తించవచ్చు. -
యాపిల్ని కోర్టుకి ఈడ్చిన ఎయిర్ ట్యాగ్
-
ట్విటర్ దీపం
సమస్యలను పరిష్కరించడం, తోటివారికి సాయం చేసే గుణం ఉంటే అధికారం, పదవులు, డబ్బులు లేకపోయినప్పటికీ ట్వీట్స్‌తో సామాజిక సేవ చేయవచ్చని నిరూపించి చూపిస్తోంది ఒడిషా ట్విటర్ క్వీన్ దీపా బారీక్. ఒడిషాలోని బర్గఢ్ జిల్లా టెమ్రీ గ్రామానికి చెందిన దీపా బారీక్ తండ్రి వ్యవసాయదారు. తల్లి అంగన్వాడి వర్కర్. మూడేళ్ల క్రితం దీపకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా వాడాలో తెలుసుకునేందుకు పక్కింట్లో ఉంటోన్న సామాజిక కార్యకర్త దిబాస్ కుమార్ సాహుని కలిసింది. అతను స్మార్ట్ ఫోన్ వాడకం గురించి వివరిస్తూ వివిధ రకాల సోషల్ మీడియా యాప్‌లు దీప ఫోన్లో వేశాడు. వీటితోపాటు ట్విటర్ యాప్ వేస్తూ ‘‘నువ్వు చేసే ట్వీట్‌ను తప్పనిసరిగా ఫలానా వ్యక్తులు చూడాలనుకుంటే వారి అకౌంట్‌ను ట్యాగ్ చేసి పోస్టుచేస్తే వారికి నేరుగా చేరుతుంది’’ అని చెప్పాడు. దిబాస్ చెప్పిన ఈ విషయమే దీపను ఒడిషా ట్విటర్ క్వీన్‌గా మార్చింది. సౌకీలాల్‌తో తొలిసారి.. అది 2019 ఒడిషాలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి గ్రామాల్లో ఇళ్లు కొట్టుకు పోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. టెమ్రీ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామంలో ఇల్లు కొట్టుకుపోవడంతో పేద దంపతులు ఉండడానికి వసతి లేక ఇబ్బందులు పడుతుండడం కనిపించింది దీపకు. అది చూసి చలించిపోయి సౌకీలాల్ దంపతుల సమస్యను వివరిస్తూ.. ఒడిషా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులతోపాటు సోషల్ మీడియా గ్రీవెన్స్ సెల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన 48 గంటల్లోనే గ్రామాభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించి, సౌకీలాల్ ఇల్లు కట్టుకునేందుకు రూ.98 వేల రూపాయలను ఇచ్చారు. ఈ సంఘటన దీపకు ముందుకు సాగడానికి ఉత్సాహాన్ని ఇవ్వడంతో..తరువాత మగదిక్కులేని వితంతువులకు పెన్షన్ కష్టాలు, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారి సమస్యలను రాష్ట్ర ఆశీర్వాద్ యోజన అధికారులకు చేర్చి వితంతువుల సమస్యను పరిష్కరించింది. వికలాంగులకు ప్రభుత్వం అందించే సదుపాయాలన్నింటిని వారి చెంతకు చేర్చడం, బిలాస్పూర్ గ్రామంలో డ్యామ్ మరమ్మతుల కారణంగా పంటపొలాలకు నీళ్లు అందకపోవడంతో.. ఆ సమస్యను నీటిపారుదల అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో రైతులు పంటలు పండించేందుకు నీరు అందింది. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా దీప ఐదు వేలమందికి పైగా సాయం చేయడం విశేషం. దేశంలో ఎక్కడున్నా... నేనున్నానంటూ... వివిధ సమస్యల పరిష్కారానికి దీప ట్వీటర్ సాయంతో చేస్తున్న కృషి స్థానికంగా చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా దీపను కలిసి వివరించడం, ట్విటర్ వేదికగా దీప ఆ సమస్యను సంబంధిత అధికారుల ముందు ఉంచడం, వారు దానిని పరిష్కరించడం చకచక జరిగిపోతున్నాయి. సొంతరాష్ట్రంలో ఇబ్బంది పడుతోన్న వారికేగాక, బతుకుదెరువుకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి సైతం దీప సాయం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఒడిషాకు చెందిన 23 మంది తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ ఇటుకల తయారీ బట్టీలో పనిచేయడానికి చేరారు. బట్టీ యజమాని ఆహారం, నీరు ఇవ్వకుండా, ఎక్కువ గంటలు పనిచేయమంటూ హింసించేవాడు. రోజులు గడిచేకొద్ది వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అది తట్టుకోలేక అక్కడినుంచి ఎలా బయటపడాలా? అనుకుంటోన్న సమయంలో వారిలో ఒకతనికి దీప గురించి తెలియడంతో.. వెంటనే ఈ సమస్య గురించి దీపకు చెప్పారు. వెంటనే ఆమె తెలంగాణ పోలీసులకు ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి 23 మంది కూలీలను రక్షించి సొంతరాష్ట్రానికి పంపించారు. ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న వెయ్యిమంది ఒడిషా కూలీలకి సాయం చేసింది. సమస్యలను వెతుక్కుంటూ.. అడిగిన వారికేగాక, చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం, దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రజాసమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా అధికారులకు చేరవేయడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తోంది దీప. ప్రస్తుతం సైన్స్‌లో పీజీ చేస్తున్న దీప భవిష్యత్‌లో ప్రొఫెసర్ కావాలనుకుంటోంది. ‘‘ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నా లాంటి వారినెందరినో తయారు చేయవచ్చు. ఇలాంటివాళ్లు సమాజంలో మరెంతోమందికి సాయం చేస్తారు’’ అంటూ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం విశేషం. తన ద్వారా సాయం అందిన వారితో దీప. -
ఈ టాగ్‌తో నోరులేని జీవాలు సేఫ్!
ప్రస్తుతమున్న బిజీ లైఫ్‌లో ముందుకు దూసుకుపోవడమేగానీ.. పక్కవారిని పట్టించుకునే తీరికలేదు. రోడ్డుమీద డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు వెనకాముందు చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వాహనాలు, నోరులేని జంతువులనూ గుద్దేస్తున్నారు. రోడ్డెక్కిన మనిషికే సేఫ్టిలేని ఈరోజుల్లో.. మూగ జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రమంగా అడవులు కనుమరుగవుతుండడంతో కాంక్రీట్ జంగిల్‌ల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మూగ జీవాల పరిస్థితిని అర్థం చేసుకున్న.. చైతన్య గుండ్లూరి.. వినూత్న ఐడియాతో వాటికి రక్షణ కల్పిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన చైతన్య మూగజీవాల పరిరక్షణకు ఏకంగా ఓ ఎన్జీవోని స్థాపించారు. వేగంగా దూసుకుపోయే వాహనాల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోతున్న కుక్కలకు ఫ్లోరోసెంట్ ట్యాగ్లు, బెల్టులు అమర్చి కాపాడుతున్నారు. చైతన్య మాట్లాడుతూ..‘‘ నా పనిలో భాగంగా నేను ఎక్కువ సమయం ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఆ సమయంలో పలుమార్లు వేగంగా దూసుకుపోతున్న వాహనాల కింద పడి జంతువులు చనిపోవడం చూసేవాడిని. అంతేగాకుండా నాకెంతో ఇష్టమైన నా బెస్ట్ ఫ్రెండ్ ఒక కుక్కను తప్పించబోయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ సంఘటన నన్ను ఎంతో కలిచి వేసింది. దీంతో రోడ్డు మీద తిరిగే కుక్కలు వాహనాలకు అడ్డుపడకుండా, ఇంకా అవి బిక్కుబిక్కుమంటూ తిరగకుండా ఉండేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. ఇందులో భాగంగానే గతేడాది నవంబర్‌లో ప్లోరోసెంట్ ట్యాగ్‌లను కుక్కలు, ఆవులు, గేదెల మెడలో వేయడం ప్రారంభించాం. రాత్రి సమయంల్లో అవి రోడ్ల మీదకు వచ్చినా డ్రైవింగ్ చేసేవారికి క్లియర్‌గా కనిపిస్తాయి. దీంతో యాక్సిడెంట్లు అవ్వవు. ఫ్లోరోసెంట్ పదార్థంతో తయారైన ఈ ట్యాగ్‌లపై లైట్ పడగానే మెరుస్తాయి. దీంతో దూరం నుంచే ఎదురుగా జంతువు ఉన్నట్లు గుర్తించి వాహనం స్పీడు తగ్గించి పక్క నుంచి వెళ్లిపోతారు. దీని వల్ల ఇటు మూగజీవాలకు, అటు వాహనదారులకు ఏ ఇబ్బంది ఉండదు’’ అని చైతన్య చెప్పాడు. ప్రస్తుతం చైతన్య ఎన్జీవో ఆరు రాష్ట్రాలో చురుకుగా పనిచేస్తోంది. 