మాస్కో: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం 500 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల పుతిన్ సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్గేనీ ప్రిగోజిన్ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు.
గత వారం రోజుల్లో ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబులు సాయం చేయడం, టర్కీ దేశం తమవద్ద ఖైదీలుగా ఉన్న ఉక్రెయిన్ కమాండర్ లను విడుదల చేయడం వంటి హఠాత్పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో రష్యా కూడా కొన్ని కీలక పావులు కదిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వాగ్నర్ గ్రూపుతోపాటు మరికొన్ని గ్రూపులను కలిపి మొత్తం 35 మందిని అధ్యక్షుడు పుతిన్ తో సమావేశానికి ఆహ్వానించింది క్రెమ్లిన్. ఈ సమావేశానికి కమాండర్లు కూడా హాజరవ్వగా సమావేశం మూడు గంటల పాటు సాగిందని తెలిపాయి క్రెమ్లిన్ వర్గాలు.
ఈ సందర్బంగా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సమావేశం ఫలప్రదంగా సాగిందని.. వాగ్నర్ గ్రూపు తాము పుతిన్ సైనికులమని ఆయన ఆదేశిస్తే యుద్ధరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం రష్యా సైన్యానికి ఎదురు తిరిగిన వాగ్నర్ గ్రూపు రోస్తోవ్ లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని మాస్కో వస్తున్నాం కాసుకోమని పుతిన్ కే సవాలు విసిరిన విషయం తెలిసిందే.
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశంకో చొరవతో సంధి కుదిరి ప్రిగోజిన్ దళాలు తిరుగుముఖం పట్టాయి. ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్ బెలారస్ వెళ్లాల్సి ఉండగా వెళ్లకుండా రష్యాలోని ఉన్నారు.
ఈ సందర్బంగా యెవ్గేనీ ప్రిగోజిన్ మాట్లాడుతూ మేము చేసింది ప్రభుత్వంపై తిరుగుబాటు కాదని సైనిక బృందాలకు, నాయకులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి తెలియజేసాం అంతేనని వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: బుద్ధి మారలేదు.. జైలు తప్పలేదు..
Comments
Please login to add a commentAdd a comment