
పబ్లిక్ ఈవెంట్లకు హాజరైనప్పుడు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మనస్ఫూర్తిగా మనుషుల్లోకి వెళ్లడం కంటే.. పబ్లిసిటీ కోసం ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇచ్చేవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆనక.. శానిటైజర్లతో చేతులు తుడుచుకుంటూ కనిపించిన దాఖలాలు మన తెలుగు రాజకీయాల్లోనే చూశాం. ఆ సంగతి పక్కన పెడితే, పాపం.. ఫొటోషూట్ హడావిడిలో ఏకంగా ప్రధాని స్థాయి వ్యక్తికే ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది.
కాన్‌బెర్రా: గురువారం న్యూ సౌత్‌వేల్స్ జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొన్నారు. ప్రసంగం పూర్తయ్యాక.. వేదికపై ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఆపై ఒక్కసారిగా పక్కకు వెళ్లి పడిపోయారు. వెంటనే లేచి తాను క్షేమంగా ఉన్నానని నవ్వుతూ సంకేతమిచ్చారు. ఆపై ఓ రేడియో ఇంటర్వ్యూకి హాజరైన ఆయన ఆ ఘటనపై స్పందించారు.
నేనేం పడిపోలేదు. ఓ అడుగు వెనక్కి పడిందంతే. ఒక కాలు కిందకు వంగిపోయింది.. అంటూ నవ్వుతూ చెప్పారు. ఇదిలా ఉంటే మే 3వ తేదీన ఆస్ట్రేలియా ఎన్నికలు జరగనున్నాయి.అధికార లేబర్ పార్టీకి, పీటర్ డుట్టాన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ లిబరల్ నేషనల్ పార్టీకి విజయావకాశాలు సమానంగా కనిపిస్తున్నాయి.
Anthony Albanese has fallen off the stage while speaking at a mining union conference… pic.twitter.com/Z716MlW629
— Roman Mackinnon (@RomanMackinnon6) April 3, 2025