36 నగరాల్లో 270 మంది వలంటీర్లు మూగజీవాలను రక్షిస్తున్నారు. రోజుకి దాదాపు 200 కుక్కలకు ట్యాగ్లు వేస్తున్నారు. ఇలా రోజూ జంతువులకు ట్యాగ్లు, ఫ్లోరోసెంట్ బెల్టులు వేయాలంటే భారీసంఖ్యలో అవి అవసరమవుతాయి. అందుకే గ్రామాల్లోని స్మాల్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ గ్రూపులతో వీటిని తయారు చేయిస్తూ.. వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. -
నకిలీ వార్తల నిరోధానికి గూగుల్ ‘ట్యాగ్’
వాషింగ్టన్ : ఆన్ లైన్ లో తప్పుడు సమాచారంతో పాటు నకిలీ వార్తల్ని నిరోధించడానికి ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కొత్తగా నిజనిర్ధారణ ట్యాగ్‌ను శుక్రవారం ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ పనిచేసే ఈ ట్యాగ్, థర్డ్ పార్టీ పరిశీలకుల సాయంతో వార్తలు వాస్తవమైనవో, కావో తెలుపుతుందని గూగుల్ వెల్లడించింది. ఈ ట్యాగ్‌ను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా 115 నిజనిర్ధారణ గ్రూపులతో గత ఏడాది కాలంగా పనిచేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కొన్ని నకిలీ వార్తలు పలు అభ్యర్థుల ఓట్లను ప్రభావితం చేశాయని తేలడంతో గూగుల్ ఈనిర్ణయం తీసుకుంది. -
విమాన ప్రయాణీకులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విమానం ప్రయాణం అంటే లగేజీ స్కానింగ్..హ్యాండ్ బ్యాగుల సెక్యూరిటీ తనిఖీలు ఓ పెద్ద తతంగం. అయితే ఇక విమాన ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగుల స్టాంపింగ్, ట్యాగింగ్ సమస్యలకు ఇక శుభం కార్డు పడినట్టే. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ బ్యూరో ఒక కొత్త పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పూర్తి భద్రతను నిర్వహించే సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఏఎస్) అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చెకింగ్ వ్యవస్థను గురువారం ప్రారంభించింది. హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత ఇతర టెక్నాలజీతో సహాయంతో హ్యాండ్ బ్యాగుల తనిఖీని మరింత కట్టుదిట్టంగా చేపట్టనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోలకతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ఈ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ పద్ధతిని అన్ని విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నట్టు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సామాను భద్రత, స్క్రీనింగ్ సౌకర్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రయాణీకులకు హ్యాండ్ బ్యాగు టాగ్స్ , స్టాంపింగ్ కష్టాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పద్థతిని అవలంబిస్తున్నట్టు చెప్పింది. బాధ్యత బీసీఏఎస్ ది. -
ఫేస్బుక్ వాడుతున్నారా.. జాగ్రత్త!