The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. లీడ్స్‌లో మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌నే మాంచెస్టర్ టెస్టులోనూ కొనసాగించనుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది మేనేజ్‌మెంట్. కాగా గత మ్యాచ్‌లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోకు మరో అవకాశం ఇవ్వడం విశేషం.
బొక్కబోర్లా పడి
ఈ నేపథ్యంలో బెన్ ఫోక్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో స్టోక్స్ బృందం ఓటమి పాలైన విషయం తెలిసిందే. బజ్‌బాల్ విధానంతో సొంతగడ్డపై బొక్కబోర్లా పడి పర్యాటక జట్టు చేతిలో ఓడి 0-2తో వెనుకబడింది. అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని మూడో టెస్టులో గెలుపొంది బోణీ కొట్టింది.
గెలుపు జోష్‌లో
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. హెడ్డింగ్లీ మైదానంలో హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్ 8 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టుకు విజయం అందించాడు. ఇదే జోష్‌లో మాంచెస్టర్ టెస్టుకు సిద్ధమవుతోంది ఇంగ్లండ్. కాగా జూలై 19- జూలై 23 వరకు నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే ఐదో టెస్టు నిర్ణయాత్మకంగా మారుతుంది. లేదంటే ఆసీస్ ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కాగా బెయిర్‌స్టోకు వరుస అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెయిర్‌స్టోను తప్పించకుండా మొండిగా వ్యవహరించినందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు:
బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్.
చదవండి: అమ్మ నమ్మట్లే! ఈ బుడ్డోడు టీమిండియాలో అత్యంత కీలక వ్యక్తి.. గుర్తుపట్టారా?
Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే!
Comments
Please login to add a commentAdd a comment