Ashes 2023: Jonny Bairstow Takes Blinder To Dismiss Mitchell Marsh - Sakshi
Sakshi News home page

Ashes 2023: 'అనుకున్నంత గొప్ప క్యాచ్‌ ఏమి కాదులే..'

Published Thu, Jul 20 2023 11:08 AM | Last Updated on Thu, Jul 20 2023 11:28 AM

Jonny Bairstow Takes Blinder To Dismiss Mitchell Marsh in Ashes 2023 - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇరుజట్లు సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అయితే ఆట ముగిసే సమయంలో మాత్రం ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా అనిపించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (51), లబుషేన్‌ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్‌ (48), స్టీవ్‌ స్మిత్‌ (41) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కీపర్‌ జానీ బెయిర్‌ స్టో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 63వ ఓవర్‌ క్రిస్‌ వోక్స్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఐదో బంతిని వోక్స్‌ వైడ్‌ లైన్‌ స్టంప్‌ మీదుగా వేశాడు. మార్ష్‌ పొజిషన్‌ మార్చి షాట్‌ ఆడాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి స్లిప్స్‌ కార్డన్‌ దిశగా వెళ్లింది. అయితే బంతి కాస్త లో యాంగిల్‌లో వెళ్లడంతో క్యాచ్‌ కష్టతరమనిపించింది. కానీ కీపర్‌ బెయిర్‌ స్టో డైవ్‌ చేస్తూ తన గ్లోవ్స్‌ను దూరంగా పెట్టడం.. బంతి సేఫ్‌గా అతని చేతుల్లో పడింది. దీంతో షాక్‌ తిన్న మార్ష్‌ నిరాశతో పెవిలియన్‌ చేరాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు బెయిర్‌ స్టో క్యాచ్‌పై విభిన్న రీతిలో స్పందించారు. ''ఇదేమంత గొప్ప క్యాచ్‌గా అనిపించడం లేదు.. మాములుగానే ఉంది'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: ICC ODI WC 2023: 'కింగ్‌' ఖాన్‌ చేతిలో వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ.. ఫ్యాన్స్‌ రచ్చ

Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్‌ కొట్టాల్సిందే'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement