Bairstow Controversial Dismissal: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లిష్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన తీరుపై వివాదం కొనసాగుతూనే ఉంది. బంతి వికెట్‌కీపర్ చేతిలో ఉండగానే.. బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమయస్ఫూర్తితో బెయిర్‌స్టోను స్టంపౌట్ చేసిన ఆసీస్ వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ సహా ఇతర ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిన నేపథ్యంలో.. తామైతే ఇలా ఆసీస్ తరహాలో గెలుపొందాలని కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం స్టోక్స్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
రిషి సునాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్
ఇందుకు ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ సైతం రంగంలోకి దిగారు. తమ జట్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళా, పురుష క్రికెట్ జట్లను చూసి తాను గర్వపడుతున్నానన్నారు.
‘‘అదే ఆసీస్.. పూర్వవైభవాన్ని గుర్తు చేస్తూ.. ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తూనే ఉంటుంది. వాళ్లు విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా.. విజేతలైన మా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని ఆంథనీ అల్బనీస్ పేర్కొన్నారు.
పరస్పరం విమర్శలు
కాగా యాషెస్ సిరీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా.. ఓవర్ పూర్తైందని భావించిన బెయిర్‌స్టో క్రీజు దాటి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని వికెట్లకు గిరాటేసి.. రనౌట్‌కు అప్పీలు చేశాడు.
అయితే, బెయిర్‌స్టో కీపర్ లేదంటే అంపైర్‌కి సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఇంగ్లండ్ అభిమానులు, మీడియా ప్రత్యర్థి జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసీస్ మీడియా కూడా తగ్గేదేలే అన్నట్లు స్టోక్స్ ఫొటోలతో ఇంగ్లండ్ విమర్శలను తిప్పి కొట్టింది. తాజాగా ఇరు దేశాల ప్రధానులు సైతం తమ తమ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ కౌంటర్ అటాక్ చేసుకోవడం విశేషం.
చదవండి: BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్..
నెదర్లాండ్స్ ఆశలు సజీవం
BAIRSTOW IS RUN-OUT.
— Johns. (@CricCrazyJohns) July 2, 2023
WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3
Comments
Please login to add a commentAdd a comment