మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. 28 రోజులుగా జరుగుతున్న ఈ భీకర దాడుల్లో ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. బాంబు దాడుల కారణంగా ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. రష్యా వైఖరిపై ప‍్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు అంటూనే రష్యా దాడులకు పాల్పడుతోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఫేస్‌బుక్, ట‍్విట‍్టర్‌పై నిషేధం విధించిన రష్యా.. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ వార్తలను రష్యాలో బ్లాక్ చేస్తున్నట్టు రష్యా కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ పేర్కొంది. ఈ విషయాన్ని ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది. కాగా, పుతిన్ తమ దేశానికి వ్యతిరేకంగా వార్త ప్రసారాలు చేస్తే వారికి జైలు శిక్ష అంటూ పుతిన్ సర్కార్ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది.
దీని ప్రకారం.. రష్యన్లను కించపర్చినట్లు గానీ, ఇతర వీడియోలను ప్రసారం చేయకూడదు. ఇక, కొత్త రష్యా చట్టాల ప్రకారం.. రష్యా మిలటరీని కించపరిచే విధంగా ఏ వార్తనైనా, వీడియోనైనా ప్రసారం చేయడం చట్ట విరుద్దంగా పరిగణిస్తారు. ఇలాంటి వార్తలను బహిరంగపరచటం నేరమంటూ రూల్స్ మార్పు చేశారు. అయితే, రష్యా- ఉక్రెయిన్ దాడిపై ఫేక్ వార్తలను అరికట్టడానికే పుతిన్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
మరోవైపు.. ఉక్రెయిన్‌లో చోటుచేసుకున్న విధ్వంసాలను, యుద్ధానికి సంబంధిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రష్యా బలగాలు మాట తప్పి ఉక్రెయిన్ పౌరులపై బాంబు దాడులకు పాల్పుడుతుండటంతో స్థానికులు మృత్యువాతపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment