Anthony Albanese
-
పదహారు ఏళ్లలోపు పిల్లలు.. సోషల్ మీడియాకు నో..!
పదహారు ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. యువతపై రకరకాల సైట్ల ప్రభావాన్ని ఆయన ‘విపత్తు’గా అభివర్ణించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లాంటి సైట్లలోకి లాగిన్ కావడానికి పిల్లల కనీస వయసు ఇంకా నిర్ణయించబడలేదు.ఇది 14 నుండి 16 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ‘సోషల్ మీడియా వ్యసనంగా మారిన పిల్లలను ఆటస్థలాలు, ΄÷లాలు, స్విమ్మింగ్ పూల్స్‌లో చూడాలనుకుంటున్నాను’ అంటున్నారు ప్రధాని. ‘సామాజిక మాధ్యమాలు సామాజిక హాని కలిగిస్తున్నాయి. యువత మనసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సోషల్ మీడియా దాటి బాహ్య ప్రపంచంలోకి వస్తే వారికి ఎన్నో అనుభవాలు సొంతం అవుతాయి’ అంటున్నాడు ఆంథోనీ ఆల్బనిస్.ప్రధాని నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు సైతం సమర్థించారు. ‘సోషల్ మీడియా సంస్థలు వయసు పరిమితి విధించాలి’ అని కోరుతున్నాడు ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్. ‘సోషల్ మీడియా సంస్థలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి’ అని ΄ాలక, ప్రతిపక్ష నేతలు కోరుకుంటున్నారు.ఇవి చదవండి: రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం..అప్ఘాన్ జిమ్ ఓనర్ మృతి -
WikiLeaks: అసాంజ్‌కు విముక్తి
సైపన్/కాన్బెర్రా: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు పూర్తి విముక్తి దొరికింది. అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు అసాంజ్‌ను బుధవారం విడుదల చేసింది. అంతకుముందు మూడు గంటలపాటు విచారణ సాగింది. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను అసాంజ్ అంగీకరించారు. అయితే, ‘‘రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛపై నాకు నమ్మకముంది. అందులో భాగంగానే ఓ జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి బయట పెట్టా. అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ప్రకారం నా చర్యలకు రక్షణ ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని అనుమతిస్తున్నట్టు చీఫ్ యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి రమొనా వి.మంగ్లోనా ప్రకటించారు. అసాంజ్‌కు ఐదేళ్ల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇప్పటికే బ్రిటిష్ జైల్లో ఐదేళ్లు శిక్ష అనుభవించిన కారణంగా ఆయన్ను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘మీరు ఈ న్యాయస్థానం నుంచి స్వేచ్ఛా వ్యక్తిగా బయటకు వెళ్లవచ్చు’’ అని ప్రకటించారు. అనంతరం అసాంజ్ కోర్టు నుంచి బయటికొచ్చారు. ఈ పరిణామం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మీడియా ఎదురుచూపులువిచారణను కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్త మీడియా సైపన్లోని కోర్టు దగ్గరికి చేరుకుంది. గంటలపాటు బయట వేచి చూసినా విచారణను చిత్రీకరించేందుకు మీడియాను కోర్టు హాల్లోకి అనుమతించలేదు. అసాంజ్ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఆయన భార్య స్టెల్లా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భావోద్వేగంతో కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నా’ అన్నారు. అసాంజ్ విడుదల స్వాగతించదగ్గ పరిణామమని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు. అసాంజ్ విడుదలకు ఆ్రస్టేలియా సకల ప్రయత్నాలు చేసిందన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని అసాంజ్ న్యాయవాది జెన్నిఫర్ రాబిన్సన్ అన్నారు. ఆయన విడుదలకు సాయం చేసినందుకు అల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వందేళ్లలో అమెరికా ఎవరిపైనా గూఢచర్య చట్టం ప్రయోగించలేదని, జర్నలిస్టు అయిన అసాంజ్పైనే మోపిందని ఆయన తరఫున వాదించిన మరో న్యాయవాది బారీ పొలాక్ తన క్లయింట్ అన్యాయానికి గురయ్యారన్నారు. శుభాకాంక్షలు చెప్పిన న్యాయమూర్తి విచారణ సందర్భంగా అసాంజ్‌కు న్యాయమూర్తి రమోనా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘‘వచ్చే వారం మీ పుట్టిన రోజని తెలిసింది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. జూలై 3న అసాంజ్ 54వ ఏట అడుగుపెట్టనున్నారు. భార్యను, తండ్రిని హత్తుకుని..ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి అసాంజ్ ప్రైవేట్ విమానంలో సైపన్ దీవుల నుంచి బయల్దేరి బుధవారం రాత్రి ఆ్రస్టేలియా రాజధాని కాన్బెర్రా చేరుకున్నారు. కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి విమానం నుంచి బయటికొస్తున్న ఆయన్ను చూసి మద్దతుదారులంతా పెద్దగా నినాదాలు చేశారు. విమానాశ్రయంలో తనకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భార్య స్టెల్లా, తండ్రి జాన్ షిప్టన్లను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారు అసాంజ్‌ను హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. -
'అరె శాండ్‌పేపర్ మరిచిపోయా'.. ఆసీస్ ప్రధానికి రిషి సునాక్ కౌంటర్
ప్రతిష్టాత్మ యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి రెండింటిలో ఆసీస్ విజయం సాధించగా.. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి రేసులో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 19 నుంచి 23 వరకు జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు గిరాటేశాడు. నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఆస్ట్రేలియా ప్రవర్తించిందంటూ అభిమానులు సహా ఇంగ్లీష్ మీడియా తమ కథనాల్లో హోరెత్తించింది. విమర్శల స్థాయి ఎలా ఉందంటే అది మూడో టెస్టుకు కూడా పాకింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అలెక్స్ కేరీ కనిపించిన ప్రతీసారి ఇంగ్లీష్ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు. ఇక బెయిర్ స్టో ఔట్ వివాదంపై రెండు దేశాల ప్రధానులు కూడా జోక్యం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమంటే.. ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ రిషి సునాక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అయితే క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అని.. ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఇరు దేశాల ప్రధానులు అభిమానులను కోరారు. తాజాగా ఇరుదేశాల ప్రధానులు మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈసారి దేశాల మధ్య అనుబంధం మరింత పెంపొందించేందుకు సమ్మిళిత అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ చాలెంజెస్, యూకే-ఆస్ట్రేలియా మధ్య వ్యాపార రంగానికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. వీటిలోనే యాషెస్ సిరీస్ ప్రస్తావన కూడా వచ్చినట్లు ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఆసీస్ ప్రధాని ఆంథోని షేర్ చేసిన వీడియోలో.. యాషెస్పై ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మొదట అల్బనీస్ యాషెస్‌లో ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలో ఉన్నట్లు ఒక పేపర్‌పై చూపించారు. ఆ తర్వాత రిషి సునాక్ లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన పేపర్ కట్‌ను చూపించారు. ఇక ఆసీస్ ప్రధాని ఈసారి లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔటైన విధానంకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను చూపించగా.. రిషి సునాక్.. ''సారీ తాను శాండ్‌పేపర్(Sandpaper-Ball Tampering) గేట్ ఉదంతం పేపర్ క్లిప్పింగ్‌ను మరిచిపోయాను'' అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాండ్‌పేపర్ వివాదమేంటి? రిషి సునాక్ ప్రస్తావించిన శాండ్ పేపర్ వివాదం 2018లో జరిగింది. ఐదేళ్ల క్రితం సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్ ముక్కతో బంతిని రుద్దడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇలా చేయడం వల్ల బంతి స్వింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ శాండ్‌పేపర్ ఉదంతం వెనుక అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లది కీలకపాత్ర అని తేలడంతో ఏడాది నిషేధం పడింది. బెన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలలు నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ తన తప్పును క్షమించమంటూ కెమెరా ముందు బోరున ఏడ్వడం ఎప్పటికి మరిచిపోలేం. ఈ ఉదంతం అనంతరం స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఏడాది తర్వాత స్మిత్, వార్నర్‌లు మళ్లీ జట్టులోకి రాగా.. బెన్‌క్రాఫ్ట్ మాత్రం మళ్లీ అడుగుపెట్టలేకపోయాడు. And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062 — Anthony Albanese (@AlboMP) July 11, 2023 చదవండి: Asia Cup 2023: 'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే' #NovakDjokovic: 46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం -
Ashes 2023: రిషి సునాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్! మాములుగా లేదు..
Bairstow Controversial Dismissal: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లిష్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన తీరుపై వివాదం కొనసాగుతూనే ఉంది. బంతి వికెట్‌కీపర్ చేతిలో ఉండగానే.. బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమయస్ఫూర్తితో బెయిర్‌స్టోను స్టంపౌట్ చేసిన ఆసీస్ వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ సహా ఇతర ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిన నేపథ్యంలో.. తామైతే ఇలా ఆసీస్ తరహాలో గెలుపొందాలని కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం స్టోక్స్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రిషి సునాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇందుకు ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ సైతం రంగంలోకి దిగారు. తమ జట్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళా, పురుష క్రికెట్ జట్లను చూసి తాను గర్వపడుతున్నానన్నారు. ‘‘అదే ఆసీస్.. పూర్వవైభవాన్ని గుర్తు చేస్తూ.. ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తూనే ఉంటుంది. వాళ్లు విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా.. విజేతలైన మా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని ఆంథనీ అల్బనీస్ పేర్కొన్నారు. పరస్పరం విమర్శలు కాగా యాషెస్ సిరీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా.. ఓవర్ పూర్తైందని భావించిన బెయిర్‌స్టో క్రీజు దాటి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని వికెట్లకు గిరాటేసి.. రనౌట్‌కు అప్పీలు చేశాడు. అయితే, బెయిర్‌స్టో కీపర్ లేదంటే అంపైర్‌కి సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఇంగ్లండ్ అభిమానులు, మీడియా ప్రత్యర్థి జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసీస్ మీడియా కూడా తగ్గేదేలే అన్నట్లు స్టోక్స్ ఫొటోలతో ఇంగ్లండ్ విమర్శలను తిప్పి కొట్టింది. తాజాగా ఇరు దేశాల ప్రధానులు సైతం తమ తమ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ కౌంటర్ అటాక్ చేసుకోవడం విశేషం. చదవండి: BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్.. నెదర్లాండ్స్ ఆశలు సజీవం BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
ఆస్ట్రేలియాలో మోదీ ప్రసంగం.. కిక్కిరిసిన ఎరీనా (ఫొటోలు)
-
Narendra Modi: నమ్మకమే పునాది
సిడ్నీ: పరస్పర నమ్మకం, గౌరవాలే మూలస్తంభాలుగా భారత్–ఆ్రస్టేలియా సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మంగళవారం సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని అతి పెద్ద ఇండోర్ స్టేడియాల్లో ఒకటైన 20 వేల మంది సామర్థ్యమున్న ఎరీనా పూర్తిగా కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో 21 వేల మందికి పైగా పాల్గొన్నారు. సభికులంతా ‘మోదీ, మోదీ’ నినాదాలతో ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఆయన ప్రసంగం పొడవునా పదేపదే అవే నినాదాలతో హోరెత్తించారు. మోదీ మాట్లాడుతూ ఆ్రస్టేలియాలో వ్యూహాత్మక భాగస్వామ్యం నానాటికీ బలోపేతమవుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపునకు మించి పెరుగుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘భారత–ఆ్రస్టేలియా మధ్య భౌగోళికంగా చాలా దూరమున్నా హిందూ మహాసముద్రం రెండింటినీ నిరంతరం కలిపే ఉంచుతోంది. ఇరు దేశాల బంధాలకు ఒకప్పుడు ‘3సి’లు (కామన్వెల్త్, క్రికెట్, కర్రీ) ప్రతీకగా ఉండేవి. తర్వాత ‘3డి’లు (డెమొక్రసీ, డయాస్పొరా, దోస్తీ)గా మారింది. ఇప్పుడది ‘3ఇ’లు (ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్)గా రూపాంతరం చెందింది. ఇరు దేశాల బంధాల్లోని గాఢత ఈ నిర్వచనాలన్నింటినీ ఎప్పుడో అధిగమించింది. క్రికెట్ అయితే ఎన్నో దశాబ్దాలుగా కలిపి ఉంచుతూ వచ్చింది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో యోగా కూడా చేరింది’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పుకొచ్చారు. ఇందులో ఆ్రస్టేలియాలోని భారత సంతతి పాత్ర అత్యంత కీలకమని ప్రశంసలు గుప్పించారు. లెగ్ స్పిన్ మాంత్రికుడు, లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ అకాల మరణం పాలైనప్పుడు లక్షలాది మంది భారతీయులు అత్యంత ఆప్తున్ని కోల్పోయామంటూ దుఃఖించారని గుర్తు చేశారు. బ్రిస్బేన్‌లో త్వరలో భారత కాన్సులేట్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. బుధవారం మోదీ, ఆల్బనీస్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రపంచ శక్తిగా భారత్ భారత్ నేడు ప్రపంచమంతటికీ ఓ సానుకూల శక్తిగా ఎదిగిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా సాయానికి అందరికంటే ముందు నిలుస్తూ వస్తోందన్నారు. ఇటీవలి తుర్కియే భూకంప బాధితులను ఆపరేషన్ దోస్త్ ద్వారా ఇతోధికంగా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తళుకులీనుతున్న తారగా భారత్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి అభివర్ణించింది. ప్రపంచ మాంద్యం పరిస్థితులను సమర్థంగా తట్టుకుంటున్న దేశమేదైనా ఉందంటే అది భారతేనని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ సంఖ్యలో యువత ఉన్న దేశం కూడా భారతే’’ అన్నారు. భారత యాత్రాస్మృతిలోకి జారుకున్న ఆల్బనీస్ ఇటీవలి భారత పర్యటన తాలూకు మధుర స్మృతులు తన మనసులో ఇంకా తాజాగానే ఉన్నాయన్నారు. ‘‘గుజరాత్లో హోలీ వేడుకలు, ఢిల్లీలో మహాత్మా గాం«దీకి నివాళులు, అహ్మదాబాద్ స్టేడియంలో దాదాపు లక్ష మంది అభిమానుల అభివాదం స్వీకరించడం అన్నీ అద్భుత జ్ఞాపకాలే. 1991లో 28 ఏళ్ల యువకునిగా ఐదు వారాల పాటు భారత్‌లో కలియదిరిగా. ఎక్కడికి వెళ్లినా ఇరు దేశాల ప్రజల మధ్య పెనవేసుకున్న గాఢానుబంధాన్ని గమనించా’’ అని చెప్పారు. నిజమైన భారత్‌ను అర్థం చేసుకోవాలంటే దేశమంతా రైల్లో, బస్సుల్లో విస్తృతంగా కలియదిరగాలని ఆల్బనీస్ అభిప్రాయపడ్డారు. సిడ్నీలో ‘లిటిల్ ఇండియా’ పశ్చిమ సిడ్నీలో భారతీయులు ఎక్కువగా ఉండే హారిస్ పార్కుకు ‘లిటిల్ ఇండియా’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ నామకరణం చేశారు. ఇదో గొప్ప గౌరవమంటూ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆల్బనీస్ను హారిస్ పార్క్‌కు తీసుకెళ్లి భారతీయ వంటకాలు, ముఖ్యంగా అక్కడ బాగా ఫేమస్ అయిన చాట్, జిలేబీ రుచి చూపించాలని స్థానిక భారతీయులకు సూచించారు. కొవిడ్ కష్టకాలంలో ఆస్ట్రేలియాలో స్థానిక గురుద్వారాలు గొప్పగా సేవలందించాయని ఆయన అన్నారు. మోదీ ఓ రాక్‌స్టార్ సిసలైన బాస్: ఆల్బనీస్ తమ దేశంలో మోదీకి దక్కుతున్న అపూర్వ ఆదరణను కళ్లారా చూసి ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ అక్షరాలా అచ్చెరువొందారు. మోదీ వేదికపైకి రాగానే ఆయన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ‘ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రాక్‌స్టార్ తరహాలో అపూర్వ స్వాగతం పొందే అత్యంత పాపులర్ నాయకుడు’ అంటూ మిన్నంటిన హర్షధ్వానాల మధ్య సభికులకు పరిచయం చేశారు! ‘‘ప్రఖ్యాత అమెరికా సింగర్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ కూడా 2017లో ఇక్కడికొచ్చారు. ఇప్పుడు మోదీకి లభించినంత ఆదరణ ఆయనకు కూడా దక్కలేదు. మోదీ నిజమైన బాస్’’ అంటూ ఆకాశానికెత్తారు. స్ప్రింగ్స్టీన్ను అభిమానులు బాస్ అని ముద్దుపేరుతో పిలుచుకుంటారు! ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం తాలూకు స్ఫూర్తిని ఆ్రస్టేలియాకు వెంట తెచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలని ఆల్బనీస్ అన్నారు. ఇంత భారీ సంఖ్యలో భారతీయులు ఆ్రస్టేలియాను తమ సొంతిల్లుగా మార్చుకున్నందుకు వారిని చూసి గర్వపడుతున్నానన్నారు. అంతకుముందు ప్రధానులిద్దరికీ వేదిక వద్ద వేదమంత్రాలు, ఆ్రస్టేలియా మూలవాసుల సంప్రదాయ పద్ధతుల్లో ఘనస్వాగతం లభించింది. ఆ్రస్టేలియాతో బంధాలను దృఢతరం చేయడంలో కీలకపాత్ర పోషించాలని భారతీయ ప్రముఖులను మోదీ కోరారు. -
కామన్వెల్త్, కర్రీ, క్రికెట్.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడమే తన కల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోందని.. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుందని తెలిపారు. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని పేర్కొన్నారు. సిడ్నీలో మంగళవారం జరిగిన ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహంగా కార్యక్రమం ప్రారంభమైంది. Immense enthusiasm in Sydney for the community programme, which begins soon… pic.twitter.com/K3193pYLEZ — PMO India (@PMOIndia) May 23, 2023 అనంతరం ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మోదీ మాట్లాడారు. తనతోపాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. తాను మళ్లీ ఆస్ట్రేలియా వస్తానని 2014లోనే వాగ్దానం ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ ఇక్కడకు వచ్చానని తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంచి స్నేహం ఉందని ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదవండి: ఆస్ట్రేలియాలో మోదీ మ్యాజిక్.. ఓ రేంజ్లో భారతీయుల స్వాగతం! భారత్, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తుంటాయన్నారు. కామన్వెల్త్, కర్రీ, క్రికెట్ మన రెండు దేశాలను కలుపుతున్నాయని తెలిపారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియాలను కలిపి ఉంచే మరో బంధం యోగా.. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన వారధి అని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం భారతదేశంలో జరిగిందన్నారు. ఒక్క క్లిక్‌తో డీబీటీ సాధ్యమైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాలను కలిపే అంశాల్లో క్రికెట్ కూడా ఉందని ప్రధాని అన్నారు. Special connect between India and Australia... pic.twitter.com/JlMEhGv8sv — PMO India (@PMOIndia) May 23, 2023 ‘ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోంది. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుంది. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగింది. ఇది రెండు దేశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. త్వరలోనే బ్రిస్బెన్లో భారత కాన్సులేట్ ఏర్పాటు చేయబోతున్నాం. రెండు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ కూడా మోదీతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటోని మాట్లాడుతూ.. మోదీ ప్రజాదరణను ప్రముఖ రాక్‌స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో పోల్చారు. ఆయన్ని అభిమానులు ప్రేమగా ‘ది బాస్’ అని కూడా పిలుస్తారు. ‘నేను ఈ వేదికపై చివరిసారిగా బ్రూస్ స్ప్రింగ్స్టీన్ను చూశాను. ప్రధాని మోదీకి లభించిన స్వాగతం అతనికి కూడా లభించలేదు. ‘ప్రధాని మోదీ ది బాస్’ అని ఆస్ట్రేలియా ప్రధాని కొనియాడారు. An absolute delight connecting with the Indian diaspora at the community programme in Sydney! https://t.co/OC4P3VWRhi — Narendra Modi (@narendramodi) May 23, 2023 -
జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!
జపాన్‌లోని హిరోషిమాలో జీ 7 సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆటోగ్రాఫ్ అడిగారు. ఈ మేరకు ఆ సదస్సులో జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్.. ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన విషయంలో తాము ఎదుర్కొంటున్న విచిత్రమైన సవాళ్లను పంచుకున్నారు. జూన్ నెలలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ విషయం గురించి బైడెన్ ప్రస్తావిస్తూ.. భారత ప్రధాని మోదీ కార్యక్రమాలకు హాజరుకావడానికి పౌరుల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న అభ్యర్థనల వరద తమకు ఎలా సవాలుగా మారిందో వివరించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియ ప్రధాని అల్బనీస్ విజయోత్సవ ల్యాప్‌లో దాదాపు 90 వేల మందికి పైగా ప్రజలు ప్రధాని మోదీకి ఎలా స్వాగతం పలికారో గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు ఆయన మోదీతో మాట్లాడుతూ సిడ్నీలో కమ్యూనిటీ రిసెప్షన్ కెపాసిటీ 20 వేల మందికి సరిపడేదని, అయినా ఇప్పటికీ అందుత్ను రిక్వెస్ట్‌లను మేనేజ్ చేయలేకపోతున్నానని అన్నారు. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాధరణ గురించి అల్బనీస్ సంభాస్తుండగా.. మధ్యలో బైడెన్ జోక్యం చేసుకుంటూ.. ‘నాకు మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులో సుమారు 22 దేశాలకు చెందిన ప్రతినిధుల పాల్గొన్నారు. (చదవండి: క్లీనర్ సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..) -
భారత్–ఆస్ట్రేలియా బంధం
దేశాల మధ్య బంధాలు బలపడటం, అవి కొత్త పుంతలు తొక్కటం, కూటమిగా కలిసి కదలాలను కోవటంవంటి పరిణామాలు మారుతున్న అంతర్జాతీయ స్థితిగతులకు అద్దం పడతాయి. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్యా పలు ఒప్పందాలు కుదరటం ఆ కోణంలో కీలక పరిణామమనే చెప్పాలి. రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఏడాదికిపైగా సాగుతున్నలడాయి కారణంగా చైనాపై మునుపటంత దృష్టి కేంద్రీకరించటం లేదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్న తరుణంలో గతవారం ఢిల్లీలో చతుర్భుజ కూటమి(క్వాడ్) విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది. అందులో మన విదేశాంగమంత్రి జైశంకర్‌తోపాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి హయాషీ యొషిమసా, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి పెన్నీ వాంగ్లు పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగానే ఆల్బనీస్ బుధవారం మన దేశం వచ్చారు. వచ్చేవారం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రాబోతున్నారు. ఈ సందడంతా సహజంగానే చైనాకు కంటగింపుగా ఉంటుంది. దక్షిణాసియాలో, హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచు కోవటానికి ప్రయత్నించటం, బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) పేరిట మన వ్యూహాత్మక ప్రాంతాలను తాకేలా ప్రాజెక్టు రూపకల్పన చేయటం వగైరా పనులు చైనావైపు నుంచి ముమ్మర మయ్యాక మన దేశం క్వాడ్‌పై ఆసక్తి ప్రదర్శించటం మొదలుపెట్టింది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా గిల్లికజ్జాలు పెట్టుకునే రీతిలో వ్యవహరించటం కూడా మన దేశానికి ఆగ్రహం తెప్పించింది. మొదట పదహారేళ్లక్రితం క్వాడ్ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినప్పుడు భారత్ పెద్దగా స్పందించలేదు. కేవలం చైనా వ్యతిరేకత ఒక్కటే క్వాడ్‌కు ప్రాతిపదిక కారాదని చెప్పింది. వాస్తవానికి చైనాతో మనకన్నా జపాన్‌కూ, ఆస్ట్రేలియాకూ సమస్యలు అధికం. దక్షిణ చైనా సముద్ర జలాల్లో జపాన్‌కూ, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆస్ట్రేలియాకూ చైనా తలనొప్పిగా మారింది. ఇక చైనాతో అమెరికాకు ఉన్న సమస్యలు సరేసరి. ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా తనతో పోటీపడుతోందని, దీన్ని సకాలంలో కట్టడి చేయకపోతే తన పలుకుబడి తగ్గినా తగ్గొచ్చని అమెరికా ఎప్పటినుంచో భావిస్తోంది. అందు వల్లే దీర్ఘకాలంగా తనకు నమ్మదగ్గ మిత్రులుగా ఉన్న నాటో కూటమినీ, ఆస్ట్రేలియా, జపాన్లనూ అందుకు అనుగుణంగా అడుగులేయిస్తోంది. తాజాగా మలబార్ తీరంలో తమ ఆధ్వర్యంలో తొలి సారి క్వాడ్ దేశాల నావికా దళాల విన్యాసాలు నిర్వహించటంతోపాటు ఆస్ట్రేలియాలో జరపబోయే నావికాదళ విన్యాసాలకు భారత్‌ను ఆహ్వానిస్తున్నామని ఆల్బనీస్ ప్రకటించటం భద్రత, రక్షణ రంగాల్లో రెండు దేశాలమధ్యా పెరిగిన సహకారాన్ని సూచిస్తోంది. ఇతరేతర రంగాలకు సైతం క్వాడ్ దేశాల సహకారం పెంపొందాలని రెండేళ్లక్రితం ఆన్లైన్ వేదికగా జరిగిన తొలి శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. అటుపై అనేకానేక అంశాలపై క్వాడ్ దేశాల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి, వాతావరణ మార్పులు, కీలక సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపువంటి అంశాలపై పరస్పర అవగాహన ఏర్పడింది. ఆంథోనీ ఆల్బనీస్ పర్యటన దానికి కొనసాగింపే. నిరుడు రెండు దేశాలూ ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) కుదుర్చుకున్నాయి. అయితే అంతకు చాన్నాళ్లముందే... అంటే 2011లో మొదలై 2016 వరకూ చర్చలు సాగి అర్ధంతరంగా నిలిచిపోయిన సమగ్ర ఆర్థిక సహకారం ఒప్పందం(సీఈసీఏ)పై మాత్రం కదలిక లేదు. రెండేళ్లనుంచీ మళ్లీ చర్చలు సాగుతున్నా ఇంతవరకూ అవి ఓ కొలిక్కి రాలేదు. కానీ ఆల్బనీస్ మాత్రం ఈ ఏడాదే ఆ ఒప్పందంపై సంతకాలవుతాయని ఘంటాపథంగా చెబుతున్నారు. దాని సంగతలావుంచి విద్యారంగంలో ఇరు దేశాలమధ్యా చాన్నాళ్లనుంచి తలెత్తిన సమస్యలు పరిష్కారం కావటం లక్షలాదిమంది విద్యార్థులకు ఊరట నిస్తుంది. నిరుడు మన దేశంనుంచి 7.7 లక్షలమంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆస్ట్రే లియా, కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లారు. అక్కడ లక్షలాది రూపాయలు వ్యయం చేసి చదువుకుని డిగ్రీలు, డిప్లొమోలు తెచ్చుకున్నా మన దేశంలో ఉద్యోగాలకు వాటిని పరిగణనలోకి తీసుకోవటం లేదు. ఈ సమస్య పరిష్కారానికి భారత్, ఆస్ట్రేలియాలు రెండూ తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రెండు దేశాల విశ్వవిద్యాలయాలూ తాము విద్యార్థులకు ప్రదానం చేసే పట్టాలను పరస్పరం గుర్తించాలన్న నిర్ణయం జరిగింది. వాతావరణం, సౌర శక్తి, హైడ్రోజన్ వంటి హరిత ఇంధనాల విషయంలో సహకారం మరింత పెంపొందాలని ఇరు దేశాలూ భావించాయి. ఇప్పటికే వ్యవసాయం, దుస్తులు, రైల్వే ఇంజిన్లు, టెలికాం పరికరాలు తదితరాలు మన దేశం నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతుండగా, అక్కడి నుంచి మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలూ, ఖనిజ ఉత్పత్తులు దిగుమతి అవు తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంథోనీ ఆల్బనీస్ల మధ్య జరిగిన చర్చల్లో ఖనిజాల ఎగు మతులు, దిగుమతులపై మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించటం ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణకు తోడ్పడుతుంది. వచ్చే మే నెలలో ఆస్ట్రేలియాలో క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. పరస్పర సహకారం, సమానత్వ ప్రాతిపదికన దౌత్య సంబంధాలు దేశాల చెలిమిని కొత్త పుంతలు తొక్కిస్తాయి. దేశాలమధ్య వైషమ్యాలు, ఘర్షణలు అంతిమంగా ఆ దేశాలు నష్టపోవటానికే దోహద పడతాయి. ఈ సంగతిని అందరూ గ్రహించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది. -
ఆలయాలపై దాడులు ఆందోళనకరం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. అంతర్జాతీయ పరిణామాలతోపాటు కీలక ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రత, పరస్పర సహకారం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఖనిజాలు, వలసలు, సప్లై చైన్లు, విద్యా, సాంస్కృతికం, క్రీడల్లో ఇకపై కలిసి పనిచేయాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని అంగీకారానికొచ్చారు. ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై ఇటీవల జరిగిన దాడుల గురించి ఆల్బానీస్ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు పెరుగుతుండడాన్ని గుర్తుచేశారు. క్రీడలు, నవీన ఆవిష్కరణలు, ఆడియో–విజువల్ ప్రొడక్షన్, సౌర విద్యుత్ విషయంలో పరస్పర సహకారానికి సంబంధించి నాలుగు ఒప్పందాలపై భారత్, ఆస్ట్రేలియా ప్రతినిధులు సంతకాలు చేశారు. చర్చల అనంతరం ఆంథోనీ అల్బానీస్‌తో కలిసి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నట్లు గత కొన్ని వారాలుగా మీడియాలో నిత్యం వార్తలు వస్తుండడం నిజంగా విచారకరం. అలాంటి దాడులు భారత్‌లో ప్రతి ఒక్కరికీ సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఆలయాలపై దాడుల పట్ల మన మనసులు కలత చెందుతున్నాయి. మన మనోభావాలను, ఆందోళనలను ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి తెలియజేశా. ఆస్ట్రేలియా సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో భారతీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అల్బానీస్ నాకు హామీ ఇచ్చారు. భారతీయుల భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సాధ్యమైనంతవరకూ మా వంతు సహకారం అందిస్తాం’’ అని పేర్కొన్నారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ద్వైపాక్షిక భద్రతా సహకారం అత్యంత కీలకమని మూలస్తంభమని మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మారిటైమ్ సెక్యూరిటీ, డిఫెన్స్, సెక్యూరిటీ కో–ఆపరేషన్ గురించి తాము చర్చించామని అన్నారు. త్వరలోనే ఆర్థిక సహకార ఒప్పందం: అల్బానీస్ ఇండియా–ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని(సీఈసీఏ)ను సాధ్యమైంత త్వరగా కుదుర్చుకోవాలని మోదీ, తాను అంగీకారానికి వచ్చినట్లు ఆంథోనీ అల్బానీస్ తెలిపారు. ఈ ఏడాదిలోనే ఒప్పందాన్ని ఖరారు చేస్తామన్న నమ్మకం ఉందన్నారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం(ఈసీటీఏ) గత ఏడాది ఖరారైన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇరు పక్షాలు సీఈసీఏపై కసరత్తు చేస్తున్నాయి. వలసల ఒప్పందం పురోగతిలో ఉందని, దీనివల్ల ఇరు దేశాల విద్యార్థులకు, వృత్తి నిపుణులకు లబ్ధి చేకూరుతుందని అల్బానీస్ తెలిపారు. భారత్‌తో తమకు బహుముఖ సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాదిలో మే నెలలో తమ దేశంలో ‘క్వాడ్’ సదస్సు జరగబోతోందని, మోదీ రాకకోసం ఎదురు చూస్తున్నానని వివరించారు. జీ20 సదస్సులో పాల్గొనడానికి సెప్టెంబర్‌లో భారత్‌కు వస్తానని అన్నారు. (చదవండి: మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..) -
ఆస్ట్రేలియా ప్రధాని కీలక ప్రకటన.. భారత విద్యార్థులకు గుడ్ న్యూస్!
గాంధీనగర్: ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ భారత పర్యటనలో ఉన్నారు. ఆయన ఇండియాకు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో అల్బనీస్ గుజరాత్‌లోకి అహ్మదాబాద్‌కు వెళ్లారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌తో సమావేశమయ్యారు. ఇందులో భారత, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా విద్యారంగానికి సంబంధించి కొన్ని కీలక ఒప్పందాల జరిగాయి. వీటిలో ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో భారతీయ డిగ్రీలకు గుర్తింపు ఇవ్వడంపై నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతీయ విద్యార్థులకు తీపి కబురనే చెప్పాలి. ఇక బంధం బలోపేతం.. విద్యార్థుల కోసం కొత్త విధానం ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు అల్బసీస్ ప్రకటించారు. దీంతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని జీఐఎఫ్‌టీ (GIFT) సిటీలో అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను ఏర్పాటు కానుంది. అనంతరం అల్బనీస్ మాట్లాడుతూ.. ‘ఇరు దేశాల ద్వైపాక్షిక విద్యా సంబంధాలు గణనీయమైన అభివృద్ధి చెందుతోంది. ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజమ్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని’ తెలిపారు. దీని వల్ల ఇరుదేశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించిన కొత్త విధానం ప్రకారం.. మీరు ఆస్ట్రేలియాలో చదువుతున్నా లేదా చదువు పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు.. ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ఆ డిగ్రికి పూర్తిస్థాయి గుర్తింపు లభించనుంది. అంతేకాకుండా భారతీయ డిగ్రీలు కూడా ఆస్ట్రేలియాలో చెల్లుబాటు అవుతాయి. వీటితో పాటు ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం కొత్త స్కాలర్షిప్ను కూడా ఆయన ప్రకటించారు. భారతీయ విద్యార్థులు నాలుగేళ్ల వరకు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి మైత్రి స్కాలర్షిప్స్ ఇస్తామన్నారు. దీంతో ఇరుదేశాలు మధ్య సాంస్కృతిక, విద్యా,కమ్యూనిటీ సంబంధాలు బలోపేతం అవుతాయని అల్బనీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
India-Australia: రక్షణ బంధం బలోపేతం
ముంబై/న్యూఢిల్లీ: భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. ‘ఎక్సర్సైజ్ మలబార్’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గురువారం ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ ఆయనకు స్వాగతం పలికారు. నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆస్ట్రేలియాలో ఎక్సర్సైజ్ మలబార్ నిర్వహించనున్నాం. వాటిలో భారత్ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు. మోదీపై ప్రశంసల జల్లు ఏ అంశాన్నైనా భవిష్యత్తును అంచనా వేసి మరీ ఆలోచించడం ప్రధాని నరేంద్ర మోదీలో ఉన్న గొప్పదనమని ఆల్బనీస్ ప్రశంసించారు. ‘‘రక్షణ సంబంధాలను సుదృఢం చేసేది ఇలాంటి దూరదృష్టే. బంధాలను ఇప్పుడెలా ఉన్నాయని కాకుండా మున్ముందు ఎదుగుదలకు ఉన్న అవకాశాల పరంగా మదింపు వేయగలగాలి. ఆ సామర్థ్యమున్న నేత మోదీ’’ అని అభిప్రాయపడ్డారు. వర్తక, ఆర్థిక కార్యకలాపాల కోసం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు ఇరు దేశాలకూ ఆవశ్యకమేనన్నారు. మోదీ ప్రతిపాదించిన జనరల్ రావత్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య అవగాహన, సాన్నిహిత్యం పెంపొందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ మంత్రుల చర్చలు రక్షణ రంగంలో ఆస్ట్రేలియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్‌తో గురువారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా తమ సంభాషణ సాగిందన్నారు.వర్తకం, రక్షణ, కీలక ఖనిజాలు మోదీతో చర్చల్లో ఇవే ప్రధానం ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపే తం చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో మోదీ శుక్రవారం విస్తృతంగా చర్చలు జరపనున్నారు. కీలక ఖనిజాలు, ద్వైపాక్షిక వర్తకం, రక్షణ ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడు, అందుకు అడ్డుకట్ట వేసే మార్గాలు తదితరాలపైనా నేతలు చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య 2021లో 27.5 బిలియన్ డాలర్ల విలువైన వర్తకం జరిగింది. 2022లో అమల్లోకి వచ్చిన ఆర్థిక సహకార వర్తక ఒప్పందం (ఈసీటీఏ)తో వచ్చే ఐదేళ్లలో ఇది 50 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ చూశారు గురువారం ఉదయం మోదీ, ఆ ల్బనీస్ కలిసి అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ప్రారంభ కార్యక్రమంలో పాల్గొ న్నారు. టాస్ అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు మ్యాచ్‌ను ఆస్వాదించారు. అనంతరం ముంబైలో ఇండియా–ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో ఆల్బనీస్ పాల్గొన్నారు. -
BGT: ప్రధానులు మోదీ, ఆల్బనీస్‌తో కెప్టెన్లు.. కోహ్లిని పరిచయం చేసిన రోహిత్!
Ind Vs Aus 4th Test Ahmedabad: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు ఇరు జట్ల ప్రధానులు హాజరయ్యారు. అహ్మదాబాద్‌లో గురువారం ఆరంభమైన మొదటి రోజు ఆటను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అంటోని ఆల్బనీస్‌తో కలిసి స్టేడియానికి విచ్చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ను సత్కరించారు. క్రికెట్లో 75 ఏళ్లుగా భారత్- ఆస్ట్రేలియా మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఆల్బనీస్ చిత్రపటాన్ని బహూకరించారు. కెప్టెన్లకు స్పెషల్ క్యాప్ ఇక బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రధాని మోదీకి ఆయన ఫొటోను అందించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు స్పెషల్ క్యాప్ అందించగా.. ఆల్బనీస్ తమ జట్టు సారథి స్టీవ్ స్మిత్‌కు క్యాప్ అందించారు. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్, స్మిత్ జట్టు సభ్యులను తమ ప్రధానులకు మర్యాదపూర్వకంగా పరిచయం చేశారు. ఇక రోహిత్ శర్మ.. మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ప్రధాని మోదీకి పరిచయం చేయగానే ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా నాలుగు రోజుల పర్యటలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మక చివరి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రవేశిస్తుంది. లేదంటే న్యూజిలాండ్-శ్రీలంక ఫలితం వెలువడిన తర్వాతే ఫైనల్లో ఆసీస్‌ను ఢీకొట్టేది ఎవరో తేలుతుంది. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌కు బ్యాడ్ న్యూస్.. కొత్త కెప్టెన్ దూరం! సారథిగా భువీ WPL 2023: గుజరాత్ కెప్టెన్ స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్ The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and The Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese have arrived at the stadium! @narendramodi | @PMOIndia | @AlboMP | #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/5bijT2ENJ5 — BCCI (@BCCI) March 9, 2023 Mr. Roger Binny, President, BCCI presents framed artwork representing 75 years of friendship through cricket to Honourable Prime Minister of Australia Mr. Anthony Albanese#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Qm1dokNRPY — BCCI (@BCCI) March 9, 2023 Mr. Jay Shah, Honorary Secretary, BCCI, presents framed artwork to Honourable Prime Minister of India, Shri Narendra Modiji, celebrating 75 years of friendship with Australia through cricket. @narendramodi | @PMOIndia | @JayShah | #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/nmDJwq2Yer — BCCI (@BCCI) March 9, 2023 A special welcome & special handshakes! 👏 The Honourable Prime Minister of India, Shri Narendra Modiji and the Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese meet #TeamIndia & Australia respectively. @narendramodi | @PMOIndia | #TeamIndia | #INDvAUS pic.twitter.com/kFZsEO1H12 — BCCI (@BCCI) March 9, 2023 -
INDvsAUS నాలుగో టెస్ట్ : మైదానంలో భారత్-ఆసీస్ ప్రధానుల సందడి (ఫొటోలు)
-
మెరుగైన స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నాం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: భారత్– ఆస్ట్రేలియా బలీయ స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్నుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న అల్బనీస్ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి మహాత్మునికి నివాళులర్పించారు. ‘వాణిజ్యం, భద్రత వంటి అంశాల్లో క్రియాశీలకంగా ఉన్న భారత్‌తో బహుముఖ బంధాలను బలపరుచుకునేందుకు ఆస్ట్రేలియాకు లభించిన అద్భుత అవకాశం ఇది. నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు చోదక శక్తి భారత్. మా దేశంలో పెద్దసంఖ్యలో వైవిధ్య భారత్, ఆస్ట్రేలియా ప్రజల వల్లే మా దేశం ఇంతగా అభివృద్ధి చెందింది ’ అని భారత్‌కు విచ్చేసిన సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు ‘ఆస్ట్రేలియా–భారత్ విద్యార్హత గుర్తింపు వ్యవస్థ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు అల్బనీస్ ప్రకటించారు. అంటే ఆస్ట్రేలియా చదువుకుంటున్న, చదివిన భారతీయ విద్యార్థుల డిగ్రీలను ఇండియాలో అనుమతిస్తారు. అలాగే భారత్‌లో చదివిన డిగ్రీనీ ఆస్ట్రేలియాలో గుర్తింపునకు అనుమతిస్తారు. మరోవైపు గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన డీకెన్ యూనివర్సిటీ తన అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను నెలకొల్పనుంది. ఆస్ట్రేలియా నాలుగేళ్లపాటు చదవనున్న భారతీయ వి ద్యార్థులకు ‘మైత్రి’ పేరిట ఉపకారవేతనం సైతం అందిస్తామని అల్బనీస్ చెప్పారు. నేడు మోదీతో కలిసి టెస్ట్ మ్యాచ్ వీక్షణ బుధవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని మోతెరా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటను ప్రధాని మోదీతో కలిసి వీక్షిస్తారు. అల్బనీస్‌తో కలిసి మ్యాచ్ చూసేందుకు మోదీ సైతం బుధవారమే అహ్మదాబాద్ చేరుకున్నారు. తర్వాత అల్బనీస్ ముంబై చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. తర్వాత మోదీతోపాటు ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొంటారు. సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం తదితరాలపై చర్చించనున్నారు. ప్రధానిగా అల్బనీస్‌కు ఇదే తొలి భారత పర్యటన. -
25, 26 తేదీల్లో భారత్‌లో జర్మనీ అధ్యక్షుని పర్యటన
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్ భారత్ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్ పాల్గొంటారు. అదేవిధంగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోని అల్బనీస్‌కు కరోనా పాజిటివ్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. కోవిడ్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో అల్బనీస్‌కు పాజివ్‌గా వచ్చింది. ఈ మేరకు ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ...తనతో ఉన్నవారిని జాగ్రత్తగా ఉండమని, టెస్టులు చేయించుకోమని సూచించారు. తాను ఐసోలేషన్‌లో ...ఉంటూ ఇంటి నుంచే వర్క్ చేస్తానని చెప్పారు. కాగా, ఫెడరల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న అల్బనీస్ రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఐతే అల్బనీస్ లేబర్ పార్టీ ఏ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదీగాక అల్బనీస్ ఈ నెల 12, 13 తేదీల్లో పాపువా న్యూగినియాకు రెండు రోజుల పర్యటన చేయవలసి ఉంది. (చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్) -
ఆస్ట్రేలియాలో 13 మంది మహిళా మంత్రులు
కెన్బెరా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసె తన కేబినెట్లో మహిళలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో 13 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఆనీ అలీ అనే ముస్లిం కూడా ఉన్నారు. దేశ చరిత్రలో తొలి ముస్లిం మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అయ్యారు. కెన్బెరాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. లేబర్ పార్టీకి చెందిన ఆంటోని ప్రధాని అయిన 11 రోజుల తర్వాత 30 మందితో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. ఇలాంటి ఒక సమీకృత ప్రభుత్వానికి సారథిగా ఉండడం గర్వంగా ఉందని ఆంటోని ట్విటర్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఎంత భిన్నత్వంతో కూడుకొని ఉందో, తన కేబినెట్ కూడా అంతే భిన్నంగా ఉందన్నారు. -
క్వాడ్ నేతల మూడో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ
-
క్వాడ్.. మంచి కోసం ఓ శక్తి: ప్రధాని మోదీ
టోక్యో: క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో-పసిఫిక్‌లో శాంతిని నిర్ధారించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య.. వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. సదస్సుకు ముందు.. బైడెన్, కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాకక్షిక సంబంధాల గురించి చర్చించారు ప్రధాని మోదీ. మార్చి 2021లో వర్చువల్‌గా క్వాడ్ నేతల మధ్య భేటీ జరగ్గా.. సెప్టెంబర్ 2021 వాషింగ్టన్ డీసీలో ఇన్ పర్సన్, మార్చి 2022లో వర్చువల్ మీటింగ్ జరగ్గా.. ఇప్పుడు టోక్యో వేదికగా జరుగుతున్న సమావేశం నాలుగవది. -
ఆస్ట్రేలియాలో అధికారం చేపట్టిన లేబర్ పార్టీ
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పరిపాలనకు తెరపడింది. ఇప్పటివరకు 50శాతం ఓట్లను లెక్కించగా ప్రతిపక్ష లేబర్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు ఆస్ట్రేలియా మీడియా ఇదివరకే వెల్లడించింది. లేబర్ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్ తదుపరి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ తన ఓటమిని అంగీకరించారు. గత మూడేళ్లలో కరోనా విజృంభణ, వాతావరణ మార్పులు కారణంగా ఏర్పడిన విపత్తుల్ని ఎదుర్కోవడంలో అధికార పార్టీ వైఫల్యం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. మూడేళ్లకి ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ సంకీర్ణ కూటమి కంటే లేబర్ పార్టీ హామీలు ఇవ్వడంలోనూ, ప్రజల విశ్వాసం చూరగొనడంలోనూ విజయం సాధించింది. -
ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో జరిగిన ఫెడరల్ ఎన్నికలలో, ప్రతిపక్ష లేబర్ పార్టీ.. స్కాట్ మోరిసన్ ప్రభుత్వాన్ని ఓడించింది. ఈ మేరకు శనివారం స్కాట్ మోరిసన్ తన ఓటమిని అంగీకరించారు. ఫలితంగా ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా లేబర్ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్బనీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా నాయకత్వం నుంచి కూడా మోరిసన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మోరిసన్ మాట్లాడుతూ..." నాయకుడిగా నేను గెలుపోటములకు పూర్తిగా బాధ్యత వహిస్తాను. లిబరల్ పార్టీకి నాయకత్వం వహించడం గొప్ప అదృష్టం. ఈ గొప్ప దేశానికి తనను నాయకుడిగా చేసేందుకు మద్దతిచ్చిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. కొత్త నాయకత్వంలో మన పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఆస్ట్రేలియా 31వ ప్రదానిగా ఆంథోని లేబర్ పార్టీ నాయకుడు ఆంథోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అల్బనీస్ 1996 నుండి ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2013లో ఆస్ట్రేలియా ఉప ప్రధాన మంత్రిగా పనిచేసిన ఆయన 2007 నుంచి 2013 మధ్య క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2022 ఎన్నికల ప్రచారంలో ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అణుగుణంగా బలమైన సామాజిక భద్రతను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయన్ని కూడా అందిస్తానని లేబర్ పార్టీ వాగ్దానం చేసింది. 2050 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను మరింత ప్రతిష్టాత్మకంగా 43 శాతం మేర తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవాలని కోరుకుంటున్నట్లు కూడా పార్టీ పేర్కొంది. ఆంథోనీ అల్బనీస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జపాన్‌లో పర్యటించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆంథోనికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ: ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య ప్రాధాన్యతల కోసం మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు. Congratulations @AlboMP for the victory of the Australian Labor Party, and your election as the Prime Minister! I look forward to working towards further strengthening our Comprehensive Strategic Partnership, and for shared priorities in the Indo-Pacific region. — Narendra Modi (@narendramodi) May 21, 2022 (చదవండి: పాకిస్తాన్ మాజీ మంత్రి కిడ్నాప్...)