Ashes 2023: Khawaja Breaks 26-Year-Old Ashes Record, Misses Bradman Feat - Sakshi
Sakshi News home page

Usman Khawaja: ఉస్మాన్‌ ఖవాజా అరుదైన ఘనత! యాషెస్‌ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత..

Published Tue, Aug 1 2023 3:27 PM

Usman Khawaja Breaks 26 Year Old Ashes Record Misses Bradman Feat - Sakshi

The Ashes, 2023- England vs Australia: యాషెస్‌ సిరీస్‌-2023లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(141) సాధించి శుభారంభం అందుకున్న ఈ ఓపెనర్‌.. మొత్తంగా మూడు అర్ద శతకాలు కూడా సాధించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓవరాల్‌గా 496 పరుగులతో మెరిశాడు.

ఈ క్రమంలో యాషెస్‌ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఆసీస్‌ ఓపెనర్ల జాబితాలో చేరాడు. కాగా 1997లో ఆస్ట్రేలియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ మాథ్యూ ఇలియట్‌ యాషెస్‌ సిరీస్‌లో మొత్తంగా 556 పరుగులు చేశాడు. అతడి కెరీర్‌ మొత్తంలో సాధించిన రన్స్‌లో సగానికి పైగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ సందర్భంగానే స్కోర్‌ చేయడం గమనార్హం.

26 ఏళ్ల తర్వాత..
ఈ నేపథ్యంలో 26 ఏళ్ల తర్వాత ఖవాజా అత్యధికంగా 496 పరుగులు సాధించి మాథ్యూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 1997 తర్వాత యాషెస్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్‌ ఓపెనర్‌గా నిలిచాడు.

ఆ రికార్డు మిస్‌!
ఇదిలా ఉంటే.. 1948లో 39 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ యాషెస్‌లో 508 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక వయసులో 500కు పైగా రన్స్‌ సాధించిన ఆసీస్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 496 పరుగుల వద్ద నిలిచిపోయిన 36 ఏళ్ల ఖవాజా.. బ్రాడ్‌మన్‌ తర్వాత ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కే అవకాశం కోల్పోయాడు. 

కాగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన యాషెస్‌ సిరీస్‌-2023 డ్రాగా ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌ గెలుపొంది సిరీస్‌ను 2-2తో సమం చేయగా.. గత సిరీస్‌ గెలిచిన ఆసీస్‌ ట్రోఫీని తమ వద్దే అట్టిపెట్టుకోనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న క్రిస్‌ వోక్స్‌.. మిచెల్‌ స్టార్క్‌తో కలిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు పంచుకున్నాడు.

యాషెస్‌-2023లో ఉస్మాన్‌ ఖావాజా సాధించిన పరుగులు
►ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో- 141, 65.
►లండన్‌ టెస్టులో- 17, 77.
►లీడ్స్‌ టెస్టులో- 13, 43.
►మాంచెస్టర్‌ టెస్టులో- 3, 18.
►ఓవల్‌ మైదానంలో- 47, 72.

చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్‌ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement