వాషింగ్టన్ : ఆన్ లైన్ లో తప్పుడు సమాచారంతో పాటు నకిలీ వార్తల్ని నిరోధించడానికి ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కొత్తగా నిజనిర్ధారణ ట్యాగ్‌ను శుక్రవారం ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ పనిచేసే ఈ ట్యాగ్, థర్డ్ పార్టీ పరిశీలకుల సాయంతో వార్తలు వాస్తవమైనవో, కావో తెలుపుతుందని గూగుల్ వెల్లడించింది.
ఈ ట్యాగ్‌ను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా 115 నిజనిర్ధారణ గ్రూపులతో గత ఏడాది కాలంగా పనిచేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కొన్ని నకిలీ వార్తలు పలు అభ్యర్థుల ఓట్లను ప్రభావితం చేశాయని తేలడంతో గూగుల్ ఈనిర్ణయం తీసుకుంది.