రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా క్రికెటర్లంతా ఇవాళ ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోని అల్బనీస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్‌లో భారత క్రికెటర్లకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.ఆల్బనీస్ టీమిండియా క్రికెటర్లందరితో కరచాలనం చేశారు. అనంతరం భారత జట్టు మొత్తం అల్బనీస్‌తో గ్రూప్ ఫోటో దిగింది.
Australian Prime Minister meets and having chat with Virat Kohli, Rohit Sharma & Team India's players in Canberra.
- VIDEO OF THE DAY. 🇮🇳 pic.twitter.com/okFF0xaCN9— Tanuj Singh (@ImTanujSingh) November 28, 2024
కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా.. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 20, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్ రెండో టెస్ట్ తరహాలోనే పింక్ బాల్‌తో (డే అండ్ నైట్) జరుగుతుంది.
ఇదిలా ఉంటే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా బుమ్రా ఆకాశమే హద్దుగా (8 వికెట్లు) చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సూపర్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 104, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment